Sahoo

09:23 - August 11, 2017

'బాహుబలి', 'బాహుబలి-2' చిత్రంతో జాతీయస్థాయిలో పేరొందిన నటుడు 'ప్రభాస్' తాజా చిత్రంతో బిజీ బిజీగా మారిపోయాడు. దాదాపు కొన్ని సంవత్సరాల వరకు ఒక్క సినిమాకే పని చేసిన ఆయన మరో చిత్రంలో నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

సుజీత్ సింగ్ దర్శకత్వంలో 'సాహో' సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ మొదలు కాకుండానే టీజర్ ను ముందుగా రిలీజ్ చేసి ఆసక్తిని రేకేత్తించారు. చాలా ఏళ్ల తర్వాత 'ప్రభాస్‌' తెర మీద మోడరన్‌ గెటప్‌తో కనిపించనుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈసినిమా వివరాలు మాత్రం ఏ మాత్రం బయటకు పొక్కడం లేదు. తాజాగా సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్న మది తమిళ మీడియాతో మాట్లాడినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు 7 రోజుల షూటింగ్‌ ముగిసిందని ఇంకా 180 రోజుల పాటు షూటింగ్‌ జరగాల్సి ఉందని అన్నారు. హీరోయిన్‌ ఎవరనేది దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. రానున్న రోజుల్లో వివరాలు తెలిసే అవకాశాలున్నాయి. 

10:19 - August 2, 2017

'భళీ..భళీ రా...భళీ..సాహోరో బాహుబలి' అనిపించుకున్న టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తన తాజా చిత్రం 'సాహో'పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. యాక్షన్ చిత్రమా..సైన్స్ ఫిక్షన్..సోషియో ఫాంటసీ నేపథ్యంలో చిత్రం ఉంటుందా అని సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. కానీ ఈ సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రం తెలియరావడం లేదు. 'సాహో' చిత్రాన్ని మాత్రం హాలీవుడ్ రేంజ్ కు తగ్గట్టు రూపొందించనున్నారని టాక్.

'బాహుబలి'..'బాహుబలి-2' సినిమాల అనంతరం సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రంలో నటించేందుకు 'ప్రభాస్' అంగీకరించారు. 'రన్ రాజా రన్' చిత్రం అనంతరం సుజీత్ చేస్తున్న సినిమా ఇదే. చిత్ర షూటింగ్ కంటే ముందుగానే చిత్రా టీజర్ విడుదల చేయడం గమనార్హం. చిత్ర హీరోయిన్స్..విలన్స్..ఇతరత్రా పాత్రలు ఎవరు పోషిస్తున్నారనే దానిపై క్లారిటీ రావడం లేదు. దాదాపు రూ. 150 కోట్లతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

'సాహో' పక్కా యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ గా సినిమా ఉంటుందని..హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని 'ప్రభాస్' పేర్కొన్నట్లు తెలుస్తోంది. సాహో కోసం బరువు తగ్గిపోయి స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. ఇటీవలే 'ప్రభాస్' కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ దుబాయిలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ప్రభాస్' కు విలన్ గా బాలీవుడ్ నటుడు 'నీల్ నితిన్ ముఖేష్' నటించనున్నట్లు తెలుస్తోంది. మరి 'ప్రభాస్' ఎలా మురిపిస్తాడో వెయిట్ అండ్ సీ...

13:59 - July 18, 2017

ప్రభాస్..’బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటుడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుతో పాటు భారీ కలెక్షన్లు కొల్లగొట్టాయి. ఈసినిమాలో కండలతో భారీకాయంతో..’ప్రభాస్' నటించాడు. ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ తో పాటు లేడీస్ ఫాలోయింగ్ కూడా అధికంగానే ఉంది.
ప్రస్తుతం 'ప్రభాస్' సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన విశేషాలు మాత్రం బయటకు రావడం లేదు. హీరోయిన్..విలన్ ఎవరనే దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా న్యూ యంగ్ లుక్ లో కనిపిస్తున్న ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ లుక్ 'సాహో' చిత్రంలోనేదా ? లేక మాములుదేనా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ ఫొటోలో 'ప్రభాస్' కిందుకు చూస్తూ ఒకింత సిగ్గు పడుతూ చిరు నవ్వు చిందిస్తూ ఉన్న ఫొటో అభిమానులను అలరిస్తోంది. ఆరెంజ్‌ కలర్‌ రౌండ్‌నెక్‌ టీ షర్ట్‌ ధరించి.. దానిపై మెడ చుట్టూ చెక్‌ షర్ట్‌ వేసుకొని ఉన్న ఈ ఫొటో ఇప్పటికే అభిమానులు తెగ ఆకట్టుకుంటోంది.

11:21 - June 4, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' 'బాహుబలి'..'బాహుబలి-2’ చిత్రాల కోసం ఏకంగా ఐదు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. అనంతరం తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. తొలుత సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమా టీజర్ మొదట్లోనే విడుదలై ప్రేక్షకుల అంచనాలు రెట్టింపు చేసింది. ‘బాహుబలి2’ విడుదలైన అనంతరం 'ప్రభాస్' విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇటీవలే భారత్ కు వచ్చిన 'ప్రభాస్' కేశాలంకరణ నిపుణుడు 'ఆలీమ్ హకీమ్' ను 'ప్రభాస్' కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోను ఆలీమ్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఈ ఫొటోలో 'ప్రభాస్' బరువు తగ్గినట్లు..స్లిమ్ గా కనిపించాడు. ‘సాహో' చిత్రం కోసం ఇలా సిద్ధమౌతున్నాడని తెలుస్తోంది. 'సాహో' చిత్రానికి సంబంధించిన హీరోయిన్స్..విలన్ ల ఎంపిక చేయాల్సి ఉంది. యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో తెలుగు..తమిళ..హిందీ భాషల్లో ఈ చిత్రా నిర్మిస్తోంది.

09:04 - June 3, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తదుపరి చిత్రాలపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. కొన్ని సంవత్సరాల వరకు 'బాహుబలి'..’బాహుబలి-2’ చిత్రాల వరకు మాత్రమే 'ప్రభాస్' పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంగతి తెలిసిందే. తాజాగా సుజీత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో 'ప్రభాస్' నటిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన టీజర్ ను షూటింగ్ కంటే ముందుగానే రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇంకా కథానాయికగా కూడా ఫైనల్ కాలేదు. ప్రతి నాయక పాత్రలో బాలీవుడ్ నటుడు 'నీల్ నితిన్ ముఖేష్' నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. మురుగదాస్ చిత్రం 'కత్తి'లో విలన్ గా ఇతను నటించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా సల్మాన్ ఖాన్ 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రంలో కూడా 'నీల్ నితిన్ ముఖేష్' విలన్ గా కనిపించి మెప్పించాడు. మరి హీరోయిన్ ఎవరు ? విలన్ ఎవరు ? తదితర వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి.

 

13:31 - May 23, 2017

టాలీవుడ్ రెబల్ స్టార్ 'ప్రభాస్' తాజా చిత్రంపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. 'బాహుబలి', 'బాహుబలి -2' చిత్రాల కోసం సంవత్సరాల తరబడి ప్రభాస్ కష్టపడి నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్యలో ఎలాంటి చిత్రాలకు ప్రభాస్ సంతకం చేయలేదు. బాహుబలి 2 చిత్రం అనంతరం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'సాహో' చిత్రానికి సంతకం చేశాడు. బాహుబలి..బాహుబలి 2 చిత్రాలు తెలుగు..తమిళ..హిందీ భాషల్లో రిలీజ్ చేశారు. ఆయా భాషల్లో డబ్బింగ్ చెప్పారు. కానీ 'సాహో' చిత్రాన్ని తెలుగు..హిందీ భాషల్లో తెరకెక్కించాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోందంట. ఇందుకోసం డార్లింగ్ ప్రభాస్ హిందీలో డైలాగులు ప్రాక్టిస్ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ప్రభాస్ సరసన నటించబోతున్న హీరోయిన్ ఎవరు అన్నది తేలలేదు. 

10:22 - May 7, 2017

‘బాహుబలి'..’బాహుబలి-2’ సినిమాలు ఘన విజయం సాధించడంతో నటుడు 'ప్రభాస్' క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ చిత్రాలకు సంవత్సరాల టైం కేటాయించిన 'ప్రభాస్' ప్రస్తుతం తన న్యూ మూవీపై నజర్ పెట్టాడు. సుజీత్ దర్శకత్వంలో 'సాహో' చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రంలో ఎవరు నటిస్తారనే విషయం ఇంతవరకు తెలియడం లేదు. డార్లింగ్ పక్కన ఎవరు హీరోయిన్ గా నటిస్తారు ? ఎవరు విలన్ గా నటిస్తారు ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. కానీ 'తమన్నా' పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'ప్రభాస్' సరసన పలు మూవీల్లో 'తమన్నా' నటించిన సంగతి తెలిసిందే. ఇక విలన్ గా 'అరవింద్ స్వామి' అయితేనే సరిగ్గా సరిపోతాడని చిత్ర యూనిట్ భావిస్తోందంట. తెలుగు..తమిళ..హిందీ భాషల్లో చిత్రం తెరకెక్కుతోంది కాబట్టి అతను విలన్ అయితే బాగుంటుందని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 'అరవింద్' విలన్ గా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. చిత్రం గురించి పలు వార్తలు త్వరలోనే తెలియనున్నాయి.

Don't Miss

Subscribe to RSS - Sahoo