raja

15:56 - December 6, 2018

పుదుచ్చేరి : మన ఇంటిలోకి పాము వచ్చిందంటే కొట్టి చంపేస్తాం. అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తాం. అంతే తప్ప ఏకంగా ముఖ్యమంత్రిగారికి ఫోన్ చేసి రక్షించండి అని అడగం కదా? ఏం ఎందుకు సీఎంను అడగకూడదు అనుకున్నాడో పాము బాధితుడు. పాము నుండి రక్షించండి సీఎంగారూ అంటు ఏకంగా ఫోన్ కొట్టాడు. 
పుదుచ్చేరి రాష్ట్రం, అరియాంకుప్పవలో రాజా అనే వ్యాపారి ఇంట్లోకి ఓ త్రాచుపాము వచ్చింది. భయపడిన రాజా ఫారెస్ట్ అధికారులకు ఫోన్ చేశాడు. స్పందించకపోవటంతో టెలిఫోన్ డైరెక్టరీ తీసుకుని ఏకంగా పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామికి ఫోన్ కొట్టాడు. ‘సార్.. మా ఇంట్లో పాము దూరింది. అధికారులకు ఫోన్ చేస్తే ఎవ్వరూ ఎత్తడం లేదు. దయచేసి సాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశాడు. అర్ధరాత్రి ఫోన్ వచ్చినా విసుక్కోకుండా సీఎం నారాయణ స్వామి ఆయన అడ్రస్ తెలుసుకోవటమే కాకుండా రాజాకు ధైర్యం చెప్పారు. 
అంతేకాదు వ్యాపారి రాజా ఇంటికి వెంటనే వెళ్లాల్సిందిగా అధికారులను ఆదేశించి రాజా అడ్రస్ ను అటవీశాఖా అధికారులను తెలిపారు సీఎం నారాయణ స్వామి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డిసెంబర్ 5వ తేదీన రాత్రి జరిగింది. సీఎంగారి ఆదేశాలతో రాజా ఇంటికి వెళ్లిన వారు పామును పట్టుకోవడంతో రాజా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. సీఎం స్పందించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

17:47 - October 17, 2018

వరుణ్ తేజ్, అదితిరావు హైదరీ, లావణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్స్‌గా, ఘాజీ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప్‌రెడ్డి డైరెక్షన్‌లో, దర్శకుడు క్రిష్ సమర్పణలో, సాయిబాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న మూవీ అంతరిక్షం 9000KMPH.
తెలుగులో  మొట్టమొదటి స్పేస్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న అంతరిక్షం టీజర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిహర స్పేస్ ప్రాజెక్ట్ టీమ్‌లో ఉండే  వరుణ్, తన టీమ్ మేట్స్‌తో స్పేస్‌కి చేరుకోవడం, అక్కడ సమస్యలు ఎదురవడం, వాటని ఎలా సాల్వ్ చేస్తాడు అనే ఆసక్తికర అంశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది అంతరిక్షం టీజర్.. టీజర్‌లో వరుణ్‌తో పాటు, అదితి రావు, సత్యదేవ్, రాజా కనబడ్డారు కానీ, లావణ్య త్రిపాఠిని చూపించలేదు.. గ్రాఫిక్ వర్క్, విజువల్స్‌తో పాటు, ఆర్ఆర్ కూడా బాగుంది.. డిసెంబర్‌లో ప్రేక్షకులను స్పేస్‌లోకి తీసుకెళ్ళబోతోంది అంతరిక్షం టీమ్...

 

22:04 - December 21, 2017

ఢిల్లీ : 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళికి ఊరట లభించింది. వీరిద్దరితో పాటు ఈ కేసులో నిందితులందరిని నిర్దోషులుగా ప్రకటించింది. యూపిఏ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిజం కావని కోర్టు తీర్పు రుజువు చేసిందని కాంగ్రెస్‌ పేర్కొంది. కోర్టు తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుబ్రహ్మణ్యస్వామి  ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2జీ స్పెక్ట్రం  కుంభకోణం కేసులో పటియాలా సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం  తీర్పు వెలువరించింది. టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ. రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు నిందితులందరిని నిర్దోషులుగా తేల్చింది. నేరారోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. 

పటియాల హౌస్‌ కోర్టు తీర్పుతో డిఎంకె, కాంగ్రెస్‌ శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కాగ్‌ వినోద్‌ రాయ్‌, బిజెపిలను కాంగ్రెస్‌ టార్గెట్‌ చేసింది. 2జీ స్పెక్ట్రం కేసులో పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ విషయంలో యూపిఏ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరిగిందన్నారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులకు సంబంధించి యూపిఏ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు నిజం కావని కోర్టు ఇచ్చిన తీర్పుతో రుజువైందని మన్మోహన్‌ చెప్పారు.

2 జి స్పెక్ట్రం కేసు తీర్పును రాజ్యసభలోనూ  కాంగ్రెస్‌ ప్రస్తావించింది. 2 జి స్కాంను అడ్డుపెట్టుకుని తప్పుడు ఆరోపణలతో బిజెపి అధికారాన్ని చేజిక్కించుకుందని విమర్శించింది. 2 జి స్పెక్ట్రంలో  లక్షా 76 వేల కోట్ల  స్కాం జరిగిందన్న ఆరోపణలు నిరాధారమని కోర్టు తేల్చిందని పేర్కొంది.

సీబీఐ కోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణుల సంబరాలు మిన్నంటాయి. పటాకులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పటియాలా హౌజ్ కోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని డీఎంకే పేర్కొంది. 2జి కేసుతో డీఎంకేను అంతం చేయాలని చూసినవాళ్లకు కోర్టు తీర్పు చెంప పెట్టు లాంటిందని అభిప్రాయపడింది. 2 జి స్పెక్ట్రం కేసులో కోర్టు తీర్పుపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పందించారు. కోర్టు తీర్పును చూసి గర్వపడవద్దని కాంగ్రెస్‌కు హితవు పలికారు. 2జీ స్పెక్ట్రం కేటాయింపులను 2012లో సుప్రీంకోర్టు రద్దు చేసినప్పుడే కాంగ్రెస్‌ పార్టీ విఫల సిద్ధాంతాలు రుజువయ్యాయని విమర్శించారు.  

యూపిఏ ప్రభుత్వంలో టెలికాం శాఖ మంత్రిగా డి.రాజా ఉన్న సమయంలో 2 జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల 1.76 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు 2010లో కాగ్‌ కేంద్రానికి ఓ నివేదిక సమర్పించింది. దీంతో ప్రభుత్వం రాజాను పదవి నుంచి తప్పించింది. ఈ స్కాంలో సీబీఐ రెండు కేసులు, ఈడీ మరో కేసు నమోదు చేసింది. రాజా, కనిమొళితో పాటు టెలికమ్యూనికేషన్స్‌ మాజీ కార్యదర్శి సిద్దార్థ్‌ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్‌కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. 2011లో రాజాను అరెస్ట్‌ చేశారు. ఏడాది తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యారు. పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ, ఈడీ హైకోర్టులో అప్పీల్ చేయాలని నిర్ణయించాయి. 

17:44 - May 28, 2016

పండంటి కాపురం చిత్రం చూసి కృష్ణ గారి అభిమాని అయ్యానని, ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించిన కృష్ణ గార్ని డైరెక్ట్ చేయ‌డం అదృష్టంగా భావిస్తున్నానని డైరెక్టర్ ముప్పలనేని శివ పేర్కొన్నారు. కృష్ణతో పాటు విజయ నిర్మల, సీనియర్ నరేష్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 3వ తేదీన ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ముప్పలనేని శివతో టెన్ టివి ముచ్చటించింది. ఆయన ఎలాంటి విశేషాలు తెలిపారో వీడియో క్లిక్ చేయండి. 

16:20 - April 23, 2016

చెన్నై: డీఎంకే నేత, మాజీ కేంద్ర మంత్రి రాజా కారుపై సొంత పార్టీకి చెందిన కార్యకర్తలే దాడి చేశారు. కునూరు నియోజకవర్గానికి ఎంపిక చేసిన ఎంబీ ముబారక్ అభ్యర్థిత్వాన్ని డీఎంకే కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉదగమండలం అభ్యర్థిని పరిచయం చేసేందుకు శుక్రవారం కోటగిరి చేరుకున్న రాజాపై కొంతమంది కార్యకర్తలు చెప్పులు, కోడిగుడ్లతో దాడి చేశారు. కాసేపు రాజాను ఘోరావ్ చేశారు. పోలీసులు కార్యకర్తలను అదుపు చేశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో అసంతృప్తిని పక్కన పెట్టి విజయం కోసం కృషి చేయాలని డిఎంకె అధినేత కరుణానిధి చెప్పిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది.

18:41 - December 6, 2015

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కోసం.. స్పెషల్‌ స్టేటస్‌ సాధన సమితి ఢిల్లీలో నిర్వహించబోయే మహాధర్నాకు.. పలు పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో సైతం లేవనెత్తుతామని సిపిఐ మాజీ కార్యదర్శి రాజా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో అటు కాంగ్రెస్, ఇటు ఎన్డీయే నేతలు లెక్కలేనన్ని హామీలు ఇచ్చి స్టేట్‌ను విడదీశారు. నాడు ఇచ్చిన హామీల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఒకటి. ఎన్డీయే అధికారంలోకొచ్చాక ఈ హామీ గురించిన ఊసే ఎత్తడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ సందర్భాల్లో స్పెషల్ స్టేటస్‌ కోరుతూ ఆందోళన చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి తన రూటు మార్చి ఢిల్లీకి చేరింది. హస్తినలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ సంఖ్యలో జనసమీకరణ చేసి మహాధర్నా నిర్వహించాలని డిసైడ్ చేసింది. డిసెంబర్ 7న జరిగే ఈ ధర్నాకు వామపక్ష పార్టీలు పూర్తి మద్దతు తెలిపాయి.

రౌండ్ టేబుల్ సమావేశం..
మహాధర్నాలో భాగంగా ముందస్తు వ్యూహ రచన కోసం ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి వివిధ ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని సిపిఐ నేత రాజా చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తానిచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు నిలదీయాలని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. విభజన సమయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్లే ఈ గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు.  వివిధ ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించడం, ఆందోళనను విజయవంతం చేయడం లాంటి పలు అంశాలను ఈ రౌండ్ టేబుల్‌ సమావేశంలో చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కేదాకా ఆందోళన విరమించబోమని నేతలు స్పష్టం చేశారు. 

Don't Miss

Subscribe to RSS - raja