Rajinikanth

12:32 - June 22, 2017

ఒక్క ఆడియో ఫంక్షన్ కు రూ. 25 కోట్లా ? అని ఆశ్చర్యపోతున్నారా ? తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్'..'శంకర్' దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రోబో 2.0’ షూటింగ్ పూర్తయి నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకొంటోటంది. భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్..డ్రామాగా తెరకెక్కుతున్న సినిమాకు ఏకంగా రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో తీయాలని చిత్ర యూనిట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దుబాయిలో ఆడియో వేడుక జరుపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఆడియో వేడుక గురించి చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అధికారికంగా ప్రకటన మాత్రం చేయలేదు. రజనీ సరసన అమీ జాక్సన్‌ హీరోయిన్ గా నటిస్తుండగా అక్షయ్ కుమార్‌ విలన్ నటిస్తున్నారు.

09:10 - June 19, 2017

చెన్నై : తమిళనాడు రైతులను ఆదుకుంటానని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హామీ ఇచ్చారు. ఆయన చెన్నైలో నేషనల్‌ సౌత్‌ఇండియన్‌ రివర్స్‌ ఇంటర్‌ లింకింగ్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.అయ్యకన్నుతో పాటు పదహారు మంది రైతులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల గురించి రజనీకాంత్‌ అడిగి తెలుసుకున్నారు. తమిళ రైతులను ఆదుకుంటానని... ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. నదుల అనుసంధానం కోసం.. కోటి రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. రజనీ తీరు చూస్తుంటే.. ఆయన రాజకీయ రంగ ప్రవేశానికి ఇదొక సూచన అని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

14:43 - June 9, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' మరోసారి అభిమానులతో భేటీ కానున్నారు. ఇటీవలే ఆయన అభిమానులతో వరుస భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 'రజనీ' రాజకీయ ప్రవేశం గ్యారంటీ అని పుకార్లు షికారు చేశాయి. దీనంతటికీ 'రజనీ' తెరదించారు. దేవుడు ఏది శాసిస్తే అదే..చేస్తానని కుంబద్ధలు కొట్టాడు. అనంతరం పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న 'కాలా' సినిమాలో 'రజనీ' నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రారంభమైంది. అంతేగాకుండా శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0' లో కూడా 'రజనీ' నటిస్తున్నాడు. ముంబైలో 'కాలా' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని చిత్ర యూనిట్ చెన్నైకి తిరిగి వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి అభిమానులతో 'రజనీ' భేటీ అవుతారని తెలుస్తోంది. రాజకీయ రంగ ప్రవేశంపై కీలక ప్రకటన చేస్తారా ? అనే చర్చ జరుగుతోంది. కానీ భేటీకి సంబంధించిన తేదీలు ఖరారు కాలేదు. 

08:55 - June 1, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న 'కాలా' సినిమా షూటింగ్ హల్ చల్ చేస్తోంది. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈసినిమా ప్రస్తుతం ముంబైలో కొనసాగుతోంది. ‘కబాలి' సినిమా విజయం అనంతరం 'రజనీ'..’రోబో 2’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' సినిమాకు దర్శకత్వం వహించిన పా.రంజిత్ తోనే మరో చిత్రానికి 'రజనీ' గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘కాలా' పేరిట రూపొందుతున్న సినిమాలో 'రజనీ' మాఫియా డాన్ గా కనిపించనున్నాడని టాక్. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోంది. దీనితో 'రజనీ' చూసేందుకు అభిమానులు భారీగా పోటెత్తుతున్నారు. దీనితో షూటింగ్ కు అంతరాయం కలుగుతున్నట్లు తెలుస్తోంది. పోలీసులతో పాటు ప్రైవేటు సెక్యూర్టీని చిత్ర యూనిట్ ఏర్పాటు చేసుకొంటోంది. షూటింగ్ అనంతరం 'రజనీ'తో ఫొటోలు తీసుకొనేందుకు అభిమానులు ఉత్సాహం చూపుతున్నారు. ముస్లింలు సంప్రదాయబద్దంగా ధరించే టోపితో రజనీకాంత్ నడిచే వెళ్లే కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఇక్కడ చిత్రీకరణ పూర్తయిన అనంతరం రెండో షెడ్యూల్ ను చెన్నై పూందమల్లి సమీపంలోని ఓ పార్కులో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. రిలీజ్ అయిన అనంతరం 'కాలా' ఎలా అలరిస్తాడో చూడాలి.

07:58 - May 30, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటిస్తున్న చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ‘కబాలి' సినిమా విజయవంతమైన అనంతరం 'రోబో 2.0’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' దర్శకుడు పా.రంజిత్ తోనే 'రజనీ' మరో సినిమా చేస్తున్నాడు. ‘కాలా' పేరిట సినిమా నిర్మితమౌతోంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేశారు. ముంబై మాఫియా నేపథ్యంలో కథ కొనసాగుతోందని ప్రచారం జరగడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతేగాకుండా 'రజనీ' లుక్స్ కూడా మాస్ నేపథ్యంలో ఉంటుండడంతో మరోసారి 'భాషా' ను తెరపైకి చూస్తామని అభిమానులు అనుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు 'నానా పటేకర్' చిత్రంలో నటించనున్నారు. ఒక కీలకమైన పాత్రలో ఆయన కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం తమిళ నటుడు సముద్రఖనిని .. హుమా ఖురేషిని తీసుకున్న సంగతి తెలిసిందే. తమిళ .. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

07:53 - May 29, 2017

తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' సినిమా కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తుంటారు. ఆయన పలికే డైలాగ్స్..మేనరిజం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ‘కబాలి'గా ముందుకొచ్చిన 'రజనీ' శంకర్ దర్శకత్వంలో 'రోబో 2.0’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా 'కబాలి' దర్శకుడు పా.రంజిత్ తెరకెక్కిస్తున్న 'కాలా' చిత్రంలో 'రజనీ' పవర్ పుల్ పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‘బాషా' సినిమాలో చెప్పిన విధంగా 'బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే' అనే డైలాగ్ మరోసారి పలుకుతున్నట్లుగా ఉంది. సినిమాను అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువలోనే తీర్చిదిద్దాలని చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. 'ధనుష్' నిర్మాణంలో తెలుగు..తమిళ..హిందీ భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘రజనీ' సరసన 'హ్యుమా ఖురేషి' హీరోయిన్ గా నటిస్తోంది.

15:43 - May 26, 2017

చెన్నై : రజనీకాంత్‌ రాజకీయ ప్రవేశంపై కమల్‌హాసన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి కెమెరాల ముందు కనబడాలనే ఆరాటం ఎక్కువని కమల్‌ కామెంట్‌ చేశారు. అంతేకాదు.. కెమెరాలు ఎక్కడుంటే అక్కడ రజనీ ప్రత్యక్షమవుతారని చెప్పాడు. రజనీకాంత్‌ పొలిటికల్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నవేళ.... కమల్‌హాసన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి. కబాలి రాజకీయాల్లోకి రావడాన్ని కొందరు ఆహ్వానిస్తుండగా.... మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. అయితే కమల్‌ వ్యాఖ్యల వెనుక పరమార్ధం ఏంటని తమిళులు చర్చల్లో మునిగిపోయారు. కెరీర్‌ ప్రారంభం నుంచీ రజనీకాంత్, కమల్‌హాసన్‌ మంచి మిత్రులుగా కొనసాగుతున్నారు. అంతేకాదు.. ఇంతవరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు లేవు. అలాంటిది ఉన్నట్టుంది రజనీ రాజకీయ ఆరంగేట్రంపనై కమల్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. దీంతో కమల్‌ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో హాట్‌టాఫిక్‌గా మారాయి.

 

14:48 - May 26, 2017

చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై తోటి సహా నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా రజనీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన ఇటీవలే అభిమానులతో వరుసగా నాలుగు రోజుల పాటు భేటీలు జరిపారు. అభిమానులతో కలిసి రజనీ ఫొటోలు కూడా దిగార. దేవుడు ఆదేశిస్తే చూద్దామంటూ రజనీ పేర్కొన్నారు. తాజాగా తోటి నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకి కెమెరాల ముందు కనపడాలన్న ఆసక్తి ఎక్కువని ఓ టివి ఛానల్ ఇచ్చిని ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తమిళనాడులో దుమారం రేగుతోంది.

 

10:16 - May 25, 2017

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్..పా.రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రంపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. వీరి కాంబినేషన్ లో 'కబాలి' చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. ధనుష్ తన ఉండర్ బార్ ఫిలిమ్స్ సంస్థ తరపున ఓ చిత్రం నిర్మితమౌతోంది. ఇందులో 'రజనీ' పవర్ పుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి 'కబాలి' చిత్ర సాంకేతిక నిపుణులు పనిచేయనన్నట్లు తెలుస్తోంది. తాజాగా కీలక పాత్రలో దర్శక నటుడు సముద్రగని నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

15:38 - May 22, 2017

చెన్నై : తమిళ పాలిటిక్స్‌లోకి రజనీకాంత్‌ ఎంట్రీ ఇస్తున్నారన్న ఊహాగానాలతో.. చెన్నైలో తమిళ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రజనీ కన్నడికుడని తమిళ సంఘాలు అంటున్నాయి. తలైవాకు వ్యతిరేకంగా తమిళ సంఘాలు ఆయన ఇంటి ఎదుట నిరసన చేపట్టాయి. రజనీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కబాలి రాజకీయాల్లోకి రావొద్దంటూ నినదించారు. దీంతో పోలీసులు నిరసన కారులను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమిళ సంఘాల ఆందోళనల నేపథ్యంలో రజనీకాంత్‌ నివాసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - Rajinikanth