sai dharam tej

18:41 - February 24, 2017

టుడే అవర్ రీసెంట్ రిలీజ్  "విన్నర్ ’'. 'సాయి ధరమ్ తేజ్'  హీరోగా నటించిన ‘విన్నర్ ’ సినిమా ఇవాళ్టి మన నేడే విడుదల రివ్యూ టైం లో ఉంది. 'పిల్ల నీవు లేని జీవితం' సినిమాతో తన ఫిలిం కెరీర్ ని స్టార్ట్ చేసిన మెగా ఫామిలీ హీరో 'సాయి ధరమ్ తేజ్'.  యాక్షన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ తో 'విన్నర్' గా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మెగా ఫామిలీలో చాల స్పీడ్ గా సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తూ మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ కి దగ్గరైన హీరో 'సాయి ధరమ్ తేజ్'. 'విన్నర్' సినిమాలో తన ప్రేమను గెలిపించుకునే ప్రేమికుడిగా యాక్ట్ చేసాడు.

డైరెక్టర్ గోపిచంద్..
యాక్షన్ లో లవ్ మిక్స్ చేసి మాస్ ని అట్రాక్ట్ చెయ్యగల డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇతని  డైరెక్షన్ లో వచ్చిన విన్నర్ వరల్డ్ వైడ్ గా ఇవాళ  రిలీజ్ అయింది. ఎనర్జిటిక్ హీరో సాయిధరమ్ తేజ్, బ్యూటీ టాలెంటెడ్ రకుల్ ప్రీత్ సింగ్, ట్రెండీ విలన్ జగపతిబాబు   నటించిన ఈ సినిమాకి నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు నిర్మాతలు. ఈ సినిమా కి  థమన్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళింది. ఒక క్యూట్ లవ్ స్టోరీకి హార్స్ రేస్ ని కనెక్ట్ చేసి ఆడియన్స్ని కట్టిపడేసే ప్రయత్నం చేసాడు డైరెక్టర్.

మంచి రెస్పాన్స్..
ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ లోనే పవర్ఫుల్ డైలాగ్స్ ని చూపించిన 'సాయి ధరమ్ తేజ్' మంచి మాస్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 'రకుల్ ప్రీత్ సింగ్' అథ్లెట్ గా నటించిన ఈ సినిమాలో స్క్రీన్ మీద గ్లామర్ ని స్ప్రెడ్ చేసింది. ఈ సినిమాలో జగపతిబాబుతో పాటు అనూప్ ఠాకూర్ మరో విలన్ గా నటించారు. మరి ఈ ‘విన్నర్ ’ సినిమా తెలుగు ఆడియన్స్ ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసింది ? ఎంత వరకు రీచింగ్ అయ్యింది ? టెన్ టివి రేటింగ్ ఎంతో వీడియో క్లిక్ చేయండి.

11:44 - September 12, 2016

అనతికాలంలో టాలీవుడ్‌లో బిజీ అయిపోయిన హీరోయిన్ రకుల్ క్రీడాకారిణి (స్ర్పింటర్)గా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. మహేష్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇలా అందరి హీరోలతో వెండితెరపై కనిపించింది. ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్‌లో మహేష్‌బాబుతో ఓ సినిమా చేస్తున్న ఈఅమ్మడు... గోపీచంద్ మలినేని- సాయిధరమ్ తేజ్ కాంబోకి ఈ బ్యూటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసిందనే టాక్ వినపడుతోంది. ఇందులో తాజా ప్రాజెక్టులో ఇంతవరకు చేయని కొత్త రోల్‌లో కనిపిస్తానని, ఈ మూవీ కోసం తనకు ఇష్టమైన ఫుడ్‌కి దూరమవుతున్నానంటూ మనసులోని మాటను బయటపెట్టింది. 

19:40 - August 18, 2016

'రకూల్ ప్రీత్ సింగ్' కూడా మెగా హీరోయిన్ అయిపోవాలని భావిస్తోంది. ఇప్పటికే ఇద్దరు మెగా కాంపౌండ్ హీరోలతో ఆడిపాడిన ఈ బ్యూటీ లేటేస్ట్ గా మరో మెగా హీరోతో జోడి కట్టుతోంది. మరి రకూల్ ఏ మెగా హీరోతో జోడి కట్టుబోతోందో చదవండి.. ఇండస్ట్రీలో ప్రస్తుతం 'రకూల్ ప్రీత్ సింగ్' హవా నడుస్తోంది. ఈ బ్యూటీ ఖాతాలో హిట్స్ తక్కేవే అయిన కొత్త ఛాన్స్ లకు మాత్రం కొదవ లేదు. గత ఎడాది వరుస ప్లాప్స్ తో సతమతమైన ఈ బ్యూటీకి సరైన టైంలో 'సరైనోడు' మూవీ మంచి హిట్టు ఇచ్చింది. ఈ సక్సెస్ తో 'రకూల్' హవా కంటిన్యూ అవుతోంది. 

గోపిచంద్ తో కూడా...
ఇప్పటికే మెగా హీరోలైన రామ్ చరణ్, అల్లుఅర్జున్ లతో నటించేసింది. ఇప్పుడు మరో మెగా హీరో 'సాయి ధరమ్ తేజ్' తో కూడా ఈ బ్యూటీ జోడి కట్టేందుకు రెడీ అయింది. 'గోపీచంద్ మలినేని' దర్శకత్వంలో 'సాయి ధరమ్ తేజ్' హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. ఈ నెల 26 సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో హీరోయిన్ గా 'రకుల్' ను ఫైనల్ చేశారట. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో 'మహేష్ బాబు' నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే 'ధృవ' సినిమా కోసం 'రామ్ చరణ్' తో రెండోసారి జోడి కడుతోంది. ఈ రెండు చిత్రాలే కాకుండా యంగ్ హీరో 'రామ్' తో పాటు 'గోపీచంద్' కూడా ఈ బ్యూటీ మరో మూవీలో నటించనుందట. 

20:45 - August 13, 2016

మెగా మేనల్లుడు సాయిధర్మ్ తేజ హీరోగా , మన్నారా చోప్రా, లారిస్సాబొనోసీ హీరోయిన్స్ గా సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టరైన సునీల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లవ్ అండ్ యాక్షన్ మూవీ తిక్క. ఈ సినిమా ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమాతో సుప్రీమ్ స్టార్ సాయిధర్మ్ తేజ మరో హిట్టు కొడతాడా లేడా? ఇంతకీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబడుతుందా లేదా? ఈ రివ్యూలో చూద్దాం.

16:06 - August 11, 2016

అనుకున్నాట్లుగానే మెగా నందమూరి మల్టీస్టార్ పట్టాలెక్కబోతోంది. ఎవరూ ఊహించని ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుండడంతో ఇటు రెండు ఫ్యామిలీస్ చెందిన ఫ్యాన్స్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రం కోసం చూస్తున్నారు. మెగా నందమూరి మల్టీస్టార్ మూవీలో నటిస్తున్న ఆ హీరోలెవరో తెలుసుకోవాలంటే చదవండి.

నిర్మాతగా కళ్యాణ్ రామ్...
మెగా నందమూరి హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు ఇదే నిజమవుతోంది. కలలో కూడా ఊహించని మెగా నందమూరి మల్టీస్టార్ చిత్రం త్వరలో పట్టాలెక్కబోతోంది. కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రం ఓ కొలిక్కివచ్చినట్లు వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తుండడం మరో విశేషం. కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ ల మల్టీస్టార్ మూవీని ఎ.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయనున్నాడు. ఈ కాంబినేషన్‌ని సెట్ చేసింది కల్యాణ్ రామేనని సమాచారం. డైరెక్టర్ రవికుమార్ ఇటీవల కళ్యాణ్ రామ్‌కి ఓ స్టోరీ చెప్పాడట. కథ బాగా నచ్చడంతో కళ్యాణ్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అంతే కాదు స్టోరీలో వున్న మాస్ రోల్‌కి సాయి ధరమ్ కరెక్ట్‌గా సరిపోతాడని సజెస్ట్ కూడా చేశాడని. దీంతో దర్శకుడు రీసెంట్‌గా తేజుకి సైతం ఈ విషయం చెప్పడం ఒకే అంటూ సిగ్నల్ ఇచ్చాడట. పిల్లా నువ్వులేని జీవితం సినిమాకు సాయిధరమ్ కి ఈ దర్శకుడు తొలి హిట్టు ఇచ్చిన విషయం తెలిసిందే.

డిసెంబర్ లో సెట్స్ పైకి...
కళ్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ ఇద్దరు పచ్చజెండా ఊపెయ్యడంతో డైరెక్టర్ రవికుమార్ పూర్తి స్క్రిప్ట్ ని రెడీ చేసే పనిలో పడ్డాడట. ఇక ఈ మూవీని కె.ఎస్.రామారావు నిర్మించనున్నారని టాక్. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిచనున్నట్లు వినికిడి. డిసెంబర్‌లోగా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. చిత్రంపై ఇప్పటి నుంచే నందమూరి, మెగా అభిమానులు ఆసక్తిగా చర్చించుకోవడం విశేషం.

09:58 - August 11, 2016

టాలీవుడ్ లో మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ టెన్షన్ పడుతున్నాడంట. ఆయన నటించిన చిత్రం 'తిక్క' విడుదలకు సిద్ధంగా ఉంది. సాయిధరమ్‌ తేజ్‌, మన్నారా చోప్రా, లారిస్సా బోన్సీ హీరో హీరోయిన్లుగా సునీల్‌రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. చిత్రం విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది తేజూ ఆందోళనలో ఉన్నాడని టాక్. ఆయన గతంలో నటించిన చిత్రాలు విజయవంతమైన సంగతి తెలిసిందే. 'తిక్క' మూవీతో హాట్రిక్ హీరో అనిపించుకోవాలని తేజూ తహతహలాడుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'సుబ్రమణ్యం ఫర్ సేల్' విజయాన్ని నమోదు చేసుకుంది. రూ. 20 కోట్లు కలెక్షన్ రాబట్టి తేజూ తన సత్తాని చాటాడు. మరో చిత్రం 'సుప్రీం' యావరేజ్ గా నిలిచింది. కానీ కలెక్షన్ల పరంగా అదరగొట్టింది. రూ. 22 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అనంతరం 'తిక్క' విడుదల కానుంది. ఈనెల 13న విడుదల ఈ చిత్రం విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా 'తిక్క' రూపొందిందని తెలుస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా తేజూ నటించాడని సమాచారం. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందనే వచ్చింది. ఫ్లాప్‌ డైరెక్టరైన తనను నమ్మి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన తేజు, రోహిణ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు నిర్మాత పేర్కొన్నారు. ఇదొక మంచి రొమాంటిక్‌ లవ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని ఫస్టాఫ్‌లో థమన్‌ సంగీతం, ఇంటర్వెల్‌ ట్విస్ట్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని తెలిపారు. మరి తేజూ హ్యాట్రిక్ హీరో అనిపించుకుంటాడా ? లేదా ? అనేది చిత్రం విడుదల అనంతరం తెలుస్తుంది.

14:50 - July 6, 2016

టాలీవుడ్ లో నిన్న మొన్నటి వరకూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా రవితేజని పిలుచుకొనేవారు. ఆ తర్వాత అల్లరినరేష్ ను కూడా అలాగే పిలిచేవారు. అయితే ఈ ఇద్దరు హీరోలను వరుస ప్లాపులు పలకరించడం వల్ల పరిస్థితి ఆ తరువాత ఏమాత్రం బాగుండకపోవడంతో... వీళ్ళ స్థానాన్ని మరికొంతమంది హీరోలు ఆక్రమించేసారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అలా పిలిపించుకొనే యువ హీరోలు వచ్చేశారు. టాలీవుడ్ లో సాయిధర్మ్ తేజ ఇప్పుడు మినిమమ్ గ్యారెంటీ హీరోల్లో ఒకడు. మెగా ఫ్యామిలీనుంచి వచ్చినా, ఇంకా స్టార్ స్టాటస్ తెచ్చుకోకుండానే వరస హిట్స్ సాధిస్తున్నాడు. ఇంకో రెండు సినిమాలు ఇలాగే పడితే.. మనోడు టాలీవుడ్ లో స్టార్ అయిపోవడం ఖాయం. నిన్న మొన్నటి దాకా మెగా ఫ్యామిలీలో అందరూ స్టార్ హీరోలే ఉండే వారు. భారీ బడ్జెట్ చిత్రాలు, హై రెమ్యునరేషన్లు, అయితే సూపర్ హిట్లు లేకుంటే లాసులు ఇలా ఉండేది పరిస్థితి. చిన్నా చితకా నిర్మాతలెవరూ మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టేవారు కాదు. మెగా ఫ్యామిలీతో సినిమా చేయాలని ఉన్నా చేతిలో అంత బడ్జెట్ లేక ఆగిపోయేవారు.

చేసేద్దాం అంటున్న తేజ్..
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్న నిర్మాతల కోసం నేనున్నానంటూ మెగా హీరో 'సాయి థరమ్ తేజ్' ముందుకొస్తున్నాడు. ఫుల్ ఎనర్జీ, మంచి ప్రతిభ ఉన్న ఈ హీరో కథ నచ్చితే రెమ్యునరేషన్ కాస్త అటు ఇటుగా ఉన్నా పర్లేదు చేసేద్దాం అంటూ నిర్మాతలకు వరాలిస్తున్నాడు. మొదటి సినిమాగా చేసిన రేయ్ చిత్రాన్ని మినహాయించుకుంటే సాయిధరమ్ తేజ చేసిన పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాలు ఓ మోస్తరు విజయాలు సాధించినా, తరువాత వచ్చిన సుప్రీమ్ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ జనానికి గట్టి షాకిచ్చింది. ఇప్పుడు ఈ హీరోతో సినిమా చేస్తే మినిమమ్ గ్యారెంటీ అని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. ఈ హీరోతో ఇప్పుడు 10కోట్లతో సినిమాతీస్తే ఎంత లేదన్నా ఓ ఇరవై, పాతికోట్ల వరకూ లాభాల్ని తెచ్చుకోవచ్చని నమ్మకం కలుగుతోంది నిర్మాతలకు. అందుకే దిల్ రాజు లాంటి నిర్మాత సాయిధర్మ్ తేజను అసలు వదలడంలేదు. ఇతడితో కంటిన్యూస్ గా సినిమాలు తీస్తున్నాడు.

తిక్క సినిమాకు మంచి హైప్...
ప్రస్తుతం సాయిధర్మతేజ చేస్తున్న తిక్క, జవాన్ సినిమాలు అదే బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే తిక్క సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా కూడా మెగాభిమానుల్ని బాగా అలరిస్తుందని అంచనా వేస్తున్నారు. ఛాయాగ్రహకుడైన సునీల్ రెడ్డి సాయిధర్మతేజ తిక్కను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసి మాస్ జానానికి మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడు. ఇక గోపిచంద్ మలినేని చేయబోతున్న జవాన్ సినిమా కూడా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. ఇక తరువాత చేయబోయే సినిమాల్ని కూడా ఓ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ పోతున్నాడు సాయి ధర్మతేజ.

17:35 - May 15, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన సాయిధరమ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన 'సుప్రీమ్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాల్లోని పాటలు 'సాయి ధరమ్ తేజ' చిత్రాల్లో రీమెక్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కూడా 'అందం..హిందోలం' అనే పాటను రీమెక్స్ చేశారు. కానీ భవిష్యత్ లో తాను నటించే చిత్రాల్లో చిరంజీవి పాటలు ఉండవని తేల్చిచెప్పారు. టెన్ టివితో 'సుప్రీమ్' చిత్ర యూనిట్ ముచ్చటించింది. హీరో సాయి ధరమ్ తేజ, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను సినీ విశేషాలను వెల్లడించారు. రీమెక్స్ పాటలు చేస్తూ పోతుంటే గలీజుగా ఉంటుందని సాయి ధరమ్ తేజ వ్యాఖ్యానించారు. 

17:20 - May 15, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన హీరో 'సాయి ధరమ్ తేజ'. ఆయన నటించిన 'సుప్రీమ్' మంచి విజయం నమోదు చేసుకుంది. పటాస్ తరువాత మరో సక్సెస్ ఫుల్ చిత్రాన్ని అనీల్ రాపూడి తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను టెన్ టివికి 'సుప్రీమ్' చిత్ర యూనిట్ తెలియచేసింది. హీరో సాయి ధరమ్ తేజ, ప్రభాస్ శ్రీను, శ్రీనివాస్ రెడ్డి విశేషాలను తెలియచేశారు. వారు ఎలాంటి విశేషాలు..ఎలా సందడి చేశారో వీడియో క్లిక్ చేయండి. 

17:18 - May 15, 2016

'మెగా' కుటుంబం నుండి వచ్చిన వారికి ఎలాంటి గర్వం ఉండదని నటుడు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. టెన్ టివితో 'సుప్రీమ్' టీంతో ముచ్చటించింది. హీరో సాయి ధరమ్ తేజ, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాస్ శ్రీను విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..కొంతమంది హీరోలతో డిస్టెన్స్ మెంటెన్ చేయాల్సి వస్తుందని తెలిపారు. సాయి ధరమ్ తేజ్ మొదటి రోజు నుండే ఫ్రెండ్లీగా మెలుగుతాడని, నేర్చుకుంటాననే ఫీలింగ్ లో ఉంటాడని పృధ్వీ పేర్కొన్నారు. తాను సెట్ లో ఉండే సమయంలో ఫ్లెండ్లీగా ఉండటానికే మొగ్గు చూపుతానని, సీరియస్ గా ఉండటానికి ఇష్టపడనని హీరో సాయి ధరమ్ తేజ పేర్కొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - sai dharam tej