resignation

17:19 - October 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముందస్తు ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. సభలు, సమావేశాలతో ముందుకెళ్తోంది. టీఆర్ఎస్‌ను ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. టీడీపీ, సీపీఐ, జన సమితి పార్టీలతో కలిసి మహాకూటమి ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్‌ను గద్దె దించాలనే తలంపుతో జట్టు కట్టింది. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఆ పార్టీకి నేతలు రాజీనామాలు చేస్తున్నారు. టికెట్ దక్కని నేతలు రాజీనామా బాట పడుతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టికెట్ రాని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇటీవలే మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డిలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సతీమణి పద్మినీరెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నేతలు వరుసగా పార్టీని వీడడంతో కాంగ్రెస్ కష్టాల సుడిగుండంలో పడింది.Image result for పద్మినీరెడ్డి
పద్మినీరెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు. గత కొంత కాలంగా సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నపద్మినీరెడ్డి బీజేపీ కండువా కప్పుకున్నారు. మురళీధర్ రావు సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పద్మినీరెడ్డి చేరికను స్వాగతిస్తున్నామని, ఆమె సేవలను వినియోగించుకుంటామని మురళీధర్ రావు తెలిపారు. సంగారెడ్డి నుండి పోటీ చేయాలని పద్మినీ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకు సంగారెడ్డి శాసనసభ టికెట్ కోసం దామోదర రాజనర్సింహ తీవ్రంగా ప్రయత్నించారు. కుటుంబానికి ఒకటే టికెట్ నిర్ణయం కారణంతో ఆమెకు టికెట్ ఇవ్వలేమని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పడంతో పోటీ యోచనను ఆయన విరమించుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం దామోదర రాజనర్సింహను మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. సతీమణి పద్మినీరెడ్డిని సంగారెడ్డి నుండి బరిలోకి దింపాలని దామోదర యోచించినట్లు తెలుస్తోంది. అయితే సతీమణి బీజేపీలో చేరడంతో దామోదర కూడా బీజేపీలో చేరుతారా అనే చర్చ జరుగుతోంది.

Related imageకాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేశారు. సిటీ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్‌ టీఆర్ఎస్‌లో చేరారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మంచి పట్టున్నవ్యక్తి దానం నాగేందర్ అని చెప్పవచ్చు. ఆత్మాభిమానం దెబ్బతిన్నందుకే పార్టీకి రాజీనామా చేశానని దానం నాగేందర్‌ అన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గడం... తనను నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేసేందుకే పార్టీ మారుతున్నట్లు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని జెండా మోస్తున్న వారికి సరైన ప్రాధాన్యం దక్కడం లేదని.. ఓ వర్గం పార్టీని బ్రష్టు పట్టిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సేవ చేశానని.. కానీ రానురాను బీసీలకు అన్యాయం జరుగుతోందని.... ఒకే వర్గానికి చెందిన వారు పార్టీని ఏలుతున్నారని ఆరోపించారు.అందుకే ఆత్మగౌరవం లేని చోట ఉండటం సరికాదని రాజీనామా చేసినట్లు తెలిపారు. Image result for ex-speaker suresh reddy

కాంగ్రెస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి గత నెల 12న టీఆర్ఎస్ లో చేరారు. కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. గౌరవం లేని చోట ఉండడం ఇష్టం లేకే పార్టీ మారాల్సి వచ్చిందని సురేశ్‌రెడ్డి తెలిపారు. పార్టీ మారే వారి కోసం టికెట్‌ కేటాయించడంతో బాల్కొండ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచే అవకాశాలు పూర్తిగా మూసుకుపోవడం వల్లే తాను కాంగ్రెస్‌ నుంచి తప్పుకోవలసి వచ్చిందన్నారు. ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వచ్చిందో సురేశ్‌రెడ్డి తన అనుచరులకు వివరించారు. 2009 నుంచి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావించారు. తొందరపడి పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోలేదన్నారు. ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్‌కు నష్టమే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు  ఏవిధంగా ముందుకెళ్తారో చూడాలి మరి.

-చింత భీమ్‌రాజ్

17:14 - October 6, 2018

ఢిల్లీ : డిసెంబ‌ర్ 7న తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు అది కూడా ఒకే ద‌శ‌లో జ‌రుగుతాయ‌ని  కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి రావ‌త్ వెల్ల‌డించారు. కాగా ఏపీ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించినా.. ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవ‌ని, సాధారణ ఎన్నికల వరకూ ఈ సీట్లు ఖాళీగానే ఉంటాయని కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ తాజాగా స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు నాలుగు రాష్ర్టాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా ఎంపీల రాజీనామాలను జూన్ 4న ఆమోదించారు. లోక్‌సభ గడువు వచ్చే జూన్ 3తో ముగుస్తుంది. ఇంకా కేవలం ఏడాదిలోపే సమయం ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు నిర్వహించమని తేల్చి చెప్పారు. ఐదుగురు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు తమ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే.
 

 

11:57 - September 26, 2018

జమ్ము కశ్మీర్ : అందాల కశ్మీరం మరోసారి హెచ్చరికల నిఘాలోకి వెళ్లిపోయిందా? పోలీసుల విధులకు అడ్డుతగులతు..ఉగ్రవాదులు పోలీసులపై బెదిరింపులకు పాల్పడతున్నారు. తమ హెచ్చరికలు ఖాతరు చేయకుంటే  ఖతం చేస్తాం..ఉద్యోగాలకు రాజీనామా చేసి, ఇంటికి పరిమితం కాకుంటే మరణం తప్పదంటూ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ట్వీట్ చేసిన తరువాత, నాలుగు రోజుల వ్యవధిలో 40 మంది పోలీసులు రిజైన్ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై స్పదించిన జమ్ము కశ్మీర్ చీఫ్ సెక్రెటరీ బీవీఆర్ సుబ్రమణియమ్  మాత్రం కాశ్మీరు లోయలో 30 వేల మందికి పైగా ఎస్పీఓ ఉన్నారని, ఆ సంఖ్యతో పోలిస్తే రిజైన్ చేసినవారు తక్కువేనన్నారు. కశ్మీర్ లోయలో పోలీసు అధికారులను దొరికినవారిని దొరికినట్టు ఉగ్రవాదులు హత్యలు చేస్తున్నారు. గత వారంలో ముగ్గురు పోలీసులను వారి ఇళ్ల నుంచి కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు దారుణంగా చంపేశారు. వారిపై బులెట్ల వర్షం కురిపించారు. ఆపై సోషల్ మీడియాలో పోలీసులు రాజీనామా చేస్తున్న వీడియోలను ఉగ్రవాదులు వైరల్ చేసారు. దీన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి.

 

11:34 - July 2, 2016

కడప : వైసీపీ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి మనస్థాపం చెందారు. దీంతో తన పదవికి రాజీనామా చేసి కొరియర్, ఫ్యాక్స్ ద్వారా స్పీకర్ కు రాజీనామా పత్రాన్ని పంపించారు. కాగా స్థానికంగా టీడీపీ నాయకులు ప్రొటోకాల్ పాటించకుండా తమకు అవమానిస్తున్నారని కడప జిల్లాలో కొన్ని రోజుల క్రితం ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. జిల్లాకు సంబంధించిన అధికారులు ప్రొటోకాల్ పాటించటంలేదని మనస్థాపం చెంది రాజీనామా చేశారు. వైసీపీ నేతలను పదే పదే అవమానిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

21:41 - October 2, 2015

హైదరాబాద్ : నేపాల్‌ ప్రధానమంత్రి సుశీల్‌ కోయిరాలా రాజీనామా చేశారు. తన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌బరన్‌ యాదవ్‌కు అందజేశారు. కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ ఖడ్గ ప్రసాద్‌ శర్మ ఓలి తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. నేపాలి కాంగ్రెస్‌ నేత సుశీల్‌ కోయిరాలాను ఫిబ్రవరి 10, 2014న ప్రధానిగా ఎన్నికయ్యారు. సెప్టెంబర్‌ 20న నేపాల్‌ నూతన రాజ్యాంగాన్ని పార్లమెంట్‌ ఆమోదించింది. దీంతో హిందూ రాజ్యం నుంచి నేపాల్‌ ప్రజాస్వామ్య లౌకిక రాజ్యంగా ఆవిర్భవించింది. 

13:44 - September 1, 2015

హైదరాబాద్ : ఎపి అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యేకహోదాపై చర్చ కాస్తా..వ్యక్తిగత దూషణలకు, ఆరోపణలు, ప్రత్యారోపణులకు దారి తీసింది. చంద్రబాబు, జగన్ లు పరస్పరం విమర్శించుకున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. స్టీఫెన్ సన్ ని ఎమ్మెల్సీ చేయడానికి కేసీఆర్ కు జగన్ లెటర్ ఇచ్చారని .. మంత్రి హరీష్, జగన్ మీటింగ్ ఆయిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అనంతరం జగన్ మాట్లాడుతూ స్టీఫెన్ సన్ ఎవరో తనకు తెలియదన్నారు. 'నేను లెటర్ ఇస్తేనే... స్టీఫెన్ ను ఎమ్మెల్సీ చేశారని... రుజువు చేస్తే తాను రాజీనామా చేస్తానని ..ఋజువు కాని పక్షంలో చంద్రబాబు రాజీనామా చేస్తారా..అని సవాల్ విసిరారు. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు.. మోడీ వద్ద సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారని విమర్శించారు. అనంతరం జగన్ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిఆర్ ఎస్, వైసిపి కలిసినా తనను ఏం చేయలేవన్నారు. నీతి, నిజాయితితో ఉన్న తనను ఎవరూ ఏం చేయలేదని పేర్కొన్నారు. జగన్ పగటి కలలు కనవద్దని తెలిపారు.

 

21:29 - August 31, 2015

హైదరాబాద్: ఎనీటైమ్‌... ఎనీ సెంటర్‌... సై అంటే సై. అసెంబ్లీ లోపలైనా... మీడియా పాయింటైనా... డోంట్ కేర్‌. ఎక్కడైనా డిష్యూం డిష్యూమే. ఏపీలో అధికార, విపక్ష నేతల తీరిది. తీరిగ్గా ముచ్చట్లు చెప్పుకునే... మీడియా చిట్‌చాట్‌లోనూ లీడర్లిద్దరూ చిటపటలేస్తున్నారు. ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు.

ఇద్దరూ ఇద్దరే......

ఒకాయనేమో సభా నాయకుడు... మరొకాయనేమో ప్రతిపక్ష నాయకుడు...ఇద్దరూ ఇద్దరే. ఒకరికొకరు బద్ధశత్రువులు. ఒకరు సై అంటే మరొకరు నై అంటారు. కళ్లు మూసినా కళ్లు తెర్చినా ఢీ అంటే ఢీ అంటూనే ఉంటారు. అసెంబ్లీ లోపలైనా..! బయటైనా..! ఒక్కటే. నీళ్లు, నిప్పుగా ఉండే... చంద్రబాబు, జగన్‌ బాబులు చిట్‌చాట్‌లోనూ చిటపటలాడుతున్నారు. ఒకరిపై ఒకరు ఒంటికాలుతో లేస్తున్నారు.

మీడియాతో జరిగిన మాటముచ్చట్లలో...

మీడియాతో జరిగిన మాటముచ్చట్లలో... అసెంబ్లీ కౌరవ సభలా మారిందని... ప్రతిపక్ష నేత జగన్‌ మండిపడ్డారు. చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రం విడిపోకుండా ఉండటానికి పోరాడింది... వైసీపీ మాత్రమేనని గర్వంగా చెప్పగలమన్నారు జగన్‌. ప్రత్యేకహోదాకు బాబు అనుకూలమైతే... తక్షణమే తీర్మానం చేసి, కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలని ఆయన సవాల్‌ విసిరారు. అసలు హోదాపై సీఎం స్టేట్‌మెంట్‌ ప్రతుల్లో ఉన్నదొకటైతే.. బాబు మాట్లాడింది ఇంకొకటని ప్రతిపక్షనేత విమర్శించారు. ఆ విషయం నిరూపించడానికి తాను సిద్ధమని.. నిరూపిస్తే బాబు రాజీనామా చేస్తారా అని జగన్‌ ప్రశ్నించారు.

మరోవైపు ముఖ్యమంత్రి సైతం అదేస్థాయిలో రియాక్ట్ .......

మరోవైపు ముఖ్యమంత్రి సైతం అదేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. జగన్‌కు ఇన్ డైరెక్ట్‌గా వార్నింగ్ ఇచ్చారు. గీతదాటితే సహించేది లేదన్నారు. లైన్ క్రాస్ అయితే ఉపేక్షించేది లేదన్నారు. అలాగే పుష్కర విషాదంపై చంద్రబాబు స్పందించారు. శవరాజకీయాలు చేయడం తగదన్నారు. వీఐపీ ఘాట్‌లో కంచి పీఠాధిపతి ఉన్నందునే... పక్క కోటిలింగాల రేవుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా వీఐపీ ఘాట్‌లో ఎందుకు స్నానం చేయలేదో చెప్పాలంటూ జగన్‌ను ప్రశ్నించారు.మొత్తానికి అటు చంద్రబాబు, ఇటు జగన్‌ బాబులు కత్తులతోనే కవాతు చేస్తున్నారు. ఈ మాటల యుద్ధానికి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. 

20:53 - August 31, 2015

హైదరాబాద్ : పేరుకే మనది అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. కానీ జరుగుతున్న ఘటనలు చూస్తే ప్రజాసామ్యం అన్న మాట నేతి బీరయకాయ చందంగా మారింది. స్వేచ్ఛగా ఆలోచించే వారు హేతుబద్ధంగా తర్కించే వారు, లౌకిక సూత్రాలను పాటించేవారు వరుసగా ఒక్కొక్కరు తుపాకీ తూటాలకు బలైపోతున్నారు. ప్రముఖ హేతువాది నరేంద్రధబోల్కర్ హత్యను ప్రజలు ఇంకా జీర్ణించుకోలేనే లేదు. ప్రఖ్యాత నాస్తికవాద నాయకుడు గోవింద పన్సారే హత్యను ఎవరూ మర్చిపోనే లేదు. ఇంతలోనే కర్ణాటకలోని మరో సాహితీ శిఖరం ఎంఎం కలబుర్గి ఉన్మాద కత్తులకు బలై నేలకొరిగింది. ఏమిటా విధ్వంసం, ఏమిటా ఆ నిరంకుశత్వ పైశాచికత్వం. తలచుకుంటనే లౌకిక వాద ప్రేమికులకు నరాల్లో భయ విస్పోటనం కలుగుతోంది. దేశంలో పెరిగిపోతున్న మతమౌఢ్య శక్తులపై ప్రత్యేక కథనం ఈ రోజు వైడాంగిల్ లో చర్చించారు. మరి మీరు కూడా వినాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి....

20:10 - August 31, 2015

హైదరాబాద్ : ఆరోపణలు, ప్రత్యారోపణలు... సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ అట్టుడికింది. ప్రత్యేక హోదా, పుష్కర వివాదంపై... టీడీపీ, వైసీపీ మధ్య సభా సమరమే జరిగింది. మాటల తూటాలతో వైసీపీ అస్త్రాలు సంధిస్తే... అధికార పక్షం సైతం ధీటుగా సమాధానం చెప్పింది.

. తొలిరోజే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు....

తొలిరోజే వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు హీటెక్కించాయి. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ప్రత్యేక హోదా, పుష్కర విషాదంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే ప్రత్యేక హోదాపై తీర్మానం చేయాలంటూ వైసీపీ పట్టుబట్టింది. స్పీకర్ వాయిదా తీర్మానం తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి వైదొలగాలని... ప్రతిపక్ష నేత జగన్‌ డిమాండ్ చేశారు. టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి బయటకు వస్తేనే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు. రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై అనవరసరంగా వైసీపీ ఆరోపణలు చేస్తోందన్నారు.

అనంతరం గోదావరి పుష్కరాలపై సభలో దుమారం.....

అనంతరం గోదావరి పుష్కరాలపై సభలో దుమారం రేగింది. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా... అపశృతి చోటుచేసుకుందని చంద్రబాబు ప్రకటించారు. పుష్కరాల మృతులకు ఏపీ సీఎం సంతాపం ప్రకటించారు. పుష్కరాల మృతులపై బాబు చేసిన ప్రసంగంపై జగన్‌ మండిపడ్డారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. బాబు పబ్లిసిటీ కోసం చేసిన నిర్వాహకం వల్ల 29 మంది చనిపోయారని ఆయన ఆరోపించారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జగన్‌ ప్రసంగంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ప్రతిపక్ష సభ్యులు సైతం హల్‌చల్....

అటు ప్రతిపక్ష సభ్యులు సైతం హల్‌చల్ చేశారు. స్పీకర్‌ వారించినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కాసేపు సభను వాయిదా వేశారు. అనంతరం ప్రత్యేక హోదాపై మృతులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు చంద్రబాబు.. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పై అవిశ్వాసం పెట్టి ఎందుకు వెనక్కి తీసుకున్నారో..? చెప్పాలని వైసీపీని డిమాండ్ చేశారు.. దీనిపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. అసెంబ్లీలో వైసీపీ ఆందోళనపై సీరియస్‌గా స్పందించారు మంత్రి యనమల. ప్రతిపక్షానికి సభ సజావుగా సాగడం ఇష్టంలేదని ఆరోపించారు. స్పీకర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వైసీపీ సభ్యులు శాంతించలేదు.. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు.. దీంతో సభను మంగళవారానికి వాయిదావేశారు స్పీకర్.

15:16 - August 31, 2015

హైదరాబాద్ : చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని.. అసెంబ్లీ కౌరవసభలా ఉందని జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోకుండా ఉండటానికి పోరాడింది వైసీపీ మాత్రమేనని గర్వంగా చెప్పగలమన్నారు. ప్రత్యేకహోదాకు చంద్రబాబు అనుకూలమైతే తీర్మానం చేసి, కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించాలని జగన్‌ సవాల్‌ విసిరారు. అసలు హోదాపై సీఎం స్టేట్‌మెంట్‌ ప్రతుల్లో ఉన్నదొకటైతే.. బాబు మాట్లాడింది ఇంకొకటని జగన్‌ విమర్శించారు. ఆ విషయం నిరూపించడానికి తాను సిద్ధమని.. నిరూపిస్తే బాబు రాజీనామా చేస్తారా అని జగన్‌ ప్రశ్నించారు.

Don't Miss

Subscribe to RSS - resignation