rtc bus

13:44 - August 13, 2017
06:43 - August 12, 2017

హైదరాబాద్ : ఆర్టీసీకి అసలే అప్పుల కుప్పలు. ఆపై నష్టాల తిప్పలు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా ఇప్పుడు ఆర్టీసీ పై జీఎస్టీ పిడుగులు. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్సీఈకి పన్నుల భారం తడిసిమోపెడవుతోంది. ఆర్టీసీకి జీఎస్టీ ప్రభావంపై 10 టీవీ ప్రత్యేక కథనం. ప్రజా రవాణలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రగతి రథ చక్రం.. ఆర్టీసి ప్రభుత్వ విధానాలతో కుదేలేవుతోంది. సంస్థను పటిష్టం చేయాల్సిన సర్కారు... ప్రైవేటు మాదిరిగానే ఆర్టీసీపై పన్నుల భారం మోపుతోంది. దీంతో సంస్థ సంక్షోభంలో చిక్కుంది. తాజాగా కేంద్రం తీసుకువచ్చిన జిఎస్టీ ఆర్టీసికి శాపంగా పరిమణించింది. కోటి మందికి పైగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరుస్తున్న ఆర్టీసీకి ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించడంలేదు. ఆదాయ వ్యయాలకు మధ్య అగాథం రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ ఆర్టీసీకి మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతోంది.. జీఎస్టీ అమల్లోకి వచ్చి నలభై రోజులు గడిచినప్పటికీ ఆర్టీసిపై దాని ప్రభావం ఎలా ఉండబోతోందనే విషయంపై యాజమాన్యానికి స్పష్టత లేకపోయినా... ప్రజా రవాణ వ్యవస్థ విస్తరణకు జీఎస్‌టీ అవరోధంగా పరిమించే అవకాశం లేకపోతేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ వినియోగించే డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురాకపోవడంపై అభ్యంతం వ్యక్తమవుతోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా డీజిల్‌పై అమ్మకం పన్ను వసూలు చేస్తున్నారు. తెలంగాణలో డీజిల్‌పై 24.5 శాతం అమ్మకం పన్ను విధిస్తున్నారు. డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే కొంత మేలు జరిగే అవకాశం ఉందని పది వేలకు పైగా బస్సులు కలిగిన ఆర్టీసి కొత్త బస్ బాడీలు తయారు చేసేందుకు విడిభాగాలు, టైర్లు, ట్యూబ్‌లను పలు సంస్థల నుంచి కొనుగోలు చేస్తోంది. వీటిపై 18 నుండి 28 శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు. ఇంతకు ముందు అమల్లో ఉన్న వ్యాట్‌తో పోలిస్తే, జీఎస్‌టీ చాలా ఎక్కువ. బస్ బాడీ తయారీకి వ్యాట్‌ ఐదు శాతం ఉంటే, జీఎస్టీలో ఇది 28 శాతానికి చేరింది. ఇది సంస్థకు భారమే.

జీఎస్టీ చట్ట నిబంధనల్లో 10 అంతకంటే ఎక్కువ సీట్లు సామర్థ్యం కలిగిన వాహనాలకు 15 శాతం సెస్ విధించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి 28 శాతం కలిపితే మొత్తం 43 శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. ఇది సంస్థకు అదనపు భారమే. కొత్తగా కొనుగోలు చేయనున్న 1350 కొత్త బస్సుల కూడా జీఎస్‌టీ ప్రభావం పడుతుంది. మొత్తం మీదీ జీఎస్‌టీ ఆర్టీసీకి భారంగానే పరిణమించే అవకాశాలు ఉన్నాయి. 

10:38 - August 8, 2017

నల్లగొండ : జిల్లాలో ఒకే చోట రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నకిరేకల్‌ మండలం చందంపల్లి స్టేజీ వద్ద రోయ్యల లారీ బోల్తా పడింది. దీంతో విజయవాడ, హైదరాబాద్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. లారీని తొలగిస్తుండగా మరో ప్రమాదం చోటుచేసుకుంది. రొయ్యల లారీని ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో.. డ్రైవర్‌ సహా ఏడుగురు ప్రయాణీకులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

09:08 - July 16, 2017

కృష్ణా : జిల్లాలోని పెడన...గుడివాడ రోడ్డులో రోడ్డుప్రమాదం జరిగింది. పెడన పల్లోటి స్కూల్‌ వద్ద వాకర్స్‌పైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో.. ఒకరు మృతి చెందగా... ముగ్గురికి గాయాలయ్యాయి. గాయలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

06:57 - July 15, 2017

చెన్నై : తమిళనాడులోని తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు-లారీ డీకొనడంతో 8 మంది మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే... మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

 

20:49 - June 28, 2017

చిత్తూరు : జిల్లాలోని నగరిలో ఎమ్మెల్యే రోజా సందడి చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. అనంతరం టికెట్టు తీసుకుని కొద్ది దూరం బస్సులో ప్రయాణం చేశారు.

 

09:06 - June 20, 2017

సిద్దిపేట : సిద్ధిపేట జిల్లా, రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండపాక మండలం, తిమ్మారెడ్డి పల్లికి చెందిన గ్రామస్థులు డీసీఎంలో పెళ్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో.. వేములవాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో డీసీఎంలో ఉన్న పెళ్లి బృందంలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగతావారిని సిద్ధిపేట జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. 

10:31 - June 6, 2017

రంగారెడ్డి: జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు-కారు ఢీ కొన్న ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. ఘటనా స్థలాన్ని రవాణశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పరిశీలించారు. 

08:08 - May 22, 2017

నెల్లూరు : అతివేగం..నిర్లక్ష్యంగా నడపడం..తదితర కారణాలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పది మందికి గాయాలయ్యాయి. తిరుపతి నుండి కావలికి ఓ ఆర్టీసీ బస్సు వెళుతోంది. నాయుడుపేట వద్ద ఎదురుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయాడు. ఎదురుగా ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు రావడంతో ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీనితో బస్సులో ఉన్న 20 మందిలో పది మందికి గాయాలయ్యాయి. వీరిని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అతివేగంగా నడపడమే కాకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపాడని ప్రయాణీకులు పేర్కొంటున్నారు.

07:58 - April 21, 2017

హైదరాబాద్ : ఆర్టీసీలో పొదుపు చర్యలు కార్మికుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. కార్యకలాపాల పరంగా వేర్వేరుగా ఉన్నా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ పీఎఫ్‌ ట్రస్టు అధికారికంగా ఇంకా విడిపోలేదు. కార్మికులు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఎఫ్ డబ్బులకు మంగళం పాడే ప్రణాళికలు తయారు చేస్తున్నారు ఏపిఎస్‌ఆర్టీసి అధికారులు. తాజాగా అధికారులు తయారు చేసిన ప్రతిపాదనల్లో పదిహేను వేల వరకు పెన్షనబుల్‌ వేతనం ఉన్న కార్మికులు, ఉద్యోగులకు మాత్రమే సంస్థ పీఎఫ్ జమచేస్తుంది. బేసిక్ పే, డీఏ కలిపి 15 వేలు దాటితే తన వాటా పీఎఫ్‌ని చెల్లించే బాధ్యత నుంచి వైదొలగాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. గతంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు కార్మిక సంఘాల నుండి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. తాజాగా విజయవాడలో జరిగిన ఆర్టీసి పీఎఫ్‌ బోర్డు సమావేశానికి తెలంగాణ ఆర్టీసి యాజమాన్యం ఓ లేఖ రాసిందనే వార్తలు గుప్పుమంటున్నాయి.
పూర్తికాని ఆర్టీసీ విభజన...
ఆర్టీసీలో సొంతంగా పీఎఫ్ ఖాతా నిర్వహించుకుంటున్నారు. లక్ష మంది, అంతకు మించి కార్మికులు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే, సొంతంగా ఆ సంస్థ పీఎఫ్ ఖాతా నిర్వహించుకునేందుకు గతంలో కేంద్రం అనుమతినిచ్చింది. దీంతో ఏపీఎస్‌ఆర్టీసీ పీఎఫ్ ట్రస్ట్ పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఆర్టీసీ విభజన పూర్తికాకపోవడంతో రెండు రాష్ట్రాల ఆర్టీసీ కార్మికులకు ఇదే ట్రస్టు సేవలందిస్తోంది. ఇందులో యాజమాన్యం, కార్మిక సంఘాల నుండి ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. పిఎఫ్ కోత విధించడం వల్ల రెండు రాష్ట్రాల్లోని ఆర్టీసిలకు ఆరువందల కోట్లకు పైగా ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కార్మిక సంఘాలు మాత్రం ఈ నిర్ణయం పట్ల తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. పీఎఫ్ బాధ్యత నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ఆర్టీసీ యాజమాన్యం ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి

Pages

Don't Miss

Subscribe to RSS - rtc bus