rohith vemula

22:08 - February 23, 2017

న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీలోని రామ్‌జస్‌ కళాశాలలో నిన్న జరిగిన హింసాత్మక ఘటనలకు నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థులు ఢిల్లీ యూనివర్సీటీ నుంచి  పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వరకు ర్యాలీగా వెళ్లి బైఠాయించారు. ఏబివిపి విద్యార్థులకు వ్యతిరేకంగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు ప్రయివేట్‌ సైన్యంలా ఎబివిపికి కొమ్ముకాస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఏబివిపి హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటే చోద్యం చూస్తున్న పోలీసులను సస్పెండ్‌ చేయాలని లెఫ్ట్‌ విద్యార్థులు డిమాండ్‌ చేశారు. జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ కూడా ఆందోళనలో పాల్గొన్నారు. మోది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశ్వవిద్యాలయాల్లో దళిత, మైనారిటీ విద్యార్థులపై దాడులు పెరిగాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం డీయూలోని రామ్‌జాస్‌ కళాశాలలో 'కల్చర్‌ ఆఫ్‌ ప్రొటెక్ట్‌' సెమినార్‌లో ప్రసంగించడానికి వచ్చిన జెఎన్‌యు విద్యార్థి ఉమర్‌ ఖలీద్‌ను ఏబివిపి విద్యార్థులు అడ్డుకున్న విషయం తెలిసిందే. కశ్మీర్‌, బస్తర్‌ ప్రాంతాలకు స్వాతంత్రం కోరుతూ కొందరు విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న  ఓ వీడియోను ఏబివిపి విడుదల చేసింది.

18:17 - February 17, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న మేముల రోహిత్‌ దళితుడు కాదంటూ ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక ఇవ్వడాన్ని మేధావులు తప్పుపడుతున్నారు. రోహిత ఎస్సీ అని ధృవీకరిస్తూ క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన తర్వాత దళితుడుకాదని నిర్ధరించడం వెనుక  పెద్ద కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. కులవిక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుకార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగానే రోహిత్‌ను బీసీగా ప్రకటించారని వివిధ సంఘాల నేతలు విమర్శించారు. 

07:04 - February 17, 2017

ఖమ్మం: కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమ్మినేని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఎత్తేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం పూనుకుంటోందని, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, డబ్బున్న అధికారులే రాష్ట్రాన్ని మేసేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. అందరికి సమాన అవకాశాలు కావాలన్నదే సీపీఎం మహాజన పాదయాత్ర ఉద్దేశమని తమ్మినేని అన్నారు. కులవివక్షకు గురైన రోహిత్‌ వేముల కుటుంబానికి న్యాయం చేయకుండా...కేంద్ర మంత్రులను కాపాడేందుకే.. అతని కులాన్ని వివాదస్పదం చేస్తున్నారని తమ్మినేని అన్నారు. రోహిత్‌ వేముల కులాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. ..

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. అభివృద్ధి సాధ్యమవుతోందని, కానీ..కేసీఆర్‌ సర్కార్‌ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు పూనుకుందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో విద్యా రంగాన్ని కాపాడేందుకు సీపీఎం పోరాటం చేస్తోందని తమ్మినేని తెలిపారు. సంస్కరణల్లో భాగంగానే మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకం కోసం అప్పులు చేసి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని పాదయాత్ర కోఆర్డినేటర్‌ వెంకట్‌ ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న కోదండరామ్‌పై కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు అక్కసు వెళ్లగక్కుతోందని ఆయన ప్రశ్నించారు.

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన...

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 123వ రోజుకు చేరుకున్న పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఖమ్మం జిల్లాలోని రాయనపేట, ఆళ్లపాడు, బోనకల్లు, ముష్టికుంట్ల, నాగులవంచలో పాదయాత్ర బృందం పర్యటించింది. ముష్టికుంట్ల గ్రామంలో రెండు కిలోమీటర్ల పొడవునా తమ్మినేని బృందానికి పూలవర్షంతో స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు పాదయాత్ర బృంద సభ్యులకు సాదరంగా ఆహ్వానిస్తూ.. యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు తమ సమస్యలను తమ్మినేని బృందానికి విన్నవిస్తున్నారు. ఇప్పటికే 3వేల 300 కిలోమీటర్ల మేర యాత్రను పూర్తిచేశారు.

19:26 - February 16, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల దళితుడు కాదని ప్రభుత్వం నియమించిన కమిటీ ప్రకటించడాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. విచారణ కమిటీ ఇచ్చిన నివేదికను నిరసిస్తూ సీపీఎంతో పాటు దళిత, గిరిజన సంఘాల నేతలు ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ముందుగా దళితుడని ధృవీకరణ పత్రం జారీ చేసి, ఇప్పుడు బీసీగా ప్రకటించడాన్ని ప్రజా సంఘాల నేతలు తప్పు పడుతున్నారు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రని విమర్శించారు. 

 

11:33 - February 15, 2017

విజయవాడ: రోహిత్‌ వేముల బీసీ అంటూ గుంటూరు కలెక్టర్‌ ధృవీకరణపత్రం ఇవ్వడం దారుణమని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు అన్నారు. ఎస్సీ ధృవీకరణ పత్రంతోనే రోహిత్‌ హెచ్‌సీయూలో చేరారని గుర్తు చేశారు. రోహిత్‌ వేముల దళితుడని అందరికీ తెలుసన్నారు. బీజేపీ, టీడీపీ ఒత్తిడిలోనయ్యే కలెక్టర్‌ బీసీ సర్టిఫికెట్‌ ఇచ్చారన్నారు. తక్షణమే రోహిత్‌ వేముల చట్టాన్ని తీసుకొచ్చి.. కుల వివక్షను రూపుమాపాలని ఆయన డిమాండ్‌ చేశారు.

09:09 - February 15, 2017

హైదరాబాద్: గత ఏడాది హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ వేముల కుల వివాదం మరో మలుపు తిరిగింది. రోహిత్‌ దళితుడు కాదని, అతను బీసీ వర్గానికి చెందినవాడని ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ నిర్ధరించింది. అయితే.. కేసును తప్పుదోవ పట్టించడానికే రోహిత్‌ కులంపై కేంద్రం కుట్ర చేస్తోందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎస్ సిగా ఆధారాలుంటే 15 రోజుల్లో చూపాలి, లేదంటే అన్ని కులధ్రువీకరణ పత్రాలు రద్దు, గుంటూరు కలెక్టర్ షోకాజ్ నోటీసు, రోహిత్ మృతికి కారకులను రక్షించేందుకు కుట్ర జరుగుతోందా? ఇదే అంశంపై 'న్యూస్ మార్నింగ్ 'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో టిపిసిసి అధికార ప్రతి శోభన, బిజెపి నేత ఎస్ కుమార్, కేవిపిఎస్ నేత నటరాజన్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

22:12 - February 14, 2017

హైదరాబాద్‌ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల కుల వివాదం కొత్త మలుపు తిరిగింది. రోహిత్‌ వేముల దళితుడు కాదని ప్రభుత్వం నియమించిన  జిల్లా స్థాయి కమిటీ నివేదించింది. రోహిత్‌ది వడ్డెర కులమని నిర్ధరించింది. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే ధ్రువీకరించారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న 13 నెలల  తర్వాత కమిటీ నివేదిక సమర్పించింది. 
కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నం : మధు 
రోహిత్‌ వేముల కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. రోహిత్‌ వేముల దళితుడని సర్టిఫికెట్ ఇచ్చిన గుంటూరు జిల్లా కలెక్టర్.. ఇప్పుడు దళితుడు కాదు... అతను బీసీ అని సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని మధు ప్రశ్నించారు. తక్షణం రోహిత్ చట్టం తీసుకురావాలని, దళితుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీనే : రాములు  
రోహిత్‌ వేముల  బీసీ సామాజిక వర్గానికి చెందినవాడంటూ... గుంటూరు కలెక్టర్‌ నివేదిక ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని సీపీఎం నాయకులు రాములు అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీ కులానికి చెందినవాడేనని, కేంద్రమంత్రులను కేసు నుంచి తప్పించడానికే రోహిత్‌ కులం విషయంలో కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన ఆరోపించారు. అలాగే రోహిత్ వేముల కుల ధ్రువీకరణపై సిట్టింగ్‌ జ్జడితో విచారణ చేయించాలని న్యూ డెమోక్రసీ నాయకులు వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. రోహిత్ వేముల దళితుడనే విషయం అందరికీ తెలుసని..ఇప్పుడు ఆయన కులాన్ని బీసీగా ప్రకటించడం అన్యాయమని న్యూడెమోక్రసీ చంద్రన్న పార్టీ నేత గోవర్ధన్‌ అన్నారు. 
గతేడాది జనవరిలో రోహిత్ ఆత్మహత్య 
హెచ్‌సీయూలో రీసెర్చ్‌ స్కాలర్‌ అయిన రోహిత్‌ వేముల గత ఏడాది జనవరిలో తన హాస్టల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యునివర్సిటీలో దళిత విద్యార్థుల పట్ల వివక్ష చూపుతున్నారని, వారికో తాడు ఇస్తే ఉరి వేసుకుంటారని ఆత్మహత్యకు ముందు రోహిత్‌ వీసీకి లేఖ రాశారు. 
రోహిత్ మృతి తర్వాత కులంపై వివాదం 
రోహిత్ మృతి తర్వాత అతని కులంపై వివాదం తలెత్తింది. అనంతరం రోహిత్‌ వేముల దళితుడని  గుంటూరు తహసీల్దార్‌ నిర్ధారించిన కుల ధృవీకరణ పత్రాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ అప్పట్లో జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపారు.  అదే సమయంలో నా పేరు రోహిత్‌ వేముల...నేను గుంటూరుకు చెందిన దళితుడినని అప్పట్లో రోహిత్‌ స్వయంగా మాట్లాడిన వీడియో ఒకటి బయటకొచ్చింది. రోహిత్‌ స్నేహితులు కూడా ఆ వీడియోను బహిర్గతం చేశారు. రోహిత్‌ వేముల బీసీ అంటూ తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించడాన్ని వామపక్షాలు, దళిత సంఘాలు ఖండించాయి. 

 

20:37 - February 14, 2017

హైదరాబాద్‌ : హెచ్ సీయూలో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్ధి రోహిత్‌ వేముల కుల వివాదం కొత్త మలుపు తిరిగింది. రోహిత్‌ వేముల దళితుడు కాదని ప్రభుత్వం నియమించిన  జిల్లా స్థాయి కమిటీ నివేదించింది. రోహిత్‌ది వడ్డెర కులమని నిర్ధారించింది. ఇదే విషయాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే ధృవీకరించారు. రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న 13 నెలల  తర్వాత కమిటీ నివేదిక సమర్పించింది. రోహిత్ దళితుడు కాదని నిర్ధారించిడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. 
రోహిత్‌ వేముల కేసును పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం : సీపీఎం నేత మధు
హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కులవివక్షత కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్‌ వేముల కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. రోహిత్‌ వేముల దళితుడని సర్టిఫికెట్ ఇచ్చిన గుంటూరు జిల్లా కలెక్టర్.. ఇప్పుడు దళితుడు బీసీ అని సర్టిఫికెట్ ఇవ్వడం వెనుక ఆంతర్యమేమిటని మధు ప్రశ్నించారు. తక్షణం రోహిత్ చట్టం తీసుకురావాలని, దళితుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. కేసును కులం చుట్టూ తిప్పుతున్నారని పేర్కొన్నారు. తల్లి ఏం కులం, ఇతరులు ఏం కులం అనే దానిపై తిప్పుతున్నారని.. ఇది సరికాన్నారు. అసలు సమస్యను పక్కదారి పట్టించి దీన్ని వివాదం చేసేందుకు పూనుకుంటున్నారు. అందరూ వ్యతిరేకించాలని అన్నారు.
రోహిత్‌ వేముల కేసును నీరుగార్చేందుకు ప్రయత్నం: సీపీఎం నేత రాములు
రోహిత్‌ వేముల  బీసీ సామాజిక వర్గానికి చెందినవాడంటూ... గుంటూరు కలెక్టర్‌ నివేదిక ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని సీపీఎం నాయకులు రాములు అన్నారు. రోహిత్ వేముల ముమ్మాటికి ఎస్సీ కులానికి చెందినవాడేనని అన్నారు. కేంద్రమంత్రులను కేసు నుంచి తప్పించడానికే రోహిత్‌ కులం విషయంలో కేంద్రం కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. 
కుల ధ్రువీకరణపై సిట్టింగ్‌ జ్జడితో విచారణ చేయించాలి : వెంకట్రామయ్య  
అలాగే రోహిత్ వేముల కుల ధ్రువీకరణపై సిట్టింగ్‌ జ్జడితో విచారణ చేయించాలని న్యూ డెమోక్రసీ నాయకులు వెంకట్రామయ్య డిమాండ్ చేశారు. 
రోహిత్ కులాన్ని బీసీగా ప్రకటించడం అన్యాయం : గోవర్ధన్  
రోహిత్ వేముల దళితుడనే విషయం అందరికీ తెలుసునని..ఇప్పుడు ఆయనకు కులాన్ని బీసీగా ప్రకటించడం అన్యాయమని న్యూడెమోక్రసీ చంద్రన్న పార్టీ నేత గోవర్దన్‌ అన్నారు. 

 

20:04 - February 14, 2017

రోహిత్ వేముల ఎస్సీ కాదనడం బాధాకరమని విశ్లేషకులు నగేష్ అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. కేసులో ఉన్న హెచ్ సీయూ వీసీ అప్పారావు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలను తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమిళనాడు రాజకీయాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

18:57 - February 14, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు కొత్త మలుపు తిరుగుతోంది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ వేముల దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ నిర్ధారించింది. రోహిత్ ది వడ్డేర కులమని విచారణ కమిటీ తేల్చింది. గతేడాది జనవరి 17న రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుల వివక్ష, వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో రోహిత్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇదిలావుంటే తాజాగా ప్రభుత్వ కమిటీ ప్రకటనపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక వేత్తలు మండిపడుతున్నాయి.
కేసులో ఉన్నవారిని కాపాడేందుకు కుట్ర : భాస్కర్  
రోహిత్ కులం మార్చి...ఆ కేసులో  కేసులో ఉన్నవారిని కాపాడేందుకు పన్నాగం పన్నుతున్నారని కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులు కలిసి... రోహిత్ దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ చేత నిర్ధారింప చేశారని ఆరోపించారు. నరేంద్రమోడీ, చంద్రబాబులు ఆర్ ఎస్ ఎస్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీవ్రమైన దళిత ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదని స్పష్టం చేశారు. దళితుల వైపు నిలబడకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోడీ, చంద్రబాబులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇది రాజకీయ దురుద్ధేశపు చర్య : మాల్యాద్రి 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దురుద్ధేశంతో చేస్తున్న చర్యగా ఏపీ కేవీపీఎస్ నేత మాల్యాద్రి అభిర్ణించారు. 
ప్రభుత్వాలు దళితులకు వ్యతిరేకంగా వ్యవహిరించడం సరికాదన్నారు.
దళితులపై వ్యతిరేక క్యాంపెయిన్ : కంచె ఐలయ్య
ప్రభుత్వాలు దళితులపై వ్యతిరేక క్యాంపెయిన్ చేసి.. లబ్ధి పొందాలనుకుంటున్నాయని సామాజికవేత్త కంచె ఐలయ్య అన్నారు. రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదని తెలిపారు. ఏపీలోని దళితులు సీరియస్ గా ఆలోచించాలని తెలిపారు. ఎక్కడికక్కడే దళితులను అణచివేస్తామంటే ఎలా కరెక్టు అవుతుందన్నారు.
రోహిత్ దళితుడు కాదనడం సరికాదు : బి.వెంకట్
రోహిత్ వేముల దళితుడు కాదని గుంటూరు కలెక్టర్ నిర్ధారణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గం సభ్యులు బి.వెంకట్ అన్నారు. ఇది ఒక వ్యక్తికి జరిగిన ఘటన కాదని.. సమాజానికి జరిగిన ఘటన అన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిపారు. రోహిత్ తల్లి రాధికమ్మ దళిత ..మాల కులానికి చెందిన మహిళ అని చెప్పారు. రోహిత్ గత 20 సం. లుగా తల్లి సంరక్షణలో పెరిగాడు. కుల నిర్ధారణ చేసేటప్పుడు గ్రామ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విషయంలో బిజెపి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కుట్రలో సీఎం కేసీఆర్, సీఎం చంద్రబాబు పాత్రదారులు అన్నారు. వీరిని దోషులుగా చేల్చాలని చెప్పారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దీన్ని ఉద్యమం లాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.
హెచ్ సీయూ విద్యార్థి సంజయ్...
రోహిత్ కేసులో కేంద్రమంత్రి, వీసీ అప్పారావు ముద్దాయిలుగా ఉన్నారు.. వారిపై ఎస్సీ, ఎస్టీ ఎఫ్ ఐఆర్ అయింది.
ఈ కేసు నుంచి వారిని తప్పించేందుకు రోహిత్ దళితుడు కాదని కమిటీ తేల్చిందని చెప్పారు. రోహిత్ కు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  
టీకాంగ్రెస్ నేత మల్లు రవి... 
ప్రభుత్వ కమిటీ వాస్తవ పరిస్థితులను బట్టి నిర్దారించలేదు. పై నుంచి ప్రభుత్వాలు ఆదేశించినట్లు కమిటీ నడుచుకుంది. వేరే కమిటీ చేత నిజ నిర్ధారణ చేయాలి. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - rohith vemula