rafale deal

11:46 - November 24, 2018

న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో మరో అడ్డంకి ఎదురవ్వబోతోంది. ఆర్థిక నేరాలపై పోరాడే షెర్పా అనే ఫ్రెంచి స్వఛ్ఛంద సంస్థ ఏ ప్రాతిపదికన 36 రాఫెల్ యుద్ధవిమానాలను డాసౌ కంపెనీ భారత్‌కు సరఫరా చేస్తోందని కోరుతూ ఆ దేశ ఆర్థిక ప్రాసెక్యూషన్ కార్యాలయంలో పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ లో ఏ అంశాలు ఈ డీల్‌లో ప్రస్తావించారని.. ఏ అంశాలతో అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ డాసౌ ఎవియేషన్‌లో ఆఫ్‌సెట్ భాగస్వామిగా తీసుకున్నారో తెలపాలని కోరుతూ ఈ పిటీషన్ దాఖలైంది.

Image result for french ngo sherpaరాఫెల్ డీల్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనకు కావాల్సిన వారికి లాభించేలా వ్యవహరించారని వచ్చిన అవినీతి ఆరోపణలును పరిగణలోకి తీసుకున్న షెర్పా స్వచ్ఛంద సంస్థ ఈ పిటీషన్‌ను దాఖలు చేసినట్టు తెలిపింది. దీంతోపాటు మీడియా కథనాలు, తాము చేసిన దర్యాప్తులను కూడా ఈ పిటీషన్‌లో వెల్లడించింది. 
దీనిపై దర్యాప్తుచేసి నిజానిజాలను వెల్లడించాలని ఎన్పీపీ కార్యలయ అధికారులను కోరింది. 

 

12:42 - October 31, 2018

ఢిల్లీ : రాఫెల్ స్కాం..ప్రకంపనలు ఇంకా ఆగడం లేదు. ప్రతిపక్షాలు ఇప్పటికీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. దీనితో అధికారపక్షమైన బీజేపీ కౌంటర్ లు ఇస్తుండడంతో రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. చివరకు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందానికి వ్యతిరేకంగా దాఖలైన రెండు పిటిషన్‌లను సుప్రీంకోర్టు విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. బుధవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కొనుగోలు ఒప్పందంలోని ధరలు, వివరాలన్నింటినీ తమకు సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు డెడ్ లైన్ కూడా విధించింది. కేవలం పది రోజుల్లో అన్ని వివరాలను సీల్డ్ కవర్ లో అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. 
Image result for Rafale deal Supreme Courtన్యాయమూర్తులు వినీత్ దండా, మనోహర్ లాల్ శర్మలు ఈ పిటిషన్ లు దాఖలు చేశారు. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని వివరాలు రహస్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని, మరోవైపు, యుద్ధ విమాన ధరలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని... వీటి ధరలను వెల్లడించడం సాధ్యం కాదని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాలన్ కోర్టుకు తెలిపారు. దీనితో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం సూచించింది. ఈ ఒప్పందంపై సీబీఐ విచారణ చేయించాలని పిటిషనర్లు కోరారు. తరువాత పరిశీలించవచ్చని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుతం ఇచ్చిన సుప్రీం ఆదేశాలతో కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. 

09:25 - October 12, 2018

న్యూఢిల్లీ: రాఫెల్ డీల్ వివాదంలో పీకల్లోతు కష్టాల్లో ఉండి విపక్షాల దాడిని ఎదుర్కోంటున్న కమలదళం ఇప్పుడు ఎంజే అక్బర్ రూపంలో మరో గండంలో చిక్కుకుంది. మీటూ వివాదం ఆరోపణలు ఎదుర్కోంటున్న విదేశాంగశాఖ సహాయ మంత్రి అక్బర్ పై  ఇప్పటికే పలు విమర్శలు  చుట్టుముట్టాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఏరికోరి కేబినెట్ లోకి చేర్చుకున్నప్పటికీ విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వెంటనే అక్బర్ తో రాజీనామా చేయించాలని సంఘ్పరివార్ బీజేపీ నేతలపై ఒత్తిడి తీసుకు వస్తోంది. ప్రస్తుతం నైజీరియా పర్యటనలో ఉన్నఎంజే అక్బర్ తన పర్యటన అర్ధంతరంగా ముగించుకుని వచ్చి రాజీనామా చేసే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. ఎఁజే అక్బర్ 80వ దశకంలో ఏసియన్ ఏజ్, టెలిగ్రాఫ్ పత్రికల్లో పని చేసిన సమయంలో ఆయన వద్ద పని  చేసిన మహిళా జర్నలిస్టులను ఏరకంగా వేధింపులకు గురి చేశారో చెపుతూ, సుమారు 10 మంది జర్నలిస్టులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఆయన బండారాన్ని బయట పెట్టారు.

అక్బర్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నవంబర్ నెలలో ఆరాష్ట్ర శాసనసభకు  ఎన్నికలు జరుగుతున్నాయి.  మీటూ వివాదంతో ఆరాష్ట్రంలో బీజీపీ ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని ఇప్పటికే బీజేపీ భయపడుతోంది. అక్బర్ విషయంలో స్పందించటానికి కేంద్ర మంత్రులుగానీ, పార్టీ నాయకులు కానీ ప్రస్తుతానికి సుముఖంగా లేరు. ఒకవేళ మీటూ వివాదంపై అక్బర్ వివరణ ఇవ్వాలని చూసినా ఎన్నికల సమయంలో అది సంతృప్తికరంగా ఉండదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రియారమణి అనే జర్నలిస్టు ఒక ప్రముఖ ఎడిటర్ తనను లైంగికంగా ఎలా  వేధించారో వివరిస్తూ 2017లో మీటూ ఉద్యమాన్ని సమర్ధిస్తూ ఒక వ్యాసం రాశారు. ఇప్పుడు ఆమె ఆ ఎడిటర్ అక్బరేనని ట్విట్టర్ ద్వారా చెప్పారు. విదేశాల నుంచి రాగానే  అక్బర్ రాజీనామా చేస్తే ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా  చేసిన వారి సంఖ్య 3 కి చేరుకుంటుంది. 2017 జనవరిలో మేఘాలయ గవర్నర్‌ వి.షన్ముగనాథన్‌, 2018 ఆగస్టులో కేంద్ర మంత్రి నిహాల్‌ చంద్‌ మేఘ్‌వాల్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతోనే తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో  ఏంజరుగుతుందో వేచి చూద్దాం. 

14:01 - October 11, 2018

ఢిల్లీ: రాఫెల్ డీల్ దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. భారత్-ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. రాఫెల్ డీల్ పూర్తి వివరాలను సీల్డ్ కవర్‌లో తమకు అందజేయాలని సుప్రీంకోర్టు నిన్న కేంద్రాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అనిల్ అంబానీకి ప్రధాని మోదీ రూ.30,000 కోట్లు అప్పనంగా ఇచ్చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ ప్రధాని మోదీ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాహుల్ డిమాండ్ చేశారు.

ఈ ఫైటర్ జెట్ల కొనుగోలు ఒప్పందంలో రహస్యంగా ఉంచాల్సిన అంశాల్లో విమానం ధర లేనేలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని స్వయంగా తనకు చెప్పారని తెలిపారు. వాస్తవాలను రాస్తున్న మీడియాపై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని, అయినా లొంగనివారిపై ఐటీ దాడులు చేయిస్తోందని రాహుల్ విమర్శించారు. 

దేశానికి కాపలాదారుగా ఉంటానన్న ప్రధాని మోదీ అవినీతిపరుడిగా తయారయ్యారని రాహుల్ ఎద్దేవా చేశారు. అవినీతిపై పోరాడతానన్న హామీతోనే మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. సుప్రీంకోర్టు రాఫెల్ వివరాలు ఇవ్వాలని నిన్న కోరగానే రాత్రికిరాత్రి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్రాన్స్ కు వెళ్లారని, దీని వెనుక అసలు రహస్యం ఏంటని రాహుల్ ప్రశ్నించారు.

మోదీ అవినీతికి పాల్పడ్డారు అనేదానికి ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయని రాహుల్ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్సిస్ హోలాండే, డస్సాల్ట్ కంపెనీలో నంబర్ 2 అధికారి ఇద్దరూ.. మోదీ అవినీతి పరుడనే చెప్పారన్నారు. డస్సాల్ట్ కంపెనీపై ఒత్తిడి తీసుకొచ్చి తన అవినీతిని మోదీ దాస్తున్నారని విమర్శించారు. రిలయన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకోకుండా, వారికి తగిన మొత్తం చెల్లించకుండా కాంట్రాక్టును దక్కించుకోలేరని డస్సాల్ట్ కంపెనీకి కేంద్రం స్పష్టం చేసినట్లు ఇటీవల ఓ డాక్యుమెంట్ లభ్యమయిందని రాహుల్ ఆరోపించారు. ఇదొక్కటే కాదు, గతంలో కేంద్రం చేసుకున్న పలు ఒప్పందాలకు సంబంధించిన వాస్తవాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయని రాహుల్ బాంబు పేల్చారు.

12:02 - October 10, 2018

ఢిల్లీ: రాఫెల్ డీల్.. దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో దీనిపై మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించిన వివరాలు, ఈ ఒప్పందం కుదుర్చుకోవడంపై నిర్ణయం తీసుకున్న ప్రక్రియ గురించి పూర్తి వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఈ నెల 29లోగా అందజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే విమానాల ధర, సాంకేతిక అంశాలకు సంబంధించిన వివరాలు అవసరం లేదని కోర్టు వెల్లడించింది. దేశ రక్షణ అంశమైనందున వ్యయాల విషయాన్ని అడగబోమని కోర్టు స్పష్టం చేసింది.

‘మేము కేంద్రానికి నోటీసులు జారీ చేయడం లేదు. పిటిషనర్ల వాదనలు పరిగణలోకి తీసుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాం. వారి వాదనలు ఆమోదయోగ్యంగా లేవు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే రాఫెల్ ఒప్పంద నిర్ణయం ఏ విధంగా తీసుకున్నారో తెలపాలని ధర్మాసనం ఆదేశించింది. 

భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రూ.59వేల కోట్లతో 36యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని పిటిషనర్‌ ఎంఎల్‌ శర్మ వాదించారు. ఈ కేసు జాతీయ భద్రతకు సంబంధించిందని, దీన్ని రాజకీయం చేస్తున్నారని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ కోర్టులో వాదనలు వినిపించారు. ఈ కేసులో దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై అక్టోబరు 31న విచారణ జరపనున్నట్లు కోర్టు తెలిపింది.

36 విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందని, ఇరు దేశ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 253 ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేనందున, ఒప్పందాన్ని రద్దు చేయాలని న్యాయవాది తన పిటీషన్‌లో పేర్కొన్నారు.

రాఫెల్ ఒప్పందం భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన రక్షణ ఒప్పందం. భారత ఎయిర్‌ఫోర్స్ ఆయుధాల ఆధునికీకరణ ప్రక్రియలో భాగంగా భారత్, ఫ్రాన్స్ మధ్య జరిగిన ఈ ఒప్పందంలో 36 రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ కొనుగోలు చేయాలనేదే ఒప్పందం. రెండు ఇంజిన్ల మీడియం మల్టీ రోల్ కంబాట్ సామర్థ్యం కలిగిన రాఫెల్ విమానాలను ఫ్రెంచ్ ఏరోస్పెస్ కంపెనీ డసాల్డ్ ఏవియేషన్ తయారు చేసింది. ఇది 59వేల కోట్ల డీల్. 2016లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.

19:08 - September 22, 2018

ఢిల్లీ : రాఫెల్ డీల్ పై కాంగ్రెస్...బీజెపి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బీజేపీ..ప్రధాన మంత్రి నరేంద్ర మోడీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రాఫెల్ విమానం డీల్ సందర్భంగా భారత ప్రభుత్వం అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ పేరును ప్రతిపాదించిందని హోలాండే ప్రకటన చిచ్చు రాజేస్తోంది. తాజాగా మరోసారి దీనిపై పలు వ్యాఖ్యలు చేశారు. మోడీపై పలు ఆరోపణలు గుప్పించారు. 

ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీనే అవినీతికి పుట్టిల్లు లాంటిదని, పలు స్కాంల కారణంగా కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రాజీనామాలు చేశారని...మాజీ ప్రధాని మన‍్మోహన్‌  విచారణను ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఒప్పందంకంటే 9 శాతం తక్కువకే ఒప్పందం చేసుకోవడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ హాయాంలోనే ఈ ఒప్పందం జరిగిందని చెప్పుకొచ్చారు. 2012లో జరిగిన ఈ ఒప్పందం దేశ చరిత్రలో ప్రధానిపై ఈ తరహా ఆరోపణలు ఏ పార్టీ అధ్యక్షులు చేయలేదని వివరించారు. 

16:16 - September 22, 2018

ఢిల్లీ :  ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విరుచకపడ్డారు. రాఫెల్ యుద్ధ విమానం కొనుగోలు రాజకీయాల్లో మంట రాజేస్తోంది. రాహుల్ వీటిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గత కొన్ని రోజులుగా పలు ఆరోఫణలు గుప్పిస్తున్న కాంగ్రెస్ కు ఫ్రాన్్స మాజీ అధ్య‌క్షుడు హోలాండే చేసిన ప్రకటన మరింత బలం ఇచ్చినట్లైంది. శనివారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాఫెల్ విమానం డీల్ సందర్భంగా భారత ప్రభుత్వం అనిల్ అంబానీ రిలయన్స్ డిఫెన్స్ కంపెనీ పేరును ప్రతిపాదించిందని హోలాండే ప్రకటన చిచ్చు రాజేస్తోంది. 

దీనిపై రాహుల్ ఎదురుదాడిని మరింత ఉధృతం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, రిలయన్స్ డిఫెన్స్ అధినేత అనిల్ అంబానీలు ఇద్దరు కలిసి భారత రక్షణ వ్యవస్థపై రూ.130వేలకోట్లతో సర్జికల్ దాడులు నిర్వహించారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రూ.30,000 కోట్ల విలువైన రాఫెల్ కాంట్రాక్టును అనిల్ అంబానీ చేతుల్లో పెట్టారని ఆరోపించారు. అనిల్ అంబానీ జీవితంలో ఇప్పటి వరకూ యుద్ధ విమానాలను తయారు చేయలేదనీ, ఆయన పేరుపై ఇప్పటికే రూ.45,000 కోట్ల అప్పు ఉందని పేర్కొన్నారు.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల రక్తాన్ని మోడీ అగౌరవ పర్చారని ఒక విధంగా సిగ్గుపడాల్సి అంశమని వెల్లడించారు. ఇన్ని ఆరోపణలు, విమర్శలు వస్తున్నా మోడీ ఎందుక సైలెంట్ గా ఉంటున్నారని ప్రశ్నించారు. మోడీ దేశానికి నమ్మక ద్రోహం చేశారని రాహుల్ విరుచుకుపడ్డారు. రాఫెల్ ఒప్పందంలో జరిగిన భారీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని, రక్షణ శాఖ మంత్రి సీతారామన్ లు రాజీనామాలు చేయాలని, ఈ ఘటనపై జాయింట్ పార్లమెంటరీ కమిటీని  ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ హయాంలో ఒక్కో రాఫెల్ యుద్ద విమానం కోసం రూ.570 కోట్లతో ఒప్పందం జరగ్గా.. మోదీ సర్కార్ ఒక్కో విమానంపై రూ.1670కోట్లు ఖర్చు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డసాల్ట్‌తో కుదిరిన ఒప్పందం మేరకు నాగపూర్‌లో రిలయన్స్ సహకారంతో రాఫెల్ యుద్ధ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఫాల్కన్‌తో పాటు రాఫెల్ విమానాల విడి భాగాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. తాజాగా రాహుల్ చేసిన విమర్శలపై బీజేపీ ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి. 

 

17:14 - July 23, 2018

న్యూఢిల్లీ : ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జీ కుంతియం వెల్లడించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం ఆయన దృష్టిసారించారు. అందులో భాగంగా ఢిల్లీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ తో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ కార్యదర్శులు బోసరాజు, సలీం, శ్రీనివాస్ లు కూడా పాల్గొన్నారు. ఒక్కో కార్యదర్శికి ఐదారు పార్లమెంట్ నియోజకవర్గాలు కేటాయించినట్లు, సీఎం కేసీఆర్ చెబుతున్నదానికంటే బలంగా ఉన్నామని తెలిపారు. 

14:05 - July 23, 2018

ఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలను ఏ ధరకు కొనుగోలు చేశారో చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. యుద్ధ విమానాల కొనుగోలు ధర ఇవ్వడంలో కేంద్రం ఎందుకు తాత్సారం చేస్తుందని ప్రశ్నించారు. 2014ఎన్నికల్లో కేసీఆర్ ఆకర్షణీయమైన మాటలతో, కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ఆలస్యంగా విడుదల చేయడంతో టీఆర్ఎస్ గెలిచిందని..కాంగ్రెస్ ఓడిపోయిందని తెలిపారు. అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడం, ఎంపికలో ఆలస్యం అవుతుందన్నారు. మూడు నెలల ముందే మేనిపెస్టో విడుదల చేయాలని, అభ్యర్థులకు టిక్కెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయాలని ఏఐసీపీ సమావేశంలో చెప్పినట్లు తెలిపారు. సంస్థాగతంగా బలపడేందుకు నిరంతరాయంగా కృషి చేస్తున్నామని చెప్పారు.

 

22:03 - September 24, 2016

ఢిల్లీ : భారత్‌- ఫ్రాన్స్‌ల మధ్య 36 రాఫెల్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై కాంగ్రెస్ మోది సర్కార్‌ను టార్గెట్‌ చేసింది. ఈ ఒప్పందంలో మోది మేక్‌ ఇన్ ఇండియా ఏమైందని ప్రశ్నించింది. వైమానిక దళాన్ని బలోపేతం చేసేందుకు 126 రాఫెల్‌ ఎయిర్‌ క్రాఫ్ట్ లను కొనాలని అప్పట్లో యుపిఏ ప్రభుత్వం నిర్ణయించిందని మాజీ రక్షణ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఎకె అంటోని అన్నారు. మోది ప్రభుత్వం కేవలం 36 రాఫెల్‌ ఫైటర్‌ జెట్స్‌ కొనడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటితో చైనా, పాక్‌లను ఎలా ఎదుర్కొంటారని ఆయన ప్రశ్నించారు. 126 ఎయిర్‌ క్రాఫ్ట్‌లకు గాను 108 భారత్‌లోనే తయారు చేయాలని యుపిఏ ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. మోది ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో మేక్‌ ఇన్‌ ఇండియా ప్రస్తావనే లేదని ఆంటోని తెలిపారు.  

Don't Miss

Subscribe to RSS - rafale deal