ravi teja

16:24 - October 1, 2018

జగిత్యాల : ఇటీ వల జగిత్యాలలో జరిగిన ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన తాజా వివరాలు వెల్లడయ్యాయి. ఇటీవల వచ్చి సూపర్ హిట్ అయిన  సినిమా ఆర్ఎక్స్ 100 సినిమా ప్రభావంతో వీరిద్దరు ఆత్మహత్య చేసుకున్నారనీ డీఎస్పీ వెంకట్ రమణ ఈ ఆత్మహత్యలపై వివరాలను వెల్లడించారు. కాగా వారిద్దరు ఆత్మహత్యకు చేసుకోలేదనీ..వారి మధ్య మూడో వ్యక్తికూడా వున్నాడనీ..అతనే వీరి ఆత్మహత్యలకు కారణం అని మహేందర్, రవితేజల పేరెంట్స్ ఆరోపించారు. కాగా విచారణలో మాత్రం మూడ వ్యక్తి మాత్రం లేడని పోలీసులు వెల్లడించారు. కాగా సదరు విద్యార్థుల ఆత్మహత్యల వివరాలను తెలుసుకుందాం..
జిల్లాలోని ఆత్మహత్యల కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ప్రేమ కోసం ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మధ్యహ్నాం 4గంటల సమయంలో పెట్రోల్ కొన్నట్లుగా సీసీ కెమెరా పుటేజ్ లో లభ్యమయ్యాయి. పెట్రోల్ బంక్ కు వెళ్లి మహేందర్, రవితేజలు రూ.430 విలువైన పెట్రోల్ కొనుగోలు చేసారు. అప్పటివకే వారు మద్యం తాగి వున్నట్లుగా తెలుస్తోంది. అనంతరం వారిద్దరు పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా అంత పెద్ద మొత్తంలో పెట్రోల్ ఎందుకు కొంటున్నాని పెట్రోల్ బంక్ వారు అడిగిన దారిని కాకు మార్గం మధ్యలో ఆగిపోయిందని అందుకే కొంటున్నామని వారు తెలిపినట్లుగా తెలుస్తోంది. 
విజయపురి కాలనీకి చెందిన కూసరి మహేందర్‌ అనే 16, విద్యానగర్‌కు చెందిన బంటు రవితేజ 16 స్నేహితులు. స్థానిక మిషనరీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. ఆదివారం పొద్దుపోయాక ఇద్దరూ పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌ వద్దకు వెళ్లారు. గొడవ.. ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకుని.. కొద్ది సేపటికే పరస్పరం ఘర్షణ పడిన వాళ్లు.. క్షణికావేశంలో వెంట తెచ్చుకున్న పెట్రోలు ఒకరిపై ఒకరు చల్లుకుని నిప్పంటించుకున్నారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు పోలీసులు తీవ్రంగా గాయపడిన బాధితులను 108 వాహనంలో జగిత్యాల ప్రాంతీయ వైద్యశాలకు తరలించే ప్రయత్నం చేశారు. ఇద్దరూ ప్రాణాలు వదిలారు.. ఈ లోపే మహేందర్‌ మృతి చెందగా..రవితేజ కరీంనగర్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. ఘటనా స్థలంలో బీరు సీసాలు ఉండటాన్ని బట్టి..ఘర్షణ పడే ముందు ఇద్దరూ మద్యం తాగి ఉంటారన్న అనుమానాలను పోలీసులు వ్యక్తంచేశారు. ఒకే అమ్మాయిని ప్రేమించి... ఒకే అమ్మాయిని ఇద్దరూ ప్రేమించి ఆమె కోసం గొడవపడి బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, మరెవరైనా ఈ ఇద్దరు యువకులను పెట్రోల్ పోసి కాల్చి చంపారా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఎంతో ప్రేమగా పెంచుకున్న తమ కుమారులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు. దీనిపై తాజాగా వివరాలు వెల్లడయ్యాయి. 

 

20:59 - February 16, 2018

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న ఫస్ట్  సినిమా  అ . న్యాచురల్ స్టార్ నాని ప్రొడ్యూసర్ గా మరో సారి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో టీజర్స్ నుంచే ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాపై స్టార్టింగ్ నుంచే హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఇంట్రస్టింగ్ మూవీ గా వచ్చిన ఈ   సినిమా   ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది.లేట్ లేకుండ  అ సినిమా టాక్ ఏంటో  తెలుసుకుందాం.

అ సినిమా ఇంట్రస్టింగ్ ఉండడానికి మెయిన్ రీజన్ ఈ మూవీ స్టార్ కాస్టింగ్. కాజల్,రెజీనా, నిత్యామీనన్,ఈషారెబ్బా  తో పాటు మురళీ శర్మ, అవసరాల శ్రీనివాస్, దర్శి ..లీడ్ రోల్స్ ప్లేచేస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందోనని అందరూ ఎగ్జైటింగ్ గానే వెయిట్ చేశారు.  అంతేకాదు..నాని ఈ సినిమాలో చేపకు, మాస్ మహారాజ రవితేజ చెట్టుకు వాయిస్ఓవర్ ఇవ్వడంతో ఇంట్రస్ట్ ఇంకా పెరిగిపోయింది.

ఇక షార్ట్ ఫిల్మ్స్ తో తన కంటూ ఓ డిఫరెంట్ మార్క్ సొంతం చేసుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాతోనే సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. మరి ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ని, స్టోరీ ని ఎలా డీల్ చేశాడో మనం కూడా చూద్దాం.  మరి అ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో, ఎంత వరకు రీచింగ్ ఉందొ సినిమా చూసొచ్చిన వాళ్ల మాటల్లోనే విందాం. ఈ అ సినిమాపై టెన్ టివి సినీ డెస్క్  తమ రివ్యూ ఇవ్వడానికి  ఉన్నారు. ఆ రివ్యూ  ఇప్పుడు చూద్దాం. 

రేటింగ్ 2/5 

15:58 - January 11, 2018

హీరో రవితేజ, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనుందంట. త్వరలోనే పట్టాలెక్కబోతుందట. శ్రీనువైట్ల మార్క్‌ కామెడీతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. అమెరికాలో ఎక్కువ శాతం సాగే ఈ చిత్రంలో రవితేజ ఎన్‌ఆర్‌ఐగా కనిపించనున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్‌ ఫైనల్‌ దశలో ఉందని, ఫైనలైజ్‌ అయ్యాక సినిమాను మొదలు పెట్టేందుకు చిత్ర బృందం ముమ్మర సన్నాహాల్లో ఉంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుందట. గతంలో రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 'నీకోసం', 'దుబారు శ్రీను', 'వెంకీ' చిత్రాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం రవితేజ 'టచ్‌ చేసి చూడు' చిత్రంలో నటిస్తున్నారు. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాశీఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. 

07:36 - December 15, 2017

హైదరాబాద్ : మాస్ మహారాజ్ రవిజేత హీరోగా కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్ లో ఓ సినిమా రానుంది. 'సోగ్గాడే చిన్ని నాయన', 'రారండోయ్ వేడుక చూద్దాం' వంటి హిట్ చిత్రాలు ఇచ్చిన కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రవితేజ సిద్ధమయ్యారు. ఎస్‌.ఆర్‌.టి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనున్న ఈ చిత్రం గురించి నిర్మాత రామ్‌ తాళ్లూరి మాట్లాడుతూ... 'మా బ్యానర్‌లో మాస్‌ రాజా రవితేజ హీరోగా మొదటి సినిమాను రూపొందిం చడం చాలా ఆనందంగా ఉంది. కళ్యాణ్‌ కృష్ణ చేసిన రెండు చిత్రాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచి విజయం సాధించాయి. కుటుంబ ప్రేక్షకుల్లో కళ్యాణ్‌ చిత్రాలకు ఓ ప్రత్యేకత ఉంది. మాస్‌ రాజా రవితేజ సినిమా అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ప్రకటించడంతో ఆడియెన్స్‌లో మా ప్రాజెక్ట్‌పై క్రేజ్‌ నెలకొంది. డిసెంబర్‌ నెలాఖరు నుంచి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం' అని అన్నారు. 

 

16:58 - November 17, 2017

సినిమా : మాస్ రాజా రవితేజ చాలా కాలం తర్వాత రాజా ది గ్రేట్ సినిమాతో హిట్టు కొట్టారు. ఈ సినిమా విజయం తర్వాత రవితేజ వరుసు సినిమాలు చేస్తున్నట్టు తెలిసింది. అందులో శ్రీను వైట్లతో ఓ సినిమా చేస్తున్నారని వార్తాలు వచ్చాయి. వీరి సినిమా ప్రొడ్యుస్ చేయాడానికి మైత్రి మూవీస్ ముందుకొచ్చింది. అయితే రవితేజ, శ్రీనువైట్లకు రెమ్యూనేషన్ కాకుండా లాభాల్లో వాటా ఇస్తామని ప్రపొజల్ పెట్టింది. దాని వారు ఒప్పుకున్నట్టు కూడా తెలిసింది. అయితే ఇందంతా జరిగింది రాజ ది గ్రేట్ సినిమా విడుదల కాకముందు కానీ ఇప్పుడు ఆ ప్రపొజల్ రవితేజ ఒప్పుకోవడం లేదని టాక్. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.

15:02 - September 6, 2017

టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ కొడుకు మహధాన్ వెండి తెరపై కనిపించనున్నాడు. మహధాన్ రాజాది గ్రేట్ సినిమాలో రవితేజ చిన్నప్పటి క్యారెక్టర్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత దిల్‌రాజు ధ్రువీకరించారు. ‘‘మాస్ మహరాజ్ రవితేజ కుమారుడు మహధాన్‌ను మా సినిమాలో పరిచయం చేస్తున్నాం. అతడికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ రవితేజ కుమారుడితో కలసి సెట్స్‌లో దిగిన ఫొటోను దిల్‌రాజు పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో రవితేజ అంధుడి పాత్రలో నటిస్తున్నారు. తన సినీ జీవితంలో తొలిసారి అంధుడి పాత్ర పోషిస్తున్న రవితేజ తన కుమారుడిని కూడా అంధుడి పాత్రతోనే సినీరంగానికి పరిచయం చేయబోతున్నారు. దిల్‌రాజు పోస్ట్ చేసిన ఫొటోలో రవితేజ కుమారుడి చేతిలో ఉన్న స్టిక్‌ను గమనిస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది.

12:51 - July 14, 2017

హైదరాబాద్ : డ్రగ్స్‌ సేవిస్తున్న పలువురు సినీరంగ ప్రముఖులకు నోటీసులు అందజేశామని అకున్‌సబర్వాల్‌ తెలిపారు.  ఈనెల 19 నుంచి నోటీసులు అందిన వారిని విచారిస్తామన్నారు. ఒక్కొక్కరినీ ఒక్కోరోజు వ్యక్తిగతం విచారించనున్నట్టు తెలిపారు. ఎవరు ఏరోజు విచారణకు హాజరుకావాలో నోటీసుల్లో తెలిపామన్నారు. డ్రగ్‌ నోటీసులు అందుకున్న వారిలో ప్రముఖ హీరోలు రవితేజ, తరుణ్‌, నవదీప్‌, తనీష్‌ పేర్లు బయటకొచ్చాయి. హీరోయిన్లు ఛార్మి, ముమైత్‌ఖాన్‌లు కూడా సిట్‌ నోటీసులు అందుకున్నవారిలో ఉన్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు సుబ్బరాజు, నందు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నిర్మాత శ్రీనివాసరావు, డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ సిట్ నోటీసులు అందుకున్నారు. వీరందరిని సిట్ కార్యాలయంలోనే విచారిస్తామని అకున్‌సబర్వాల్‌ అంటున్నారు. ఛార్మి, ముమైత్‌ఖాన్‌లను మాత్రం వారు కోరుకున్న చోటే విచారిస్తామని చెప్పారు. ఈ నెల 19 నుంచి విచారణ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

12:38 - July 14, 2017
20:32 - June 25, 2017

హైదరాబాద్ : అతివేగం మరొకరిని బలి తీసుకుంది. హీరో రవితేజ తమ్ముడు.. సినీ నటుడు భరత్‌... కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వెళుతుండగా కొత్వాల్‌గూడ వద్ద ఆగివున్న లారీని ఢీకొని భరత్‌ మృతి చెందాడు. . జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో భరత్‌ అంత్యక్రియలు నిర్వహించారు. అతివేగమే భరత్‌ మృతికి కారణమని పోలీసులంటున్నారు. 
రోడ్డు ప్రమాదంలో భరత్‌ మృతి 
సినీ హీరో రవితేజ సోదరుడు, సినీ నటుడు భరత్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి నోవాటెల్‌ హోటల్‌ నుంచి  హైదరాబాద్‌ తిరిగి వస్తుండగా కొత్వాల్‌గూడ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని.. భరత్‌ స్కోడా కారు ఢీకొట్టింది.  కారు సగభాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో భరత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. అయితే... అర్ధరాత్రి గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్‌ సిబ్బంది ఈ ప్రమాదాన్ని గుర్తించి ఆర్‌జీఐఏ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో రంగంలోకి పోలీసులు భరత్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కారు నెంబర్‌ ఆధారంగా భరత్‌ తల్లికి ఫోన్లు చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో చనిపోయింది ఎవరనే విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. ఆతర్వాత ఉదయం భరత్‌ తల్లి పోలీస్‌ స్టేషన్‌కు రావడంతో.. విషయం నిర్ధారణ అయ్యింది. 
భరత్‌ మృతికి అత్యధిక వేగమే కారణం 
భరత్‌ మృతికి అత్యధిక వేగమే కారణమని పోలీసులంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బెలూన్లు తెరుచుకున్నప్పటికీ సీట్‌ బెల్ట్‌ పెట్టుకోకపోవడంతో తలకు, ముఖానికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో భరత్‌ మృతి చెందాడు. 
మహాప్రస్థానంలో భరత్‌ అంత్యక్రియలు 
ఉస్మానియాలో భరత్‌ మృతదేహానికి పోస్ట్‌మార్టం అనంతరం జూబ్లీహిల్స్‌ మహాప్రస్థానంలో భరత్‌ అంత్యక్రియలు ముగిశాయి. భరత్‌ను చూసేందుకు స్నేహితులు, సినీ నటులు తరలివచ్చారు. అయితే... భరత్‌ మరణవార్త విని శోకసంద్రంలో మునిగివున్న తల్లి, సోదరుడు రవితేజ.. అంత్యక్రియలకు రాలేకపోయారు. దీంతో భరత్‌ అంత్యక్రియలను సోదరుడు రఘు నిర్వహించారు. 
మరో నటుడి ప్రాణాలు హరించిన అతివేగం 
మొత్తానికి అత్యధిక వేగం మరో నటుడి ప్రాణాలు హరించివేసింది. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వేగంగా వాహనాలు నడపడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సీటు బెల్ట్‌ పెట్టుకోకపోవడం, మితిమీరిన వేగంతో అనేకమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. 

 

15:04 - June 25, 2017

హైదరాబాద్ : ఉస్మానియా ఆసుపత్రిలో భరత్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. భరత్‌ మృతికి అతివేగమే కారణమని పోలీసులు తేల్చారు. ప్రమాద సమయంలో కారు 140 కి.మీ వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా భరత్‌ కారులో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతివేగం, మద్యం సేవించడంవల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
రోడ్డు ప్రమాదంలో భరత్‌ మృతి 
రోడ్డు ప్రమాదంలో రవితేజ సోదరుడు భరత్‌ మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం కొత్వాల్‌గూడ సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్‌లో ఆగి వున్న లారీని భరత్‌ ప్రయాణిస్తున్న స్కోడా కారు వేగంగా ఢీకొంది. కారు సగభాగం లారీ కిందకు దూసుకెళ్లడంతో భరత్‌ అక్కడికక్కడే మృతిచెందారు. అర్థరాత్రి గస్తీ తిరుగుతున్న పెట్రోలింగ్‌ సిబ్బంది ఈ ఘటనను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆర్‌జీఐఏ పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని మృతదేహాన్ని కారులో నుంచి బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. భరత్‌ పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పనిచేశారు. 
భరత్‌ మృతి పట్ల స్నేహితులు విచారం 
అవుట్‌ రింగ్‌ రోడ్డులో జరిగిన ప్రమాదంలో సినీనటుడు భరత్‌ రాజు మృతి పట్ల అతని స్నేహితులు విచారం వ్యక్తం చేశారు. భరత్‌తో తమకు ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎక్కడకు వెళ్లినా కలిసివేళ్లి, కలిసితినేవారిమని చెబుతున్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - ravi teja