Sasikala

21:23 - March 23, 2017

చెన్నై: తమిళనాడులోని ఆర్‌కె నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న అన్నాడిఎంకే పార్టీలోని రెండు వర్గాలకు ఎన్నికల కమిషన్‌ గుర్తులు కేటాయించింది. శశికళ వర్గానికి టోపీ గుర్తు , పన్నీర్‌సెల్వం వర్గానికి రెండు విద్యుత్‌ స్తంభాల గుర్తును కేటాయించింది. రెండు వర్గాలకు వేర్వేరు పార్టీ పేర్లను కూడా ఈసీ ప్రకటించింది. శశికళ వర్గానికి 'అన్నాడిఎంకె అమ్మ' పార్టీ , పన్నీర్‌ సెల్వం వర్గానికి 'అన్నాడిఎంకే పురిట్చితలైవి అమ్మ' పార్టీగా పేర్లను ఖరారు చేసింది. ఎన్నికల్లో అన్నాడిఎంకే పేరును ఎక్కడా వాడొద్దని ఇరువర్గాలకు ఈసీ సూచించింది. పార్టీ సింబల్‌ రెండాకుల గుర్తు కోసం ఇరువర్గాలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. రెండాకుల గుర్తును ఎవరికి కేటాయించకుండా ఈసీ నిర్ణయం తీసుకుంది.

20:50 - March 22, 2017

అమ్మ సీటును చిన్నమ్మ వర్గం దక్కించుకుంటుందా...? పన్నీరు పార్టీతో ప్రజల మనస్సులు గెలవగలడా...? అమ్మలేని గ్యాప్ ని డీఎంకే వశం చేసుకుంటుందా..?
తమిళనాట కమలం పార్టీ కలలు నెరవేరుతాయా...? ఈ అంశంపై ప్రత్యేక కథనం.. ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక చుట్టూ జరుగుతున్న చర్య ఇది. నిజానికి ఇది ఒక అసెంబ్లీ నియోజక వర్గంకి జరిగే ఉప ఎన్నిక. దివంగత ముఖ్యమంత్రి తమిళ ప్రజలు అమ్మగా పిలుచుకునే జయలలిత అనారోగ్య కారణాల వల్ల మరణించడం వల్ల వచ్చిన ఉపఎన్నిక. కాని ఇది అమ్మలేని లోటు ఎవరు తీరుస్తారు అని తేల్చే ఎన్నిక, తమిళనాట రాజకీయ భవిష్యత్తును తేల్చే ఎన్నిక, అందుకే ఇక్కడ గెలుపు అందరికి అవసరం. కాదు కాదు అత్యవసరం. భవిష్యత్తులో తమిళ నాడు రాజకీయలపై చెరగని ముద్ర వేయాలంటే ఆర్కే నగర్ లో తప్పకుండా గెలిచి తీరాలి. ప్రస్తుతం తమిళ రాజకీయాలు ఎంత వేడిగా ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. ఈ అంశంపై మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి.

13:32 - March 21, 2017

నేరస్తులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో సీనియర్ విశ్లేషకులు నగేష్, టీడీపీ నేత విజయ్ కుమార్, సీపీఎం నేత కృష్ణ పాల్గొని, మాట్లాడారు. నేరస్తులకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. వారిని కఠినంగా శిక్షించాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

06:39 - March 16, 2017

చెన్నై : అన్నాడీఎంకేలో రాజకీయ పోరు కొనసాగుతూనే ఉంది. ఆర్‌కె నగర్‌ నియోజకవర్గం నుంచి పోటీకి అన్నాడిఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ పేరును శశికళ ఖరారు చేసింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఎన్నికల కమిషన్‌ను కలిశారు. అన్నాడీఎంకే తరపున అభ్యర్థులను నిలిపే అర్హత శశికళకు లేదన్నారు. దినకరన్‌కు అన్నాడీఎంకేతో ఎలాంటి సంబంధం లేదని, ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని పన్నీర్‌ సెల్వం ఈసీని కోరారు. అన్నాడీఎంకే పార్టీ గుర్తును తనకే కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. జయలలిత మరణం తర్వాత ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12 ఉప ఎన్నిక జరగనుంది. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ కూడా ఆర్కేనగర్‌ నుంచే రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు.

14:33 - March 10, 2017

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష చెల్లదంటూ ప్రతిపక్ష నేత సాల్టిన్‌ చెన్నై హైకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ జరిగింది. ప్రతిపక్షం లేకుండా బలపరీక్ష నిర్వహించారని స్టాలిన్‌ తన పిటిషన్‌లో ఆరోపించారు. అయితే నిబంధనల ప్రకారమే బలపరీక్ష నిర్వహించామని తమిళనాడు అసెంబ్లీ కార్యరద్శి న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. రెండు పక్షాల వాదనలు విన్న కోర్టు.. బలపరీక్ష నాటి వీడియో ఫుటేజీని స్టాలిన్‌కు ఇవ్వాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది.

14:43 - March 9, 2017

చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్‌ నియోజకవర్గ స్థానానికి ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 12వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 15వ తేదీన కౌంటింగ్‌ నిర్వహించి.. ఫలితాన్ని విడుదల చేయనున్నారు. ఈ నెల 23 నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. జయలలిత మృతితో ఆర్కేనగర్‌ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.

10:42 - March 8, 2017

ఢిల్లీ : తమిళనాడులో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దీక్షకు కూర్చొంటున్నారు. జయ మరణంపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జయ మరణం తరువాత కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎంగా పళనీ స్వామి ప్రమాణ స్వీకారం చేయడం..సీఎం కావాలని ఆలోచించిన శశికళ జైలుకు వెళ్లడం జరిగిన సంగతి తెలిసింద. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం నిరహార దీక్షకు పూనుకున్నారు. అమ్మ జయలలిత మృతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ ఎగ్మోర్ రాజరత్నం స్టేడియంలో సెల్వం దీక్ష చేయనున్నారు. జయది సహజమరణం కాదని..ఉద్ధేశ్య పూర్వకంగా మరణానికి దగ్గర చేశారని..సీబీఐతో ఎంక్వయిరీ చేయించాలని పన్నీర్ సెల్వం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

12:25 - March 6, 2017

చెన్నై : ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రానున్నారా ? రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోమవారం కమల్ అభిమాన సంఘాలతో అత్యవసరం భేటీ అయ్యారు. దీనితో ఒక్కసారిగా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారనే విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. జయ మరణం తరువాత తమిళనాడులో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ రాజకీయాలపై ట్విట్టర్ వేదికపై కమల్ పలు ట్వీట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో తామే సమస్యలు పరిష్కరిస్తామని ఆయన పేర్కొంటున్నారు. దీనితో ఆయన రాజకీయాల్లో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

జయ మరణం అనంతరం..
జయ మరణం అనంతరం రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిపోవడం..డీఎంకే బలంగా తయారు కావడం వంటివి చోటు చేసుకున్నాయి. జాతీయ పార్టీలు నామమాత్రం కావడంతో సినీ రంగం నుండి రావాలని పలువురిపై వత్తిడి పెరుగుతోంది. అంతేగాకుండా సినీ రంగానికి చెందిన వారు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆయనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. కానీ దీనిపై రజనీ మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. తాజాగా కమల్ పొలిటికల్ ఎంట్రీపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.

19:15 - February 27, 2017

చెన్నై : డీఎంకే పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. సీఎంగా పళనిస్వామి ఎన్నిక చెల్లదని కోర్టులో స్టాలిన్‌ పిల్‌ వేశారు. స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

21:28 - February 26, 2017

చెన్నై:తమిళనాడు ప్రభుత్వ కార్యాలయాల్లో దివంగత సీఎం జయలలిత ఫోటోల వివాదం రోజురోజుకు ముదురుతోంది. స్టాలిన్‌, పన్నీర్‌ సెల్వం మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో, స్థానిక సంస్థల్లో జయలలిత ఫోటోలు ఉండడం, పథకాలకు ఆమె పేరు కొనసాగించడాన్ని డీఎంకే తీవ్రంగా పరిగణిస్తోంది. అమ్మ బొమ్మలు, పథకాలకు చెక్‌ పెట్టేందుకు సిద్ధమైంది. డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌తో శనివారం భేటీ అయ్యారు. జయలలిత ఫోటోలు తొలగించాలంటూ ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. జయలలితను కోర్టు దోషిగా తేల్చిందని, ఆమె ఫోటోలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచడం చట్టవిరుద్దమని అన్నారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పందిచకుంటే కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు.

డీఎంకే తీరును తప్పుపట్టిన పన్నీరు సెల్వం

ప్రభుత్వ కార్యాలయాల్లో జయలలిత ఫోటోలు తొలగించాలన్న డీఎంకే తీరును మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తప్పుపట్టారు. రాజకీయ దురుద్దేశంతోనే డీఎంకే ఆందోళన చేస్తోందని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన జయలలిత చిత్రాలను తొలగిస్తే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆఫీసుల్లోంచి జయ ఫోటోలను తొలగించినా ప్రజల మనసుల్లోంచి అమ్మను తొలగించలేరని అన్నారు. ప్రజలు వరుసగా రెండుసార్లు తిరస్కరించినా డీఎంకేకు బుద్దిరాలేదని దుయ్యబట్టారు. తండ్రి కరుణానిధి బాటలోనే స్టాలిన్‌ కూడా నడుస్తున్నారని పన్నీరుసెల్వం ధ్వజమెత్తారు. మరోవైపు అన్నాడీఎంకే కూడా స్టాలిన్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా డీఎంకే అనేక కుట్రలు చేస్తోందని.. భాగంగానే అమ్మ ఫోటోల వివాదానని సృష్టిస్తున్నారని దినకరన్‌ మండిపడ్డారు.

వాస్తవానికి దోషిగా ముద్రపడ్డ వారి పేర్లు పథకాలకు ఉపయోగించకూడదు.

వాస్తవానికి దోషిగా ముద్రపడ్డ వారి పేర్లు పథకాలకు ఉపయోగించకూడదు. అలాగే వారి ఫోటోలు ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండరాదు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. దీంతో ఆమె ఫోటోలను తొలగించాలన్నది డీఎంకే డిమాండ్‌. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉండడంతో తాము చెప్పిందే చట్టం అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. అమ్మ పేరిట పథకాలు అలాగే కొనసాగుతున్నాయి. మరికొన్ని పథకాలకు అమ్మ పేరు పెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక జయలలిత జయంతిని కూడా ప్రభుత్వం అధికారిక వేడుక తరహాలో నిర్వహించింది. వీటన్నింటిని డీఎంకే తీవ్రంగా పరిగణిస్తోంది. అమ్మ బొమ్మలకు, పథకాలకు చెక్‌ పెట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే సీఎస్‌ను కలిసి జయ ఫోటోలను తొలగించాలని కోరింది. అయితే ఈ చర్య.. రెండు పార్టీల మధ్య తీవ్ర వివాదంగా మారింది. మరి ఈ పరిణామం ఎటువైపు సాగుతుందో వేచి చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - Sasikala