reservations

21:22 - April 8, 2018

మహబూబాబాద్ : గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడంలో విఫలమైన టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి తరిమికొట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. టీపీసీసీ చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా మహబూబాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఉత్తమ్‌ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్లు పెంచడం సహా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. 

18:35 - March 26, 2018

హైదరాబాద్ : రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తూనే... అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే పాల్గొంటామన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా అడ్డుకుంటున్నామన్న ఏపీ నాయకుల ఆరోపణలు సరికాదన్నారు. రిజర్వేషన్లపై మా పోరాటం కొనసాగుతుందని.. కానీ వెల్‌లోకి మాత్రం వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే... విభజన చట్టం ప్రకారం కేంద్రం చేసిన మోసాన్ని ఎండగడుతామన్నారు. కేంద్రంపై పోరాటం చేయాలంటే ఇరు రాష్ట్రాలు ఆరోపణలు చేసుకోవడం కాకుండా... కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరముందన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీలు. 

16:39 - March 26, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల హక్కుల్ని కాలరాస్తోందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కేంద్ర పభుత్వాన్ని విమర్శించారు. ఎంపీలతో కేసీఆర్ భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ మాట్లాడుతు..కేంద్రప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాలు కొనసాగినంతకాలం తాము రిజర్వేషన్స్ పై పోరాటాన్ని కొనసాగిస్తునే వుంటామని స్పష్టంచేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత జనాభా పెరుగుతోందన్నారు. దీనికి అనుగుణంగా రిజర్వేషన్స్ ను అమలు చేయాల్సిన అవసరముందన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభయిన 5 తేదీ మార్చి నుండి రిజర్వేషన్స్ కోసం టీఆర్ఎస్ నిర్విరామంగా పోరాడతున్నామని ఎంపీ వినోద్ తెలిపారు. అలాగే కావేరీ బోర్టును ఏర్పాటు చేయాలని కర్నాటవాసులు కూడా పోరాడాతున్నారనీ..ఈ క్రమంలో మమ్మల్ని బూచిగా చూపించి ఏపీకి సమస్యలపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై చర్చింటంలేదన్నారు. ఒకే దేశం ఒకే చట్టం వుండాలని అందుకనే రిజర్వేషన్స్ కోసం పోరాడుతున్నామన్నారు. చెవిటివాని ముందు శంఖం ఊదినట్లుగా కేంద్రం వ్యవహరిస్తోందని వినోద్ ఎద్దేవా చేశారు. రిజర్వేషన్స్ అంశం గురించి పలు పార్టీ నేతల మద్దతును కోరామన్నారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఈర్ తో టీఆర్‌ఎస్ ఎంపీలు భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. రిజర్వేషన్ల అధికారాలు రాష్ర్టాలకే అప్పగించాలని టీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీలకు సీఎం దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ భేటీలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్, కవిత, ప్రభాకర్‌రెడ్డి, సుమన్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావులు పాల్గొన్నారు. 

15:55 - October 22, 2017

మార్క్సిజం అవసరమని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ పేర్కొన్నారు. రంగనాయకమ్మ..తెలుగు సాహిత్యానికి...తెలుగు సమాజానికి పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో కథలు..నపలలు..వ్యాసాలు..సామాజిక..రాజకీయ అంశాలతో తెలుగు సాహిత్యంలో అంతులేని చర్చను రేకేత్తించారు. సుప్రసిద్ధ మార్కిస్టు, స్త్రీ వాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన 'రామాయణ విషవృక్షం' ఒకటి. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగాయి. రచయిత్రిగా ఎదిగిన క్రమం..మార్క్సిజంపై ఆకర్షితులు కావడం..ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిణామాలపై రంగనాయకమ్మతో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను తెలియచేశారు. ఆమె నిర్మోహమాటంగా..స్పష్టంగా చెప్పిన అభిప్రాయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

18:55 - July 14, 2017

గుంటూరు : రాష్ట్రం విడిపోయాక ఏపీ సచివాలయ ఉద్యోగులంతా అమరావతికి తరలించాకా వారికి అన్ని డిపార్ట్‌మెంట్లలో ప్రమోషన్లు ఇచ్చింది ప్రభుత్వం. అయితే ఆర్ధికశాఖలో మాత్రం..దళిత, దళితేతర ఉద్యోగులలో వచ్చిన విభేదాల కారణంగా 9 నెలలుగా ప్రమోషన్లు ఆగిపోయాయి. ప్రమోషన్లలో తమ కోటా 15 శాతం భర్తీ చేయాలని దళిత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. జీవో నెంబర్ 2 ప్రకారం ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఎస్సీ ఉద్యోగులకు 15 శాతం, ఎస్టీ ఉద్యోగులకు 6 శాతం చొప్పున ఇవ్వాలి. అయితే రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఇచ్చిన ప్రమోషన్లలో దళిత ఉద్యోగులకు 15శాతం ప్రమోషన్లు ఇచ్చారని వారంతా తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్నారని ఓసీ, బీసీ ఉద్యోగులు చెప్తున్నారు. రాష్ట్రం విడిపోయాక ఇచ్చే ప్రమోషన్లలో మళ్లీ రూల్స్‌ అంటూ రిజర్వేషన్లు ఇస్తే తాము నష్టపోతామని జూనియర్లు ముందుకు వెళ్తారని ఓసీ, బీసీ ఉద్యోగులు వాదిస్తున్నారు.

ఆర్ధికమంత్రితో చర్చలు
దీంతో విభేదాలు తవ్రతరం కావడంతో అచివాలయంలో ఎవరివారు సమావేశాలు పెట్టుకోవడం, నిరసనలకు దిగడం జరుగుతోంది. ప్రమోషన్లలో రిజర్వేషన్‌ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని దళితేదర ఉద్యోగుల నాయకులు మండిపడుతున్నారు. ప్రమోషన్లలో రిజర్వషన్లు తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడితో కూడా చర్చలు జరిపారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. పైగా సమస్య మొత్తం సచివాలయానికి పాకింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. 

07:04 - April 21, 2017

హైదరాబాద్ : ముస్లిం, గిరిజనులకు రిజర్వేషన్లు పెంపు తర్వాత.. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ కొనసాగుతోంది. ఐదారు నెలల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. దీని కోసం సర్వే చేయాలని బీసీ కమిషన్‌ను కోరారు. దీంతో బీసీ కమిషన్‌ కసరత్తు మొదలు పెట్టింది. మరోవైపు రిజర్వేషన్ల పెంపు అంశంపై బీసీ వర్గాల్లో ఎలాంటి చర్చ జరుగుతుందనే దానిపై కేసీఆర్‌ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలువురు బీసీ నేతలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వంపై బీసీలకు ఎలాంటి అభిప్రాయం ఉందనే అంశాన్ని ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ ద్వారా కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు పెంచినప్పుడు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
బీసీలకు రిజర్వేషన్లు పెంపు
అయితే.. బీసీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు పెంచి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. బీసీలకు ఉన్న 25 శాతం రిజర్వేషన్లను.. మరో ఏడెనిమిది శాతం పెంచే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. ఇదే అంశాన్ని ఈరోజు జరిగే టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే 27న జరిగే బహిరంగ సభలో మరోసారి ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే రిజర్వేషన్ల అంశంపై పొలిటికల్‌ జేఏసీతో పాటు ప్రజాసంఘాలు, పార్టీలు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం చేయలేదని.. దీంతో మరిన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.

 

20:08 - April 13, 2017

హైదరాబాద్ : తెలంగాణ రైతులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. వచ్చే ఏడాది నుంచి రైతులకు ఉచితంగా ఎరువులు సరఫరా చేస్తామని ప్రకటించారు. ఎరువుల కోసం ఎకరానికి 4వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. మూడు నాలుగేళ్లలో కోటి ఎకరాలకు గోదావరి నీరు అందిస్తామన్న ఆయన.. రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు.  
తెలంగాణ నవ శకానికి నాంది.. 
తెలంగాణ నవ శకానికి నాంది పలకబోతుందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. ప్రగతిభవన్‌ జనహితలో రైతులతో సమావేశమైన ఆయన.. పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు రూ.17వేల కోట్ల రుణ‌మాఫీ చేసి చరిత్ర సృష్టించామనీ, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులకు 26లక్షల టన్నుల ఎరువుల‌ను నూటికి నూరు శాతం ఉచితంగా స‌ర‌ఫ‌రా చేయ‌నున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 55లక్షల మంది రైతులు ఉన్నారనీ వారందరికీ ఎరువులు ఉచితంగా ఇస్తామన్నారు. బడ్జెట్ ఆమోదం పొందిన వెంటనే తొలి నిధులు అన్నదాతలకే విడుదల చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రైతులకు ఉచితంగానే ఎరువులు సరఫరా చేస్తామన్నారు. 
'గ్రామ రైతు సంఘం' గా ఏర్పడాలి
ప్రతి ఊరిలోనూ 'గ్రామ రైతు సంఘం' గా ఏర్పడాలని అన్నదాతలకు కేసీఆర్‌ సూచించారు. ఈ సంఘాలు తమ గ్రామాల జాబితాను రూపొందించి నవీన వ్యవసాయ పద్ధతుల్ని తెలుసుకోవాలన్నారు. ఎకరానికి 2 దుక్కి మందు బస్తాలను, 3 యూరియా బస్తాలను ఉచితంగా ఇస్తామన్నారు. వీటికయ్యే మొత్తం 4 వేల రూపాయలు వచ్చే ఏడాది మే నెలలో రైతుల బ్యాంక్ అకౌంట్లో వేస్తామన్నారు. దుక్కి మందు, యూరియా, పొటాష్ ప్రభుత్వమే ఇస్తుందని.. పురుగుల మందులు విత్తనాలు రైతులు కొనుగోలు చేయాలన్నారు. 
కోటి ఎకరాలకు సాగునీరందిస్తాం..
తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నట్టుగానే కోటి ఎకరాలకు సాగునీరందించి తీరుతానని కేసీఆర్‌ స్పష్టంచేశారు. మూడు నాలుగేళ్లలోనే నీరు అందించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రజల్ని అభివృద్ధి పథంలో ఉంచితే తమకు డిపాజిట్లు కూడా దక్కవని కొందరు బాధపడుతున్నారని, నానా మాటలు అంటున్నారని చెప్పారు. గ్రామాల్లో క్రాప్‌ కాలనీలు రావాల్సి ఉందని, గిట్టుబాటు ధర అప్పుడే సాధ్యమవుతుందన్నారు. సీఎం వరాల జల్లుతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసినందుకు వ్యవసాయశాఖమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి రైతుల తరపున సీఎంను సన్మానించారు.

 

17:58 - April 13, 2017

రాజన్నసిరిసిల్లా : జిల్లాలోని వస్త్ర పరిశ్రమను అగ్రభాగాన నిలిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని చేనేత జౌళీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తంగళ్లపల్లి మండలం సారంపెల్లి టెక్స్‌టైల్‌ పార్క్‌లో జూకీ కుట్టు మీషన్ల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ టెక్స్ టైల్ పార్క్ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. సిరిసిల్లా పట్టణంలో ప్రెస్‌క్లబ్‌ భవనానికి భూమిపూజ చేశారు. పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికుల ఆదాయాన్ని నెలకు 15 వేల రూపాయల వరకు సంపాదించేలా వనరులను కల్పించేదుకు ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. అందులో భాగంగానే ఈ బడ్జెట్ లో 1284 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని చెప్పారు. 

16:20 - April 13, 2017

హైదరాబాద్ : వచ్చే ఏడాది నుండి ఎరువులను ఉచితంగా అందించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. గురువారం సాయంత్రం ప్రగతి భవన్ లో నిజామాబాద్ రైతులతో కేసీఆర్ సమావేమయ్యారు. రూ.17వేల కోట్ల రుణమాఫీ చేసినందుకుగాను రైతులు కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టించిందని, రెండు, మూడేళ్లలో తెలంగాణలో కోటి ఎకరాకు నీరు అందిస్తామన్నారు. వచ్చే ఏడాది నుంచి 26 లక్షల టన్నుల ఎరువులను రైతులకు ఉచితంగా ఇస్తామని అన్నారు. రాష్ట్రం బంగారం కావాలని, కేవలం మాటలు మాట్లాడితే సరిపోదని చేతలు కూడా ఉండలన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల జీవితం బొగ్గు బాయి, దుబాయిగా ఉందని, ఇప్పుడా పరిస్థితి ఉండదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం చావుదాక వెళ్లివచ్చినట్లు, రైతులు బాగుపడుతనే బంగారు తెలంగాణ అయినట్లు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హాయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, కోటి ఎకరాలకు నీళ్లు అందించి తీరుతామన్నారు. గత ప్రభుత్వాల హాయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, 24 లక్షల నుండి 26 లక్షల టన్నుల ఎరువుల సరఫరా చేస్తామన్నారు. రైతుల విత్తనాలు..పురుగుల మందు మాత్రమే కొనుక్కోవాలని సూచించారు. ప్రతి ఊరిలో ఒక గ్రామ రైతు సంఘం ఏర్పాటు చేయాలని, రైతు సంఘంలో అన్ని కులాల భాగస్వామ్యం ఉండాలన్నారు. గ్రామ, రైతు సంఘాలు అద్భుతమైన వేదికగా మారాలని సూచించారు. వ్యవసాయంలో రైతులు నవీన పద్ధతులు అవలింబించాలని, పైరవీలు జరగకుండా నేరుగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. మేలో ఎకరాకు రూ. 4 వేల చొప్పున రైతు అకౌంట్ లో జమ అవుతుందన్నారు.

 

22:01 - April 12, 2017

హైదరాబాద్ : ఈ నెల 21న కొంపల్లిలో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశాలు ఉంటాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ జరుగుతుందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ఈ నెల 14నుంచి 20వరకూ గులాబీ కూలీదినాలని... ఆ రోజుల్లో కూలీ పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో సభకు రావాలని సూచించారు. ఎవరి ఖర్చులు వారే భరించాలన్నారు. తాను కూడా కూలీ పనిచేస్తానని చెప్పారు.

Pages

Don't Miss

Subscribe to RSS - reservations