sajid
హైదరాబాద్ : ముంబాయి చెందిన సాజిద్ 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చి పనిచేసుకునేవాడు..ఈ క్రమంలోనే ఇక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిన సాజిద్ ఆ తర్వాత మోసాలు చేయడం మొదలుపెట్టాడు... 2004లో నకిలీ వీసాలు ...పన్నెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో నకిలీ వీసాలు సృష్టించి తాను దుబాయి చెందినవాడిగా పరిచయం చేసుకుని వీసాలు ఇస్తూ మోసాలకు పాల్పడ్డాడు...సాజిద్ చీటింగ్ బయటపడ్డంతో అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు....
2012లో మరో కొత్త వేషం..
ఇక సాజిద్ మరో వేషం కట్టాడు...తనకు తంత్రాలు వస్తాయని నమ్మించి బ్లాక్ మేజిక్ పేరుతో ఇంట్లో శని ఉందని... సైతాన్ ను పంపిస్తానంటూ మోసాలు చేయడం మొదలుపెట్టాడు..మూఢనమ్మకాల్లో ఉన్నవారిని మరింతగా భయపెట్టి దండుకునేవాడు..ఇలా సాజిద్ వేషం ఎన్నో రోజులు లేదు... అప్పట్లోనే టప్పాచబుత్ర, రాజేంద్రనగర్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు...
సరికొత్త ఆలోచనలతో బయటకు...
రెండు,మూడు సార్లు జైలుకు వెళ్లొచ్చిన సాజిద్ బయటకు వచ్చిన ప్రతీ సారి కొత్త ఆలోచనతో వస్తున్నాడు..ఈసారి ఏకంగా వైద్యులను టార్గెట్ చేసుకున్నాడు..తనకు తాను నాందేడ్ చెందిన సబ్ఇన్స్పెక్టర్ నంటూ ఫోన్ చేసి మీ వైద్యం వల్ల ఓ మనిషి చనిపోయాడంటూ టార్గెట్ చేసిన డాక్టర్‌కు ఫోన్ చేసి సెటిల్ చేస్తాడు...అకౌంట్ నంబర్ చెప్పి డబ్బులు జమ చేయించుకుంటాడు...సాజిద్ ఎలా మోసం చేస్తాడో పోలీసుల సమక్షంలోనే జరిగింది....ఇలా ఎందరో వైద్యులను నమ్మించి మోసం చేసిన సాజిద్‌పై వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి పట్టుకున్నారు...ఫోన్లలోనే మాట్లాడుతూ రకరకాలుగా మోసాలు చేసే సాజిద్ లాంటివారెందరో ఉన్నారు..తస్మాత్ జాగ్రత్తా...
Don't Miss
