rajini

20:46 - August 11, 2017

ఓ పక్క కాలా షూటింగ్ జరుగుతోంది.. మరోపక్క వాడి వేడిగా సమావేశాలు జరుగుతున్నాయి. ఊహాగానాలు పెరుగుతున్నాయి.. వీటన్నిటిని చూస్తే తమిళనాట రాజకీయాలు మలుపు తిరగబోతున్నాయా? సూపర్ స్టార్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? రజనీ ఏ సంకేతాలిస్తున్నారు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి? అదే సమయంలో ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి కనిపించటం తమిళనాట కొత్త చర్చకు దారితీస్తోందా? ఇదే ఈ రోజు .దశాబ్దాల నుండి ఆ పీఠంపై సినీ తారలను, సినీరంగ ప్రముఖులను కూర్చోబెడుతున్నారు. దక్షిణాదినే కాదు.. ఆ మాటకొస్తే, దేశం మొత్తంమీద కూడా ఆ రాష్ట్ర రాజకీయాలకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ వరుసలో రజనీ పాలిటిక్స్ లో ఎంటరైతే దుమ్మురేపటం ఖాయమా? ఆయన దారి రహదారి. ఇది సినిమాల్లోనేనా లేక పాలిటిక్స్ లో కూడానా. ఇప్పుడు రజనీకాంత్ ఎంట్రీ ఇస్తే ఆల్రెడీ ఉన్న దారిలోనే దూసుకొస్తారా? లేక కొత్త బాట వేసుకుంటారా? రజనీతో పాటు తెరపైకి వచ్చి వేడెక్కిస్తున్న కమల్ హసన్ దారెటు?రజనీ హడావుడి ఓ పక్క నడుస్తుండగానే కమల్ హాసన్ తెరపైకివచ్చారు.. కొద్ది నెలలుగా ట్వీట్లు స్టేట్ మెంట్లతో తమిళ రాజకీయరంగాన్ని వేడెక్కిస్తున్నారు. అదే సమయంలో ఇద్దరూ ఒకే పార్టీ కార్యక్రమానికి హాజరు కావటం చర్చనీయాంశంగా మారింది. తనకు గతంలోనే డీఎంకే నుంచి పిలుపు వచ్చిందంటున్న కమల్ ఇప్పుడు దాన్ని అంగీకరిస్తారా?సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారా.. రారా.. అనే ప్రశ్న తమిళనాడు ప్రజల మెదళ్లను తొలిచేస్తుండగా మరో రెండు వారాల్లో రజనీ సొంత పార్టీని ప్రకటిస్తారని గాంధేయ మక్కల్‌ ఇయక్కం చెప్తోంది. రజనీ ఎంట్రీ ఇస్తే, కొత్త పార్టీతో తమిళ ప్రజల్లోకి ఆయన వస్తారా? ఇందుకు ఢిల్లీ వేదికగా కసరత్తులు సాగుతున్నాయా? సైలెంట్ గా న్యాయ నిపుణుల కమిటీలతో రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో సిద్ధాంతాలు, విధి విధానాల రూపకల్ప నలో బిజీగా ఉన్నారా?

21:33 - November 20, 2016

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం రోబో2.0. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్‌ ఇందులో విలన్‌ పాత్ర పోషిసున్నారు. ముంబైలో...ఫస్ట్ లుక్‌ను విడుదల జరిగింది. సంచలన విజయం సాధించిన రోబో సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్ కాగా.. ఆస్కార్ విన్నర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

14:08 - November 14, 2016

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కబాలి మూవీని మించిపోయేలా రోబో2 కోసం ప్రణాళికలు సిద్ధం చేశాడట. త్వరలోనే రోబో 2 ప్రమోషన్స్ తో దున్నేయడానికి శంకర్ అండ్ యూనిట్ రెడీ అవుతుందట. భారీ బడ్జెట్ తో హై ఎక్స్ పెక్టేన్షన్స్ తో రిలీజ్ కి రెడీ అవుతున్న రోబో 2 విశేషాలేంటో హావ్  ఏ లుక్.
కబాలికి వచ్చిన హైప్ 
రీసెంట్‌గా రజనీకాంత్ కబాలికి వచ్చిన హైప్ ఏ సినిమాకీ రాలేదు. ఈ మూవీ రిలీజ్ కి ముందు చేసిన ప్రచారంతో సిని ఆడియన్స్ మొత్తం కబాలి ఫీవర్‌తో ఊగిపోయింది. అంతలా కబాలిని ప్రమోట్ చేశారు మేకర్స్. ఇప్పుడు రజనీ రోబో 2 మూవీని అంతకు మించిన రేంజ్ లో ప్రమోట్ చేయాలని శంకర్ తో పాటు యూనిట్ భావిస్తుందట. 
ఎండింగ్ స్టేజ్ కి రోబో 2షూటింగ్ 
రోబో 2షూటింగ్ ఎండింగ్ స్టేజ్ కి చేరుకుంది. దీంతో ఇక ప్రమోషన్స్ తో పిచ్చేక్కించాలని యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఈ ప్రమోషన్లు కబాలి ని మించే రేంజ్‌లో ఉంటాయట. మామూలుగానే రజినీ మానియా ఓ రేంజ్‌లో వుంటుంది. ఇక శంకర్ కాంబినేషన్‌లో రోబో తరువాత వస్తోన్న ఈ మూవీ కావడంతో రోబో 2పై స్కై రేంజ్ లో అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఈ నెల 20న రోబో 2 ఫస్ట్ లుక్ రిలీజ్‌ 
ఈ నెల 20న రోబో 2 ఫస్ట్ లుక్ రిలీజ్‌తో మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారు. తరువాత వరుసగా మూవీపై హైప్ పెరిగేలా ప్రమోషన్స్ ప్లాన్ రెడీ చేస్తారట. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా చేస్తున్న ఈ మూవీలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రోబో 2తో బాక్సఫీసు వద్ద1000కోట్లు కలెక్ట్ చేయాలనేది శంకర్ టార్గెట్ గా కనిపిస్తుంది. మరి రోబో 2 ఏ రేంజ్ లో సక్సెస్ కొడుతుందో చూడాలి. 

 

11:09 - October 6, 2016

'శంకర్' దర్శకత్వంలో ఓ చిత్రం వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అత్యంత భారీ బడ్జెట్ తో 'శంకర్' సినిమాలు నిర్మిస్తుంటాడు. గతంలో ఆయన నిర్మించిన చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'రజనీకాంత్' 'ఐశ్వర్య రాయ్' కాంబినేషన్ లో 'రోబో' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అనంతరం దీనికి సీక్వెల్ గా 'రోబో 2' సినిమాను 'శంకర్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్లతో సినిమాను రూపొందిస్తున్నట్లు టాక్. గతేడాది డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు 150 రోజులు షూటింగ్ పూర్తి చేశారు. ఇటీవలే క్లయిమాక్స్ చిత్రీకరించారు. మొత్తంగా 60 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ సీన్స్ చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిత్ర కథానాయకుడు 'రజనీకాంత్' కథానాయిక 'అమీ జాక్సన్'పై ఓ రోమాంటిక్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో 'రజనీ' పూర్తిగా యంగ్ గా కనిపిస్తుండడం విశేషం. నవంబర్ లో 'రోబో 2' చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా వచ్చే ఏడాది అక్టోబర్ 19న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందా ? లేదా? అనేది చూడాలి. 

16:56 - July 18, 2016

ప్రస్తుతం తమిళనాడులో అంతటా 'కబాలి' ఫీవర్ నెలకొంది. ఈనెల 22న చిత్రం రిలీజ్ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి హద్దు ఉండడం లేదు. కబాలి చిత్రానికి సంబంధించిన పిక్చర్స్ ను వాహనాలపై అతికించుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని క్యాష్ చేసుకొనేందుకు పలు కంపెనీలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. 'రజనీ కాంత్' సినిమా విడుదలయిదంటే ఆయన కటౌట్లకు అభిమానులు పాలాభిషేకాలు చేస్తుంటారు. ఇలా కొన్ని వేల లీటర్ల పాలు నేలపాలవుతుండడం గమనిస్తుంటాం. ఈసారి ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టాలని పాల ఉత్పత్తి దారుల సంఘం రజనీ ఫ్యాన్స్ ను కోరుతోంది. పాలను కొనడానికి డబ్బులు లేకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, 15 శాతం మంది కూడా పాలు కొనే పరిస్థితుల్లో లేరని సంఘం పేర్కొంటోంది. జులై 22వ తేదీన ఒక్క రోజే రూ. 20 లక్షల విలువైన 50 వేల లీటర్ల పాలు అభిషేకం పేరిట వృథా కాబోతున్నాయని అసోసియేషన్ సభ్యులు పేర్కొన్నట్లు సమాచారం. మరి అసోసియేషన్ విజ్ఞప్తిని రజనీ ఫ్యాన్స్ ఆలకిస్తారా ? లేదా ? అన్నది చూడాలి. అలాగే ఈ విషయంపై 'కబాలీ' ఎమైనా స్పందిస్తారా అనేది వేచి చూడాలి.

 

13:07 - February 18, 2016

శివరాజ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన హర్రర్‌ థ్రిల్లర్‌ 'శివలింగ' ఇటీవల విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో సంచలన విజయం సాధించింది. పి.వాసు దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని తమిళంలో రజనీకాంత్‌, తెలుగులో నాగార్జున రీమేక్‌ చేసేందుకు అమితాసక్తి చూపిస్తున్నారని సమాచారం. పి.వాసు దర్శకత్వంలో రూపొందిన 'ఆప్తమిత్ర', 'ఆప్తరక్షక', 'దృశ్య' వంటి తదితర చిత్రాలు అఖండ విజయాన్ని సాధించడమే కాకుండా పలు భాషల్లో రీమేక్‌గా తెరకెక్కి అక్కడ కూడా అదే స్థాయిలో విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ఆయన గత చిత్రాలు సాధించిన విజయాలతోపాటు తాజా 'శివలింగ' సైతం అదే రీతిలో ప్రేక్షకాదరణ పొందడంతో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు రజనీ, నాగ్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, 'కబాలి' చిత్రం షూటింగ్‌లో రజనీ, 'ఊపిరి'చిత్రం షూటింగ్‌ నాగార్జున నటిస్తూ బిజీగా ఉన్నారు.

21:24 - December 16, 2015

హైదరాబాద్ : బ్రిటీష్ బ్యూటీ అమీజాక్సన్ రోబోగా మారనుంది. సెస్సేషనల్ డైరెక్టర్ శంకర్ తీస్తున్న రోబో-2లో ఆమె రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రోబో-2 ప్రీప్లానింగ్ లో బిజీగా ఉన్న ఈ స్టార్ డైరెక్టర్.. అమీ జాక్సన్ ను ఓకే చేసినట్టు సమాచారం. ఫస్ట్ పార్ట్‌లో ఐశ్వర్యను ఎంచుకున్న శంకర్.. ఈసారి ఆమెకు ఏమాత్రం తీసిపోవద్దని అమీజాక్సన్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 

07:33 - December 14, 2015

రజనీకాంత్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని దర్శకుడు శంకర్‌ 'రోబో- 2' చిత్ర షూటింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్‌ ప్రారంభమైన్నట్లు నిర్మాణ సంస్థ లైకా అధికారంగా ప్రకటించింది. చెన్నైలో వరదల కారణంగా రజనీకాంత్‌ తన పుట్టినరోజు వేడుకల్ని రద్దు చేసుకున్న విషయం విదితమే. అత్యధిక భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రంలో రజనీకాంత్‌ సరసన ఎమీజాక్సన్‌ నటిస్తున్నట్టు సమాచారం. భారతీయ చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుని ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సొంతం చేసుకున్న సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పుట్టిన రోజు (శనివారం) సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రజనీ ఆదర్శ, నిరాడంబర వ్యక్తి అంటూ ప్రముఖులంతా కొనియాడారు. అమితాబ్‌ బచ్చన్‌, వెంకటేష్‌, అల్లుఅర్జున్‌, బోయపాటి శ్రీను, నారారోహిత్‌, సునీల్‌, బ్రహ్మాజీ, అనుష్క, మంచు లక్ష్మీ, ఎం.ఎం.శ్రీలేఖ, హీరో ధనుష్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

 

13:04 - November 4, 2015

దర్శకుడు శంకర్‌ రూపొందించనున్న చిత్రం 'రోబో 2'. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందించేందుకు శంకర్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటులను కూడా నటింపజేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ చిత్రంలో నటించనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇందుకు 'అమితాబ్‌' కూడా గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్లు సమాచారం. 1985లో అమితాబ్‌, రజనీకాంత్‌ కలసి 'జెరాఫ్టార్‌' చిత్రంలో నటించారు. ఇప్పుడు మళ్లీ ఈ చిత్రంలో కన్పించనున్నారు. రజనీతో కలసి పనిచేయడానికి తానేనెప్పుడూ సిద్ధమని అమితాబ్ పేర్కొన్నారు. దీనితో 'రోబో -2'లో అమితాబ్ నటిస్తారన్న వార్తలకు బలం చేకూరింది. భారీ స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తామని శంకర్‌ ఇదివరకే ప్రకటన చేశారు. ఇంకా ఈ చిత్రానికి నిర్మాత ఎవరన్నది ఇంకా స్పష్టత రాలేదు.

Don't Miss

Subscribe to RSS - rajini