railway station

07:15 - May 14, 2017

హైదరాబాద్: ఏ కష్టమొచ్చిందో ఏమోకానీ.. ఓ యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. రైలు కిందపడి చనిపోవాలనుకుంది. ప్లాట్‌పామ్‌పైకి రైలు వస్తుండడంతో దానికింద పడేందుకు పరుగులు తీసింది. ఇది గమనించిన ఓ వ్యక్తి ఆమెను కాపాడాడు. రైలు కిందపడకుండా అడ్డుకున్నాడు. దీంతో ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. చైనాలోని పుటియన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.

 

08:17 - April 4, 2017

మాస్కో : రష్యాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. మాస్కోలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ మెట్రోస్టేషన్‌లో బాంబు పేల్చారు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. మరో 50మందికిపైగా గాయపడ్డారు.  బాంబు పేలుడుతో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. 
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో పేలుళ్లు
రష్యాలో మరోసారి ఉగ్రవాదులు తెగబడ్డారు. మాస్కోలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో బాంబులు పేల్చారు. ఒక్కసారిగా పేలుళ్లు సంభవించడంతో ఎక్కడివారు అక్కడ భయంతో పరుగులు తీశారు. బాంబు పేలుళ్లతో  మాస్కో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.   రద్దీగా ఉన్న మెట్రోస్టేషన్లను టార్గెట్‌ చేసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు.  రెండు మెట్రోస్టేషన్లలో పేలుళ్లు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
పేలుళ్లలో 10మంది మృతి
ఉగ్రవాదులు జరిపిన బాంబు పేలుళ్లతో మొత్తం 10మంది రష్యన్‌లు చనిపోయారు. మరో 50మంది వరకు గాయపడ్డారు.  బాంబు పేలుడు జరిగిన బోగీ దగ్గర మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి.  రక్తపు మరకలు కూడా కనిపిస్తున్నాయి.  అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. గాయపడిన వారిలో చిన్నారులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.
పేలుళ్లతో రష్యా ప్రభుత్వం అలర్ట్‌
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుళ్లతో ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. సమీపంలోని  8 స్టేషన్లనూ మూసివేశారు.  మాస్కోలో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. రష్యన్‌ భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి.  రైలులోని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.  ఐఈడీ బాంబుతో బోగీని పేల్చివేసినట్టు అంచనా వేశారు. మరోవైపు పేలుళ్ల నేపథ్యంలో భద్రతా అధికారులతో పుతిన్‌ సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.  ఘటనపై అన్ని కోణాల్లో విశ్లేషిస్తున్నామన్నారు. పేలుడు బాధితులకు పుతిన్‌ సంతాపం తెలిపారు. 
 

 

18:28 - April 3, 2017

హైదరాబాద్: రష్యాలో టెర్రరిస్టులు మరోసారి పంజా విసిరారు. సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌ మెట్రో స్టేషన్‌ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో పదిమంది మృతి చెందారు. మరో 50మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో చిన్నారులు ఎక్కువమంది ఉన్నట్లు సమాచారం. ఉగ్రవాదులు రైలులోనే బాంబులు అమర్చి దాడులకు పాల్పడి ఉంటారని నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. రెండు మెట్రో స్టేషన్లలో పేలుళ్లు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముందు జాగ్రత్తగా మూడు మెట్రోస్టేషన్లను మూసివేసి రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. దుండగులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. దాడి ఘటనను ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌- మృతులకు సంతాపం ప్రకటించారు. పుతిన్ సెయింట్‌ పీటర్‌ బర్గ్‌ పర్యటనలో ఉండగా ఈ ఘటన జరగడం గమనార్హం.

 

09:15 - March 31, 2017

హైదరాబాద్: ఒడిశాలో మావోయిస్టులు గురువారం అర్థరాత్రి డోయ్‌కల్‌ రైల్వేస్టేషన్‌పై దాడి చేసి స్టేషన్‌ను మందుపాతరలతో పేల్చివేశార. ఈ ఘటనలో రైల్వేస్టేషన్‌ ధ్వంసం కాగా.. సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. మావోయిస్టుల దాడితో ఈ మార్గంలో ప్రయాణించే పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. రూర్కెలా-కోరాపుట్‌, ధన్‌బాద్‌-అలెప్పి, విశాఖ-కొర్బా, కొర్బా-విశాఖ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

17:35 - January 19, 2017

కామారెడ్డి : జిల్లా రైల్వే స్టేషన్‌ దగ్గర పది కిలోల మత్తుపదార్థాన్ని.. పోలీసులు పట్టుకున్నారు. దానిని సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.  రూట్‌ వాచ్‌ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన కురుమూర్తి గౌడ్‌ను ఎక్సైజ్‌ అధికారులు తనిఖీ చేసి.. ఆయన దగ్గర ఉన్న పది కిలోల ఆల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆల్ఫాజాలం ఏడు లక్షల విలువ చేస్తుందని.. వీరిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. కర్ణాటక రాష్ట్రంలో ఉత్తల గ్రామ కేంద్రంగా ఈ వ్యాపారం సాగుతుందని చెప్పారు.

 

21:28 - January 11, 2017

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో రద్దీ పెరిగింది. పన్నెండో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో.. ఏపీకి చెందిన వారు.. చిన్నా పెద్ద సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

మహానగరం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళే ప్రయాణీకుల కష్టాలు అన్నిఇన్నీ కావు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. ట్రైన్లు లేక పోవడంతో ప్రయాణీకులు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. దొరికిన రైళ్లు, బస్సులలో సీట్లు దోరకక ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు జూబ్లి బస్టాండ్ లో ఆందోళనకు దిగారు. గంటల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్ధితి ఉండటంతో మరిన్ని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు వేయాలని డిమాండ్ చేసారు.

పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ఆంధ్రాప్రజలు...

హైదరాబాద్ మహానగరంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం వారివారి ప్రాంతాలకు తరలివెళతారు. వీరితో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి వెళతారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వెళ్లే వారి కోసం ఆర్టీసీ, రైల్వే శాఖలు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులు నడపడంలో ఆర్టీసీ విఫలమైంది. దీనికి తోడు రైల్వే శాఖ కూడా అదనపు రైళ్లను వేయకపోవడంతో సంక్రాంతి రద్దీ మరింతగా పెరిగింది.

అదనపు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్....

సందేట్లో సడేమియాల్లా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు బస్సు ఛార్జీలు మూడింతలుగా వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది. దీనిపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీని అరికట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేసారు. ఇప్పటికైనా ఆర్టీసీ , రైల్వే శాఖలు స్పందించి రద్దీకి తగ్గటుగా అదనపు బస్సులను, రైళ్లను నడపాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

12:09 - December 4, 2016

హైదరాబాద్ : బెంగళూరు...సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్ లో చోరీ జరిగింది. బెంగళూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ లో ఎపిలోని అనంపురం జిల్లా గుంతకల్ వద్ద రెండు బోగీల్లో 12 తులాల బంగారం, రూ.40 వేలను అపహరించారు. సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. 

 

14:53 - September 28, 2016

కృష్ణా : బెజవాడ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూట్‌ రిలే ఇంటర్‌లాకింగ్‌ సిస్టమ్‌ తుదిదశ పనులను పూర్తి చేశారు. అధికారులు సిగ్నలింగ్‌ వ్యవస్థను మెరుగుపర్చారు. అనుకున్న గడువు కంటే ముందే పనులు పూర్తయ్యాయి. దీంతో రైళ్లన్నీ వారం తర్వాత ప్లాట్‌ఫారాలకు చేరుకుంటున్నాయి. బెజవాడ రైల్వేస్టేషన్‌లో మెరుగైన సిగ్నలింగ్‌ వ్యవస్థపై మరిన్ని వివరాలను టెన్ టివి ప్రతినిధి అందించారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం..

 

14:50 - September 21, 2016

విజయవాడ రైల్వే జంక్షన్ ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దుచేయగా, మరికొన్ని రైళ్లు పూర్తిగా రద్దయ్యాయి. ఉత్తర, దక్షణ భారతదేశాల మధ్య నడిచే రైళ్లకు మాత్రమే కొన్ని ప్లాట్ ఫారమ్స్ పైకి అనుమతిస్తున్నారు. ఆధునీకరణ పనులపై మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:38 - September 20, 2016

కృష్ణా : విజయవాడ రైల్వే స్టేషన్‌లో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌ పనులు కారణంగా రేపటి నుంచి 28వ తేదీ వరకు మెగా లైన్‌ బ్లాక్‌ను తీసుకొంటున్నట్లు సీనియర్‌ డీసీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని పాక్షికంగా రద్దు చేస్తామని, కొన్నింటిని దారి మళ్లించి నడుపుతామని చెప్పారు.  గుంటూరు-విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 22, 23, 24 తేదీల్లో పూర్తిగా రద్దయ్యే అవకాశాలున్నాయి. గుంటూరు-సికింద్రాబాద్‌- గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని 23వ తేదీ వరకు రద్దు చేయనున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - railway station