sand mafia

16:22 - August 16, 2017

హైదరాబాద్ : నేరెళ్ల ఘటనపై హైకోర్టులో విచారణ సాగింది. ఎంజీఎం వైద్యుల నివేదికను సీల్డ్‌కవర్‌లో హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. బాధితులకు తీవ్రగాయాలైనట్లు నివేదికలో వైద్యులు స్పష్టం చేశారు. అందరికీ ఒకేచోట తీవ్రగాయాలు ఎలా అయ్యాయని కోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్ ఐ రవీంద్రను సస్పెండ్‌ చేశామని కోర్టుకు ప్రభుత్వ అడ్వకేట్‌ రామచంద్రరావు తెలిపారు. ఎస్ ఐ పై సస్పెన్షన్‌పై పూర్తి నివేదిక ఇవ్వాలని కరీంనగర్‌ డీఐజీని కోర్టు ఆదేశించింది. బాధితుల మెడికల్‌ రిపోర్ట్‌ను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే రెండో వారాల్లో నివేదిక సమర్పించాలని కరీంనగర్‌ సూపరింటెండెంట్‌‌ను ఆదేశించింది. కేసును రెండు వారాలపాటు వాయిదా వేసింది.

 

08:00 - August 12, 2017

ట్రాఫిక్ పోలీసాయిన పని ఏందయ్యా..? ఏడ ట్రాఫిక్ జాంగాకుంట జూస్కోవాలె.. ఎవ్వలన్న వీఐపీలొస్తె ట్రాఫిక్ క్లీయర్ జెయ్యాలే..? రోజు సక్కగ డ్యూటీ జేశి ఇంటికి వోవాలె అంతేనా..? మరి తొవ్వొంట వొయ్యెటోళ్లను అమ్మని అక్కని అని తిడ్తె ఎన్కటి కాలమేనా ఇది..? జనం అంత ఒక్కటై.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని తోలు దీశిండ్రు వీడియోలో సూడుండ్రి..

13:13 - August 7, 2017
07:30 - August 3, 2017

కరీంనగర్ : ఒంటినిండా గాయాలు.. నిలబడలేని పరిస్థితి. ఆపుకున్నా ఉబికి వస్తున్న కన్నీరు. ఇదీ నేరెళ్ల బాధితుల కన్నీటి గాథ. నేరెళ్ల బాధితులు బుధవారం కరీంనగర్‌ జిల్లా జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. బయటకు వస్తూనే తమ గోడును వెల్లబోసుకున్నారు. లారీలకు నిప్పు పెట్టిన ఘటనలో తమకు ఎలాంటి సంబంధంలేకపోయినా పోలీసులు అక్రమ కేసులు బనాయించారని బాధితులు ఆరోపించారు. స్టేషన్‌లో నాలుగు రోజులపాటు పోలీసులు తమను చిత్ర హింసలకు గురిచేశారని వాపోయారు. మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్స్‌ ఇస్తూ తమను ఎస్పీ,ఎస్సైసహా ఇతర పోలీసులు చావబాదారని బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. లేకపోతే తమ కుటుంబ సభ్యులపై గంజాయి కేసు పెడతామని బెదిరింపులకు దిగారన్నారు. మహిళలపై వ్యభిచార కేసులు నమోదు చేస్తామని ఎస్పీనే స్వయంగా బెదిరించినట్టు బాధితులు వెల్లడించారు.

బాధితులు కన్నీరుమున్నీర
బాధితులు కన్నీరుమున్నీరనేరం అంగీకరించనందుకు తమకు కరెంట్‌షాక్‌ పెట్టారని బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. థర్డ్‌డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. ప్రత్యక్ష నరకం చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు దెబ్బలతో నడవలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.దళితులపట్ల కేసీఆర్‌కు చిత్తశుద్ధి వారిని చిత్రహింసలకు గురిచేసిన ఎస్పీసహా ఇతర పోలీసులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. మనిషి ప్రాణాలకంటే ఇసుక లారీలే ప్రభుత్వానికి ముఖ్యమైపోయాయని మండిపడ్డారు.

వాస్తవాలు బయటకు 
మొత్తానికి నేరెళ్ల బాధితులు జైలు నుంచి విడుదలవ్వడంతో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దళితులపై పోలీసుల దాష్టీకం వెలుగుచూస్తోంది. మరి దళితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందా. పోలీసులపై చర్యలు తీసుకుంటుందా. ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి.

18:59 - August 2, 2017

కరీంనగర్ : నేరెళ్ల బాధితులకు కరీంనగర్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. కాసేపట్లో 8 మంది నిందితులు బయటకు రానున్నారు. 22 రోజుల పాటు శిక్ష అనుభవించిన నిందితులకు.. కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో.. ఇవాళ విడుదలవుతున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

17:36 - August 2, 2017

హైదరాబాద్ : నేరెళ్ల ఘటనపై సీఎం కేసీఆర్‌ సైలెంట్‌గా ఉండటాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ వి.హన్మంతరావు ఖండించారు. హైదరాబాద్‌లో కూర్చొని స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా.. బాధితులను కలుసుకుని అసలేం జరిగిందో తెలుసుకోవాలన్నారు. ఇసుక మాఫీయా మాయలో పడి అమాయకులపై ప్రభుత్వం కక్షగట్టిందని వీహెచ్‌ ఆరోపించారు. ఇసుక కాంట్రాక్టర్లే ముఖ్యమా.. మనుషుల ప్రాణాలు కాదా..? అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వమేనా..? హైదరాబాద్‌లో కుర్చునొ స్టేట్‌మెంట్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాలను అణగదొక్కుతున్నారని విమర్శించారు.

07:28 - August 2, 2017

సిరిసిల్ల : నేరేళ్లలో దళితులపై పోలీసుల దాష్టీకం తెలంగాణలో సంచలనం రేపుతోంది. రాష్ట్ర రాజకీయాలు నేరెళ్ల చుట్టూనే తిరుగుతున్నాయి. లెఫ్ట్‌ పార్టీలు నేరేళ్ల దళితులపై పోలీసుల దాడిని నిరసిస్తూ ఆందోళన ప్రారంభించాయి. ప్రజాసంఘాలు, టీమాస్‌ ఫోరం కూడా దళితులకు అండగా నిలిచాయి. దళితులపై పోలీసుల వేధింపులు ఆపాలని, దళిత యువకులపై అక్రమ కేసులను ఉపసంహరించాలని డిమాండ్‌ చేశాయి. దీంతో నేరెళ్ల ఘటన రాష్ట్ర రాజకీయ తెరపైకి చేరింది. నేరేళ్ల దళితుల సమస్యపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ కూడా కదలింది. దళితుల ఆందోళనకు మద్దతు ప్రకటించింది. అంతేకాదు... దళితులను వేధిస్తోన్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ బహిరంగ జరిపింది. ఈ బహిరంగ సభ కూడా అనేక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. లోక్‌సభ్‌ మాజీ స్పీకర్‌ మీరా కుమార్‌ నేరెళ్ల బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు. ఇలా ప్రతిపక్షాలు నేరెళ్ల దళితులకు అండగా నిలుస్తుండడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

నెలరోజులుగా నేరెళ్ల ఘటన
దాదాపు నెలరోజులుగా నేరెళ్ల ఘటన రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. మంత్రి కేటీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గం కావడంతో విపక్షాలు కూడా దీన్ని ఆసరా చేసుకుని ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి మంత్రి కేటీఆర్‌ సహకారంతోనే ఇసుక అక్రమ వ్యాపారం జరుగుతోందని.. వారిని కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. నెల రోజులుగా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తుండడంతో ఎట్టకేలకు అధికార టీఆర్‌ఎస్‌లో చలనం వచ్చింది. ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలు తిప్పికొట్టేందుకు గులాబీ బాస్‌ దళిత నేతలను రంగంలోకి దింపారు. ఇసుక వ్యాపారానికి , కేటీఆర్‌కు సంబంధం లేదని అధికార పార్టీ నేతలు స్పష్టం చేశారు. దళితుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ లేదంటూ ఎదురుదాడికి దిగారు. మొత్తానికి విపక్షాల వరుస ఆందోళనలతో అధికారపార్టీలో చలనమొచ్చింది. ప్రతిపక్షాలపై ఎదురుదాడికి పూనుకుంటోంది. మరి అధికారపార్టీ విమర్శలను ప్రతిపక్షాలు ఎలా ఎదుర్కొంటాయో, ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచిచూడాలి.

18:06 - July 31, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ నేతలు.. ఎస్సీలు, బీసీలు గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. ఎస్సీలపై ప్రేమ ఉన్నట్టు కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతున్నారని... కానీ వారి 125 ఏళ్ల చరిత్రలో వారికి చేసిందేమి లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పాలనలో.. ఈ మూడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో దళితులకు చేసిన మేలుపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్‌ విసిరారు. 

13:39 - July 31, 2017

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల బహిరంగసభపై కాంగ్రెస్‌ వెనక్కితగ్గింది. సభ నిర్వహణపై హైకోర్టులో విచారణకు తగిన సమయంలేదని.. కాంగ్రెస్‌ అడ్వకేట్‌ పిటిషన్‌ ఉపసంహరించుకున్నారు. తాజా పరిణామాలపై మీరాకుమార్‌ కాంగ్రెస్‌ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ నేతల టూర్‌లో స్వల్ప మార్పులుఉండే అవకాశం కనిపిస్తోంది. డీకే.అరుణతోపాటు పలువురు నేతలు కరీంనగర్ జైలులో బాధితులను పరామర్శించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

12:35 - July 31, 2017

రాజన్న సిరిసిల్ల : సిరిసిల్లలో నిర్వహించే సభపై కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. సభ నిర్వహణపై హైకోర్టులో విచారణకు తగిన సమయం లేదని కాంగ్రెస్ అడ్వకేట్ పిటిషన్ ఉపసంహరింకున్నారు. ఆ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో మీరాకుమార్ సమావేశం అయ్యారు. నేతల టూర్ లో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉంది. కాసేపట్లో కరీంనగర్ జైలులో బాధితులను కాంగ్రెస్ నేతలు పరామర్శించనున్నారు. అనంతరం బాధిత గ్రామాల్లో నేతలు పర్యటించనున్నారు. నేరెళ్ల ఘటనకు నిరసనగా కాంగ్రెస్‌ నేడు చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది. భారీ బహిరంగసభకు సిద్ధమైంది. అయితే సభ నిర్వహణపై హైకోర్టులో విచారణకు తగిన సమయం లేదని కాంగ్రెస్ అడ్వకేట్ పిటిషన్ ఉపసంహరింకున్న నేపథ్యంలో సిరిసిల్లలో తలపెట్టిన సభపై కాంగ్రెస్ వెనక్కి తగ్గింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - sand mafia