rajasthan

09:44 - December 17, 2018

రాజస్థాన్ : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో రాజస్థాన్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు కాంగ్రెస్ దక్కించుకుంది. దీంతో డిసెంబర్ 17న ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లట్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలని  ఏపీ సీఎం చంద్రబాబుకు కాంగ్రెస్ ఆహ్వానం పంపించింది. దీంతో గెహ్లాట్ ప్రమాణానకి  చంద్రబాబు జైపూర్ లో జరగనున్న గెహ్లాట్ ప్రమాణస్వీకారా కార్యక్రమానాకి చంద్రబాబు హాజరుకానున్నారు.అలాగే అలాగే, మధ్యప్రదేశ్ వెళ్లి భోపాల్‌లో కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా పాల్గొననున్నారు. చంద్రబాబు పాటు మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు కూడా వెళ్లనున్నారు. 
కాగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలనే ఎజెండాతో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పొత్తుకున్న క్రమంలో తెలంగాణ ఎన్నికల్లోను కాంగ్రెస్ పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ఓటమిపాలయ్యారు. కానీ  థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కొనసాగించే క్రమంలో కాంగ్రెస్ సీఎంలు చేయనున్న ప్రమాణస్వీకార కార్యక్రమాలకు చంద్రబాబు హాజరుకానున్నారు. 
 

08:32 - December 17, 2018

మూడు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలువుదీరనున్నాయి. ముగ్గురు ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా భూపేశ్ బఘేల్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మొత్తంగా సీనియర్లకే పెద్దపీట వేసిన కాంగ్రెస్ అధిష్టానం యువతను నిరాశ పరిచింది.
సీనియర్లకే పట్టం:
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులను ఎంపిక చేయడంలో మాత్రం బాగానే కసరత్తు చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆయా రాష్ట్రాల పరిశీలకులు, సీనియర్‌ నేతలు, కార్యకర్తలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఇప్పటికే మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌పై ఆమోద ముద్ర వేసిన కాంగ్రెస్‌ అధిష్టానం తాజాగా రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్ సీఎంల పేర్లను కూడా ప్రకటించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్లాట్‌కు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. సచిన్‌ పైలట్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టింది.  
రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్:
1974లో ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడిగా అశోక్‌ గెహ్లాట్‌ రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఇందిరా గాంధీ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన గెహ్లాట్ రాజస్థాన్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని అశోక్‌ గెహ్లాట్‌ చెప్పారు.
డిప్యూటీ సీఎంగా పైలట్:
సచిన్‌ పైలట్‌ రెండుసార్లు లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. రాహుల్‌కు సన్నిహితుడైన పైలట్‌ను రాజస్థాన్‌ పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించారు. పైలట్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ విజయపథంలో సాగింది. 3 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశానికి శుభ సూచకమని ఈ సందర్భాగా పైలట్‌ అన్నారు. బీజేపీయేతర పార్టీలను కలుపుకుని లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతామని ఆయన తెలిపారు.
ఎంపీ సీఎంగా కమల్‌నాథ్:
మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 1946లో కాన్పూర్‌లో వ్యాపార కుటుంబంలో కమల్‌నాథ్ జన్మించారు. 1980లో ఆయన తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. చింద్వాడా నుంచి పోటీలో ఉన్న కమల్‌నాథ్‌ను ఇందిరాగాంధీ తన మూడో కుమారుడిగా పేర్కొన్నదంటేనే ఆయనకు గాంధీ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కమల్‌నాథ్‌ 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. సీఎం రేసులో యువనేత జ్యోతిరాదిత్య సింధియా పోటీ పడ్డప్పటికీ కమల్‌నాథ్‌ వైపే పార్టీ మొగ్గుచూపింది.
ఛత్తీస్‌గఢ్‌లో రాజీ ఫార్ములా, ఇద్దరు సీఎంలు:
చాలాకాలం తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్.. సీఎం పదవిపై నాలుగు రోజుల ఉత్కంఠకు తెరదించింది. ఇక్కడ రాజీ ఫార్మూలాను అనుసరించారు. పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతలు భూపేశ్ బఘేల్, టీపీ సింగ్‌దేవ్‌లకు చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. రాహుల్‌తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ పీఎల్ పునియాల సమక్షంలో సీనియర్ నేతలు సమావేశమయ్యారు. గంటల కొద్దీ చర్చల అనంతరం తామ్రధ్వజ్ సాహును ఎంపిక చేస్తున్నట్టు చెప్పగానే, సీఎం రేసులో ఉన్న బఘేల్, సింగ్ దేవ్‌లు తిరుగుబాటు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సోనియా, ప్రియాంకా గాంధీ.. తామ్రధ్వజ్‌ను పక్కనబెట్టి, రాజీ ఫార్ములాను తెరపైకి తెచ్చారు. కుర్మి వర్గానికి చెందిన బఘేల్‌కు ప్రజల్లో సానుభూతి ఉంది. పైగా పలుకుబడి, ధనిక వర్గాల మద్దతు కూడా పుష్కలం. హస్తినలో ఆయన లాబీయింగ్ బాగానే పని చేసింది. ఇదే సమయంలో రాజ్‌పుత్ వర్గానికి చెందిన సింగ్‌దేవ్ సైతం, తనదైన శైలిలో పావులు కదిపి రెండున్నరేళ్లు సీఎం అవకాశాన్ని పొందారు.

10:18 - December 14, 2018

ఢిల్లీ : రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం,ఛత్తీస్ గఢ్  తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయి..ఫలితాలు కూడా వచ్చేసాయి..ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారాలు కూడా ఒక పక్క అయిపోతున్నాయి. అయితే ఏంటి అనుకుంటున్నారా? అక్కడే వుంది మరి మాజా..దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన పెట్రోల్ ధరలు తగ్గిపోతుంటాయి. సడెన్ గా అప్పుడే కేంద్రానికి ప్రజలపై ఎక్కడ లేని అక్కరా వచ్చేస్తుంది. అదేనండీ..పెట్రోల్ రేట్లు తగ్గించేయటం..ఎన్నకలు అయిపోగానేవెంటనే మళ్లీ పెట్రో వాతలు జనాలపై పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయిపోతుంది. ఈ క్రమంలోనే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసాయో లేదో అలా పెట్రోల్ ధరలు పెంచేందుకు కేంద్రం రెడీ అయిపోతోంది. 
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పెట్రోలు ధరల బాదుడు మొదలైంది. రెండు నెలలపాటు తగ్గుతూ వచ్చిన పెట్రోలు, డీజిల్ ధరలు తొలిసారిగా పెరిగాయి. ఈ రెండు నెలల్లో 15 శాతం మేరకు ధరలు దిగిరాగా, ప్రజలు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ, అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగకుండా చూసుకునేందుకే పెట్రోలు ధరలను పెంచడం లేదన్న విశ్లేషణలూ..విమర్శలు కూడా వస్తున్నాయ్. తాజాగా, పెట్రోలుపై 11 పైసలు, డీజిల్ పై 13 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీంతో ముంబైలో పెట్రోలు ధర రూ. 75.91కి పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఒపెక్, రష్యాలు రోజుకు 1.2 మిలియన్ బ్యారళ్ల క్రూడాయిల్ సరఫరాను నిలిపివేయాలని, తద్వారా ధరల స్థిరీకరణ సాధ్యమవుతుందని నిర్ణయించడంతో, ఆ ప్రభావం చమురు మార్కెట్ పై తీవ్రంగా పడటంతో ధరలు పెంపు తప్పలేదంటున్నాయి చమురు కంపెనీలు.
కాగా గతంలో కర్ణాటకలోను..కొన్ని రాష్ట్రాలకు ఎన్నికలు వచ్చిన సమయంలో పెట్రోల్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఏదీ ఏమైనా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అంటు కేంద్రం తలచుకోవాలిగానీ (ప్రజల్లో చైతన్యం రానంత కాలం) ప్రజలు ఇటువంటి పెను భారాలు మోస్తునే వుండాలి.

19:15 - December 13, 2018

ఢిల్లీ: ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీంతో ముఖ్యమంత్రుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లవైపే మొగ్గు చూపింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ పేర్లను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‌గాంధీ అధికారికంగా వారి పేర్లు ప్రకటించాల్సి ఉంది. యువ నాయకత్వానికి కాకుండా సీనియర్లవైపు మొగ్గు చూపడానికి చాలానే కారణాలు ఉన్నాయి.
సీనియర్లపైనే నమ్మకం: కమల్‌కు అవకాశం:
మధ్యప్రదేశ్‌లో యువ నాయకుడు జ్యోతిరాదిత్య సింథియా, రాజస్థాన్‌లో సచిన్ పైలెట్‌లను సీఎంలుగా నియమిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ పెద్దలు భావించారు. పరిపాలన అనుభవంలో, నాయకులను మేనేజ్ చేసే విషయంలో సమస్యలు తలెత్తుతాయనే కోణంలో ఆలోచన చేశారు. దీంతో సీనియర్ల వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కమల్‌నాథ్‌కు కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభం ఉంది. 35ఏళ్లకు పైగా రాజకీయ అనుభవం కూడా ఉంది. పీసీసీ ఇంచార్జ్‌గా కేడర్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లారనే పేరుంది. ఆయన సీనియారిటీ, రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్‌కు అనుకూలంగా మలిచే వ్యక్తిగా కమల్‌నాథ్‌కు గుర్తింపు ఉంది.
బీజేపీని దృష్టిలో పెట్టుకుని:
రాజస్థాన్‌లో కూడా సేమ్ సీన్ కనిపించింది. అక్కడ ఎస్పీ, బీఎస్పీల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఈ క్రమంలో నాయకులను మేనేజ్ చేయాలంటే సీనియర్ అవసరం ఎంతైనా ఉంది. దీంతో ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ వైపు రాహుల్ గాంధీ మొగ్గు చూపారు. గెహ్లాట్‌కు రెండు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఇక చాలామంది రెబెల్ ఎమ్మెల్యేలు సైతం గెహ్లాట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం సచిన్ పైలెట్‌ను కాదని అశోక్ గెహ్లాట్ పేరు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికలు, నాయకులను మేనేజ్ చేసే అంశాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ హైకమాండ్ సీనియర్లవైపే మొగ్గుచూపింది. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి బీజేపీ తమ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుందని, ఇందుకు బీహారే నిదర్శనం అని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బీహార్‌లో ఆర్జేడీని దింపి జేడీయూతో చేతులు కలిపి బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితులు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లలో తలెత్తకుండా.. ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి రాకుండా బలమైన నాయకత్వాన్ని కాంగ్రెస్ అధిష్టానం నియమిస్తోందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

15:31 - December 12, 2018

రాజస్థాన్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తగిలింది. హిస్టరీ రిపీట్ అయ్యింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కమల దళం మట్టికరించింది. కాంగ్రెస్ తిరిగి తన పూర్వ వైభవాన్ని దక్కించుకుంది.  ఈ క్రమంలో బీజేపీ పార్టీకి ఘోర పరాభవం ఎదురైనా గానీ ఆ పార్టీ ఎమ్మెల్యే మాత్రం విజయంలో రికార్డ్ సృష్టించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మూడు సార్లు ఎంపీగా పనిచేసిన ఆయన  కైలాశ్‌ మేఘవాల్‌. స్పీకర్ గా పనిచేసిన మేఘవాల్ తన పార్టీ ఓడిపోయినా..తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి మహావీర్‌ ప్రసాద్‌పై 74,542 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 
బీజేపీ సీనియర్‌ శాసన సభ్యుడు, స్పీకర్‌ కైలాశ్‌ మేఘవాల్‌ భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు నెలకొల్పారు. అవివాహితుడు అయిన 84ఏళ్ల  కైలాశ్‌ రాజస్థాన్  తాజా ఎన్నికల్లో షాపురా నియోజక వర్గం నుంచి పోటీ చేసిన కైలాశ్‌ తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి మహావీర్‌ ప్రసాద్‌పై 74,542 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే స్థానం నుంచి కైలాశ్‌ పోటీ చేసి...43,666 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, ఈసారి మరో 30 వేల ఓట్ల వరకు సాధించడం గమనార్హం. ఉదయ్‌పూర్‌లో 1934 మార్చి 22న జన్మించిన కైలాశ్‌ మేఘవాల్‌ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పలు కీలక పదవులు నిర్వహించారు కైలాశ్ మేఘవాల్. 
 

12:05 - December 12, 2018

ఢిల్లీ : స్వంత పార్టీ మీద సంచలన వ్యాఖ్యలు చేసారు బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే. ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతింది. డిసెంబర్ 11న వెలువడి ఎన్నికల ఫలితాలపై బీజేపీ ఎంపీ సంజయ్ మాట్లాడుతు..చత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో బీజేపీ ఓటమిని తాను ముందే ఊహించానన్నారు. అయితే మరీ ఇంత ఘోరమైన ఫలితాలు వస్తాయని మాత్రం అస్సలు ఊహించలేదన్నారు. కానీ మధ్యప్రదేశ్‌లలోనూ కాంగ్రెస్ పైచేయి సాధించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. 
మాట మరచిన మోదీ అందుకే ఓటమి: సంజయ్ 
దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానన్న 2014 ఎన్నికల్లో  మోదీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక  ఆ మాట మరచిపోయారనీ.. సొంత పార్టీ పైనే విమర్శలు చేస్తున్నారు. రామ మందిర నిర్మాణం, విగ్రహాల నిర్మాణం, నగరాల పేర్ల మార్పుపైనే పార్టీ దృష్టి సారించిందని, ఈ ఎన్నికల్లో అదే కొంప ముంచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ఫుల్ జోష్ మీదున్నది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. దీనితో ఆ పార్టీ నేతలు ఖుషీఖుషీగా ఉన్నారు. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్‌లలో విస్పష్ట మెజార్టీ ఇవ్వగా మధ్యప్రదేశ్‌లో మాత్రం నరాలు తెగ ఉత్కంఠ కనపడిన క్రమంలో ఎట్టకేలకు విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ మాత్రం కుదేలైపోయింది. దీనిపై ఐదింట మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ వశం కావటంతో బీజేపీ ఎంపీ సంజయ్ కేడే ఈ వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు బీజేపీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. 

 

 

08:04 - December 12, 2018

రాజస్థాన్ : రాష్ట్రంలో బీజేపీకి ఘోరపరాభవం ఎదురైంది. వసుంధరా రాజే ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించారు. ఇక్కడ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఏకంగా 101 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. బీజేపీ మాత్రం 73 స్థానాలతో సరిపెట్టుకుంది. బీఎస్పీ 6 స్థానాల్లో గెలువగా ఇతరులు మాత్రం 19 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. 
200 నియోజకవర్గాలు...
రాష్ట్రంలో 200 నియోజకవర్గాలకు 199 స్థానాల్లో డిసెంబర్ 7 పోలింగ్ జరిగింది. రామ్‌గఢ్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బీఎస్పీ అభ్యర్థి లక్ష్మణ్‌ సింగ్‌ గుండెపోటుతో మరణించడంతో ఆ స్థానానికి పోలింగ్‌ వాయిదా పడింది. బీజేపీ 199, కాంగ్రెస్‌ 194, ఆర్‌ఎల్‌డీ 2, ఎన్‌సీపీ 1, ఎల్‌జేడీ 2 స్థానాల్లో పోటీ చేశాయి. 
వసుంధరా రాజే రాజీనామా...
ఓటమిని అంగీకరించిన సీఎం వసుంధరా రాజే పదవికి రాజీనామా చేశారు. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కొంప ముంచాయని విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నోట్ల రద్దు కారణంతో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూతపడడం...నిరుద్యోగం అధికం కావడం..రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొనడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌనట్లు ఓటింగ్ సరళిని బట్టి అర్థమౌతోంది. 
డిసెంబర్ 11 బుధవారం ఉదయం జైపూర్‌లో సమావేశం కానున్నామని..ముఖ్యమంత్రి ఎవరనేది అప్పుడే కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేత కేసి వేణుగోపాల్ తెలిపారు. 

06:56 - December 11, 2018

దేశవ్యాప్తంగా అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. భారీ బందోబస్తు మధ్య లెక్కింపు జరుగుతోంది.  ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా, గంటలోనే పోలింగ్ సరళి తెలిసిపోనుంది. తెలంగాణతోపాటు మొత్తం 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మధ్యప్రదేశ్‌లో 230, రాజస్థాన్‌లో 200, తెలంగాణలో 119, చత్తీస్‌గఢ్‌లో 90, మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాజస్థాన్‌లో అభ్యర్థి మరణించడంతో 199 స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి.
తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో 40వేల మంది సిబ్బంది ఉన్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. 9 గంటలకల్లా పోలింగ్ సరళి ఏంటనేది తెలిసిపోనుంది. ఇక, శేరిలింగంపల్లిలో గరిష్టంగా 42 రౌండ్లు లెక్కించనుండగా, అతి తక్కువగా భద్రాచలం, అశ్వారావుపేటలలో 12 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర, రాష్ట్ర బలగాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. అలాగే, సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించారు. కౌంటింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లను నిషేధించిన ఈసీ, విజయోత్సవాలకు కూడా అనుమతి నిరాకరించింది.
మధ్యప్రదేశ్‌, మిజోరంలలో నవంబర్ 28న, రాజస్థాన్‌, తెలంగాణలో డిసెంబర్ 7న పోలింగ్ జరిగింది. ఛత్తీస్‌గడ్‌లో నవంబర్ 12, 20 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరిగింది.

* మధ్యప్రదేశ్‌లో మొత్తం స్థానాలు 230, మేజిక్ ఫిగర్ 116
* రాజస్థాన్‌లో మొత్తం స్థానాలు 199, మేజిక్ ఫిగర్ 101
* ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం స్థానాలు 90, మేజిక్ ఫిగర్ 46
* మిజోరంలో మొత్తం స్థానాలు 40, మేజిక్ ఫిగర్ 21
* తెలంగాణలో మొత్తం స్థానాలు 119, మేజిక్ ఫిగర్ 60

10:12 - December 10, 2018

ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పందంగా పరిణమించాయి. రాజస్థాన ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షురాలు సోనియా గాంధీపై మోదీ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాజస్థాన్ లో పర్యటించిన ఆయన ఓ ప్రచార సభలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఆయన వ్యాఖ్యలు సోనియాగాంధీని ఉద్దేశించే చేశారని, తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

"కాంగ్రెస్‌ పాల్పడిన పలు కుంభకోణాల్లో భాగమైన వితంతు పింఛను పథకంలోని పెద్ద మొత్తం ఏ కాంగ్రెస్‌ వితంతువు అకౌంట్ లోకి ఈ మొత్తం చేరిందో?" అని రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఘాటుగా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన సీడబ్ల్యూసీ సభ్యుడు సిద్ధరామయ్య..ప్రధాని దిగజారుడుతనానికి ఇది తాజా ఉదాహరణని అన్నారు. ఆయన తమ మాట్లతో ప్రధాని పదవికే కళంకం తెచ్చారని..ఈ వ్యాఖ్యలు మహిళలందరికీ అవమానమని నిప్పులు చెరిగారు. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ నుంచి నరేంద్ర మోదీ నేర్చుకోవాల్సింది చాలా ఉందని సిద్ధరామయ్య సూచించారు. 
 

16:19 - December 7, 2018

జైపూర్‌ (రాజస్థాన్) :  ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా చివరి రెండు రాష్ట్రాలైన తెలంగాణ, రాజస్థాన్‌లో శుక్రవారం పోలింగ్‌ కొనసాగుతోంది. జోధ్‌పూర్‌ రాజవంశీకులు గజ సింగ్‌, ఆయన సతీమణి సర్దార్‌పురా నియోజకవర్గంలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. యువత నుంచి వృద్ధుల వరకు ఎంతో ఉత్సాహంగా పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేస్తున్నారు. 100 ఏళ్లు పైబడిన వృద్ధులు సైతం కుటుంబీకుల సాయంతో పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.రాజస్థాన్‌లో మొత్తం 200 స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. రామ్‌గఢ్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మృతితో 199 స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 2,274 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 4.77 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
 

Pages

Don't Miss

Subscribe to RSS - rajasthan