rayalaseema

21:21 - October 17, 2017

విశాఖపట్నం : అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మూడేళ్ల క్రితం హుదూద్‌ తుపాన్‌ వచ్చినా.. విశాఖ నగరం తట్టుకుని నిలబడిందని.. ప్రజల సహకారంతోనే పునర్‌వైభవం సాధించగలిగామని చెప్పారు. అంతకు ముందు విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌ను ప్రారంభించారు. అనంతరం ఎన్‌ఏడీ ఫ్లైఓవర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. విశాఖ బీచ్‌రోడ్‌లో టీయూ-12 యుద్ధ విమాన ప్రదర్శనశాలను సీఎం ప్రారంభించారు.

21:45 - October 12, 2017
19:53 - October 12, 2017

అనంతపురం : భారీ వర్షాలతో రాయలసీమ ప్రజలు అవస్థలు పడుతున్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలుజిల్లాలో   'చిన్నకుహుంతి వంక' పొంగడంతో పత్తికొండ ఆస్పరి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు అనంతపురం జిల్లా గుత్తిలో రాత్రి కురిసిన వర్షంతో పట్టణంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇళ్లలోకి నీరుచేరడంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. 

 

08:07 - October 12, 2017

అనంతపురం : రాయలసీమ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనంతపురం జిల్లా గుత్తిలో నిన్న రాత్రి కురిసిన కుండుపోత వర్షానికి రోడ్లు, ఇళ్లు జలమయం అయ్యాయి. దీంతో గుత్తి ప్రజలు రాత్రంగా జాగారం చేశారు. కర్నూలును కూడా వర్షాలు ముంచెత్తున్నాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

21:49 - October 9, 2017

అనంతపురం : అనంతపురంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. సుమారు 9 గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో... లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రామకృష్ణా కాలనీ, సూర్యానగర్‌, ఉమానగర్‌తో పాటు పలు కాలనీలు నీటమునిగాయి. టీవీ టవర్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఉరవకొండ, కళ్యాణదుర్గం, తాడిపత్రి ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను దారి మళ్లించారు. అయితే వర్షం కారణంగా పలు కాలనీలలో వరద నీరు ఇళ్లల్లోకి వచ్చి చేరుతోంది. అక్రమకట్టడాలు, నాలాల ఆక్రమణలతో వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరుతోందని ప్రజలు అంటున్నారు. రాత్రంతా ప్రాణాలు అరచేత పెట్టుకుని గడిపామని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు వచ్చినపుడు అధికారులు హడావిడి చేస్తున్నారని.. తర్వాత యథాతథంగా ఆక్రమణలు కొనసాగుతున్నాయిని అనంతపురం ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్‌ వీరపాండ్యన్‌ అనంతపురంలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైందని తెలిపారు. జిల్లా ఎస్పీ జివిజి అశోక్‌ కుమార్‌తో కలిసి వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించామని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. బాధితులకు అండగా ఉంటామని, వర్షాల వల్ల నష్టపోయిన వారికి పరిహారం అందిస్తామని తెలిపారు. వెంటనే సహయక చర్యలు చేపట్టాలని మండల స్థాయి ప్రభుత్వ అధికారులకు ఆదేశించామన్నారు.

చెరువులు, నదులు జలకళను సంతరించుకున్నాయి....
భారీ వర్షాలతో జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గంలో చెరువులు, నదులు జలకళను సంతరించుకున్నాయి. ఏడు సంవత్సరాలుగా నిండని చెరువులు ఇప్పుడు నిండుకుండలను తలపించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుట్టపర్తిలో సాహెబ్‌ చెరువు నిండి చిత్రావతి నదిలోకి ఉదృతంగా నీరు వస్తుండటంతో చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. అటు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండురు, వేముల, లింగాలలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. లింగాల కుడి కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. గత పదేళ్లుగా... ఇలాంటి వర్షాలు కురవలేదని.. ఇప్పుడు చెక్‌ డ్యామ్‌లు, వాగులు వంకలు నిండటంతో సంతోషంగా ఉందంటున్నారు రైతులు. సీమలో కురుస్తున్న వర్షాలతో తమకు నీటి సమస్య తీరినట్లేనని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

15:47 - October 9, 2017

కడప : వర్షాలు సమృద్దిగా కురవడంతో రాయలసీమలో చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వర్షాలు లేక కరవు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఈ సారి కురిసిన వర్షానికి పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం, తొండురు, వేముల, లింగాలలోని చెరువులు పూర్తిగా నిండిపోయాయి. లింగాల కుడి కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. గత పదేళ్లుగా... ఇలాంటి వర్షాలు కురవలేదని.. ఇప్పుడు చెక్‌ డ్యామ్‌లు, వాగులు వంకలు నిండటంతో సంతోషంగా ఉందని రైతులు తెలిపారు. 

15:46 - October 9, 2017

అనంతపురం : అనంతపురం జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చెరువులు, నదులు జలకళను సంతరించుకున్నాయి. బోర్లలోకి నీరు రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడు సంవత్సరాలుగా నిండని చెరువులు ఇప్పుడు నిండుకుండలను తలపిస్తున్నాయి. పుట్టపర్తిలో సాహెబ్‌ చెరువు నిండి చిత్రావతి నదిలోకి ఉదృతంగా నీరు వస్తుండటంతో చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. అయితే పంటపొలాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో రైతులు పొలాలకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. 

19:23 - October 7, 2017

గుంటూరు : పార్టీని పట్టాలెక్కించేందుకు వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే.... టీడీపీ మైండ్‌ గేమ్‌కు తెరతీసింది. రాయలసీమ నేతలే టార్గెట్‌గా ముందుకు కదులుతోంది. టీడీపీ ఎక్కడ బలహీనంగా ఉందో? వైసీపీ ఎక్కడ బలంగా ఉందో..? చూసుకుని మరీ ఆ ప్రాంతంపైనే టీడీపీ ఫోకస్‌ పెట్టింది. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలను ... పార్టీలోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.

పార్టీలో చేర్చేందుకు కసరత్తు
ఈ క్రమంలో అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌ రెడ్డి... కర్నూలు ఎంపీ బుట్టా రేణుక సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు గుర్నాథ్‌రెడ్డితో.. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి.... బుట్టా రేణుకతో.. ఎంపీ సీఎం రమేశ్‌ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. అలాగే మాజీ మంత్రి శైలజానాథ్‌, కర్నూలు జిల్లాకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చేందుకు కసరత్తు జరుగుతున్నట్టు సమాచారం.

టీడీపీలోకి బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
వీరితో పాటు.. మాజీ సీఎం కోట్ల కుటుంబ సభ్యులతో కూడా సీనియర్‌ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నుంచి.. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. అలాగే మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి... చిత్తూరు జిల్లాలో . మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు కిషోర్‌కుమార్‌ రెడ్డిని పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. అదేవిధంగా ప్రకాశం జిల్లా.. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి కూడా లైన్‌ క్లియర్‌ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ చేరికలకు సంబంధించి ఇప్పుడే బయటపెట్టేందుకు టీడీపీ అధినాయకత్వం సుముఖంగా లేదనేది సమాచారం. జగన్‌ పాదయాత్ర మొదలుపెట్టాక... వైసీపీ నాయకులను పార్టీలోకి ఆహ్వానించేలా ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. కాగా ఈ ఆపరేషన్‌ రాయలసీమ బాధ్యతలను మంత్రులు సోమిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, అమర్నాథ్‌ రెడ్డిలతో పాటు ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, సీఎం రమేశ్‌లకు పార్టీ అధినాయకత్వం అప్పజెప్పినట్టు సమాచారం.

 

19:17 - October 7, 2017

తూర్పుగోదావరి : జిల్లా కిర్లంపుడిలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రేపటి నుంచి కోనసీమలో ఆత్మీయ పలకరింపు పేరుతో ముద్రగడ పర్యటించనున్నారు. అయితే ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. కిర్లంపుడిలో మరోసారి పోలీసులు భారీగా మోహరించారు.

16:31 - September 25, 2017

అనంతపురం : అనంతపురంలో రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తంగా మారాయి.. రహదారుల విస్తరణ రాజకీయ విస్తరణగా మారిందంటూ సీపీఐ నేతలు ఆందోళనకు దిగారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

Pages

Don't Miss

Subscribe to RSS - rayalaseema