samantha

10:58 - August 16, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగ చైతన్య' జోరు పెంచేస్తున్నాడు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకెళుతున్నాడు. ఆయన నటించిన 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా విజయవంతం కావడంతో ఏ దర్శకుడి సినిమాలో నటిస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారి దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్న 'యుద్ధం శరణం గచ్చామి' చిత్రంలో చైతూ నటిస్తున్నాడు. 'లావణ్య త్రిపాఠి' హీరోయిన్ గా సీనియర్ నటి 'రేవతి' కీలక పాత్రలో శ్రీకాంత్ ప్ర‌తినాయ‌క పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాలో 'నాగ చైతన్య' నటించబోతున్నాడు. దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'ప్రేమమ్' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి 'సవ్యసాచి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. చిత్ర టైటిల్ లోగోను రిలీజ్ చేశారు. రెండు బలమైన చేతులు పదునైన ఆయుధాలను ధరించివున్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. రెండు చేతులతో బాణాలు సమర్ధవంతంగా వేసే అర్జునుడిని.. 'సవ్వసాచి' అని పిలుస్తారు. చీకట్లో సైతం గురితప్పక బాణాన్ని సంధించే ఆయనకి 'సవ్యసాచి' అనే బిరుదు ఉంది. ఈ సినిమాలో కూడా ఏదో డిఫరెంట్ పాయింట్ డీల్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదేదో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అని టాక్. 

19:02 - August 4, 2017

మహిళల వార్తల సమాహారం..మానవి న్యూస్.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, దుబాయ్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఫెస్టివల్ మహిళల రొమ్ము క్యాన్సర్...త్వరలో ఖాకీ డ్రస్ వేసుకోనున్న హర్మన్ ప్రీత్ కౌర్ వంటి పలు మహిళల వార్తలపై ఇవాళ్టి మానవి న్యూస్... పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం..

10:55 - August 1, 2017

'మనం బతకాలంటే వాడికి ఎదురెళ్లాలి..ఇది ధైర్యం కాదు..తెగింపు'..అంటూ అక్కినేని నాగ చైతన్య గళం వినిపిస్తున్నాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'యుద్ధం శరణం గచ్చామి' టీజర్ విడుదలైంది. మాస్ పాత్రలో నటిస్తున్న 'నాగ చైతన్య' ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఆయన నటించిన 'ప్రేమమ్', 'రారండోయ్ వేడుక చూద్దాం' విజయాలతో చైతూ దూసుకెళుతున్నాడు.

వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారి దర్శకత్వంలో రజని కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో 'చైతూ' సరసన 'లావణ్య త్రిపాఠి' హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటి 'రేవతి' కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ ప్ర‌తినాయ‌క పాత్ర పోషించాడు. 'యుద్ధం శరణం గచ్చామి' టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్..ఇటీవలే విడుదల చేశారు. తాజాగా సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

ఈ టీజ‌ర్‌ను 'నాగ‌చైత‌న్య' త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. నిమిషం పాటు ఉన్న ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను రేకెత్తిస్తోంది. డ్రోన్లు త‌యారు చేసుకుంటూ జీవించే ఓ యువ‌కుడి క‌థ నేఫ‌థ్యంలో ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందినట్లు తెలుస్తోంది. ఆగస్టులో సినిమా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ భావిస్తోంది. 

07:47 - July 23, 2017

వరంగల్ : టాలీవుడ్‌ హీరోయిన్ సమంత వరంగల్‌లో సందడి చేశారు. హన్మకొండ కిషన్‌పూర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బిగ్‌ సి మొబైల్‌ స్టోర్‌ను ప్రారంభించారు. అయితే సమంత వస్తుందని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. మొబైల్‌ షాప్‌ ప్రారంభం తర్వాత సమంత అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

 

16:15 - July 9, 2017

వరుస చిత్రాలతో బిజీ బిజీగా మారిపోతున్న 'కాజల్' కు మరో ఆఫర్ వచ్చినట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. స్టార్ హీరోల పక్కన మంచి మంచి అవకాశాలు పట్టేస్తూ ప్రేక్షకులను 'కాజల్' అలరిస్తోంది. మెగాస్టార్ 'చిరంజీవి' సరసన 'ఖైదీ నెంబర్ 150’లో చిందేసిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో కూడా బిజీగా ఉంది. గ్లామర్ హీరోయిన్ గా హావా కొనసాగిస్తున్న ఈ భామ 'నాగార్జున' నటిస్తున్న 'రాజు గారి గది 2’ సినిమాలో నటిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో 'సమంత' కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆమె షూటింగ్‌లో సైతం పొల్గొందని టాక్. పాత్ర నచ్చడంతోనే నటించేందుకు 'కాజల్' ఒప్పుకుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రధాన పాత్ర పోషిస్తున్న సీరత్ కపూర్ సరసన 'కాజల్' నటించందా ? లేక 'నాగార్జున' సరసన నటించిందా అనేది చూడాలి. 'రానా' సరసన 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో 'కాజల్' నటిస్తోంది.

15:34 - July 9, 2017

టాలీవుడ్ లో వరుసగా చిత్రాలు చేస్తున్న 'సమంత' ఇతర భాషా చిత్రాలపై కూడా దృష్టి పెడుతోంది. తమిళ సినీ రంగంలో పలు చిత్రాలు చేస్తూ అక్కడి ప్రేక్షకులను కూడా అలరిస్తోంది. తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో 'వేలైక్కారన్' చిత్రంలో 'సమంత' నటిస్తోంది. కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ కొనసాగుతోంది. శుక్రవారం నుండి 'సమంత' షూటింగ్ లో పాల్గొంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు ఘన స్వాగతం పలికింది. హీరోగా నటిస్తున్న 'శివకార్తియన్'..’సమంత'లకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 14 ఏఎం ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో 'సిమ్రాన్'..’నెపోలిన్' ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

16:00 - July 5, 2017

టాలీవుడ్ మన్మథుడు 'నాగార్జున' తనయుడు 'నాగ చైతన్య' వివాహం త్వరలో 'సమంత' తో జరుగనున్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది. 'నాగార్జున' తనయుడు 'అఖిల్' కాబోయే వదిన 'సమంత'తో కరీంనగర్ లో సందడి చేశాడు. మెయిన్ సెంటర్ లోని నూతనంగా ఏర్పాటు చేసిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను బుధవారం వీరు ప్రారంభించారు. వీరు వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి రావడంతో అక్కడంతా సందడి వాతావరణం ఏర్పడింది. సౌతిండియా షాపింగ్ మాల్ ప్రచారకర్తలుగా 'అఖిల్'..'సమంత'లున్న విషయం తెలిసిందే.

10:34 - June 27, 2017

గ్రామీణ యువతిగా వాలుజడ, లంగావోణీతో పదహారణాల పల్లెటూరి అమ్మాయిగా సంప్రదాయబద్దంగా కనిపిస్తోన్న ఈ హోరియన్ ఎవరో చెప్పండి.. ప్రస్తుతం విలక్షణ చిత్రాల దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న రంగస్థలం చిత్రీకరణతో బిజీగా ఉన్నది ఈ సొగసరి. రామ్‌చరణ్ తో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాలలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. సరస్సు ఒడ్డుపై కూర్చొని సూర్యస్తమయాన్ని చూస్తున్న ఫొటోను సోమవారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది ఈమె. గ్రామీణ యువతిగా ఆమె పాత్రను దర్శకుడు సుకుమార్ వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. గోదావరి తీర ప్రాంతాల్లో చిత్రీకరణ సందర్భంగా వారం రోజులుగా సిగ్నల్ అందుబాటులో లేకపోవడంతో ఫోన్ మాట్లాడటం కుదరలేదని, మళ్లీ వెనకటి రోజులకు వెళ్లిన అనుభూతి కలిగిందని ట్విట్టర్ ద్వారా పేర్కొంది కూడా.

14:52 - June 26, 2017

టాలీవుడ్ నటి 'సమంత' పూర్తిగా కొత్తగా కనిపించనుంది. గత చిత్రాల పాత్రలకు భిన్నంగా ఓ పాత్ర చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు 'రామ్ చరణ్'..దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'రంగస్థలం 1985’ చిత్రంలో 'సమంత' నటిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'సమంత' కొత్తగా కనిపించనుంది. చెర్రీ పక్కా పల్లెటూరి యువకుడిగా లుంగీలో కనిపించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫొటోను 'సమంత' రిలీజ్ చేసింది. ఈ ఫొటోలో లాంగా వోణి ధరించి పల్లెటూరి అమ్మాయిల..కాలువ గట్టు కూర్చొని సూర్యాస్తమయం చూస్తున్నట్లు ఉంది. ‘అలసట..బాధ పెద్ద విషయం కాదు..కెమెరా కేవలం అద్బుతాన్నే చిత్రీకరిస్తుంది' అంటూ 'సమంత' పోస్టు చేశారు.

11:13 - June 21, 2017

టాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగొందిన 'సిమ్రాన్' మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో ఆమె పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ సినిమాలో విలన్ గా నటిస్తోందని తెలుస్తోంది. శివ కార్తికేయన్, పొన్ రామ్ కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో శివ కార్తీకేయన్..సమంత తొలిసారిగా నటిస్తున్నారు. వీరితో పాటు 'సిమ్రాన్'..’నెపోలియన్' కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో 'శివ కార్తికేయన్' తండ్రి పాత్రలో 'నెపోలియన్' నటిస్తున్నట్లు..ప్రతి నాయకిగా 'సిమ్రాన్' నటిస్తోందని తెలుస్తోంది. అంబ సముద్రంలో ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి. శివ కార్తికేయన్‌తో 'రెమో’, 'వేలైక్కారన్‌' చిత్రాన్ని నిర్మించిన 24 ఎ.ఎం. స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్నీ నిర్మిస్తోంది.

Pages

Don't Miss

Subscribe to RSS - samantha