raviteja

16:32 - July 17, 2017

హైదరాబాద్ : 'రవితేజ నిప్పులాంటి వాడు..నిప్పుతో చెలగాటమాడుతున్నారు..శత్రుత్వం తమకు లేదు..ఎవరో కావాలని చేశారని అనుకోవడం లేదు..తన కష్టం మీద పైకి వచ్చాడు'..అంటూ రవితేజ తల్లి పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా డ్రగ్స్ రాకెట్ కేసు సినీ ఇండస్ట్రీని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సినీ నటుడు రవితేజ..ఇతరులు కూడా ఉన్నారనే వార్త సంచలనం అయ్యింది. దీనితో ఆమె తల్లి 'రవితేజ' తల్లి సోమవారం స్పందించారు.

మత్తు ఏంటో తెలియదు..
డ్రగ్స్ వ్యవహారంలో తన కొడుకు పేరు రావడంపై హీరో రవితేజ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజకు మత్తు పదార్థాలు సేవించే అలవాటు లేదని, కష్టపడి ఇంత స్థాయికి ఎదిగిన తన కుమారుడికి ఈ కేసుతో సంబంధం ఉందని అనడం తమకు బాధ కలిగిందన్నారు. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉన్నందున స్పందించడానికి అందుబాటులో లేడని, పోలీసుల నుండి నోటీసు వచ్చిందన్నారు. 22వ తేదీన విచారణకు రవితేజ హాజరౌతాడని తెలిపారు.

కెల్విన్..ఎవడో తెలియదు..
నిజాయితీ ఎప్పటికైనా బయటపడుతుందని..ఏ టెస్టులకైనా తన కొడుకు రెడీ అని తెలిపారు. ఆరు నెలలకొకసారి ఆరోగ్య వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడని, గతంలో భరత్..రవితేజను డ్రగ్స్ కేసులో ఇరిక్కించారని తెలిపారు. భరత్ అలాంటి సర్కిల్ కు అలవాటు పడ్డాడని..మంచితనం కుర్రాడైన భరత్ మద్యానికి అలవాటు పడ్డాడని తెలిపారు. కెల్విన్..గెల్విన్ ఎవడో తెలియదని 'రవితేజ' తల్లి కుండబద్ధలు కొట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:58 - July 5, 2017

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన తన సోదరుడిని కడసారి ఆ స్థితిలో చూలేకే.. అంత్యక్రియలకు హాజరుకాలేదని సినీ హీరో రవితేజ అన్నారు. భరత్‌ మరణం గురించి తెలిసిన వెంటనే తమ కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆవేదన చెందారన్నారు. భరత్‌ అంత్యక్రియలకు తాము హాజరుకాలేదంటూ సోషల్‌మీడియాలో వచ్చిన కథనాలు తమను బాధించాయన్నారు. అవిరాసే ముందు ఒకసారి తమను సంప్రదించి ఉంటే బాగుండేదన్నారు. భరత్‌ అంత్యక్రియలను జూనియర్‌ ఆర్టిస్ట్‌తో జరిపించామన్న కథనాలు అసత్యమని.... తన చిన్నాన్నతో అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు.  భరత్‌ చనిపోయిన తర్వాతి రోజునే తాను షూటింగ్‌కు వెళ్లానని తెలిపారు. ఇక షూటింగ్‌లో నవ్వుతూ సెల్ఫీలు దిగారన్న కథనాలను ఆయన తప్పుపట్టారు. 

 

09:15 - June 26, 2017

సినీ నటుడు రవితేజ సోదరుడు 'భరత్' అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. శనివారం రాత్రి శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ పరిధిలోని ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో 'భరత్' అక్కడికక్కడనే మృతి చెందిన సంగతి తెలిసిందే. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కావడం..స్టీరింగ్ రెండు ముక్కలు కావడంతో భరత్ ముఖం ఛిద్రమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయడంతో సినీ నటుడు 'రవితేజ' సోదరుడు 'భరత్' అని నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం సోదరుడు రఘు, ఉత్తేజ్, భరత్ స్నేహితుడు ఆదిత్యలకు మృతదేహాన్ని అప్పగించారు. రాయదుర్గం మహాప్రస్థానానికి తరలించారు. భరత్ బాబాయి మూర్తిరాజు అంతిమ సంస్కారాలు నిర్వహించిన అనంతరం విద్యుత్ దహన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంత్యక్రియలకు భరత్ తమ్ముడు రఘు మినహా..రవితేజ, ఇతర కుటుంబసభ్యులు హాజరు కాలేదు. ఛిద్రమైన తమ్ముడు ముఖాన్ని చూడలేనని రవితేజ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. భరత్ తండ్రి అనారోగ్యం కారణంగా రాలేకపోయారని కుటుంబసభ్యులు పేర్కొంటున్నట్లు సమాచారం. మొత్తానికి అతివేగం మరో సినీ నటుడిని కోల్పోయింది.

11:49 - February 23, 2017

టాప్ రేంజ్ లో ఉన్న హీరోలు ఒక్కసారిగా డార్క్ లైట్ లోకి వెళ్ళిపోతారు. అలా కెరీర్ స్లో అవ్వడానికి రీజన్స్ చాల ఉంటాయి. తాము సెలెక్ట్ చేసుకునే కధలు, తాము వర్క్ చేసిన డైరెక్టర్స్ ఇలా చాలా అంశాలు ప్రభావం చూపిస్తాయి. లాస్ట్ ఇయర్ ఒక్క సినిమా కూడా చెయ్యకుండా ఉన్న ఒక హీరో రియలైజేషన్ తో ఈ ఇయర్ టు ఫిలిమ్స్ ఒకే చేసాడు. సినిమా అంటేనే మాస్ మార్కెట్ అనేది ఒక కోణం. ఒక హీరో మాస్ ని అట్రాక్ చేస్తే తిరుగుండదు, కలెక్షన్లకు కొదవుండదు, ఫాన్స్ కి లిమిట్ ఉండడదు. ఇవన్నీ ఒకప్పుడు. ఆడియన్స్ వ్యూస్ లో విజన్ లో మార్పు వస్తుంది. హీరో ఎవరైనా కధలో దమ్ముండాలి సినిమాలో బలముండాలి. అప్పుడే ఆడియన్స్ థియేటర్ వరకు వస్తారు. సినిమాని హిట్ చేస్తారు. సినిమా ఇండస్ట్రీ లో బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన నటుడు 'రవితేజ'. తన యాక్టన్ తో మాస్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన రవితేజ మాస్ మహారాజా అని బిరుదు కూడా కొట్టేసాడు. కానీ కొంత కాలం నుండి 'రవితేజ' ఫిల్మ్ రికార్డు చూస్తే ఒక్క పర్ఫెక్ట్ హిట్ కూడా కనపడదు. అసలు కొన్ని సినిమాలు అయితే ఎందుకు చేసాడో కూడా అర్ధం కాదు. సెంటిమెంట్ ని కామెడీ ని యాక్షన్ ని క్యాజువల్ వేలో ప్రెజెంట్ చేసే రవితేజ ఘోరంగా వెనక పడ్డాడు. హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్స్ తో చేసిన సినిమాలు కూడా అంతగా ఆడలేదు. కొత్తదనం లేని కధ, కట్టిపడెయ్యలేని కధనం, రొటీన్ కామెడీ, మోనాటిని ఎక్స్ప్రెషన్స్ ఇలా ఎన్నో కారణాలు మాస్ మహారాజని డౌన్ చేసాయి. గత సంవత్సరం కేవలం ఒక్క సినిమా కూడా చెయ్యకుండా సైలెంట్ గా వరల్డ్ టూర్ కి వెళ్ళాడు రవితేజ. ఒకప్పుడు కలక్షన్స్ కురిపించిన ఈ హీరో ఎంట్రీ తడబాటు లో పడింది. ఐన సరే అది గతం. ఇప్పుడు మాస్ మహారాజ్ రెండు వెరైటీ సినిమాలతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తన ప్రీవియస్ ఎనేర్జినీ స్క్రీన్ మీద మ్యాజిక్ లా మార్చబోతున్నాడు.

రెండు సినిమాలు..
ఈ ఇయర్ లో రవితేజ ఆల్రెడీ రెండు సినిమా లు ఓకే చేసి ట్రాక్ మీద పెట్టుకున్నాడు. 'టచ్ చేసి చూడు' అనే టైటిల్ తో ఒక సినిమా రాబోతుంది. టైటిల్ లోనే మాస్ ఎలిమెంట్ కనిపిస్తున్న ఈ సినిమా మీద 'రవితేజ' హోప్స్ పెట్టుకున్నాడు. విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో వస్తున్న 'టచ్ చేసి చూడు' సినిమా వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో 'రవితేజ'తో పాటు 'లావణ్య త్రిపాఠి', 'రాశిఖన్నా' నటిస్తున్నారు. దిల్ రాజు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో 'రవితేజ' హీరోగా వస్తున్న మరో సినిమా 'రాజా ది గ్రేట్'. ఈ సినిమా లో 'రవితేజ' అంధుడిగా నటిస్తున్నాడు అని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. స్టోరీ లైన్ సస్పెన్సు మైంటైన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఏది ఏమైనా 'రవితేజ'కి ఈ ఇయర్ రెండు సినిమాలు రెడీ గా ఉన్నాయ్. తన స్పీడ్ పెంచి ఇంకా కధలు వింటున్నాడు ఈ మాస్ హీరో.

09:39 - January 24, 2017

రాజా ది గ్రేట్. ఇది మాస్ రాజా 'రవితేజ' న్యూ మూవీ టైటిల్. ఆప్టర్ వన్ ఇయర్ మాస్ రాజా కొత్త సినిమాకి కమిట్ అయ్యాడు. త్వరలోనే ఈ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ సినిమా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. 'బెంగాల్ టైగర్' సినిమా తరవాత 'రవితేజ' మరోసారి కెరీర్ పరంగా వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాడు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'కిక్ 2'డిజాస్టర్ కావడంతో పాటు 'బెంగాల్ టైగర్' సోసో గా ఆడడంతో మాస్ రాజా ఈ గ్యాప్ తీసుకున్నాడు. దీనికి తోడు ఎడాది గ్యాప్ లో ఎన్ని స్టోరీస్ విన్న కూడా ఈ మాస్ స్టార్ కి నచ్చలేదు. ఇలా అనుకోకుండానే 'రవితేజ' వన్ ఇయర్ సినిమా చేయకుండా ఖాళీగా వదిలేశాడు. అయితే ఈ గ్యాప్ ఆయన వరల్డ్ టూర్ వేసి తెగ ఎంజాయ్ చేశాడులేండి. ఇక వరల్డ్ టూర్ కూడా కంప్లీట్ కావడంతో మాస్ రాజా కొత్త సినిమా పనుల్లో నిమగ్నం అయినట్లు తెలుస్తోంది.

'దిల్' రాజు..
'రవితేజ' ఫైనల్ గా 'దిల్' రాజు నిర్మాణంలోనే కొత్త సినిమా చేస్తున్నట్లు వినికిడి. 'రాజా ది గ్రేట్' టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. గత ఎడాది వీరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల డీలే అయిన ఈ కాంబినేషన్ ఇప్పుడు ఫైనల్ అవ్వడం విశేషం. త్వరలో ఈ చిత్రం ముహుర్తం జరుపుకోబోతున్నట్లు ఫిల్మ్ నగర్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూ మూవీ పట్టాలెక్కడానికి దర్శకుడే కారణంగా కనిపిస్తోంది. నిజానికి గత ఎడాది 'దిల్' రాజు, 'రవితేజ' మూవీ చేయడానికి ప్లాన్ చేశాడు. కానీ మాస్ రాజా ప్లాప్స్ లో ఉండడంతో ఈ స్టార్ ప్రొడ్యూసర్ కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య ఒప్పందం కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ సైడైపోయింది. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి ఇద్దరినీ కన్విన్స్ చేసి ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 'ఫటాస్’, 'సుప్రీమ్' సినిమాలో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు కొట్టిన ఈ దర్శకుడు మాస్ రాజాతో చేయనున్న సినిమాను కూడా సక్సెస్ చేసి హ్యట్రిక్ దర్శకుడు అనిపించుకోవాలని ఆశపడుతున్నాడు. బహుశ ఈ చిత్రం మార్చి నుంచి రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్లొచ్చని ఇన్ సైడ్ టాక్.

13:19 - May 9, 2016

మాస్ రాజా రవితేజ ఇలా తయారయ్యాడేంటి అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలు పెడుతున్నాయట. ఈ స్టార్ హీరో ఎప్పుడు లేని విధంగా ఇలా చేస్తున్నాడేంటి అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇతర స్టార్స్ మాస్ రాజాను ఫాలో కావాలనుకునే వారు. కానీ ప్రస్తుతం మాస్ రాజా ఇతర స్టార్స్ లా అయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నాడు. ఇంతకీ మాస్ రాజా ఎలా మారాడు ? మాస్ రాజా రవితేజ అంటే హుషారుకు మరో పేరు. తెర మీదే కాదు. బయట కూడా చాలా ఎనర్జీతో ఉంటాడు. ఆయన ఎనర్జీకి తగ్గట్టే శరవేగంగా సినిమాలు చేసేస్తుంటాడు. ఈ జనరేషన్ హీరోలందరూ స్పీడు పెంచడానికి ఒకరకంగా రవితేజానే కారణం. పెద్ద హీరోలందరూ ఏడాదికో రెండేళ్లకో ఓ సినిమా చేస్తుంటే రవితేజ మాత్రం ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి రెవెన్యూ తెచ్చిపెడుతాడు. అలాంటి మాస్ రాజా సడన్ రూట్ మార్చాడు. ఈ ఏడాదిలో రవితేజ ఖాళీగా గడిపేస్తున్నాడు.

స్లోగా సినిమాలు..
బెంగాల్ టైగర్ సినిమా వచ్చి ఐదు నెలలవుతోంది. అయిన కూడా ఇప్పటి వరకు ఈ స్టార్ హీరో కొత్త మూవీని సెట్స్ పైకి తీసుకురాలేదు. అవకాశాలు లేవా అంటే అదేం లేదు. రెండు మూడు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. కానీ సినిమా మొదలుపెట్టడంలోనే టైం తీసుకుంటున్నాడు. యంగ్ జనరేషన్ హీరోలందరూ రవితేజలా స్పీడ్ పెంచాలనుకుంటారు. కానీ ప్రస్తుతం రవితేజనే చాలా స్లోగా సినిమాలు చేస్తున్నాడు. గత రెండేళ్లుగా మాస్ రాజా ఎడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. కానీ వాటిని పట్టాలెక్కించడానికి మాత్రం మరో నాలుగు నెలలు పట్టొచ్చు అంటున్నారు. జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే రవితేజ సినిమా సినిమాకి ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నాడనేదే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

10:45 - November 17, 2015

రవితేజ సరసన నటించిన 'బెంగాల్‌ టైగర్‌'పైనే ఆశలన్నీ ఉన్నాయని రాశిఖన్నా అంటోంది. బాలీవుడ్‌లో నిర్మితమైన 'మద్రాస్‌కేఫ్‌'తో వెండితెరంగేట్రం చేసిన రాశిఖన్నా 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. ఆ తర్వాత 'మనం' చిత్రంలో అతిథి పాత్రలో నటించింది. 'జోరు' సినిమా తర్వాత గోపీచంద్‌ వంటి అగ్రహీరోతో 'జిల్‌'లో నటించే అవకాశాన్ని పొందింది. తాజాగా రామ్‌తో నటించిన 'శివమ్‌' విడుదలైంది. ప్రస్తుతం సాయిధరమ్‌తేజ సరసన 'సుప్రీమ్‌' చిత్రంలో నటిస్తోంది. రవితేజకి జోడీగా నటించిన 'బెంగాల్‌టైగర్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని రాశిఖన్నా పై విధంగా స్పందించింది. 'కొన్ని చిత్రాల్లోని పాత్రలు మనకే కాదు చూసిన ప్రేక్షకులకు కూడా బాగా గుర్తిండిపోతాయి. 'బెంగాల్‌ టైగర్‌'లోని పాత్ర కూడా ఇలాంటిదే' అని రాశి చెప్పింది.

20:08 - October 22, 2015

శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటించిన 'బెంగాల్‌ టైగర్‌' త్వరలో విడుదల కాబోతోంది. కె.కె. రాధామోహన్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాస్‌ డైలాగ్స్ కు పెట్టింది పేరైన మాస్‌ మహరాజ్‌ హీరో రవితేజ. ఈ మధ్య కాస్త రూటు మార్చి చేసిన కిక్‌2 సినిమా రవితేజకి పెద్దగా కిక్‌ ఇవ్వలేదు. దీంతో మళ్లీ తనకు బిగ్గెస్ట్ హెల్ప్ అయిన మాస్‌ మసాలా కథతో చేసిన సినిమా 'బెంగాల్‌ టైగర్‌' ఈ టైటిల్‌తో ఎంత పవర్‌, ఎంత మాస్‌ ఉందో దానినే సినిమాలో చూపించటానికి ట్రై చేశారు. ఈ సందర్భంగా రవితేజ, తమన్నలు సినిమా విశేషాలు వెల్లడించారు. 

08:59 - September 20, 2015

మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ కు తెలుగులో వరుసగా బంపర్ ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఇటీవల మాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్‌గా హండ్రెడ్‌ డేస్‌ పూర్తి చేసుకున్న 'ప్రేమమ్‌'లో అనుపమ నటించింది. అక్కడ మంచి మార్కులు రావడంతో అలాగే తెలుగు 'ప్రేమమ్‌'లో కూడా ఈ అమ్మడే నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్‌ కూడా ప్రారంభించుకోకుండానే.. నితిన్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న 'అ ఆ' సినిమాలో సైతం హీరోయిన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. అంతటితో ఆగకుండా తాజాగా రవితేజ సరసన కూడా నటించే లక్కీఛాన్స్‌ని దక్కించుకుందక్కించుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ కథానాయకుడిగా 'ఓ మై ఫ్రెండ్' ఫేమ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించబోయే చిత్రంలో ఒక హీరోయిన్‌గా అనుపమను తీసుకున్నారని సమాచారం. ఛాన్సుల మీద ఛాన్సులు వచ్చి పడుతుండటంతో ఉబ్బితబ్బిబ్బయిపోతోందట ఈ మలయాళ భామ. 

18:01 - August 7, 2015

                   రవితేజ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోహీరోయిన్లుగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్‌ రామ్‌ నిర్మిస్తున్న చిత్రం 'కిక్‌2'. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం గురించి నిర్మాత కళ్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ,'సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్ట్‌ 21న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. థమన్‌ సంగీతమందించిన పాటలు ఇప్పటికే హిట్‌ అయ్యాయి. ఈనెల 14న ట్రిపుల్‌ ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను చాలా గ్రాండ్‌గా చేయబోతున్నాం. సినిమా చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చింది. నిర్మాతగా నేను పూర్తి స్థాయిలో సంతృప్తి పొందిన చిత్రమిది. అద్యంతం వినోదాత్మకంగా సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మా బేనర్‌లో కచ్చితంగా 'కిక్‌2' మరో సూపర్‌ హిట్‌ చిత్రమవుతుంది' అని అన్నారు. 'యన్‌.టి.ఆర్‌. ఆర్ట్స్‌ బేనర్‌లో 'అతనొక్కడే' చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమైన నేను మళ్ళీ ఇదే బేనర్‌లో సినిమా చేయడం, రవితేజతో 'కిక్‌' తర్వాత మళ్ళీ 'కిక్‌2' చిత్రం చేయడం చాలా హ్యాపీగా వుంది. 'అతనొక్కడే' 'కిక్‌' చిత్రాల్లాగే ఈ సినిమా కూడా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవుతుందన్న నమ్మకం ఉంది' అని దర్శకుడు సురేందర్‌రెడ్డి తెలిపారు. 

Don't Miss

Subscribe to RSS - raviteja