Revanth

17:48 - January 23, 2018
17:39 - October 31, 2017

ఢిల్లీ : రాజకీయ పునరేకీకరణలో భాగంగానే తాము టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరామని వేం నరేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతుందని ఆయన అన్నారు. అవినీతితో సంపాదించిన డబ్బుతో తమను ఎవరూ ఓడించలేరని టీఆర్‌ఎస్‌ అనుకుంటోందని.... వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని వేం నరేందర్‌ రెడ్డి అన్నారు.

17:36 - October 31, 2017

ఢిల్లీ : కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా రాజకీయ పునరేకీకరణ జరగాల్సిన అవసరముందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఇది తుది పోరాటం కావాలన్నారు. కేసీఆర్‌ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలు పక్కకు పోయాయని.. గొర్రెలు, బర్రెలు, చేపలు, చీరలు వచ్చాయని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ పాలనలో విద్యార్థులకు, నిరుద్యోగులకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు ఎలాంటి న్యాయం జరగడం లేదని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

13:14 - October 26, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు శాసనసభా పక్ష సమావేశాలు జరిపాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. కాసేపట్లో బీఏసీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశం హాట్ హాట్ గా సాగనుందని తెలుస్తోంది. సమావేశంలో పాల్గొనేందుకు ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లు..ఇతరులు హాజరవుతున్నారు.

ఈ సమావేశంలో టి.కాంగ్రెస్ పలు డిమాండ్లను ప్రస్తావించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో వాయిదా తీర్మానాలకు విలువ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి. వీటిపై సమగ్రంగా చర్చ జరగాలని టి.కాంగ్రెస్ కోరనుంది. మొట్టమొదట వాయిదా తీర్మానాలు తీసుకోవాలని అనంతరం కొశ్చన్ అవర్..తరువాత షార్ట్ డిస్కషన్ తీసుకోవాలని పేర్కొంటోంది. మరి ఈ డిమాండ్లపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు టి.కాంగ్రెస్ చలో అసెంబ్లీ అంశం కూడా బీఏసీలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక టిడిఎల్పీ నుండి సండ్ర వెంకట వీరయ్య హాజరు కానున్నారు. టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ ను తాత్కాలికంగా బాధ్యతల నుండి తప్పించిన సంగతి తెలిసిందే.

07:09 - September 24, 2017

విజయవాడ : ఏపీ, తెలంగాణ రాష్ట్ర కమిటీలను టీడీపీ అధిష్టానం ఎన్నుకుంది. రాష్ట్ర కమిటీలతో పాటు జాతీయ, పొలిట్‌బ్యూరో సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పొలిట్‌బ్యూరోలో స్వల్ప మార్పులు చేశారు. తెలంగాణ నుంచి రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్కకు చోటుకల్పించారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నందమూరి హరికృష్ణను కొనసాగిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు.

టీడీపీ పొలిట్‌బ్యూరో, జాతీయ, తెలుగు రాష్ట్రాల కమిటీల ఏర్పాటుపై కసరత్తు పూర్తయిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పార్టీ సీనియర్లతో సమావేశమైన చంద్రబాబు.. పొలిట్‌బ్యూరోలో 17 మంది సభ్యులు ఉంటారని స్పష్టం చేశారు. కొత్తగా తెలంగాణ నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి,  సీతక్కకు పొలిట్‌బ్యూరోలో చోటు కల్పించినట్టు చెప్పారు. ఇటీవల పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎర్రబెల్లి, రమేశ్‌ రాఠోడ్‌ స్థానంలో వీరిద్దరికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇప్పటికే పొలిట్‌బ్యూరోలో అంతా సీనియర్లే ఉన్నందునా.. పెద్దగా మార్పులు చేయలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీలో 105  మంది, తెలంగాణ కమిటీలో 114 మంది ఉంటారని ప్రకటించారు. తెలంగాణ కమిటీకి ఎల్‌.రమణ అధ్యక్షుడిగా, రేవంత్‌రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉంటారని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ కమిటీకి అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉంటారని తెలిపారు. త్వరలోనే పార్టీ అనుబంధ సంఘాలు,  కమిటీలు ప్రకటించనున్నట్టు సీఎం వెల్లడించారు. ఇక టీడీపీ జాతీయకమిటీలో ఐదుగురు ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఐదుగురు అధికార ప్రతినిధులు ఉంటారని తెలిపారు.  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ కొనసాగుతారని వెల్లడించారు. 

టీడీపీ పొలిట్‌బ్యూరో అధ్యక్షులుగా చంద్రబాబు ఎన్నికయ్యారు. సభ్యులుగా అశోకగజపతిరాజు, యనమల, చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, హరికృష్ణ, కాల్వ శ్రీనివాసులు, దేవేందర్‌గౌడ్‌, ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి, రావుల, సోమిరెడ్డి, ప్రతిభాభారతి, అయ్యన్నపాత్రుడు, నామా నాగేశ్వరరావు, రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క ఉంటారు. నటుడు నందమూరి హరికృష్ణ స్థానం టీడీపీలో పదిలంగా ఉంది. ఆయన ప్రస్తుతం టీడీపీ పొలిట్‌బ్యూరోలో కొనసాగుతున్నారు. హరికృష్ణ టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదనే విమర్శలు ఉన్నా...కొత్తగా ఏర్పడిన పొటిట్‌బ్యూరోలో హరికృష్ణను టీడీపీ అధిష్టానం కొనసాగించింది.  

20:35 - August 11, 2017

మన నిజాంబాదు పోలీసోళ్లు ఎంత తెల్వికల్లోళ్లమ్మా..? అడ్డంబడెటోన్ని ఇడ్సిపెట్టి.. ఆపదలున్నోన్ని అరెస్టు జేశిండ్రంటే.. వాళ్ల ప్రతిభా పాఠవాలు మామూల్యేంగాదు.. తెలంగాణ జేఏసోళ్లు స్పూర్తి యాత్ర పేరు మీద నిజాంబాదుకు వోతుంటే.. టీఆర్ఎస్ కార్యకర్తలు నడ్మిట్ల అడ్డం బడి ఆగమాగం జేయవోయిండ్రు.. మరి ఆడనే ఉన్న పోలీసోళ్లు ఏం జెయ్యాలే.. అడ్డంబడెటోన్ని అరెస్టు జేయాల్నా..? జేఏసోళ్లను అరెస్టు జెయ్యాల్నా మీరే జెప్పుండ్రి..

ఆ నంద్యాల ఉపఎన్నికలళ్ల గెల్చెటోళ్లు ఎవ్వలో పొయ్యెటోళ్లు ఎవ్వలోగని.. రామచంద్రా.. తెల్గుదేశమోళ్లు అట్లనే మోపైండ్రు.. అటు జగన్ పార్టోళ్లు అట్లనే మోపైండ్రు.. ఎల్లిమీద మల్లి మల్లి మీద ఎల్లి.. వీళ్లు వాళ్లను తిట్ట వాళ్లు వీళ్లను తిట్ట.. నంద్యాల ఓటర్లే నోరెళ్ల వెట్టె పరిస్థితొచ్చింది.. అటు ఎన్నికల సంఘమోళ్లు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు దీస్కుంటున్నరు..

సిరిసిల్ల జిల్లా నేరెళ్ల పంచాదిల కొండను దొవ్వి ఎల్కను వట్టిండ్రుగదా ప్రభుత్వమోళ్లు.. మోకాళ్లు వల్గెతట్టు.. సంసారానికి పన్కిరానట్టు దళితులను గొట్టిన కేసుల తప్పంత ఎస్ఐ రవీందరుదేనటనుల్లా.. ఆ ఒక్కడు గొడ్తెనే ఎన్మిది మంది ఎందుకు పన్కిరాకుంటైండ్రట.. మరి అంత ధమ్మున్న ఎస్ఐని ఇండియా పాకిస్తాన్ బార్డర్ పొంట నిలవడ్తె ఒక్కడన్న బత్కుతడా పాకిస్తాన్ ఉగ్రవాది..? ఏం తమాషనో పోండ్రి..

హురక మనం చాల మిస్సైపోయినయ్ నిన్నటి శ్రీరాంసాగర్ నీళ్ల సభకాడి ముచ్చట్లు.. అంటే ఇవ్వి సర్కారు కెమేరాల గనిపియ్యయ్ గదా..? ఏదో ప్రైవేటు కెమేరాలకే దొర్కుతయ్ గావట్టి ఆల్చంగొస్తున్నట్టున్నయ్.. అయితే నిన్న ఓదిక్కు ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే.. సభ సంతోషంగున్నదనుకున్నంగని.. లోపటతం గంద్రగోళమే అయ్యిందట.. సూడుండ్రి..

ఓ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుగారూ.. ఎంత మందున్నరు మీ కులపోళ్లు తెలంగాణల..? అంత తింపికొడ్తె.. అరశాతానికి ఎక్వలేరు.. మీరు గంత మంది ఎమ్మెల్యేలా..? గజ్వెల్లి కెళ్లి మొదలు వెడ్తె.. సిద్దిపేట మీరేనాయే.. సిరిసిల్ల మీరేనాయే.. వేములవాడ మీరేనాయే.. కోరుట్ల మీరేనాయే.? ఏంది తమాష మరి మా బీసీలంత ఎటువోవాలె అంటున్నడు అంబర్ పేట అన్మంతన్న... ఏందో మళ్లొకపారి జెప్పు..?

మహాత్మా జ్యోతి బాపూలే బడుల పొంట సద్వుతున్న పోరగాళ్లు సద్వుళ్ల సారం నేర్చుకోని ఎట్ల బత్కాలె అని నేర్చుకునుడు కంటే.. మన్షి అనెటోడు ఏ విధంగ బత్కొద్దు అనేదే నేర్చుకుంటున్నట్టున్నరు ఎక్వ.. ఎందుకంటె హాస్టళ్లు గట్టిండ్రు పయ్యాకన బాతురూములు మర్శిండ్రు.. రూములు నిర్మించిండ్రు.. కిటికీలు మర్శిండ్రు.. ఇన్ని అవస్థల నడ్మ వాడు వ్యవస్థ మీద ఏడపట్టుసాధిస్తడు చెప్పుండ్రి..

ట్రాఫిక్ పోలీసాయిన పని ఏందయ్యా..? ఏడ ట్రాఫిక్ జాంగాకుంట జూస్కోవాలె.. ఎవ్వలన్న వీఐపీలొస్తె ట్రాఫిక్ క్లీయర్ జెయ్యాలే..? రోజు సక్కగ డ్యూటీ జేశి ఇంటికి వోవాలె అంతేనా..? మరి తొవ్వొంట వొయ్యెటోళ్లను అమ్మని అక్కని అని తిడ్తె ఎన్కటి కాలమేనా ఇది..? జనం అంత ఒక్కటై.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని తోలు దీశిండ్రు సూడుండ్రి..

కాలే ధన్ వాపస్ లాయెంగే.. యా నహి లాయెంగే... చేతులు ఇంత పొడ్గువెట్టి చెప్పిండు అప్పటి అభ్యర్థి.. ఇప్పటి ప్రధానమంత్రి మోడీ.. నల్లధనం వాపసు దెస్తాన్న మొనగాడు.. ఉన్నధనం విదేశాల పాలు జేశే పనిజేస్తున్నడట.. ఇన్నొద్దులు సర్కారు చేతులున్న రైల్వే సంస్థ.. ఇప్పుడు విదేశాలోళ్లకు అప్పజెప్పె కుట్రలు జేస్తున్నడట.. ఇగ రైల్వే కార్మికులు.. కండ్లెర్ర జేయవట్టిరి..

 

14:19 - April 12, 2017

హైదరాబాద్ : తెలంగాణ సచివాలయంలో మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఇండియన్‌ ఐడల్‌ విజేతలు రేవంత్‌, రోహిత్‌ లు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌, రేవంత్, రోహిత్‌లను కేటీఆర్ ఘనంగా సత్కరించారు. ఇలాంటి విజయాలు ఎన్నో సాధించాలంటూ ఇద్దరినీ మంత్రి అభినందించారు. 

Don't Miss

Subscribe to RSS - Revanth