ram charan

21:54 - December 6, 2018

హైదరాబాద్: టాలీవుడ్‌ హీరోలంతా ఎలక్షన్‌ పోలింగ్‌ సెంటర్ల బాట పట్టనున్నారు. తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సినిమాలే కాదు రాజకీయ అవగాహన కూడా ఉందని చాటి చెప్పేందుకు తెలుగు సినీ ప్రముఖులు సిద్ధమవుతున్నారు.
జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో మెగాస్టార్, భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో సూపర్‌స్టార్:
తెలుగు సినిమా తారాగణం.. ఓటు వేసేందుకు క్యూ కట్టనుంది. సినిమాలే కాదు సమాజం పట్ల బాధ్యత కూడా ఉందని నిరూపించనుంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పలువురు ప్రముఖ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. టాలీవుడ్‌ అగ్రహీరోల్లో చాలా మంది హైదరాబాద్‌లో సెటిలయ్యారు. వీరంతా శుక్రవారం(డిసెంబర్ 7) జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తమ ఓటును వేసేందుకు రెడీ అవుతున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు రామ్‌చరణ్‌ జూబ్లిహిల్స్‌ క్లబ్‌లో.. సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు భారతీయ విద్యాభవన్ స్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ జూబ్లిహిల్స్‌లో ఓటును వేయనున్నారు. టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున, స్టైలిష్‌ అల్లు అర్జున్‌, కల్యాణ్‌రామ్‌ జూబ్లీహిల్స్‌లోని వేరువేరు పోలింగ్ బూత్‌లలో ఓటు వేయనున్నారు. వీరితో పాటు చాలా మంది టాలీవుడ్‌ సినీ స్టార్స్‌ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఇలా సినీ ప్రముఖులంతా సమజా పౌరులుగా తమ బాధ్యత నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. వారికి కేటాయించిన పోలింగ్‌ సెంటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకొని.. అభిమానులకు ఓటు విలువ తెలియచేయనున్నారు.

17:46 - November 23, 2018

సినిమా ప్రమోషన్స్‌కి ఏ చిన్న సందర్భాన్ని, అవకాశాన్నికూడా వదలుకోవడం లేదు మూవీ మేకర్స్.. కార్తీక పౌర్ణమిని సందర్భంగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ న్యూ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, శ్రీమతి డి.పార్వతి సమర్పణలో, డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా, వినయ విధేయ రామ. దీపావళి సందర్భంగా, ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన చిత్ర బృందం, ఆ తర్వాత టీజర్ రిలీజ్ చేసింది. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటల్లోనే కోటి 51 లక్షల డిజిటల్ వ్యూస్ రాబట్టి, రికార్డు సృష్టించింది. ఇప్పుడు చరణ్, సాంప్రదాయ బద్దంగా, చక్కగా పంచెకట్టుకుని, హారతి ఇస్తుండగా దణ్ణం పెడుతున్న లుక్ రిలీజ్ చేసారు. పోస్టర్‌పై, మీకు, మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అని వ్రాసారు. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  వినయ విధేయ రామలో చరణ్ పక్కన కియారా అడ్వాణి హీరోయిన్‌గా నటిస్తుండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ (జీన్స్‌ఫేమ్), చరణ్ అన్నయ్యలుగా నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా చేసాడు. స్నేహ, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2019 సంక్రాంతికి.. వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వాచ్ టీజర్...

12:58 - November 20, 2018

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోయే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్, హైదరాబాద్, కోకాపేట్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో నిన్న ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గరినుండి, టైటిల్ గురించీ, కథ గురించీ రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో, వాటికి చెక్ పెడుతూ, షూటింగ్ స్టార్ట్ అంటూ, జక్కన్నే రెండు ఫోటోలతో, ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చాడు. షూటింగ్ స్పాట్ నుండి, చెర్రీ, తారక్‌తో కలిసి ఫోటోకి పోజిచ్చిన దర్శకధీరుడు, ఫస్ట్‌టేక్ అప్పుడు కూడా వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ముగ్గురూ కలిసి, కేవలం కాళ్ళు మాత్రమే కనబడేలా తీసిన మరో ఫోటో కూడా అదిరిపోయింది. స్వయంగా రాజమౌళినే ఫస్ట్‌డే షూట్ అప్‌డేట్ ఇవ్వడంతో,  ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతుంటే, గాసిప్ రాయుళ్ళు మాత్రం.. అరరే, పుకార్లు పుట్టించడానికి మాకు చాన్స్ ఇవ్వలేదే.. అని తెగ ఇదైపోతున్నారు. మొత్తానికి, ఆర్ ఆర్ ఆర్‌కి సంబంధించిన అప్‌డేట్ ఏదైనాసరే, అది అఫీషియల్‌గా మూవీ యూనిట్ నుండి వస్తేనే బాగుంటుంది. బాహుబలి విషయంలో ఒకసారి ఇబ్బందిపడ్డ జక్కన్న, ఈ ఆర్ ఆర్ ఆర్ సెట్‌లో ఎటువంటి లీకేజ్‌లకు చోటు లేకుండా, చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నాడు. సెట్‌లో నో మొబైల్స్, యూనిట్ మెంబర్స్ అందరూ ఐ.డి కార్డ్స్, వాకీటాకీలు వాడుతున్నారు.  సెట్‌లోకి  కొత్త వాళ్ళు నాట్ అలౌడ్. దాదాపు రెండువారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తుంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, డి.వి.వి.దానయ్య ఈ మూవీని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిర్మిస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సాంకేతిక విభాగం..  కథ : వి.విజయేద్ర ప్రసాద్, మాటలు : సాయి మాధవ్ బుర్రా, కర్కి, సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, స్టైలింగ్ : రమా రాజమౌళి, ఎడిటింగ్ :  శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ విజన్ : వి.శ్రీనివాస మోహన్,  ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్

ACTION!!

The first shot of the MASSIVE  MULTISTARRER has been DONE. #RRRShootBegins @tarak9999 #RamCharan @ssrajamouli @srinivas_mohan @DOPSenthilKumar  @DVVMovies pic.twitter.com/eUkWYuFRZF
— RRR Movie (@RRRMovie) November 19, 2018

11:02 - November 19, 2018

దర్శకుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోయే ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్, హైదరాబాద్ శివార్లలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ ఉదయం ప్రారంభమైంది. బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడం, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండంతో, ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే నేషనల్ లెవల్లో ఈ సినిమా గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సెట్‌లో మొదటి రెండురోజులూ టీజర్‌కి సంబంధించిన షూట్ చేస్తారని ఫిలింనగర్ వర్గాల టాక్. దాదాపు రెండువారాల పాటు ఈ షెడ్యూల్ ఉంటుందని సమాచారం.. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, డి.వి.వి.దానయ్య ఈ మూవీని  దాదాపు, రూ.300 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిర్మించబోతున్నాడు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌కి చాన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాకి కథ : వి.విజయేద్ర ప్రసాద్, మాటలు : సాయి మాధవ్ బుర్రా, కర్కి, సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, స్టైలింగ్ : రమా రాజమౌళి, ఎడిటింగ్ :  శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ విజన్ : వి.శ్రీనివాస మోహన్,  ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్

11:48 - November 15, 2018

దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోయే ఆర్ ఆర్ ఆర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల 19 నుండి హైదరాబాద్‌లో  స్టార్ట్ కాబోతోంది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై, డి.వి.వి.దానయ్య ఈ మూవీని  దాదాపు, రూ.300 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా, నిర్మించబోతున్నాడు. బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడం, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండంతో, ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. నేషనల్ లెవల్లో ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. పనిలో పనిగా రోజుకొక గాసిప్ కూడా పుట్టిస్తున్నారు గాసిప్ రాయుళ్ళు. ఇన్ని రోజులూ, ఈ మూవీ కథ గురించి, తారక్, చెర్రీల క్యారెక్టర్ల గురించి రకరకాల వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారని కూడా అన్నారు. రీసెంట్‌గా ఆర్ ఆర్ ఆర్‌లో మరో ఆర్ యాడ్ అవబోతుందని ఫిలింనగర్ టాక్. ఛలో, గీత గోవిందం, దేవదాసు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ భామ రష్మిక‌ని ఈ సినిమాలో ఒక హీరోయిన్‌గా ఎంపిక చెయ్యనున్నారని అంటున్నారు. కానీ, మూవీ యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సినిమా పూర్తయ్యేలోపు ఇంకెన్ని గాసిప్‌లు పుట్టుకొస్తాయో చూడాలి. ఈ సినిమాకి, కథ : వి.విజయేద్ర ప్రసాద్, మాటలు : సాయి మాధవ్ బుర్రా, కర్కి, సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, స్టైలింగ్ : రమా రాజమౌళి, ఎడిటింగ్ :  శ్రీకర్ ప్రసాద్, వి.ఎఫ్.ఎక్స్ సూపర్ విజన్ : వి.శ్రీనివాస మోహన్,  ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్

12:34 - November 11, 2018

దర్శకుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందబోయే ఆర్ ఆర్ ఆర్ సినిమా, ఈ ఉదయం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.  దాదాపు, రూ. 300 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, డి.వి.వి.దానయ్య ఈ మూవీని నిర్మించబోతున్నాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రానా, వి.వి.వినాయక్, కొరటాల శివ, నిర్మాతలు.. అల్లు అరవింద్, సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి దేవుడు పటాలపై క్లాప్‌నివ్వగా, రాఘవేంద్రరావు, రాజమౌళికి స్ర్కిప్ట్ అందచేసారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. 2020‌లో  ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. బాహుబలి తర్వాత జక్కన్న చేస్తున్న సినిమా కావడం, ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తుండంతో   ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాకి, సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి, కెమెరా : కె.కె.సెంథిల్ కుమార్, మాటలు : సాయి మాధవ్ బుర్రా, స్టైలింగ్ : రమా రాజమౌళి.

12:00 - November 10, 2018

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, శ్రీమతి డి.పార్వతి సమర్పణలో, డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా, వినయ విధేయ రామ. నిన్న ఉదయం రిలీజ్ చేసిన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. టీజర్‌లో చెర్రీ చెప్పిన.. ఏయ్, పందెం పరశురామ్ అయితే ఏంట్రా? ఇక్కడ రామ్, రామ్.. కొ..ణి..దె..ల.. డైలాగ్‌కి మెగాఫ్యాన్స్ బాగా కనెక్ట్అయిపోయారు.
వినయ విధేయ రామ టీజర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. కేవలం 24 గంటల్లో కోటి 51 లక్షల డిజిటల్ వ్యూస్ రాబట్టి, రికార్డు సృష్టించింది. ఇప్పటికే పదిహేను మిలియన్ వ్యూస్ దాటేసింది. రెండు మిలియన్లకి పైగా లైకులొచ్చాయి. పనిలో పనిగా 11 వేల డిస్‌లైకులు కూడా వచ్చాయి. గతంలో ఉన్న యూట్యాబ్ టీజర్ హైయ్యెస్ట్ వ్యూస్ రికార్డుని చరణ్ బీట్ చెయ్యడం ఖాయం అంటున్నారు మెగాభిమానులు. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  వినయ విధేయ రామలో చరణ్ పక్కన కియారా అడ్వాణి హీరోయిన్. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్ (జీన్స్‌ఫేమ్), చరణ్ అన్నయ్యలుగా నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా చేసాడు. స్నేహ, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2019 సంక్రాంతికి వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

11:12 - November 9, 2018

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, శ్రీమతి డి.పార్వతి సమర్పణలో, డివివి దానయ్య నిర్మిస్తున్న సినిమా, వినయ విధేయ రామ. దీపావళి సందర్భంగా, ఫస్ట్‌లుక్ లాంచ్ చేసిన మూవీ యూనిట్, ముందుగా చెప్పినట్టే ఈ ఉదయం టీజర్ రిలీజ్ చేసింది. టీజర్ మొత్తం, రామ్ చరణ్, బోయపాటి శ్రీను మాత్రమే కనబడతారు.
అన్నాయ్ వీణ్ణి చంపెయ్యాలా, భయపెట్టాలా? భయపెట్టాలంటే పదినిమిషాలు, చంపెయ్యాలంటే పావుగంట, ఏదైనా ఓకే.. సెలెక్ట్ చేస్కో..
ఏయ్, పందెం పరశురామ్ అయితే ఏంట్రా? ఇక్కడ రామ్, రామ్.. కొ..ణి..దె..ల.. అంటూ చరణ్ రెచ్చిపోయాడు. సరైనోడులో విలన్.. వైరం ధనుష్ అయితే, ఈ సినిమాలో పందెం పరశురామ్ అనుకోవచ్చు. బోయపాటి ఎప్పటిలానే తన ఊరమాస్ యాంగిల్‌లో అదరగొట్టేసాడు. ఎం. రత్నం తన మార్క్ మాస్ డైలాగ్స్ వ్రాసారు. ఆర్యన్ రాజేష్, ప్రశాంత్(జీన్స్‌ఫేమ్), చరణ్ అన్నయ్యలుగా నటించారు. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా చేసాడు. టీజర్‌కి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  వినయ విధేయ రామలో చరణ్ పక్కన భరత్ అనే నేను భామ కియారా అడ్వాణి హీరోయిన్ కాగా, స్నేహ, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2019 సంక్రాంతికి వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

13:46 - November 6, 2018

మెగా ఫ్యాన్స్‌ఎంతగానో ఎదురుచూస్తున్న ఘడియ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో, డివివి దానయ్య నిర్మిస్తున్న కొత్త సినిమాకి, వినయ విధేయ రామ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసి, దీపావళి సందర్భంగా, ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసారు. పోస్టర్‌లో ఎప్పటిలానే బోయపాటి తన మాస్ మార్క్ చూపించగా, చెర్రీ ఎమోషనల్‌గా పరిగెడుతూ, ఒక చేత్తో కత్తి పట్టుకుని, మరో చేత్తో రెండో వెపన్‌ని ఎగరేస్తూ, ఉన్న స్టిల్ అభిమానులను అలరిస్తోంది. ఫ్యామిలీ, లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  వినయ విధేయ రామలో చరణ్ పక్కన భరత్ అనే నేను భామ కియారా అడ్వాణి హీరోయిన్ కాగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా చేస్తున్నాడు. స్నేహ, ఆర్యన్ రాజేష్, ప్రశాంత్(జీన్స్‌ఫేమ్), నవీన్ చంద్ర కీలక పాత్రలు చేస్తుండగా, రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. నవంబర్ 9వ తేదీ ఉదయం 10.25 నిమిషాలకు టీజర్ విడుదల చెయ్యనున్నారు. సంక్రాంతికి వినయ విధేయ రామ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

12:48 - November 3, 2018

దర్శకుడు రాజమౌళి, బాహుబలి రెండు పార్ట్‌‌ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో మల్టీస్టారర్ చెయ్యబోతున్నాడు. దాదాపు, రూ. 300 కోట్లతో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఈ మూవీని నిర్మించబోతున్నాడు నిర్మాత డి.వి.వి.దానయ్య. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇప్పుడీ సినిమా ప్రారంభోత్సవం ఎప్పుడనేది ప్రకటించింది చిత్ర బృందం. ఈ నెల 11వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కొబ్బరికాయ కొడతారట. పదకొండవ నెల, పదకొండవ తారీఖు, పదకొండు గంటలకి ముహూర్తం భలే సెట్ చేసారు. ఈ సినిమా కోసం రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌ల సరసన ముచ్చటగా ముగ్గురు ముద్దుగుమ్మలని ఫిక్స్ చేసాడని తెలుస్తుంది. ఈనవంబర్ 11న క్లాప్‌తో మొదలవనున్న ఈ సినిమా, 2020 లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. తారక్, చెర్రీ కలిసి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ (వర్కింగ్ టైటిల్) ‌కోసం మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుండడంతో అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి..
ఎమ్.ఎమ్.కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చెయ్యబోతుండగా, కె.కె.సెంథిల్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తాడు.

Pages

Don't Miss

Subscribe to RSS - ram charan