puri jagannath

13:47 - October 11, 2017

ఏ వుడ్ లోనైనా తమ తనయులను హీరోలుగా స్థిరపరచాలని హీరోలు..దర్శక..నిర్మాతలు అనుకుంటుంటారు. కొంతమంది సక్సెస్ కాగా మరికొందరు ఇంకా ప్రయత్నాలు సాగిస్తుంటుంటారు. అలాంటి వారిలో 'పూరి జగన్నాథ్' ఒకరు. తనయుడు 'ఆకాష్ పూరీ'ని హీరోగా తీర్చిదిద్దే పనుల్లో పడిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాలు నిరాశపరుస్తున్నా నెక్ట్స్ ప్రాజెక్ట్ పై దృష్టి సారించారు. పూరీ - బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన 'పైసా వసూల్' చిత్రం నిరాశపరిచిన సంగతి తెలిసిందే.

ఈ దర్శకుడు హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో స్పెషల్ మార్క్ క్రియేట్ చేశాడు. కానీ ప్రస్తుతం సినిమా సినిమాకి 'పూరీ' ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకుంటున్నాడు. హిట్స్ కొట్టడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసినట్టే, ఫ్లాప్స్ ఇవ్వడంలోనూ వెరైటీ చూపిస్తున్నాడు. ఆకాష్ పూరీ హీరోగా పూరీ దర్శకత్వంలో 'వైష్ణో అకాడమీ సంస్థ' ఓ చిత్రం నిర్మిస్తోంది. గతంలో వచ్చిన సినిమాలకంటే ఇది భిన్నంగా ఉంటుందని టాక్. 1971 నాటి ఇండియా - పాక్ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుందని పూరీ పేర్కొన్నారు. ఈ చిత్ర పోస్టర్ ను ఇటీవలే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో చిత్ర షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఛార్మీ క్లాప్ కొట్టగా షూటింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోను ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. పంజాబ్, రాజస్థాన్ లోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగనుంది. యుద్ధ వాతావరణం మధ్య సాగే లవ్ స్టోరీని తొలిసారిగా తీస్తున్నట్లు పూరీ పేర్కొన్నారు. మంగుళూరు మగువ నేహా శెట్టి నాయికగా పరిచయమవుతోంది. సందీప్‌ చౌతా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. 

11:11 - September 28, 2017

టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన దర్శకుల్లో 'పూరీ జగన్నాథ్' ఒకరు. తన చిత్రాల్లో హీరో..హీరోయిన్ల గెటప్..ఇతర విషయాల్లో వెరైటీగా చూపిస్తుంటాడు. తన మార్కును తన చిత్రాల్లో చూపించి ఆయా హీరోలు..హీరోయిన్ల అభిమానాన్ని చూరగొనడంలో 'పూరీ' దిట్ట. గత చిత్రాలు ఆయనకు మంచి విజయాలే అందించాయి కానీ కొన్ని చిత్రాలు డిజాస్టర్ గా మిగులుతున్నాయి. ఆయన దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన 'పైసా వసూల్' చిత్రం కూడా మరోసారి నిరాశపరిచింది. ఈ చిత్రంలో 'బాలకృష్ణ' హీరోగా నటించారు.

ఇదిలా ఉంటే పూరీ తనయుడు 'ఆకాష్' ను హీరోగా లాంచ్ చేస్తూ ఓ సినిమాను తెరకెక్కించనున్నాడు. నేడు పూరీ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ కొత్త సినిమా టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు 'మెహబూబా' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. 1971 భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్ధ నేపథ్యంలో సినిమా ఉండనుంది. మంగళూరు మోడల్ 'నేహా శెట్టి' హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాకు సందీప్ చౌతా సంగీతమందించనున్నారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ లలో షూటింగ్ జరుపుకోనుంది. అక్టోబ్ నుండి ప్రారంభమయ్యే ఈ సినిమా విశేషాలు త్వరలో తెలియనున్నాయి. 

12:01 - July 28, 2017

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలయ్య ప్రధాన పాత్రలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం పైసా వసూల్. శ్రేయ, ముస్కాన్, కైరాదత్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 29న చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ రోజు పైసా వసూల్ స్టంపర్ అంటూ చిన్న టీజర్ విడుదల చేశారు. ఇందులో బాలయ్య డైలాగ్స్, పూరీ టెకింగ్, అనూప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పక్కా యాక్షన్ మూవీ అని డైలాగ్స్ తో చెప్పకనే చెప్పారు. కొత్తరకం స్టైల్ తో మొదలైన ఈ ప్రమోషన్ సినిమా రిలీజ్ వరకు ఇంకా ఏఏ రూట్లో వెళుతుందో అని ఫ్యాన్స్ ఆలోచనలు చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుండగా ఒక పాత్రలో టాక్సీ డ్రైవర్ గా మరో పాత్రలో మాఫియా డాన్ గా కనిపించనున్నట్టు సమాచారం. భవ్య క్రియేషన్స్ బేనర్ పై రూపొందుతున్న పైసా వసూల్ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. అలీ, పృథ్వీ, విక్రమ్జిత్ సహా బాలీవుడ్ నటుడు కబీర్ బేడీ ఇందులో ప్రత్యేక పాత్ర పోషించారు

 

12:52 - July 27, 2017

టాలీవుడ్..హాలీవుడ్..కోలీవుడ్..ఇలా ఏ వుడ్ లోనైనా సరే చిత్రానికి సంబంధించిన విశేషాలు అభిమానులకు తెలియచేసేందుకు చిత్ర బృందం వినూత్న పంథాను ఎంచుకుంటుంది. అందులో భాగమే టీజర్..ట్రైలర్..మోషన్ పిక్చర్స్. తమ చిత్రాలను ఒక్కో విధంగా విడుదల చేస్తూ చిత్రాలపై అంచనాలను మరింత పెంచుతుంటారు. ఇందులో ప్రముఖ హీరోల చిత్రాల కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటారు. ఆయా సినిమాల పోస్టర్స్, టీజర్స్..ట్రైలర్స్ చూస్తూ అభిమానులు సంతోష పడుతుంటారు. ఆడియో వేడుకలు లేకుండా ఏకంగా యూ ట్యూబ్ లో సాంగ్స్ విడుదల చేయడం ప్రారంభించారు. ఇలాంటి ట్రెండ్ ను క్రియేట్ చేసింది మెగా ఫ్యామిలీ. అనంతరం ప్రీ రిలీజ్ ఫంక్షన్ పేరిట ఓ వేడుకను నిర్వహిస్తున్నారు.

తాజాగా కొత్త ట్రెండ్ ముందుకొచ్చింది. దర్శకడు పూరి జగన్నాథ్ మరో కొత్త పేరును తెరపైకి తీసుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో 'బాలకృష్ణ' హీరోగా 'పైసా వసూల్' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి 'స్టంపర్' ను విడుదల చేస్తున్నట్లు పూరీ వెల్లడించారు. టీజర్ క బాప్..గా ఉంటుందని వెల్లడించడం చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈనెల 28న ఈ చిత్రం 'స్టంపర్‌'ను విడుదల చేస్తున్నారు. ఇది టీజర్‌, ట్రైలర్‌కు భిన్నంగా ఉంటుందని చిత్రబృందం చెబుతుంది. నందమూరి అభిమానులు కోరుకొనే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయని, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయే లెవెల్‌లో ఉంటాయని పూరి పేర్కొంటున్నారు. 

17:18 - July 25, 2017

హైదరాబాద్ : టాలీవుడ్ నటి ఛార్మీ వేసిన పిటిషన్ పై ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టులో విచారణ జరిగింది. డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ ఫోర్స్ మెంట్ ఛార్మీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించారు. మంగళవారం ఉదయం దీనిపై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.

సిట్ విచారణ సరిగ్గా జరగలేదని, బ్లడ్ శాంపిల్స్ బలవంతంంగా సేకరిస్తున్నారని ఛార్మీ పిటిషన్ లో పేర్కొన్నారు. రక్త నమూనాలను బలవంతంగా సేకరించడం సరికాదని ఆమె కోర్టుకు విన్నవించారు. ఛార్మీకి ఇంకా పెళ్లి కాలేదని, సిట్ విచారణ న్యాయబద్ధంగా జరగాలని ఛార్మీ తరపు న్యాయవాది వాదించారు. దీనిపై సిట్ తరపు న్యాయవాది వాదించారు. తాము ఛార్మీని అతిథిగానే భావిస్తున్నామని, ఆమె ఇంట్లో కూడా తాము విచారణ చేయడానికి సిద్ధమని తెలిపారు. బలవంతంగా రక్త నమూనాలు..గోర్లు, వెంట్రుకలు తీసుకోవడం లేదని, స్వచ్చందంగా ముందుకొస్తేనే తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నిన్నటి విచారణలో నటుడు నవదీప్ శాంపిల్స్ ఇవ్వడానికి నిరాకరించారని, తప్పు చేయకపోతే భయం ఎందుని పేర్కొన్నారు.

ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పు మధ్యాహ్నానికి వాయిదా వేసింది.

17:04 - July 25, 2017

హైదరాబాద్ : సినీ నటి ఛార్మీ కోర్టు మెట్లు ఎక్కింది. డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఛార్మీకి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో కెల్విన్ ముఠా పట్టుబడిన అనంతరం సంచలనాత్మక విషయాలు వెలుగు చూశాయి. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సబర్వాల్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు నోటీసులు జారీ చేసి వారిన విచారిస్తున్నారు. ఈ సమయంలో నటి ఛార్మికి..మమైతఖాన్ లకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నోటీసులపై ఛార్మీ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించింది. విచారణ పేరిట వ్యక్తిగత వివరాలు అడగవద్దని..విచారణ సమయంలో తన న్యాయవాదిని అనుమతించాలని పిటిషన్ లో అభ్యర్థించింది. మహిళా అధికారులు మాత్రమే విచారించాలని, బలవంతంగా రక్త నమూనాలు..గోళ్లు..వెంట్రుకలు తన అనుమతి లేకుండా తీసుకోవద్దని..సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అధికారులు పట్టించుకోవడం లేదని..తనకు దురలావాట్లు లేవని..బలవంతంగా ఈ కేసులో ఇరికించారని ఆరోపణలు గుప్పించింది. ఆయా అంశాలపై ఎక్సైజ్ శాఖకు పలు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది.

మరి హై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

10:30 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ కేసులో ఎక్సైజ్‌ శాఖ రెండో జాబితా సిద్ధం చేసింది. ఇవాళ పలువురికి నోటీసులు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నోటీసులు అందుకున్నవారిని ఈ నెల 19నుంచి 27వరకూ విచారించనుంది. కేసు కీలక దర్యాప్తులో ఉండగా అకున్ సబర్వాల్ సెలవులపై వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలావుంటే కొంతమంది సినీ నటులు తమకు నోటీసులు అందలేదని అంటున్నారు. మరికొంతమంది సినీ నటులు తమకు డ్రగ్స్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. నోటీసులపై నటుడు సుబ్బరాజు స్పందించారు. తనకు నోటీసులు వచ్చిన వార్త నిజమేనని ఒప్పుకున్నారు. కానీ కెల్విన్ లిస్ట్‌లో తన పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు. డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవమన్నారు నటుడు నందు. తనకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్  నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పేరు లాగొద్దని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని యువ హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. నోటీసులు అందుకున్న ఐటమ్ గర్ల్ ముమైత్‌ఖాన్‌ కూడా తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియా సినీ పరిశ్రమకు విస్తరించడం దురదృష్టకరమని సినీయర్ నటులు అన్నారు. డ్రగ్స్ కేసులో తప్పు చేసిన స్టార్స్‌కి మా అసోసియేషన్ నుంచి ఎలాంటి సాయం ఉండబోదని మా అధ్యక్షులు శివాజీరాజా స్పష్టం చేశారు. 

07:20 - July 15, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ రాకెట్‌ టాలీవుడ్‌ వణుకు పుట్టిస్తోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న కొంతమంది టాలీవుడ్‌ స్టార్స్‌ నోటీసులపై స్పందించారు. డ్రగ్స్‌తో తమకేం సంబంధంలేదని స్పష్టం చేస్తున్నారు. అయితే కొందరి వల్లే సినీ పరిశ్రమపై చెడ్డపేరు వస్తుందని టాలీవుడ్ పెద్దలు చెప్తున్నారు. 
టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు 
టాలీవుడ్‌లో డ్రగ్స్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. డ్రగ్స్‌ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్స్‌కు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీచేయడంతో  సినీ పరిశ్రమలో ఒక్కసారిగా అలజడి రేగింది.
నాకు నోటీసులు అందాయి : సుబ్బరాజు
ఈ నోటీసులపై నటుడు సుబ్బరాజు స్పందించారు. తనకు నోటీసులు వచ్చిన వార్త నిజమేనని ఒప్పుకున్నారు. కానీ కెల్విన్ లిస్ట్‌లో తన పేరు ఎలా వచ్చిందో ఇప్పటికీ అర్థంకావడంలేదన్నారు.
నాకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవం : నందు 
డ్రగ్స్ కేసులో తనకు నోటీసులు వచ్చిన వార్త అవాస్తవమన్నారు నటుడు నందు. తనకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్  నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన పేరు లాగొద్దని ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చి విజ్ఞప్తి చేశారు. 
నాకు ఎలాంటి నోటీసులు అందలేదు : హీరో తనీష్‌ 
డ్రగ్స్‌ కేసులో సిట్‌ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని యువ హీరో తనీష్‌ తెలిపారు. తనకు డ్రగ్స్‌ తీసుకునే అలవాటు లేదన్నారు. డ్రగ్స్‌ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. 
డ్రగ్స్‌ వ్యవహారంతో నాకు సంబంధం లేదు : ముమైత్ ఖాన్  
నోటీసులు అందుకున్న ఐటమ్ గర్ల్ ముమైత్‌ఖాన్‌ కూడా తనకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం లేదని తెలిపారు. డ్రగ్స్‌ మాఫియా సినీ పరిశ్రమకు విస్తరించడం దురదృష్టకరమని సినీయర్ నటులు అన్నారు.  
వారికి ఎలాంటి సాయం ఉండదు : శివాజీరాజా 
డ్రగ్స్ కేసులో తప్పు చేసిన స్టార్స్‌కి మా అసోసియేషన్ నుంచి ఎలాంటి సాయం ఉండబోదని మా అధ్యక్షులు శివాజీరాజా స్పష్టం చేశారు. వాళ్లకు చట్టం ఎలాంటి శిక్ష విధిస్తుందో..అసోసియేషన్ అంతే శిక్ష వేస్తుందన్నారు. మొత్తానికి టాలీవుడ్ స్టార్స్‌ డ్రగ్స్‌ మత్తులో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఈ డ్రగ్స్‌ మత్తులో మరెంతమంది టాలీవుడ్ స్టార్స్‌ చిత్తవుతారో చూడాలి. 

21:47 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్ కేసుల నోటీలసుల విషయంలో నటులు స్పందించారు. పూర్తి వివరాలకువ వీడియో చూడండి.

21:45 - July 14, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ కలకలం కొనసాగుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో తగిలిన డ్రగ్స్‌ తీగను పట్టి లాగితే.. సినిమా పరిశ్రమలో డొంక కదులుతోంది. ఈ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌ అందించిన సమాచారం ఆధారంగా.. ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఇప్పటికే డజనుకు పైగా సినీరంగ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్‌, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామెన్‌ శ్యాం కె.నాయుడు, హీరోలు నవదీప్‌, తరుణ్, తనీష్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. ఈ నెల 19 నుంచి 27 వరకు సిట్‌ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని, సెక్షన్‌ 67 కింద జారీ చేసిన ఆ నోటీసుల్లో సూచించారు.

50 మంది వరకూ సినీ ప్రముఖుల పాత్ర
డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులకు నోటీసుల జారీ ప్రక్రియను ఇకపై కూడా కొనసాగించాలని ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్ణయించింది. డ్రగ్స్‌ వ్యవహారంలో సుమారు 50 మంది వరకూ సినీ ప్రముఖుల పాత్ర ఉందని డైరెక్టరేట్‌ అనుమానిస్తోంది. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన వారిని.. సిట్‌ ఆఫీసులోనే విచారిస్తామని.. హీరోయిన్లను మాత్రం వారు కోరిన చోట విచారిస్తామని, డైరెక్టరేట్‌ ప్రకటించింది. అయితే నోటీసులు అందుకున్న వారందరూ డ్రగ్స్‌ తీసుకుంటున్నారా? లేదా.. వాటి క్రయవిక్రయాల్లో పాలుపంచుకుంటున్నారా అన్నది తేలాల్సి ఉంది. వీటన్నింటిని లోతుగా విచారించేందుకే నోటీసులు జారీచేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. డ్రగ్స్‌ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. పియూష్ అనే సివిల్‌ ఇంజనీర్‌తో పాటు, మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య 13కు చేరింది. ఎల్‌ఎస్‌డీ కేసులో 11 మందిని, కొకైన్‌ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.

కొందరికి అందని నోటీసులు
అయితే టాలీవుడ్‌లో డ్రగ్స్‌ తీసుకుంటున్న వారందరికి నోటీసులు అందలేదని సమాచారం. ఇందులో బడా నిర్మాతలు, దర్శకుల కొడుకులను తప్పించినట్లు వదంతులు వినిపిస్తున్నాయి. కొంతమందికే నోటీసులిచ్చి ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, రాష్ట్ర రాజధానిలో డ్రగ్స్‌ మాఫియా గుట్టును బట్టబయలు చేయడంలో ముక్కుసూటిగా వెళుతున్న..ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ అనూహ్యంగా సెలవుపై వెళుతుండడం..పలు అనుమానాలకు తావిస్తోంది.

సబర్వాల్ పై ఒత్తిళ్లు
పాఠశాలల్లో డ్రగ్స్‌ విక్రయంపై మొదలైన విచారణ.. సినీ పరిశ్రమ వరకూ సాగింది. ఈ క్రమంలో.. ప్రభుత్వంపై సినీ ప్రముఖులు ఒత్తిడిని పెంచారని, అందుకే, ప్రభుత్వ పెద్ద ఒకరు అకున్‌ సబర్వాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆయన పది రోజుల సెలవులో వెళుతున్నారని తెలుస్తోంది. అయితే.. గతంలో దరఖాస్తు చేసుకున్న మేరకే సెలవు మంజూరైందని అకున్‌ చెబుతున్నారు. మొత్తానికి రకరకాల మలుపులతో.. డ్రగ్స్‌ వ్యవహారం.. సినిమా ఫక్కీలో రసవత్తరంగా సాగుతోంది. ఈ డ్రగ్స్‌ సినిమాకు క్లైమాక్స్‌ మరియు ముక్తాయింపు ఎలా ఏంటాయోనని సినిమా అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - puri jagannath