Rain Effect

08:16 - April 7, 2018

హైదరాబాద్‌ : నగరంలో రాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్‌శాఖ అధికారులు ముందస్తుగా సరఫరా నిలిపివేయడంతో చాలా ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. రోడ్లపై వర్షపునీరు భారీగా నిలిచింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలుప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. చిలకలగూడలో భారీ వర్షం నేలకూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలుపడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. క్యూమిలోనింబస్‌ మేఘాల ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం తేలికపాటి నుంచి ఓ మోస్తారు కురుస్తుందని తెలిపింది. 

 

12:07 - April 2, 2018

సూర్యపేట : జిల్లా హుజుర్‌నగర్‌ నియోజకవర్గంలో రాత్రి కురిసిన వర్షానికి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందే సమయంలో ఈదురుగాలులు, వర్షాల బీభత్సానికి దాదాపు వంద ఎకరాల పంట నేలమట్టం అయింది. ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మామిడితోటలు, బత్తాయి తోటలు కాయరాలిపోయి తీవ్ర నష్టం వాటిళ్లింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు కొంత ఉపశమనం కలిగించాలని రైతులు కోరుతున్నారు. 

21:52 - March 17, 2018

కడప : తెలుగు రాష్ట్రాలలో గాలివాన బీభత్సం సృష్టించింది. అకాలంగా కురిసిన వర్షాలకు రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. ఈ నేపథ్యంలో రైల్వే కోడూరు మండలంలో శుక్రవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది.. పెనుగాలులతో కూడిన వర్షానికి అరటి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో అరటి, మామిడి పంటలు సాగు చేస్తుంటారు.. కాగా రాత్రి కురిసిన వర్షంతో పండ్ల తోటల్లో పూత, పిందెలు రాలిపోవడంతో పాటు... చెట్లు నేలకొరిగాయి.... ముఖ్యంగా అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పు చేసిన తోటలు సాగుచేశామని... ఎలాగైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

గిట్టుబాటు ధరలేక ఆందోళన
అసలే గిట్టుబాటు ధరలేక ఆందోళన చెందుతోన్న రైతులను రాత్రి కురిసిన అకాల వర్షం మరింత నిరాశ పరిచింది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు మండలంలో రైతులు గిట్టుబాటు ధరలేక మర్కెట్‌ యార్డు వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకున్నారు. రాత్రి కురిసిన వర్షంతో అది కాస్తా తడిచి పోయింది. దీంతో రైతులు తడిసిన ధాన్యాన్ని వదిలేసేందుకు సిద్ధమయ్యారు. తమను ఆదుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భారీ వర్షం
భద్రాద్రి కొత్త గూడెం జిల్లా భారీ వర్షంతో తడిసి ముద్దయ్యింది.. తెల్లవారు జామునుంచి కురుస్తున్న వర్షంతో.... అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాల్లో దారులన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయి అస్తవ్యస్తంగా మారాయి. కుండపోత వర్షంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. ఏకధాటిగా వర్షం కురవడంతో.. ప్రజలు ఇళ్ళలోనుంచి బయటికి రాలేని పరిస్థితినెలకొంది..

16:42 - October 12, 2017

కృష్ణా : జిల్లాలోని గన్నవరం పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. గన్నవరం మండలం ముస్తాబాద్‌, ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి, చిన్నఅవుటపల్లిలో భూమి కంపించింది. అటు గన్నవరం ఎయిర్ పోర్ట్‌లోనూ స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అధికారులు భయంతో పరుగులు తీశారు. గన్నవరంలో మూడురోజుల్లో భూమి కంపించండం ఇది రెండోసారి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

19:17 - October 9, 2017

హైదరాబాద్ : నగర్ మేయర్ ఉప్పల్ లో పర్యటించారు. అక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుకున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

Don't Miss

Subscribe to RSS - Rain Effect