sankranthi

17:23 - July 25, 2017

మెగా ఫ్యామిలీ కుటుంబం నుండి వెండితెరకు పరిచయమై బిజీ బిజీగా మారిపోతున్నారు. అందులో మెగా స్టార్ 'చిరంజీవి' తనయుడు 'రామ్ చరణ్' ఒకరు. ఇప్పటికే యువతో ఎంతో క్రేజ్ తెచ్చుకుని తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్న నటుల్లో 'పవన్ కళ్యాణ్' ఒకరు. ప్రస్తుతం వీరిద్దరి సినిమాలు షూటింగ్ దశలో కొనసాగుతున్నాయి.

సుకుమార్ దర్వకత్వంలో 'రామ్ చరణ్ తేజ' నటిస్తున్నాడు. పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో చిత్రం ఉండనుందంట. ఈ సినిమాలో 'రామ్ చరణ్' వైవిధ్యమైన పాత్రను పోషించనున్నారని..పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడని సమాచారం. ఇందులో 'చెర్రీ' సరసన 'సమంత' హీరోయిన్ గా నటిస్తోంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతోంది. గ్రామీణ నేపథ్యం ఉట్టిపడేలా భారీ సెట్టింగ్ లో షూటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది.

కానీ నవంబర్ బరిలో నిలిచిన 'పవన్'..’త్రివిక్రమ్' సినిమా సంక్రాంతికి మార్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. ‘పవన్ కళ్యాణ్' సైతం వేగంగా షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ సినిమానే కాకుండా ఇతర సినిమాలకు సైతం సైన్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయాలని త్రివిక్రమ్..పవన్ యోచిస్తున్నట్లు టాక్.

మరి సంక్రాంతి బరిలో 'రామ్ చరణ్' నిలుస్తారా ? బాబాయ్ 'పవన్ కళ్యాణ్' సినిమాతో ముందే రిలీజ్ చేయాలని 'చెర్రీ' నిర్ణయిస్తారా ? అనేది రానున్న రోజుల్లో చూడాలి.

11:35 - March 5, 2017

పండుగలు..పలు వివాదాలను సృష్టిస్తుంటాయి. తేదీల విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తుంటాయి. గతంలో పండుగల విషయంలో..గోదావరి పుష్కరాలు, నిన్నటి కృష్ణాపుష్కరాల తేదీల్లో కూడా ఇలాంటి తేడాలు వచ్చాయి. తాజాగా 'ఉగాది' పండుగపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పండితులు, పంచాంగకర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో పంచాంగం రూపొందించారు. దీంతో పండగల తేదీల్లో తేడాలొచ్చాయి. కొన్ని పంచాంగాలు, క్యాలెండర్లు మార్చి 28న శ్రీహేవళంబి నామ సంవత్సర ఉగాది అని..మరికొన్ని మార్చి 29 ఉగాది అని పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు మార్చి 29న ఉగాది సెలవు ప్రకటించాయి. అయితే పలు పంచాంగాలు, క్యాలండర్లలో మార్చి 28న ఉగాది అని పేర్కొన్నాయి. తాజాగా శ్రీనివాస గార్గేయ కూడా 28నే ఉగాది అని ప్రకటించారు. దీంతో ఏ తేదీన ఉగాది జరుపుకోవాలనే అంశంపై ప్రజల్లో అయోమయం నెలకొంది. పాడ్యమి తిథి సూర్యోదయం తరువాత కనీసం 144 నిముషాలు ఉండాలని..కానీ, 29వ తేదీ కేవలం 58 నిముషాలే ఉంటుందని..అందుకే, 28వ తేదీనే ఉగాది జరుపుకోవాలి అని పలువురు పేర్కొంటున్నారు. పూర్వ సిద్ధాంతాన్ని అనుసరించి పంచాంగాన్ని రూపొందించే సిద్ధాంతులు, ఛాయార్క, కరణార్క దృక్‌ సిద్ధాంత పద్ధతిని అనుసరించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవు తేదీని మారుస్తుందా ? లేదా ? చూడాలి.

18:42 - January 20, 2017

హైదరాబాద్ : కొమ్ములు తిరిగిన ఎద్దులు, దుమ్ము రేపే దున్నపోతులు, పాలిచ్చే పాడి ఆవులు, డప్పుల దరువులు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేల సంఖ్యలో వివిధ రాష్ట్రాల నుండి తరలి వచ్చిన మేలు రకం పశువులు. ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నారా...? మన హైటెక్‌ నగర శివారు ప్రాంతమైన నార్సింగిలోనే. అట్టహాసంగా జరుగుతున్న పశు సంక్రాంతిపై ప్రత్యేక కథనం...
పశువుల సంత
ప్రతి ఏడాది సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి శుక్రవారం జరిగే పశువుల సంతను పశు సంక్రాంతిగా పిలుచుకుంటారు. ఈ వేడుకలు దాదాపు 150 ఏళ్ళ నుండి కొనసాగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. పశువుల అమ్మకాలు, కొనుగోళ్ల కోసం దేశం నలుమూలల నుంచి రైతులు తరలివస్తారు. ఇక్కడ అన్ని రకాల జాతుల గేదెలు, గిత్తలు అందుబాటులో ఉంటాయి. 
ఒక్కో గేదె ధర 50వేల నుంచి రూ.3లక్షలు 
సంతలో చూసేందుకు, అమ్మకాలు-కొనుగోళ్లు జరిపేందుకు... వివిధ ప్రాంతాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. ఒక్కో గేదె ధర 50వేల నుంచి 3లక్షల రూపాయల వరకు పలుకుతోంది. సంతను చూసేందుకు అటు రైతులతో పాటు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ తో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వచ్చారు. వివిధ రకాల పశువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నార్సింగ్ పశువుల సంతకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తానని మండలి చైర్మన్ అన్నారు. ప్రభుత్వంతో చర్చించి మార్కెట్ అభివృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
సంతపై పాత నోట్ల రద్దు ప్రభావం  
పాత నోట్ల రద్దు ప్రభావం సంతపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంతలో పశువులకు అవసరమైన సామాగ్రిని అమ్మేందుకు దుకాణాలు వెలిశాయి. అయితే సరైన సౌకర్యాలు లేక... వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతం నుంచి పశువులను విక్రయించేందుకు వచ్చిన తమకు సరైన సౌకర్యాలు కల్పించాలని వ్యాపారులు కోరుతున్నారు. 
నార్సింగిలో పశు సంక్రాంతి కల 
వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడకు పశువులు రావడంతో నార్సింగిలో పశు సంక్రాంతి కల ఉట్టిపడుతోంది. ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రత్యేక దృష్టి పెడితే పశు సంక్రాంతి ఇంకా బాగా నిర్వహిస్తామని నిర్వహకులు చెబుతున్నారు.

 

19:08 - January 12, 2017

కృష్ణా : సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. 10టీవీ, విజయక్రాంతి జూనియర్‌ కాలేజీ ఆధ్వర్యంలో చల్లపల్లిలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. విద్యార్థినులు, ఉపాధ్యాయులతో పాటు చుట్టు పక్క గ్రామాల మహిళలు సైతం ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. చివరగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ముగ్గుల పోటీలకు సంబందించి మరిన్ని వివరాలు మా విజయవాడ డిఫ్యూటీ ఇన్‌పుట్‌ ఎడిటర్‌ జయరాజ్‌ అందిస్తారు.

14:44 - January 12, 2017

శ్రీకాకుళం : సంక్రాంతిని సందర్భంగా శ్రీకాకుళంలో 10 టివి నిర్వహించిన ముగ్గుల పోటీకి మహిళల నుంచి మంచి స్పదన లభించింది. పెదపాడులోని SRA విద్యాసంస్థల ప్రాంగణంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో 80 మంది పాల్గొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రంగవల్లు తీర్చిదిద్దారు. డీఎస్‌పీ శ్రీనివాసరావు, ఎస్ ఆర్ ఏ విద్యాసంస్థల చైర్మన్‌ పూడి తిరుపతిరావు, ప్రిన్సిపాల్‌ స్వర్ణలతల చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు అందజేసి, జ్ఞాపికలు ప్రదానం చేశారు.

21:28 - January 11, 2017

హైదరాబాద్ : సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్‌లలో రద్దీ పెరిగింది. పన్నెండో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో.. ఏపీకి చెందిన వారు.. చిన్నా పెద్ద సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి.

ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు...

మహానగరం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్ళే ప్రయాణీకుల కష్టాలు అన్నిఇన్నీ కావు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కిటకిటలాడుతోంది. ట్రైన్లు లేక పోవడంతో ప్రయాణీకులు గంటల తరబడి పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. దొరికిన రైళ్లు, బస్సులలో సీట్లు దోరకక ప్రయాణీకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల రద్దీకి తగినంతగా బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు జూబ్లి బస్టాండ్ లో ఆందోళనకు దిగారు. గంటల తరబడి పడిగాపులు పడాల్సిన పరిస్ధితి ఉండటంతో మరిన్ని ప్రత్యేక బస్సులు, ట్రైన్లు వేయాలని డిమాండ్ చేసారు.

పండుగకు సొంతూళ్లకు వెళుతున్న ఆంధ్రాప్రజలు...

హైదరాబాద్ మహానగరంలో స్థిరపడిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను జరుపుకోవడం కోసం వారివారి ప్రాంతాలకు తరలివెళతారు. వీరితో పాటుగా తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన వారు కూడా సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకోవడానికి వెళతారు. అయితే ఈ ఏడాది సంక్రాంతికి వెళ్లే వారి కోసం ఆర్టీసీ, రైల్వే శాఖలు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసులు నడపడంలో ఆర్టీసీ విఫలమైంది. దీనికి తోడు రైల్వే శాఖ కూడా అదనపు రైళ్లను వేయకపోవడంతో సంక్రాంతి రద్దీ మరింతగా పెరిగింది.

అదనపు చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్....

సందేట్లో సడేమియాల్లా ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటున్నాయి. రద్దీని దృష్టిలో పెట్టుకొని పలు ప్రైవేటు ట్రావెల్స్ కంపెనీలు బస్సు ఛార్జీలు మూడింతలుగా వసూలు చేస్తున్నాయి. దీంతో ప్రయాణీకులపై అదనపు భారం పడుతోంది. దీనిపై ఆర్టీఏ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలు దోపిడీని అరికట్టాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేసారు. ఇప్పటికైనా ఆర్టీసీ , రైల్వే శాఖలు స్పందించి రద్దీకి తగ్గటుగా అదనపు బస్సులను, రైళ్లను నడపాలని ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు.

20:28 - January 11, 2017
06:52 - December 29, 2016

హైదరాబాద్ : ప్రతి ఏడాది సంక్రాంతికి హైదరాబాద్‌లో నిర్వహించే పతంగుల పండుగ ఈ ఏడాది మరింత శోభాయానంగా జరగనుంది. ఆగాఖాన్ ఫౌండేషన్ మరియు తెలంగాణ టూరిజం శాఖ కైట్స్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాయి. ఈ ఫెస్టివల్‌లో 40 దేశాల నుంచి కైట్ ప్లేయర్స్ పాల్గొననున్నారు. ఇప్పటివరకు అహ్మదాబాద్‌లో అత్యంతం అద్భుతంగా పతంగుల పండుగ జరుగుతుంది. దీని కంటే గొప్పగా పండుగ నిర్వహించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయంగా కైట్ ప్లేయర్స్‌తో పాటు హైదరాబాద్‌లో 10 స్కూళ్లలో కూడా పతంగుల పండుగ చేయనున్నారు.

4 రోజుల పాటు జరగనున్న కైట్ ఫెస్టివల్....

హైదరాబాద్‌లో ఈ కైట్ ఫెస్టివల్ నాలుగు రోజుల పాటు జరుగుతుంది. కైట్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమాన్ని జనవరి 17 న వరంగల్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇదే స్ధాయిలో వరంగల్‌లో కూడా పతంగుల పండుగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో టూరిజంను అభివృద్ధి చేయడంలో భాగంగా ఆగాఖాన్ ఫౌండేషన్, తెలంగాణ టూరిజం కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి.

జనవరి 14 నుంచి 3 రోజుల పాటు అంతర్జాతీయ డ్యాన్స్ ఫెస్టివల్ .....

పతంగుల పండుగతో పాటుగా వచ్చే నెల 14 నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ డ్యాన్స్ కార్యక్రమాలు కూడా జరగనున్నాయి. ఏషియన్ బ్రాడ్ కాస్టింగ్ యూనిట్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శిల్పారామంలో జరగనుంది. వివిధ దేశాలు వారి సాంప్రదాయ నృత్యాలను ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తాయి. అంతర్జాతీయ డ్యాన్స్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ టూరిజం శాఖ చేస్తోంది. మొత్తానికి ఈ సంక్రాంతికి నాలుగు రోజుల పాటు జరిగే కైట్ ఫెస్టివల్, డ్యాన్స్ ఫెస్టివల్స్ అలరించనున్నాయి. దేశ విదేశాల నుంచి వచ్చే అతిథులకు, పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ అన్ని ఏర్పాట్లు చేయనుంది.

16:31 - January 15, 2016

శ్రీకాకుళం : సంక్రాంతి పండుగ సందర్భంగా నాటుకోళ్లకు డిమాండ్‌ అమాంతంగా పెరిగిపోయింది. ఇంటికి వచ్చే అల్లుళ్లు, చుట్టాలకు నాటుకోడి కూర వండిపెట్టడం ఆనవాయితిగా వస్తోంది. దీంతో శ్రీకాకుళం జిల్లాలో నాటుకోడి విక్రయాలు జోరందుకున్నాయి. నాటుకోళ్లకు డిమాండ్‌ పెరగడంతో వీటి ధరలు భారీగా పెరిగి.. వ్యాపారస్తులకు కాసులు కురిపిస్తున్నాయి. మరోవైపు కోళ్ల రేట్లు భారీగా పెరిగినా.. ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం కాబట్టి.. కోడికూర చేయక తప్పదంటున్నారు ప్రజలు. 

14:42 - January 15, 2016

చదువు కోసమో..ఉద్యోగం కోసమో..ఉపాధి కోసమో..మరో పని కోసమో..పల్లెను వదిలి పట్నం చేరిన మనిషికి లేలేత కిరణాల వెచ్చదనం..పైరగాలి చల్లదనం..మట్టి పరిమళం..ఎక్కడ దొరుకుతుంది ? కాంక్రీట్ జంగిల్ లో ఆకాశా హర్మ్యాల మధ్య ప్లాస్టిక్ వనాలలో తిరిగి తిరిగి అలసిపోయి వడలిపోతున్న మనిషికి మళ్లీ జవసత్వాన్ని జీవాన్ని ఇచ్చేది ఆ పల్లె పరిమళమే. ఆ మట్టి గంధమే. అక్కడి నీటి చెలిమలే. అందుకనే ఏమో ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో యాంత్రీకంగా మారుతున్న మనిషి పండుగ పేరిట బలహీనమవుతున్న తన మూలాలను వెతుక్కుంటున్నాడు. చివరి అంచుల మీదున్న బంధాలను బలోపేతం చేసుకోవడానికి పరుగులు పెడుతున్నాడు. పల్లెకు పోదాం అంటూ పరుగులు తీస్తున్నాడు. 'సంక్రాంతి' పండుగ సందర్భంగా 'మానవి' ప్రత్యేక కథనం. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - sankranthi