rape

06:44 - March 16, 2017

ఢిల్లీ : అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ మంత్రి గాయత్రీ ప్రజాపతి అరెస్టు అయ్యారు. కొద్ది రోజులుగా తప్పించుకుతిరుగుతున్న ప్రజాపతిని పోలీసులు లక్నోలో అరెస్టు చేశారు. ప్రజాపతి అఖిలేశ్‌ మంత్రివర్గంలో పని చేశారు. ప్రజాపతి తనయులను నిన్నే అరెస్టు అయ్యారు.

13:34 - March 13, 2017
11:25 - March 13, 2017

హైదరాబాద్ : కొండాపూర్ లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న భవనం సెల్లార్ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మృత దేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరో ఇద్దరు కూలీలు ఉన్నట్లు సమాచారం. అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మృతులు భారతమ్మ (25), కిష్టమ్మ (45) గా గుర్తించారు. భారతమ్మ నిజామాబాద్ జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. కిష్టమ్మ భర్త పాపయ్యగా గుర్తించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

07:59 - March 8, 2017

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఇవాళ మహిళలకు ప్రత్యేక సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. మహిళా దినోత్సవానికి రెండు రోజుల ముందు విడుదలైన మోన్ స్టర్ సర్వే గణాంకాలు కొన్ని కీలకమైన ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. మన దేశంలో స్త్రీలు పురుషుల మధ్య ఇప్పటికీ వేతన వ్యత్యాసాలు కొనసాగుతున్న వైనాన్ని కళ్లకు కట్టింది మోన్ స్టర్ సర్వే. ఒకవైపు వేతనాల్లో అన్యాయానికి గురవుతున్న స్త్రీలు ఇటు ఇంటి పని, అటు ఆఫీసు పనిలోనూ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న స్త్రీలు ఆరోగ్యపరంగానూ అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడో 1910 నుంచే మార్చి 8ని మహిళా హక్కుల దినోత్సవంగా పాటిస్తున్నా , సమాన పనికి సమానవేతనం చెల్లించాలంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ఈ వ్యత్యాసాలు ఎందుకు కొనసాగుతున్నాయి? వివిధ రంగాల్లో పనిచేస్తున్న వర్కింగ్ ఉమెన్ ఎదుర్కొంటున్న సమస్యలేమిటి? మహిళలు ఎదుర్కొంటున్న విభిన్న సమస్యలకు పరిష్కారం లభించేదెప్పుడు? అందుకు మనమేం చేయాలి? ఇదే అంశంపై ఇవాళ్టి జనపథంలో మాట్లాడేందుకు ప్రముఖ గైనకాలజిస్ట్‌ , జన విజ్ఞాన వేదిక నేత డాక్టర్‌ రమాదేవిగారు, ఐఎఫ్ టియు నేత ఎస్ ఎల్ పద్మగారు 10టీవీ స్టూడియోకి వచ్చారు. మహిళా దినోత్సవం, మహిళా సాధికారత గురించి అద్భుతంగా మాట్లాడారు. కాలర్స్ అడిగే ప్రశ్నలకు మంచి సమాధానాలు చెప్పారు. పూర్తి సమాచారాన్ని వీడియోలో చూడొచ్చు.

20:40 - March 7, 2017

స్వాతంత్ర ఫలాలు అందుకున్నామని సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టి ఏడు దశాబ్దాలు గడుస్తున్నాయి. మహిళల కోసం అనేక చట్టాలు చేశామని ప్రభుత్వాలు పదే పదే వల్లె వేస్తున్నాయి. మహిళా సంక్షేమమే తమ ఎజెండా అని ప్రతి పార్టీ నినదిస్తోంది. కానీ ఆచరణలో మాత్రం ఆ నిబద్ధత శూన్యం అని పదే పదే రుజువు అవుతోంది. మహిళల హక్కులే మానవ హక్కులని తీర్మానాలు నినదిస్తున్నాయ్. మహిళలు, పిల్లల మీద జరుగుతున్న హింసను ప్రతిఘటిద్దామంటోంది ఐక్యరాజ్య సమితి. అన్ని రంగాల్లో సమభాగస్వామ్యం మహిళల హక్కూ అని ఘోషిస్తున్నాయి అంతర్జాతీయ సదస్సులు. పితృస్వామ్య కుటుంబాలు కూల్చండి... ప్రజాస్వామ్య కుటుంబాలు నిర్మించండి అని డిక్లరేషన్లు చేశారు. కానీ వాస్తవంలో ఏం జరుగుతోంది? మహిళల సమానత్వం సిద్ధించేదెప్పుడు? ఇదే అంశంపై నేటి వైడాంగిల్ విశ్లేషణ. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి.

17:31 - March 6, 2017

నిర్మల్: ఆత్మహత్య చేసుకునేందుకు కెనాల్‌లోకి దూకిన మహిళను కాపాడారు జగిత్యాల పోలీసులు.... ఇబ్రహీంపట్నంకు చెందిన జల్ల లక్ష్మి శ్రీరాంసాగర్‌ కెనాల్‌లోకి దూకేసింది.. స్థానికుల ద్వారా ఈ సమాచారం అందుకున్న ఎస్ఐ మాడవి ప్రసాద్‌, రైటర్‌ మహేశ్‌లు కెనాల్‌కు చేరుకున్నారు.. అందులోకి దూకి కిలోమీటర్‌ దూరంలో అపస్మారక స్థితిలోఉన్న మహిళను గుర్తించారు.. తాళ్ల సహాయంతో ఆమెను బయటకు తీసి స్థానిక ఆస్పత్రికి తరలించారు.. తమ ప్రాణాలకుతెగించి మహిళను కాపాడిన పోలీసుల్ని స్థానికులు అభినందించారు..

17:29 - March 6, 2017

పెద్దపల్లి : జిల్లాలో పోలీసుల అరాచకంపై బాధితురాలు శ్యామల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది... రెండు రోజులక్రితం భర్త, పిల్లలతో కలిసి పొలం దగ్గరకి వెళ్లివస్తుండగా తమపై ఎస్ఐ దాడి చేశాడని ఆరోపించింది.... పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లి మరో ఎస్ఐతో కలిసి అసభ్య పదాలతో దూషించారని కలెక్టర్‌కు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్‌ వర్షిణి... ఈ విషయంపై కమిషనర్‌ విక్రమ్‌జిత్‌ దుగ్గల్‌కు ఫోన్‌ చేశారు.. ఈ ఘటనపై విచారణ జరిపి ఎస్ఐలపై చర్యలు తీసుకోవాలని సూచించారు..

17:06 - March 5, 2017

హైదరాబాద్ : నయీమ్ కేసులో శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్‌ను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విచారించింది. నేతిని సిట్ ఇప్పటికే రెండుసార్లు విచారించింది. నయీమ్‌తో తనకు ఫ్రెండ్‌ షిప్ ఉందని నేతి అంగీకరించారు. ఈ మేరకు నేతి విద్యాసాగర్ స్టేట్‌మెంట్ సిట్ రికార్డ్ చేసింది. నయీమ్ భార్య ఫర్హానాతో కలిసి నేతి విద్యాసాగర్ భార్య ల్యాండ్ కొన్నట్లు కూడా సిట్ గుర్తించింది. నాగేందర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై సిట్ బృందం నేతిని విచారించింది. 

 

20:03 - March 4, 2017

చిత్తూరు : తిరుపతి మండలం మల్లవరం వద్ద రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన ఉన్న వ్యవసాయబావిలో టవేరా వాహనం అదుపుతప్పి పడడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులంతా తమిళనాడు తిరువణ్ణామలై వాసులుగా గుర్తించారు. 

 

17:22 - March 2, 2017

యాదాద్రి : భువనగిరి జిల్లాలోని బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. కొలనుపాకకు చెందిన కనకరాజు యాదవ్ తో జనగాం జిల్లా నవాబుపేట ప్రాంతానికి చెందిన రేవతికి వివాహాం కుదిరింది. ఆలేరు మండలం కొలనుపాకలో వీరి వివాహా ఏర్పాట్లు చేశారు. కానీ రేవతికి 18 ఏళ్లు నిండలేదని ఐటీడీఎస్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే వివాహం జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని పెళ్లిని ఆపి వేయించారు. దీనిపై రేవతి కుటుంబసభ్యులు అభ్యంతరం చెప్పారు. పెళ్లికి ఎంతో ఖర్చు చేసి ఏర్పాట్లు చేయడం జరిగిందని, వివాహం రద్దు కావడంతో తాము నష్టపోతామని పేర్కొన్నారు. మైనర్ కు వివాహం జరగడం వల్ల కలిగే నష్టాలను అధికారులు వారికి తెలియచేశారు. ఈ వయస్సులో పెళ్లి చేయడం మంచిది కాదని హితవు పలికారు.

Pages

Don't Miss

Subscribe to RSS - rape