rajamouli

14:55 - July 19, 2017

‘బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాలతో హాలీవుడ్ చూపు తెలుగు వైపు వచ్చేలా చేసిన దర్శకుడు 'రాజమౌళి'. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడమే కాకుండా రికార్డులు బద్దలు కొట్టాయి. కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించింది. ఈ సినిమా అనంతరం 'రాజమౌళి' నెక్ట్స్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఏ ప్రాజెక్టు చేస్తున్నారో ? నిర్మాత ఎవరు ? హీరో..హీరోయిన్ ఎవరు ? అనేది తెలియడం లేదు.

తాజాగా 'శ్రీదేవి..’రాజమౌళి'లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. 'శివగామి' పాత్ర ఈ ఇద్దరి మధ్య చిచ్చు రేపిన సంగతి తెలిసిందే. శివగామి పాత్ర కోసం అందాల తార 'శ్రీదేవి'ని సంప్రదించడం జరిగిందని..కానీ భారీ పారితోషకంతో పాటు హిందీలో కూడా షేర్..అనేక డిమాండ్స్ పెట్టిందని..ఇలాంటి డిమాండ్స్ పెట్టడమే మంచియ్యిందని..ఆ పాత్రలో 'రమ్యకృష్ణ'ను కాకుండా వేరే వారిని ఊహించుకోలేమని 'రాజమౌళి' బహిరంగంగా చెప్పడం వివాదాస్పదమైంది. దీనిపై అందాల తార 'శ్రీదేవి' గుస్సా అయ్యింది. తాను డిమాండ్లు పెట్టలేదని..బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ 'రాజమౌళి'కి 'శ్రీదేవి' చురుకులు అంటించింది. తాను బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని..అలా మాట్లాడి ఉండాల్సింది కాదంటూ ఇటీవలే 'రాజమౌళి' అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీదేవి టాప్ హీరోయిన్ తో సయోధ్య ఉండడం మంచిదని..తన సినిమాలు హిందీలో రిలీజ్ చేయాలని భావించి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని టాక్.

ఇదిలా ఉంటే నెక్ట్స్ సినిమాలో శివగామికంటే పవర్ పుల్ పాత్రను 'రాజమౌళి' తీర్చిదిద్దుతున్నారని..ఆ ప్రాతంలో అతిలోక సుందరికి 'శ్రీదేవి'కి ఛాన్స్ ఇస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. రాజమౌళి తదుపరి సినిమాలో 'శ్రీదేవి' నటిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

08:04 - June 2, 2017

రాజమౌళి..ప్రభాస్..టాలీవుడ్ లో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. అనంతరం 'ప్రభాస్' సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. అనంతరం 'ప్రభాస్' ఏ చిత్రాల్లో నటిస్తాడనే దానిపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మళ్లీ 'రాజమౌళి'..'ప్రభాస్' తోనే సినిమాను తీయనున్నారని టాక్ వినిపిస్తోంది. 'రాజమౌళి' తదుపరి సినిమాకు నిర్మాత ఎవరు అనేదానిపై ఓ చర్చ జరిగిన సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాతలో ఓ చిత్రం రూపొందబోతోందని తెలుస్తోంది. అందుకు సంబంధించిన లైన్ ఓకే అయిందని అంటున్నారు. ఈ చిత్రంలో 'ప్రభాస్' హీరోగా నటింపచేయాలని 'రాజమౌళి' అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ 'సాహో' పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని..అందువల్ల వెంటనే 'ప్రభాస్' తో 'రాజమౌళి' సినిమా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

16:32 - May 26, 2017

ఒక పెద్ద సినిమా నిర్మించాలి అంటే పెద్ద నిర్మాత పెద్ద డైరెక్టర్ కలిస్తే చాలు. అలాంటి పరిణామమే చోటు చేసుకోవడానికి రెడీ గా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్ లో వరల్డ్ వైడ్ సినీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసిన డైరెక్టర్ తో హిట్ ప్రొడ్యూసర్ జత కట్టబోతున్నాడా..ఇండియా అంతా ఎంతో ఆత్రంగా చూసిన 'బాహుబలి ది కంక్లూజన్' మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. మొదటి భాగంలో వదిలేసిన ఎన్నో పజిల్స్ కు ఆన్సర్ తెలుసుకునేందుకు జనాలు ఆత్రంగా థియేటర్లకు క్యూ కట్టేశారు. 'బాహుబలి2’ దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. అన్ని చోట్ల నుంచి మంచి రిపోర్టులే వచ్చాయి. రూ. 1500 కోట్ల మార్కుని కూడా అందుకుంది. విజువల్ విషయంలో 'బాహుబలి 1’ స్థాయిని అందుకోలేదనే విమర్శలు ఉన్నా.. మొత్తంగా కథకు ప్రాధాన్యత ఇవ్వడంతో సినిమాపై సంతృప్తిగానే ఉన్నారు ఆడియన్స్. ఎంత టీమ్ వర్క్ ఐన క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కే వెళ్తుంది. మరి ఈ సినిమాకి డైరెక్షన్ చేసి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని జమ చేసుకున్న 'రాజమౌళి' నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి.

దానయ్యతో..
'జులాయి', 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' సినిమాలతో హిట్ ట్రాక్ లో ఉన్న ప్రొడ్యూసర్ డి వి వి దానయ్య రీసెంట్ గా 'నాని' సినిమా 'నిన్ను కోరి', 'మహేష్ బాబు'తో 'భరత్ అను నేను' సినిమాలతో రెడీ గా ఉన్నాడు. ఎన్నో సినిమా లకు ప్రొడ్యూసర్ గా చేసి మంచి మంచి హిట్స్ ఇచ్చిన దానయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ పైన క్లారిటీ వచ్చింది అనే టాక్ ఫిలింనగర్ లో వినిపిస్తోంది. మధ్యలో జరిగిన స్టోరీ డిస్కషన్ల తర్వాత 'రాజమౌళి' తెలుగులో కాకుండా హిందీలో ఆల్ ఇండియన్ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని సినిమా చేయాలని డిసైడైనట్లుగా వార్తలొస్తున్నాయి. ఐతే ఈ సినిమా ఏ భాషలో చేసినా.. హీరోగా ఎవరిని ఎంచుకున్నా.. ఆ ప్రాజెక్టును నిర్మించేది మాత్రం డీవీవీ దానయ్యే అని వార్తలు వస్తున్నాయి. రాజమౌళికి చాలా ఏళ్ల కిందటే దానయ్య అడ్వాన్స్ ఇచ్చాడు. కేఎల్ నారాయణకు కూడా కమిట్మెంట్ ఉన్నప్పటికీ ముందు దానయ్యకే సినిమా చేయాలని రాజమౌళి ఫిక్సయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎంత ఖర్చయినా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మించాలని ఆయన భావిస్తున్నారట.

10:41 - May 26, 2017

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు 'రాజమౌళి' తెరకెక్కించిన 'బాహుబలి 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై రికార్డుల సునామీ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు..విమర్శకులు..రాజకీయ నేతలు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రభాస్..రానా..ఇతర నటుల ప్రతిభను మెచ్చుకున్నారు. కానీ బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా పేరొందిన 'అమీర్ ఖాన్' ఈ సినిమాను ఇంకా చూడలేదంట. కానీ 'బాహుబలి 2' సినిమాపై 'అమీర్' పలు వ్యాఖ్యలు చేశారు. తాను నటించిన 'దంగల్' సినిమాతో పోల్చవద్దని సూచించారు. 'సచిన్..ది బిలియన్ డ్రీమ్స్' ప్రత్యేక షొకు ఆయన హాజరై మీడియాతో మాట్లాడారు. 'దంగల్'..'బాహుబలి 2' సినిమాలు బాక్సాపీసు వద్ద వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 'దంగల్' రూ. 1,565 కోట్లు రాబడితే ఇప్పటికే చైనాలో ఏకంగా రూ. 778 కోట్లను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలో 'బాహుబలి 2' సినిమా 'దంగల్' ను బీట్ చేస్తుందా అని మీడియా 'అమీర్'ను ప్రశ్నించింది. రెండూ మంచి చిత్రాలని..దేశం గర్వపడేలా చేశాయన్నారు. ఇప్పటి వరకు 'బాహుబలి 2' సినిమాను చూడలేదని, చిత్రం గురించి గొప్పగా మాట్లాడడం విన్నానని తెలిపారు.

15:11 - May 13, 2017

హైదరాబాద్ : బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళి తర్వాత సినిమా ఎవరితో చేస్తారని ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతోంది. యువ హీరోలతో చిన్న ప్రాజెక్టు చేస్తారని... బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫక్ట్ ఆమిర్ హీరోగా సినిమా చేయబోతున్నారని...ఆయన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతాన్ని తెరకెక్కిరస్తాడని ఇలా రకరకాలుగా వార్తాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి లండన్ లో ఉన్నారు. ఇప్పుడు తాజాగా సమాచారం ప్రకారం జక్కన్న తన తర్వాత చిత్రాన్ని మహేష్ హీరోగా చేయాలని భావిస్తున్నాడట...చాలా రోజుల కింద మహేష్ బాబు హీరోగా కెయల్ నారాయణ నిర్మాణంలో సినిమా చేసేందుకుకు రాజమౌళి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఒప్పందం ప్రకారం చిత్రాన్ని చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. ప్రస్తుతం మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ స్ఫైడర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మహేష్ సినిమా చేయనున్నాడు.

మరి రాజమౌళి తో మహేష్ తో సినిమా చేయాలనుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ...లేక కొరటాలతో సినిమా పక్కన పెట్టి రాజమౌళితో సినిమా చేస్తాడా...? లేక మహేష్ కొరటాల సినిమా పూర్తయ్యే వరకు అగుతాడా చూడాలి మరి....!

10:40 - May 1, 2017

ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూసిన 'బాహుబలి -2’ రిలీజ్ అయి రికార్డులు సృష్టిస్తోంది. చిత్రాన్ని చూసిన పలువురు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాజమౌళి అత్యద్భుత దర్శకుడని...తెలుగు సినిమా సత్తా చూపెట్టారని కొనియాడుతున్నారు. ‘ప్రభాస్'..'రానా' చిత్రంలో ప్రతొక్కరూ అద్భుత నటనను ప్రదర్శించారని మెచ్చుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ 'చిరంజీవి' కూడా 'బాహుబలి -2’ సినిమా చూశారు. ఈసందర్భంగా ఆయన ప్రశంసలు కురిపించారు. చిత్రం చూసిన అనంతరం ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. 'బాహుబలి- ది కంక్లూజన్‌ ఒక అద్భుతం.. ఆ అద్భుతాన్ని సృష్టించిన రాజమౌళి అభినందనీయుడు. తెలుగు సినిమా సత్తా దేశ విదేశాల్లో చాటిన అద్భుత శిల్పికి హ్యాట్సాఫ్‌. బాహుబలిలో నటించిన ప్రభాస్‌, రానా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్‌, నాజర్‌ ఇతర నటీనటులతో పాటు ప్రత్యేకంగా విజయేంద్రప్రసాద్‌, కీరవాణి గారికి, సెంథిల్‌కి, మిగిలిన సాంకేతిక నిపుణులకు నా ప్రత్యేక అభినందనలు. జయహో... రాజమౌళి' అంటూ యూనిట్‌ సభ్యులను ప్రశంసలతో ముంచెత్తారు.

21:11 - April 27, 2017

వచ్చేస్తోంది.. మరికొద్ది గంటల్లో.. బాహుబలి-2.. అన్ని థియేటర్ల లోకి వచ్చేస్తోంది. ఆన్ లైన్ టిక్కెట్లు జోరుగా అమ్ముడుపోయాయి.... భారీగా థియేటర్ల ముందు ప్రేక్షకులు క్యూలు కట్టారు... దాదాపు సినిమా ప్రదర్శించబోయే అన్ని థియేటర్ల టిక్కెట్లు బుక్ అయిపోయాయి. బాహుబలి పార్ట్-1 లో సస్పెన్ష్ గా మిగిలిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. 2015లో విడుదలైన పార్ట్-1 బాక్స్ ఆఫీసు వద్ద రికార్డుల మోత మోగించింది. ఇప్పుడు విడుదల అవుతున్న బాహుబలి పార్ట్-2 మరెన్ని రికార్డుల సృష్టిస్తోందనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పార్ట్ వన్ వస్తున్నప్పుడే అంచనాలు ఆకాశాన్నంటాయి. కథనంలో కొనసాగించిన బిగువుతో.. పార్ట్ టూ పై అంతులేని ఉత్కంఠ. అసలు కథంతా పార్ట్ టూలో ఉందని ఎదురు చూశారు ప్రేక్షకులు.. ఈ ఎదురు చూపులకు ముంగింపు పడి.. ఇండస్ట్రీకి వసూళ్ల వర్షం కురిపించే సినిమాగా బాహుబలి ఉండబోతోందా? సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చలే ఈ సినిమాకున్న క్రేజ్ కున్న నిదర్శనం. ఐమాక్స్ ఎదురుగా కట్టిన కిలోమీటర్ పొడవు క్యూలే ప్రేక్షకుల ఉత్కంఠకు ఉదాహరణగా నిలుస్తోంది. టికెట్ బుకింగ్ కోసం ఉధృతంగా సాగుతున్న ఆన్ లైన్ ట్రాఫిక్కే.. బాహుబలి బలం ఎంతో చెప్పే కొలత. వెరసి బాహుబలి ఓపెనింగ్స్ తోనే భారీ రికార్డు నెలకొల్పే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.టీజర్ మరిన్ని బాహుబలి విశేషాలు చిన్న బ్రేక్ తర్వాత కేవలం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయటమే ఆలస్యం బిజినెస్ అలా అలా జరిగిపోయింది. కేవలం పదినిమిషాల వీడియో చూసి ఫస్ట్ పార్ట్ వసూలు చేసిన మొత్తానికి రెట్టింపు కంటే ఎక్కువ చెల్లించి మరీ కొనేశారు. ఇదీ బాహుబలి సత్తా.. ఇదీ రాజమౌళి క్రియేటివిటీ సృష్టిస్తున్న సినిమా సునామీ.. ఈ సునామీ తీరాన్ని తాకే సమయం ఆసన్నమైంది..

21:24 - April 26, 2017
14:02 - April 21, 2017

చెన్నై : ప్రముఖ నటుడు సత్యరాజు కర్ణాటక ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఆయన ట్విట్టర్ ద్వారా రెండేళ్ల క్రితం చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతున్నానని, తాను ఎప్పుడు కర్ణాటక ప్రజలకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. తన మీద ఉన్న కోపంతో 'బాహుబలి 2' సినిమా అడ్డుకోవద్దని కోరారు. ఎప్పుడు తమిళులకు మద్దతగానే మాట్లాడతానని సత్యరాజు పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పాలని కోరుతున్న వారు కట్టప్ప చెప్పిన సారీతో శాంతిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

 

11:39 - April 21, 2017

చెన్నై : హీరో ధనుష్ పై తుది తీర్పు వెల్లడైంది. ధనుష్ తమ కొడుకేనని..తమ బాగోగులు చేసుకోవడం లేదని మేలూర్ కు చెందిన కదిరేషన్ వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మద్రాసు హైకోర్టు శుక్రవారం తుదితీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో ధనుష్ కు ఊరట లభించినట్లైంది. కదిరేషన్ దంపతులు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
తాను 1983లో జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించానని...అప్పట్లో తన పేరు వెంకటేశ్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చాక ధనుష్‌ కే రాజాగా పేరు మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో ధనుష్ పిటిషన్ దాఖలు చేశారు. 1985 నవంబర్7న మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జన్మించాడని తమ వద్ద ఆధారాలున్నాయని కదిరేషన్ వృద్ధ దంపతులు కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఇరువురు జనన ధృవీకరణ, విద్యా సంబంధ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తుది తీర్పును వెల్లడించింది.

Pages

Don't Miss

Subscribe to RSS - rajamouli