sarkar

17:23 - November 10, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కిన సినిమా, సర్కార్.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సర్కార్, భారీ అంచనాల మధ్య, దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో.. మొన్న 6వ తేదీన రిలీజ్ అయింది. తెలుగు టాక్, కాస్త అటు ఇటుగా ఉన్నా, తమిళనాట మాత్రం, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. 
అంతేకాదు, కేవలం రెండే రెండు రోజల్లో ఈ సినిమా అక్షరాలా రూ. 100 కోట్ల మార్క్ దాటేసింది. మొదటి రోజు అన్నిచోట్లా హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడగా, ప్రపంచవ్యాప్తంగా, రెండు రోజుల్లో, రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తమిళనాట అధికార పార్టీ పోరు భరించలేక ఇవాళ్టి నుండి కొన్ని సీన్లకు కత్తెర వేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కార్ నాలుగు రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి.
నైజాం : 1.98 కోట్లు, సీడెడ్ : 1.34 కోట్లు, నెల్లూరు : 0.23 కోట్లు, గుంటూరు : 0.59 కోట్లు, కృష్ణ : 0.51 కోట్లు, తూర్పు గోదావరి : 0.43 కోట్లు, పశ్చిమ గోదావరి : 0.35 కోట్లు, ఉత్తరాంధ్ర : 0.48  కోట్ల చొప్పున, మొత్తం, రూ. 5.91 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ రూ. 7.5 కోట్లకు అమ్మారు. ఆ లెక్కన మరో రూ. 1.4 కోట్ల షేర్ వసూలు చేస్తే తెలుగు నిర్మాత సేఫ్ అవుతాడు. పోటీగా వేరే సినిమాలేవీ లేవు కాబట్టి, ఈ వీకెండ్‌ లోనూ సర్కార్ హవా కొనసాగనుంది.

13:25 - November 9, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, రూపొందిన సర్కార్‌కీ, తమిళనాడు  సర్కార్‌కీ మధ్య వార్ జరుగుతుంది. విజయ్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చాలా సీన్స్‌‌‌లో, తమిళ రాజకీయాలపైనా, అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చేపట్టిన సంక్షేమ పథకాలపైనా సెటైర్లు వేసాడు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర అచ్చు జయలలితను పోలి ఉందని అంటున్నారు. సినిమాలోని వివాదాస్పద సీన్లు, డైలాగులు తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు థియేటర్ల ముందు ధర్నాలు చేసారు. ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి, గత రాత్రి దర్శకుడు మురుగదాస్‌‌ని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులను రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో, విజయ్ సర్కార్ వర్సెస్ తమిళనాడు సర్కార్ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసారు విజయ్ అభిమానులు. సర్కార్ సినిమా వివాదం గురించి తెలుసుకున్న సూపర్ స్టార్ రజినీ‌కాంత్, యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్‌లు విజయ్‌కి అండగా నిలవబోతున్నారని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక, ఎట్టకేలకు సినిమాలో అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించేందుకు సన్ పిక్చర్స్ అంగీకరించిందని తెలుస్తోంది. దీని విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అనవసరమైన గొడవలెందుకనే ఉద్దేశంతో  సన్ పిక్చర్స్ యాజమాన్యం రాజీకి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
 
 

 

10:09 - November 9, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, రూపొందిన  సర్కార్, భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో మొన్న రిలీజ్ అయింది. తెలుగు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా, తమిళనాట మాత్రం, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. 
 కేవలం రెండే రెండు రోజల్లో ప్రపంచవ్యాప్తంగా, రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చేసి, దళపతి సత్తా చాటింది సర్కార్.  ఇప్పుడు తమిళనాట ఈ సినిమాకి రాజకీయ సెగ తగులుతోంది. ప్రభుత్వంపై సెటైర్లు వేసారనీ, వివాదాస్పద సీన్లు, డైలాగులు తొలగించాలని అన్నాడీఎంకే కార్యకర్తలు థియేటర్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ప్రభుత్వం ఒక అడుగు ముందుకువేసి, దర్శకుడు మురుగదాస్‌‌ని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులను రంగంలోకి దింపింది. ఈవిషయాన్ని మురుగదాస్‌ ట్విట్టర్ ద్వారా తెలియచేసాడు. అర్థ రాత్రి పూట తాను ఇంట్లో లేనప్పుడు, పోలీసులు తమ ఇంటికివచ్చి, చాలాసార్లు తలుపులు కొట్టారని, ఆ టైమ్‌లో తను ఇంట్లోలేనని, కొద్దిసేపటి తర్వాత పోలీసులు వెళ్ళిపోయారని దాస్ తెలిపాడు.  ఇదే విషయాన్ని సన్ పిక్చర్స్ ట్వీట్ చేసింది. నటుడు విశాల్, మురుగదాస్‌ ఇంటికి పోలీసులు ఎందుకు వెళ్ళారు.సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చాక కూడా ఈ నాన్సెన్స్ ఏంటి అంటూ అసహనం వ్యక్తం చేసాడు. ప్రస్తుతం, సర్కార్ వర్సెస్ తమిళనాడు  సర్కార్ అనే యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు విజయ్ అభిమానులు.
   

12:33 - November 8, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కిన సినిమా, సర్కార్.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సర్కార్, భారీ అంచనాల మధ్య, దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో మొన్న రిలీజ్ అయింది. తెలుగు టాక్ కాస్త అటు ఇటుగా ఉన్నా, తమిళనాట మాత్రం, సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. 
అంతేకాదు, కేవలం రెండే రెండు రోజల్లో ఈ సినిమా అక్షరాలా రూ. 100 కోట్ల మార్క్ దాటేసింది. మొదటరోజు అన్నిచోట్లా హౌస్‌ఫుల్ బోర్డ్ పడగా, ప్రపంచవ్యాప్తంగా, రెండు రోజుల్లో, రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చేసింది సర్కార్. మరోపక్క ఈ సినిమాలో విజయ్, పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే చాలా సీన్స్‌లో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ని ఇమిటేట్ చేసాడని తెలుగు ఆడియన్స్ అంటున్నారు. గతంలో, తమిళనాట విజయ్ నటించగా విజయం సాధించిన కొన్ని సినిమాలను పవన్, తెలుగులో రీమేక్ చేసాడు. పవన్ బంగారం ఆడియో ఫంక్షన్‌కి, విజయ్ గెస్ట్‌గా వచ్చాడు కూడా. అయితే సర్కార్‌లో విజయ్, పవన్‌లా,  ప్రశ్నిస్తా.. అనడంతో పాటు, అజ్ఞాతవాసి సినిమాలోలా, అహ్ అహ్ అంటూ చాలా వరకూ, పవన్‌ని అనుకరించాడు, అందుకే రెండు రోజుల్లో రూ. 110 కోట్ల గ్రాస్ వసూలు చెయ్యగలిగింది అంటున్నారు కొందరు పవర్ స్టార్ ఫ్యాన్స్.. 

 

16:23 - November 6, 2018

దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్‌ల కాంబినేషన్‌లో, తుపాకి, కత్తి లాంటి సూపర్ హిట్స్ తర్వాత తెరకెక్కిన సినిమా, సర్కార్.. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందిన సర్కార్, భారీ అంచనాల మధ్య, దీపావళి కానుకగా తమిళ్‌, తెలుగులో ప్రపంచవ్యాప్తంగా  ఈరోజు రిలీజ్ అయిన సర్కార్ ఎలా ఉందో చూద్దాం.
కథ : 
ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ, సుందర్ రామస్వామి (విజయ్), తన సొంత ఊర్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి, ఓటు హక్కు వినియోగించుకోవడానికి అమెరికా నుండి ఇండియాకి వస్తాడు. తీరా ఓటు వెయ్యబోయే సరికి, తన ఓటు వేరెవరో వేసేసారని తెలిసి షాక్ అవుతాడు.తగ్గే ప్రసక్తే లేదని న్యాయపోరాటానికి దిగుతాడు. సుందర్ మళ్ళీ ఓటువేసే వరకూ ఎన్నికలు రద్దు చేస్తున్నట్టు కోర్టు తీర్పిస్తుంది. 
ఈలోగా అతనికి తోడు మరికొంత మంది బాధితులు యాడ్ అవుతారు. దీంతో ఎన్నికలే రద్దవుతాయి. ఆకోపంలో అధికార పార్టీ కవ్వింపు చర్యలకు పాల్పడడంతో, సుందర్ ఏకంగా ముఖ్యమంత్రి మీదే పోటీకి దిగుతాడు. చివరకు సుందర్ ఏం చేసాడు, అతనికి న్యాయం జరిగిందా, లేదా అనేది సర్కార్ స్టోరీ అన్నమాట.

నటీనటులు & సాంకేతిక నిపుణులు : 

సీన్స్‌కి తగ్గట్టు విజయ్ నటన అభిమానులను ఆకట్టుకుంటుంది. డాన్స్, ఫైట్స్ పరంగానూ బాగానే చెయ్యడంతోపాటు, అక్కడక్కడా కాస్త అతి చేసిన ఫీలింగ్ కూడా కలిగించాడు. కీర్తి సురేష్ ఏదో ఉంది అంటే ఉంది అన్నట్టుంది తప్ప, ఆమె క్యారెక్టర్ చెప్పుకునేంత గొప్పగా ఏమీ లేదు. ఇక వరలక్ష్మి, విజయ్ ముందు తేలిపోయింది. రాధారవి, ప్రేమ్ కుమార్, పాల కరుపయ్య, యోగిబాబు తదితరులు ఉన్నంతలో పర్వాలేదనిపిస్తారు. సినిమాలో విజయ్‌ని ఢీకొట్టే స్థాయి విలన్ లేకపోవడం మైనస్.
ఏ.ఆర్. రెహమాన్ పాటలు గుర్తుంచుకునేలా లేవుకానీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. గిరీష్ గంగాధరన్ కెమెరా, రామ్, లక్ష్మణ్ ఫైట్స్ బాగానే ఉన్నాయి. లాస్ట్‌బట్ నాట్ లీస్ట్.. కొన్నాళ్ళ క్రితం వరకూ సినిమా ప్రారంభంలో,‌ ఈ నగరానికేమైంది అనే యాడ్ వచ్చినట్టు, ఈ మురుగదాస్‌కి ఏమైంది, ఓ వైపు స్పైడర్, మరోవైపు సర్కార్, ఆయన బ్రెయిన్‌కేమైంది  అనే డౌట్ వస్తుంది ప్రేక్షకులకు. సంవత్సరానికి రూ. 1800 కోట్ల శాలరీ తీసుకునే సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ, తను ఏదేశంలో అడుగుపెడితే అక్కడున్న కార్పొరేట్ కంపెనీలన్నిటినీ కొనెయ్యడం, తర్వాత వాటిని మూయించెయ్యడం ఎందుకో అర్ధం కాదు. డైరెక్ట్‌సీఎమ్‌ని ఢీ కొని, ఈజీగా ప్రభుత్వాన్ని పడగొట్టడం చూస్తే, నవ్వాలో, ఏడవాలో కూడా తెలీదు. చాలా చోట్ల మురుగ, లాజిక్ మిస్సయ్యాడు. తమిళ రాజకీయాలు, అక్కడి నేటివిటీ మనోళ్ళకేమాత్రం ఎక్కదు. విజయ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమా కాబట్టి, వాళ్ళకు మాత్రమే సర్కార్ భీభత్సంగా నచ్చుతుంది.. తెలుగులో సూపర్ అనిపించడం కష్టం అనే చెప్పాలి. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.


తమిళ తంబీలకు నచ్చే సర్కార్...

తారాగణం :   విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాధారవి, ప్రేమ్ కుమార్, పాల కరుపయ్య, యోగిబాబు

 కెమెరా    :    గిరీష్ గంగాధరన్ 

 సంగీతం   :      ఏ.ఆర్. రెహమాన్

నిర్మాత   :     అశోక్ వల్లభనేని

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : ఏ.ఆర్.మురుగదాస్‌

రేటింగ్  : 2/5

 

మూవీ రివ్యూ - 5 స్టార్ రేటింగ్‌ విధానం...
3.5 స్టార్ - ఉత్తమ చిత్రం
3 స్టార్స్  - చాలా బావుంది! తప్పక చూడాల్సిన సినిమా
2.75 స్టార్స్  - ఉన్నంతలో బావుంది
2.5 స్టార్స్ - సినిమా చూడొచ్చు 
2.25 స్టార్స్ - ఇంకొంచెం శ్రద్ధపెట్టాల్సి ఉంది 
2 స్టార్స్ - చాలా మెరుగుపర్చుకోవాలి

 

 

 

17:13 - November 1, 2018

ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందిన మూవీ సర్కార్.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సర్కార్ తమిళ్‌, తెలుగు టీజర్‌లకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది... దీపావళి కానుకగా, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్న సర్కార్ సినిమాని, కేరళలో రెండు థియేటర్లలో, ఏకధాటిగా, 24 గంటల పాటు ప్రదర్శించనున్నారు. మరికొన్ని చోట్ల తెల్లవారు జామున 5 గంటలనుండే షోలు వెయ్యనున్నారు. తమిళనాడులో అయితే, కంటిన్యూస్‌గా 48 గంటలపాటు షోలు వేసుకునేలా అనుమతి ఇవ్వాలని, విజయ్ అభిమానులతో పాటు, మూవీ యూనిట్, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ 6న సర్కార్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతుంది.

18:13 - October 30, 2018

ఇళయ దళపతి విజయ్, స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందిన మూవీ సర్కార్.. రీసెంట్‌గా రిలీజ్ చేసిన సర్కార్ తమిళ్‌, తెలుగు టీజర్‌లకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది... తన కథ మురగదాస్‌ కాపీ చేసాడని, రచయిత వరుణ్ రాజేంద్రన్ కోర్ట్‌లో కేసు వేసిన సంగతి తెలిసిందే. మొదట సర్కార్ కథ తనదేననీ, ఏదైనా కోర్ట్‌లోనే తేల్చుకుంటానని చెప్పిన మురగదాస్‌, రచయిత వరుణ్ రాజేంద్రన్‌తో రాజీకి వచ్చాడు. అతనికి టైటిల్ క్రెడిట్‌తో పాటు, 30 లక్షల పారితోషికం కూడా ఇవ్వడానికి సన్ పిక్చర్స్ అండ్ దాస్ ఒప్పుకోవడంతో, సర్కార్ వివాదం సద్దుమణిగి, విడుదలకి లైన్ క్లియర్ అయిందని తెలుస్తుంది. దీని గురించి వివరణ ఇస్తూ, మురగదాస్‌ ట్విట్టర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసాడు. , కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాధా రవి,యోగిబాబు తదితరులు నటించిన సర్కార్, దీపావళి కానుకగా నవంబర్ 6న తెలుగు, తమిళ్‌లో భారీగా రిలీజ్ కానుంది.

16:27 - October 28, 2018

హైదరాబాద్ : తెలుగు ఇండస్ట్రీలలో కూడా తమ సత్తా చాటాలని ఇతర వుడ్‌లకు చెందని హీరోలు అనుకుంటుంటారు. తాము నటించే చిత్రాలను ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. కోలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్..ఇలా పలు వుడ్‌లకు చెందని హీరోల చిత్రాలు టాలీవుడ్‌లో విడుదలై మంచి విజయాలను కూడా నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళ స్టార్ హీరో ‘విజయ్’ చిత్రం కూడా తెలుగులో రిలీజ్ అవుతోంది. 
Image result for SARKAR murugadossవిజయ్’ హీరోగా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ‘సర్కార్’. ఈ సినిమాలో ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే రాదా రవి , వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ దుమ్ము రేపుతోంది. చిత్ర కథ పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరుగునున్న సంగతి తెలిసిందే. 
Image result for SARKAR murugadossఇదిలా ఉంచితే మణిరత్నం ‘నవాబ్’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన అశోక్ వల్లభనేనినే, ‘సర్కార్’ చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేస్తున్నారు. వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.  ఈ సినిమాను ఏకంగా సుమారు 750 థియేటర్లలో విడుదల చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 6వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. మరి తెలుగులో కూడా ‘సర్కార్’ సత్తా చాటుతాడా ? లేదా ? అనేది చూడాలి. 

10:26 - October 24, 2018

ఢిల్లీ : తమిళ సూపర్ స్టార్ విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కార్. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో...కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం తమిళ టీజర్‌ రికార్డు సృష్టించడంతో... తాజాగా తెలుగు టీజర్‌ను యూనిట్‌ విడుదల చేసింది. అతనొక కార్పొరేట్‌ మాన్‌స్టర్‌‌.... ఏ దేశానికి వెళ్లినా తనను ఎదిరించిన వారిని అంతం చేసి వెళ్తాడు.... అతను ఇప్పుడు ఇండియాకు వచ్చాడు... అనే డైలాగ్‌తో టీజర్‌ ప్రారంభమైంది. ఒక్కరోజులో ఏం మారుతుందో, మారబోతోందో ఓ మూల నిల్చుని వేడుక చూడండంటూ విజయ్‌ చెప్పే డైలాగ్‌ థియేటర్‌లో కాసులు కురిపించనుంది. 

 

16:23 - February 10, 2017

సెంటిమెంట్స్ కి అతీతుడు తాను పట్టిన కుందేలుకి కళ్ళేలేవు వీల్ చైర్ లో తిరుగుతుంది అని చెప్పే క్రియేటివ్ డైరెక్టర్. చిన్న చిన్న కెమెరాలతో పెద్దసినిమాలు తీసే సినీ టెక్నాలజీ తెలిసిన దర్శక జీవి. తన పుట్టిన రోజుకి తానే గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాడు ..ఆ గిఫ్ట్ ఏంటో ఆ జీవి ఎవరో చూద్దాం. భారత సినీ ఇండస్ట్రీ లో భీష్ముడు లాంటి వాడు అమితాబచ్చన్. 74 సంవత్సరాల వయస్సులో కూడా నటన మీద మక్కువతో యాక్టింగ్ లో కంటిన్యూ అవుతున్న అమితాబచ్చన్ ఈ మధ్య చేస్తున్న సినిమాలు ఎంతో వైవిధ్యంగా ఉంటున్నాయి. హిందీ లో బ్లాక్, పా, పీకు, పింక్ వంటి డిఫరెంట్ ఫిలిమ్స్ చేస్తూనే ఇటు పరభాషా చిత్రాల్లో గెస్ట్ రొలెస్ కూడా వేస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీ నటించిన 'మనం' సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేసి మరొక్కసారి తనకి తెలుగు ఇండస్ట్రీ మీద అభిమానాన్ని చాటుకున్నారు.

హిట్ ఫిలిం సర్కార్..
అమితాబచ్చన్ ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన బాలీవుడ్ హిట్ ఫిలిం సర్కార్. మహారాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో తెరకెక్కిన సర్కార్ సినిమా బాక్స్ ఆఫీసుల్ని కాసులతో నింపేసింది. అటు అమితాబచ్చన్ కి ఇటు రాంగోపాల్ వర్మకి మంచి పేరు తెచ్చిపెట్టిన ఈ సినిమా బచ్చన్ సాబ్ ని ఆర్ జి వి నీ మంచి మిత్రులుగా కూడా మార్చేసింది. 2005 లో రిలీజ్ ఐన 'సర్కార్' మంచి కలెక్షన్లతో దూసుకెళ్లింది. అదే ఫ్లో నీ కంటిన్యూ చేస్తూ 2008 లో సర్కార్ సినిమాకి సీక్వెల్ గా 'సర్కార్ రాజ్' సినిమాని తీశాడు. అనుకున్న స్థాయిలో 'సర్కార్ రాజ్' సినిమా ఆడియన్స్ ని రీచ్ అవ్వలేదు.

వర్మలో సాధారణ జీవి ? 
'అమితాబచ్చన్' తో ఎనిమిది సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ఈసారి 'సర్కార్ 3' తో వస్తున్నాడు. 'సర్కార్ 3' లో యాంగ్రీ ఆడియన్స్ మెచ్చే స్థాయిలో అమితాబచ్చన్ న్ను ప్రెజెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు సెంటిమెంట్స్ ఉండవ్ అని చెప్పుకునే రాంగోపాల్ వర్మ ఈ 'సర్కార్ 3' సినిమాని తన బర్త్ డే ఏప్రిల్ 7 న రిలీజ్ చేస్తున్నట్లు అని చెప్పడం, రీసెంట్ గా జరిగిన వంగవీటి ఫంక్షన్ లో ఒట్టు..ప్రామిస్ లు అనడం చూస్తుంటే ఆర్ జివి సాధారణ జీవి అవుతున్నాడా అని అనుమానం రాకమానదు. 'సర్కార్ 3' సినిమా చూడాలంటే మాత్రం ఏది ఏమైనా 'రాంగోపాల్' వర్మ బర్త్ డే ఏప్రిల్ 7 వరకు ఆగాల్సిందే..

Don't Miss

Subscribe to RSS - sarkar