rss

11:53 - February 14, 2018
10:35 - February 14, 2018

హైదరాబాద్ : ప్రేమ...రెండు మనుషులను ఏకం చేసి...ఒకే శ్వాసగా నిలిచేది..ప్రతి మనిషిని ప్రేమించగలగడం...ప్రతి జీవిలో ప్రేమను చూడడం..ఎంత ఉన్నతమోనని పలువురు పేర్కొంటుంటారు...కానీ ఆ ప్రేమ నేడు కుంచించుకపోతోంది..ప్రేమించకపోతే దాడులు...ప్రేమించడం లేదని హత్యలు...ఇద్దరూ ప్రేమించుకుంటే పెద్దల అడ్డంకులు...ప్రేమికుల దినోత్సవం ఇక్కడి సంప్రదాయం కాదని హెచ్చరికలు...ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 14 దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంటూ ఉంటోంది...

హైదరాబాద్ లోని ప్రముఖంగా పేరొందిన ఇందిరా పార్కు బుధవారం ఉదయం బోసిపోయింది. ఫిబ్రవరి 14..ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పోలీసులు మూసివేశారు. ఉదయం కేవలం మాకింగ్ వార్నింగ్ వారికే మాత్రమే అనుమతినిచ్చారు. ప్రేమికుల దినోత్సవం జరుపుకోవద్దని..ప్రేమికులు కనిపిస్తే వివాహాలు చేస్తామని భజరంగ్ దళ్, వీహెచ్ పీ నేతలు హెచ్చరికలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిపార్కుకు భజరంగ్ దళ్ కార్యకర్తలు వస్తారనే సమాచారంతో మఫ్టీలో పోలీసులు గస్తీని నిర్వహిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రేమికుల రోజున చట్టపరిధి దాటి ప్రవర్తిస్తే చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.

సంజీవయ్య పార్కులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. భజరంగ్ దళ్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని పలు పార్కులు బోసిపోయాయి. పలు పార్కులను మూసివేసిన పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రేమికుల దినోత్సవం ఇక్కడి సంస్కృతి కాదని పేర్కొంటూ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు భజరంగ్ దళ్ నేతలు ప్రయత్నాలు చేయనున్నట్లు తెలుస్తోంది. మరింత వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:54 - February 12, 2018

ఢిల్లీ : తాము తలుచుకొంటే కేవలం మూడు రోజుల్లో ఆర్మీని తయారు చేయగలమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ స్పందించారు. భగవత్ చేసిన వ్యాఖ్యలు భారత సైనికులను అవమానపరిచేవిగా ఉన్నాయని, దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులను..జాతీయ జెండాను అగౌరవపరిచాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు మోహన్ భగవత్ సిగ్గు పడాలని తెలిపారు. ఇదిలా ఉంటే భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్మీని..ఆర్ఎస్ఎస్ తో పోల్చలేదని..బీహార్ లోని ముజఫర్ నగర్ లో జరిగిన సమావేశంలో మోహన్ భగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ తమ జవాన్లను సిద్ధం చేసేందుకు ఆరు నెలలు పడితే అదే ఆర్ఎస్ఎస్ శిక్షణ ఇస్తే మూడు రోజుల్లో స్వయం సేవక్ తయారవుతారని వ్యాఖ్యానించారు. 

15:38 - January 27, 2018
18:15 - January 19, 2018

యాదాద్రి : పేదలకు కేసీఆర్‌ ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఆర్‌డీవో కార్యాలయం ఎదుట టీమాస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన పేదలకు నివాస గృహాలు, నివాస స్థలాలను ఇవ్వాలని పేదలు ధర్నాకు దిగారు. నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరారు. అనంతరం ఆర్‌డీవోకు మెమోరాండం అందజేశారు. హామీలను వెంటనే అమలు చేయాలని.. లేకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని టీమాస్‌ నేతలు కల్లూరి మల్లేష్‌, ఆనగంటి వెంకటేష్ హెచ్చరించారు.  

18:51 - January 18, 2018

యాదాద్రి : సంక్రాంతి పండగరోజు ఆవుమాంసం తిన్నారని దళితులపై జరిగిన దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలం చిన్నకందుకూరు గ్రామంలో చోటుచేసుకున్న ఈ దాడికి నిరసనగా టీమాస్‌ కన్వీనర్‌ జాన్‌ వెస్లీ ఆధ్వర్యంలో.. యాదగిరిగుట్టలో ధర్నా నిర్వహించారు. ఆర్ఎస్‌ఎస్‌ వాదులు గోరక్షక పేరుతో చేస్తున్న దాడులకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని ధర్నాలో పాల్గొన్న నాయకులు విమర్శించారు. దీనిపై పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు.

13:38 - January 16, 2018

ఢిల్లీ : వీహెచ్ పీ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను ఎన్ కౌంటర్ చేయాలని చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం తనను వేధిస్తోందని మీడియా సమావేశంలో వెల్లడించారు. సోమవారం నుండి అదృశ్యమైన తొగాడియా బుధవారం ఓ పార్కులో అపస్మారకస్థితిలో కనిపించారు. ప్రస్తుతం ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొగాడియా మాట్లాడారు....కేంద్రం తన గొంతును నొక్కాలని చూస్తోందని...గుజరాత్, రాజస్థాన్ పోలీసులు తనను వెంటాడుతున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, గుజరాత్ పోలీసులు అరెస్టు చేయాలని చూస్తున్నారని తెలిపారు. తన ఆరోగ్యం కుదుటపడగానే పోలీసుల ఎదుట లొంగిపోతానని తొగాడియా పేర్కొన్నారు. 

12:41 - December 25, 2017
11:12 - December 25, 2017

కరీంనగర్ : శాతవహన యూనివర్సిటీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యార్థి సంఘాలు దాడులకు దిగాయి. సోమవారం మనస్మృతిని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు దగ్ధం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ...ఆర్ఎస్ ఎస్ నేతలు వర్సిటీకి చేరుకున్నారు. దగ్ధం చేసిన సంఘాల నేతలపై దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాలు రాళ్లు విసురుకున్నారు. ఒక్కసారిగా పరిస్థితులు ఉద్రిక్తతంగా మారిపోయాయి. ఘర్షణలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. 

20:43 - December 1, 2017

ఆ రాష్ట్రాలే ఎందుకు దళితులపై దాడుల్లో ముందున్నాయి..? ఆ రాష్ట్రాలే ఎందుకు మహిళలపై దాడుల్లో ముందున్నాయి? ఏ దన్ను చూసుకుని చెలరేగిపోతున్నారు? ఏ అండతో ఈ దాడులు సాగిస్తున్నారు? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ జాబితా ఆలస్యంగా ఎందుకు రిలీజ్ అయింది? క్రూరంగా ఘోరంగా సాగుతున్న నేరాల తీరుపై ప్రత్యేక కథనం.. ఆలస్యంగా ఎందుకు విడుదల చేశారు? భయపడ్డారా? ఎన్నికల్లో ఈ చిట్టా ప్రభావితం చేస్తుందని వెనుకంజ వేశారా? దళితులపై మహిళలపై తమ రాష్ట్రాల్లో పెరుగుతున్న నేరాలను చెప్పుకోలేక వాయిదా వేశారా? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ జాబితా ఎందుకు ఆలస్యంగా విడుదలయింది? అందులో హైలైట్స్ ఏంటి?

బీజెపీ పాలిత రాష్ట్రాల్లో క్రైమ్ రేట్ పెరుగుతోందా? దళితులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయా? కేసుల సంఖ్య ఏం చెప్తోంది? కేంద్రం, రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని అండగా చేసుకుని కమలం కార్యకర్తలు చెలరేగిపోతున్నారా? ముఖ్యంగా నేరాలకు అడ్డాగా దేశంలో అతి పెద్ద రాష్ట్రం యూపీ నిలవడాన్ని ఎలా చూడాలి?

ఏపీ తెలంగాణలు పోటీపడుతున్నాయి..ఒకదానితో వెంట మరొకటి నేను ముందంటే నేను ముందని దూసుకెళ్తున్నాయి.. అభివృద్ధిలోకాదు.. క్రైమ్ రేట్ లో.. హత్యలు, కిడ్నాప్ లు, మహిళలపై దాడుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా ఉన్నాయి. ఇక దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రంగా మహారాష్ట్ర తన ఘనతను నిలబెట్టుకుంది

టీజర్ ఎన్ని చట్టాలున్నా, రాజ్యాంగ రక్షణలు ఘోషిస్తున్నా.. పరిస్థితిలో మార్పు కనిపించటంలేదు.. వివరాలు చిన్న బ్రేక్ తర్వాత..
మహిళల హక్కులను కాలరాస్తున్నారు..బాలలపై దాడులు అడ్డూ అదుపు లేకుండా జరుగుతున్నాయి. దళితులపై కులదురహంకారంతో విరుచుకుపడుతున్నారు.. ఎన్ని చట్టాలున్నా, రాజ్యాంగ రక్షణలు ఘోషిస్తున్నా.. పరిస్థితిలో మార్పు కనిపించటంలేదు.. 2017 క్రైమ్ రికార్డ్స్ ఈ అంశాలను స్పష్టంగా చెప్తోంది. పైగా ఈ నేరాల్లో నిందితులకు శిక్ష పడిన సందర్భాలూ తక్కువే..

నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ మన సమాజ పరిస్థితిని స్పష్టంగా చెప్తున్నాయి. ఏ వర్గాలను అణచివేస్తున్నారు. ఎవరిపై దాడులు చేస్తున్నారు. దానికి కారణాలేంటి? అనే అంశాలు ఈ గణాంకాలను గమనిస్తే తెలుస్తుంది. వివిధ రాష్ట్రాల్లో దళితులు, మహిళలపై పెరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్న అంశం. సత్వరం జాగ్రత్తపడి తగని చర్చలు తీసుకోవలసిన అవసరాన్ని ఈ గణాంకాలు చెప్తున్నాయి. పూర్తి విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - rss