ram gopal varma

13:48 - April 19, 2018

రాజమండ్రి : శ్రీరెడ్డి వివాదంపై ఎంపీ మురళి మోహన్‌ ఘాటుగా స్పందించారు. ఏదైనా సమస్య వస్తే ఇండస్ట్రీలోని పెద్దలను కలిసి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పి సమస్య పరిష్కారించుకోవాల్సింది అన్నారు. అంతే కాని అర్ధనగ్న ప్రదర్శనలు చేయడం సరికాదన్నారు. ఇండస్ట్రీలో పని చేస్తున్నవారు క్రమశిక్షణతో మెలగాలని, లేని వారికి ఇండస్ట్రీలో ఉండే అర్హత లేదన్నారు.

 

13:23 - April 19, 2018

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ను తిట్టమని శ్రీరెడ్డికి తానే చెప్పినట్లు రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్‌ చేశారు. ఇందుకోసం శ్రీరెడ్డికి 5 కోట్లు ఇచ్చినట్లు కూడా ఒప్పుకున్నారు. శ్రీరెడ్డి ఉద్యమం పెద్ద ఎత్తున అందరిలోకి వెళ్లాలనే అలా చెప్పానన్నారు. ఈ విషయంలో శ్రీరెడ్డిని ప్రభావితం చేసినందుకు పవన్ కల్యాణ్‌కు, ఆయన అభిమానులకు ఆర్జీవీ క్షమాపణలు చెప్పారు. 

 

13:16 - April 19, 2018

హైదరాబాద్ : పవన్‌ కల్యాణ్‌ను తిట్టమని తనకు చెప్పింది రామ్‌గోపాల్‌ వర్మనే అని శ్రీరెడ్డి క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ తమన్నతో ఫోన్‌లో సంభాషించింది. ఇందుకోసం తనకు 5 కోట్లు ఇచ్చినా తాను తీసుకోలేదని చెప్పింది శ్రీరెడ్డి. రామ్‌గోపాల్ వర్మ, వైసీపీ తనపై పెద్ద ప్లాన్‌ వేశారని చెప్పుకొచ్చింది. పవన్‌ను తిట్టినందుకు ఉద్యమం అంతా నీరుగారిపోయిందని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. మళ్లీ ఎజెండా తయారు చేసి పోరాటం చేద్దామని ఉద్యమాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పింది. తన చివరి నెత్తుటి బొట్టు వరకు పవన్‌ను ఓడించేందుకే ప్రయత్నం చేస్తానంది. 

14:34 - February 22, 2018

విశాఖపట్టణం : జీఎస్టీ సినిమా ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాం గోపాల్ వర్మ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' బూతు సినిమాను యూ ట్యూబ్ లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోర్న్ నేపథ్యంలో ఉన్న సినిమా ఉండడంపై మహిళా సంఘాలు భగ్గుమన్నాయి. వెంటనే షార్ట్ ఫిలింను నిషేధించాలని మహిళా నేతలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో తమపై వర్మ కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు మహిళా సంఘాల నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కానీ ఏపీ రాష్ట్రంలో ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం అక్కడి మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వెంటనే వర్మపై కేసు నమోదు చేయాలని..అరెస్టు చేయాలని జీవీఎంసీ ఎదుట మహిళా సంఘాలు రెండు రోజుల పాటు నిరహార దీక్షకు పూనుకున్నారు. బుధవారం స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ తాము డిమాండ్ చేస్తున్నట్లుగా కేసులు నమోదు చేయలేదని దీక్షలు కొనసాగించారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. డ

18:31 - February 21, 2018

విశాఖపట్టణం : జీఎస్టీ షార్ట్ ఫిల్మ్ తీసిన వర్మ ఎన్నో చిక్కులు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను అరెస్టు చేయాల్సిందేనంటూ మహిళా సంఘాలు పిడికిలి బిగిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసును బుక్ చేసినా ఏపీలో మాత్రం అలాంటిదేమి చేయకపోవడం పట్ల మహిళా సంఘాలు కన్నెర్ర చేస్తున్నారు. వర్మపై కేసు నమోదు చేయాల్సిందే..ఆయన్ను అరెస్టు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ ఎదుట 48గంటల పాటు నిరహార దీక్షకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

16:30 - February 21, 2018

విశాఖపట్టణం : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ 'జీ ఎస్టీ' సినిమా వివాదం ఇంకా వీడడం లేదు. ఇటీవలే ఆయన దర్శకత్వంలో యూ ట్యూబ్ లో 'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' పేరిట పోర్న్ షార్ట్ ఫిల్మ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. సామాజిక వేత్త దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది. కానీ ఏపీ రాష్ట్రంలో ఎలాంటి కేసు నమోదు కాలేదు.

దీనితో మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలో జీవీఎంసీ వద్ద మహిళలు 48 గంటల నిరహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను బుధవారం దేవి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవీతో టెన్ టివి మాట్లాడింది. ఐద్వా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు పక్కన పెట్టడం సరికాదన్నారు. జీఎస్టీ సినిమా దర్శకుడు వర్మను పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని, మహిళల ఆత్మగౌరవాన్ని వర్మ కించపరిచారని తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

13:04 - February 20, 2018

హైదరాబాద్ : వర్మ జీఎస్టీ కేసులో కీరవాణికి నోటీసు జారీ చేయడానికి పోలీసుల సిద్ధమైయ్యారు. జీఎస్టీ సినిమాకు కీరవాణి సంగీత దర్శకత్వం చేశారు. దీంతో ఆయనను కూడా విచారించే అవకాశం ఉంది. కీరవాణితో పాటు ఆ సినమాకు సహకరించిన వర్మ అసిస్టెంట్లకు కూడా నోటీసుల జారీ చేసే అవకాశ ఉంది. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

11:40 - February 20, 2018

హైరదాబాద్ : వివాదాస్పద దర్శకులు రాంగోపాల్‌వర్మ కేసును సీసీఎస్ పోలీసులు త్వరితగతిన విచారణ జరపాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది బాలాజి విజ్ఞప్తి చేశారు. ఐటీ యాక్ట్‌ 2000, 67 ఏబీసి చట్ట ప్రకారం వర్మ శిక్షార్హుడేనన్నారు. ఈ కేసులో వర్మాకి మూడేళ్లపాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పిటిషనర్‌ తరపు న్యాయవాది వడ్డెర బాలాజి అన్నారు.

18:22 - February 19, 2018

హైదరాబాద్ : పోలీసులు స్కైప్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. సీసీఎస్ పోలీసులు ఇప్పటికే వర్మ ల్యాప్ ట్యాప్ ను స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

22:16 - February 17, 2018

హైదరాబాద్ : 'నా ఇష్టం వచ్చినట్లు చేస్తా... నా ఇష్టమొచ్చిన సినిమాలు తీస్తా.. అడిగారంటే అడ్డంగా తిడుతా.. ఎవరైనా డోంట్‌ కేర్‌'.. ఇది వివాదాస్పద డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తీరు. కానీ.. సీన్‌ రివర్స్‌ అయ్యింది. మహిళల ఆగ్రహానికి గురైన వర్మ తొలిసారి పోలీసుల విచారణకు హాజరయ్యాడు. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. అయితే కొన్ని సాంకేతిక అంశాలపై సమయం కావాలని కోరడంతో.. సీఆర్పీసీ 41 ప్రకారం నోటీసులిచ్చి వచ్చే శుక్రవారం హాజరు కావాలని సూచించారు పోలీసులు. 

రామ్‌గోపాల్‌ వర్మ. ఎన్నో సంచలనాలకు మారు పేరు.. అనేక వివాదాలకు కేంద్ర బిందువు... ఇలాంటి రామ్‌గోపాల్‌వర్మ.. తన సినిమాల్లో మహిళలను అశ్లీలంగా చిత్రకరించడమే కాకుండా... అడిగిన వారిపై అసభ్యకర కామెంట్లు చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సామాజిక కార్యకర్త దేవి హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు రామ్‌గోపాల్‌వర్మను స్టేషన్‌కు పిలిపించి విచారించారు.  

పోలీసులు జారీ చేసిన నోటీసుల మేరకు, రామ్‌గోపాల్‌వర్మ మధ్యాహ్నం 12 గంటలకు సీసీఎస్‌ పోలీసుల విచారణకు హాజరయ్యారు. జీఎస్ టీ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన అనేక అంశాలపై వర్మను పోలీసులు ప్రశ్నించారు. దాదాపు వర్మను 25 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అయితే... కొన్ని టెక్నికల్‌ ప్రశ్నలకు వర్మ సమయం కోరడంతో... వచ్చే శుక్రవారం విచారణకు రావాలని 41 సీఆర్పీసీ ప్రకారం నోటీసులిచ్చారు. 

ఇక వర్మ విచారణలో ప్రధానంగా జీఎస్టీ సినిమాకు సంబంధించిన ప్రశ్నలను అడిగారు పోలీసులు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన మాల్కోవా ఫొటోలు ఎక్కడివి?, విదేశాల్లో తీసినంతమాత్రాన భారతీయ చట్టాలకు ఈ సినిమా వర్తించదని ఎలా చెబుతారు?, ఐటీ చట్టం ప్రకారం మహిళలను అభ్యంతరకరంగా చూపడం నేరం కాదా?, జీఎస్టీని ఎంతకు అమ్మారు?, మాల్కోవాతో అభ్యంతర సన్నివేశాలు ఎలా తీశారు? అంటూ రకరకాల ప్రశ్నలను పోలీసులు సంధించినట్లు తెలుస్తోంది. అయితే... కాన్సెప్ట్‌ మాత్రమే తనదని... సినిమాను తాను రిలీజ్‌ చేయలేదని...  డైరెక్షన్‌ చేయలేదని విచారణలో చెప్పినట్లు అదనపు డీసీపీ రఘువీర్‌ తెలిపారు. పోలాండ్‌, యూకేలో సినిమాను చిత్రీకరించినట్లు తెలిపారన్నారు. సినిమాకు సంబంధించిన విషయాలతో ఉన్న ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేసి... ఎఫ్‌సీఎల్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఓ చానల్‌ లైవ్‌ ప్రోగ్రామ్‌లో మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యనించడంపై.. ఉద్రేకంలో మాట్లాడినట్లు వర్మ సమాధానమిచ్చినట్లు పోలీసు వర్గాల సమాచారం.

ఇదిలావుంటే వచ్చే వారం విచారణ ఎలా సాగబోతోందన్న విషయంపై హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. వర్మను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారమూ జరుగుతోంది. మరి వర్మ విచారణ నెంబర్‌ టూ ఎలా సాగనుందో తేలాలంటే శుక్రవారం వరకూ వేచి చూడాల్సిందే. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ram gopal varma