scams

13:31 - May 28, 2017

గద్వాల్ : జిల్లాలో కాల్ మనీ ఘటనలపై జిల్లా ఎస్పీ విజయ్ కుమార్ సీరియస్ అయ్యారు. కాల్ మనీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని, జిల్లాలో కాలనాగుల దుర్మార్గాలు, దౌర్జన్యాలు సహించేది లేదన్నారు. ఈ అంశంపై టెన్ టివితో ఎస్పీ మాట్లాడారు. ఏ స్థాయిలో ఉన్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇంకా ఎలాంటి అంశాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

14:33 - May 12, 2017

సూర్యాపేట : మరో చిట్ ఫండ్ మోసం బయటపడింది. సూర్యాపేటలో వెంకటలక్ష్మీ చిట్ ఫండ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ రెండు వేల మంది ఖాతాదారుల దగ్గర రూ. 2కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును మధ్యతరగతి వర్గాల ప్రజలు ఈ చిట్ ఫండ్ లో సొమ్మును దాచుకున్నారు. రెండు రోజులుగా కార్యాలయం తెరవకపోవడంతో ఖాతాదారులకు అనుమానాలు కలిగాయి. శుక్రవారం పరారయ్యారని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

 

19:41 - May 9, 2017
14:57 - May 7, 2017

హైదరాబాద్ :  ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం పేదలను కోలుకోలేని దెబ్బతీసింది. అసంఘటిత కార్మికులకు పనిదొరకక నానా ఇబ్బందులు పడుతున్నారు. మోదీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నాక.. ఫ్యాక్టరీలలో పని చేస్తున్న 2 లక్షల మంది ఉద్యోగాలు గల్లంతయ్యాయి. మరో 46 వేల మంది పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలకు కోత పడింది. 2016 అక్టోబర్‌ నుంచి 2017 జనవరి మధ్య కార్మికులు.. ఉపాధి కోల్పోయినట్టు ప్రభుత్వ నివేదికే వెల్లడించింది. నోట్ల రద్దు తర్వాత తీవ్ర నగదు కొరత ఏర్పడింది. ఈ ప్రభావం చిన్న తరహా పరిశ్రమలపై పడిందని నివేదికలో బయటపడింది. వ్యవసాయేతర రంగాలైన తయారీ, నిర్మాణ, కార్మిక, రవాణా, వసతి, రెస్టారెంట్లు, ఐటీ, బీపీఓ, విద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించి వివరాలు సేకరించారు. నిర్మాణ రంగంలో సుమారు 1.10 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ఈ కాలంలో పార్ట్‌టైమ్‌కు సంబంధించి 46 వేల మంది ఉద్యోగాలను కోల్పోయారు. నోట్ల రద్దు ప్రభావంతో కార్మికుల జీతాల్లో భారీగా కోతలు పెట్టాల్సి వచ్చినట్టు తేలింది. ఐటీ, బీపీఓల్లో కూడా ప్రభావం కనిపించింది.

పార్ట్‌ టైమ్‌ అధిక ప్రభావం
నోట్ల రద్దు ప్రభావం నిర్మాణ రంగంలో పని చేస్తున్న పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాలపై అధిక ప్రభావం పడింది. 2017లో నిర్మాణ, రవాణా, బీపీఓ, విద్య, ఆరోగ్య విషయాల్లో పురోగమన మార్పులు వచ్చాయని గుర్తించింది. అయితే వసతి, రెస్టారెంట్లలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇందులో కార్మికుల సంఖ్య 1.39 లక్షలు కాగా, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య 1.24 లక్షలుగా నమోదైంది. ప్రతీ యేటా 2.5 కోట్ల మందికి ఉద్యోగాలిస్తామని ఎన్నికల్లో మోదీ వాగ్దానం చేశారు. ప్రస్తుతం దేశంలో ప్రతీ యేటా 1.2 కోట్ల మంది కార్మికులు కొత్తగా చేరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అసంఘటిత రంగంతో పాటు కాంట్రాక్టు కార్మికులకు ఉపాధి దొరకటం కష్టమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే నోట్ల రద్దు ప్రభావంతో కోట్లాది సంఖ్యలో కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులతో పాటు.. పలు రంగాలకు చెందినవారు ఉపాధిని కోల్పోయారని ప్రజా ఉద్యోగ పంఘాలు ఆరోపిస్తున్నాయి. 

18:54 - April 24, 2017

కాకినాడ : ఇళ్లు ఇస్తామని ఆశ చూపించారు. లబ్దిదారుల నుంచి డబ్బులు వసూలు చేశారు. భవనాలు సిద్ధమయ్యాయి. కానీ వాటిని కేటాయించడానికి మాత్రం డబ్బులు కట్టించుకున్నవాళ్లు రెడీగా లేరు. ఎప్పటికప్పుడు ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నాం అంటూ వాళ్ల కలలను కల్లలు చేస్తున్నారు. కాకినాడ నగరంలో ఐహెచ్‌ఎస్‌ఎల్‌ స్కీమ్‌ లబ్ధిదారుల గోడుపై ప్రత్యేక కథనం. కాకినాడ 15వ డివిజన్ ఏటిమొగలో నిరుపేదల కోసం కేంద్రం కేటాయించిన హౌసింగ్‌ స్కీమ్‌లో.. అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరిగింది. మంజూరు చేయడానికి రంగులు కూడా వేసి సిద్ధం చేశారు. కానీ పంపిణీ మాత్రం చేయడం లేదు.

అదనంగా డబ్బుల వసూలు..
ఇళ్ల లబ్ధిదారుల నుంచి ఇప్పటికే అదనంగా డబ్బులు వసూలు చేశారని కొందరు చెబుతున్నారు. మళ్లీ డబ్బులు వసూలు చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో  లబ్ధిదారుల్లో ఆందోళన రేగుతోంది. దీనంతటికీ కారణం నగర ఎమ్మెల్యే సోదరుడు సత్యనారాయణ అనే ఆరోపణలున్నాయి. ఆయన మనుషులే ఇళ్ల పేరుతో భారీ దందాలకు సిద్ధపడుతున్నారని పలువురు వాపోతున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా కేటాయించకపోవడంతో ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు ఇవి వేదికలవుతున్నాయి. తాగుబోతులకు అడ్డాగా మారుతున్నాయి. ఎమ్మెల్యే కొండబాబు వ్యవహారాలన్నీ ఆయన అన్న సత్యనారాయణ చూస్తుంటారు. ఇక్కడ ఏటిమొగ ఇళ్ల కేటాయింపులో కూడా ఆయన మూలంగానే తమకు అన్యాయం జరుగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిధులతో కట్టిన ఇళ్లను కేటాయించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
చాలా కాలంగా ఇళ్ల కేటాయింపు కోసం ఎదురు చూస్తున్న బాధితులు చివరకు ఐహెచ్ఎస్‌ఎల్‌ నిర్మాణాల వద్ద ఆందోళనకు దిగుతారు. తమకు ఈ నెలాఖరులో ఇళ్లు కేటాయించకపోతే కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగుతామంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే సోదరుడి నిర్వాహకం మరోసారి వివాదాస్పదమవుతున్నట్టు కనిపిస్తోంది.

19:49 - March 21, 2017

ఢిల్లీ: రామ జన్మభూమి వివాదాన్ని.. కోర్టు బయటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో అవసరమైతే మధ్యవర్తిత్వం వహించేందుకూ సంసిద్ధతను వ్యక్తం చేసింది. సుప్రీం సూచనను బిజెపి స్వాగతించగా.. విశ్వ హిందూపరిషత్‌ మాత్రం రామాలయ నిర్మాణం కోసం మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది.

కీలక సూచనలు చేసిన సుప్రీం....

అయోధ్యలో వివాదాస్పద రామమందిర నిర్మాణానికి సంబంధించిన కేసుపై సుప్రీంకోర్టు మంగళవారం, కీలక సూచనలు చేసింది. ఇది చాలా సున్నితమైన, భావోద్వేగాలతో కూడిన అంశం కావటంతో కోర్టు వెలుపలే పరిష్కరించుకోవడం మేలని కోర్టు అభిప్రాయపడింది. అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ కోరుతూ బిజెపి నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌ ఇరు వర్గాలు కలిసి కూర్చొని వివాదానికి పరిష్కార మార్గం కనుగొనాలని సూచించారు.

న్యాయ వ్యవస్థ జోక్యం అవసరమనన్నస్వామి ...

రామజన్మభూమి వివాదంలో.. గతంలో కూడా కోర్టు బయట చర్చలు జరిగాయని సుబ్రహ్మణ్య స్వామి కోర్టు దృష్టికి తెచ్చారు. అందుకే ఈ విషయంలో న్యాయ వ్యవస్థ జోక్యం అవసరమని స్వామి అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై ఇరు వర్గాలను సంప్రదించి వారి నిర్ణయాన్ని మార్చి 31లోగా వెల్లడించాలని సుబ్రహ్మణ్య స్వామిని కోర్టు ఆదేశించింది. ఒకవేళ అవసరమైతే, తామూ మధ్యవర్తిత్వం వహించటానికి సిద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

గత 27 ఏళ్లుగా ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నా...

గత 27 ఏళ్లుగా ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నా ఎలాంటి పురోగతి లేదని బాబ్రీ మసీదు యాక్షన్‌ ప్లాన్ సభ్యులు జఫర్‌యాబ్‌ జిలానీ అన్నారు. చర్చల కాలం ముగిసిందని ఆలిండియా ముస్లిం బోర్డు పేర్కొంది. 2010లో రామజన్మభూమికి అనుకూలంగా అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. మరోవైపు, సుప్రీంకోర్టు సూచనను భారతీయ జనతాపార్టీ స్వాగతించింది. కానీ, సంఘ్‌పరివార్‌ మాత్రం దీన్ని తోసిపుచ్చింది. రామాలయ నిర్మాణం కోసం మరో ఉద్యమాన్ని చేపడతామని విశ్వహిందూ పరిషత్‌ స్పష్టం చేసింది. యూపీలోని 70వేల గ్రామాల్లో, మార్చి 26 నుంచి ఏప్రిల్‌ 16 వరకు రామ మహోత్సవం నిర్వహిస్తామనీ వెల్లడించింది. 

19:07 - March 21, 2017

ఢిల్లీ: నేరచరితులపై కొరడా ఝళిపించేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమైంది. ఇకపై దోషులని తేలితే జీవితకాలం నిషేధం విధించాలని ప్రతిపాదిస్తోంది. వారు ఏ పదవులు చేపట్టడానికైనా అనర్హులుగా భావిస్తోంది. ఈమేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. మరోవైపు ప్రజాప్రతినిధుల క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చే సేందుకు తాము వ్యతిరేకం కాదని పేర్కొంది.

నేర రహితం చేసే దిశగా ఈసీ అడుగులు..

రాజ్యాంగం, చట్టం పరిధిలో రాజకీయాలను నేర రహితం చేసే దిశగా ఈసీ అడుగులు వేస్తోంది. నేరచరితులు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండేందుకు...కఠినంగా వ్యవరించాలని నిర్ణయించింది. ప్రస్తుత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, రెండేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడిన దోషులు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమల్లో ఉంది. ఈ నిషేధాన్ని ఆరేళ్లకే పరిమితం చేయకుండా, జీవితకాలం విధించాలని ఎన్నికల కమిషన్‌ ప్రతిపాదిస్తోంది. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్‌ కేసుల సత్వర విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. వాటి ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. ఈమేరకు సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.

క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు...

శాసన, న్యాయ, పాలన వ్యవస్థల్లోని సభ్యులపై దాఖలైన క్రిమినల్‌ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి, న్యాయవాది అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ ఏడాదిలోపు పూర్తి చేసి, వాటిలో దోషులుగా తేలిన వారిని రాజకీయ ప్రక్రియ నుంచి జీవిత కాలం నిషేధించాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై విచారణ సందర్భంగా.. ఈసీ ఈ అఫిడవిట్‌ను దాఖలు చేసింది. నేరచరితులపై జీవితకాల నిషేధానికి తాము వ్యతిరేకం కాదని తేల్చి చెప్పింది.

కనీస విద్యార్హత, వయో పరిమితిపై స్పందించిన ఈసీ ...

ఇక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కనీస విద్యార్హత...చట్ట సభ సభ్యులకు వయో పరిమితి అంశాలపై ఈసీ స్పందించింది. ఆ రెండూ శాసన వ్యవస్థ పరిధిలోనివని, వాటిని అమలుకు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తమ ప్రతిపాదనలు, సిఫార్సుల్లో అత్యధికం కేంద్ర ప్రభుత్వం వద్ద ఏళ్ల తరబడి పెండింగులో ఉన్నాయని, ఇప్పటి వరకూ వాటికి ఆమోదం తెలపలేదని అఫిడవిట్‌లో ఈసీ వివరించింది. రాజ్యాంగం, చట్టం పరిధిలో రాజకీయాలను నేర రహితం చేయాలని తాము ఎప్పటి నుంచో పోరాడుతున్నామని తెలిపింది.

పబ్లిక్‌ సర్వెంట్లు, న్యాయాధికారులకూ వర్తింపజేయాలి-ఈసీ ...

రాజకీయ నాయకులతోపాటు దోషులుగా తేలిన పబ్లిక్‌ సర్వెంట్లు, న్యాయ వ్యవస్థ సభ్యులు కూడా మళ్లీ ఆయా వ్యవస్థల్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించాలని ఈసీ ప్రతిపాదించింది. న్యాయ, పాలనా వ్యవస్థలోని సభ్యులు కూడా పదవులు చేపట్టడానికి అనర్హులుగా ప్రకటించాలని సూచించింది. వారిపై దాఖలైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయాలని అఫిడవిట్లో పేర్కొంది. ఈ పిటిషన్‌ శుక్రవారం మరోసారి విచారణకు రానుంది. 

13:40 - March 17, 2017

విశాఖ : నగరంలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. విశాఖ అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ముమ్మన రాజేశ్వరరావు ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహించారు. ఏకకాలంలో ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి.. 20 కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది. 1990లో 1450 రూపాయల జీతంతో రాజేశ్వరరావు ఉద్యోగంలో చేరారు. 2012 నుంచి 2016 వరకు నాలుగేళ్ల కాలంలో అత్యధికంగా ఆస్తులు సంపాదించినట్లు గుర్తించామని ఏసీబీ అధకారులు చెబుతున్నారు.  

 

15:34 - February 26, 2017
08:52 - February 2, 2017

నల్గొండ : పోలీసులకు గ్యాంగ్ స్టార్ నయీంకు ఉన్న సంబంధాలు ఒక్కోక్కటి వెలుగుచూస్తున్నాయి. వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన నయీంతో పోలీసు, రాజకీయ ప్రముఖులతో ఎలాంటి సంబంధాలు లేవని సిట్ హైకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నయీం దందాకు సహకరించిన పోలీసుల వ్యవహారాలు బట్టబయలు చేస్తున్న కొన్ని ఫోటోలు బట్టబయలయ్యాయి. సుమారు 16 మంది పోలీసు ఉన్నతాధికారులు నయీంతో విందువినోదాలు చేస్తున్న ఫోటోలు బహిర్గతమయ్యాయి. ఈ ఫోటోలు పోలీసుల చేతికి చిక్కినప్పటికీ సిట్ అధికారులు ఆ ఫోటోలలో వున్న వారిని పక్కకి తప్పించడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా డీఎస్పీ మద్దిపాటి శ్రీనివాసరావుతో పాటు నయీం కలిసి ఉన్న ఫొటోలు బయటపడ్డాయి. భువనగిరి వినాయకుడి వద్ద సీఐ తిరుపతన్న, నయీం కలిసి దిగిన ఫొటో సంచలనం రేపుతున్నాయి. పోలీసులతో కలిసి లంచ్‌లు, డిన్నర్‌లు చేసి నయీం ప్రత్యర్థులను చంపేందుకు పోలీసుల సహకారం తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  నయీం పోలీసు అధికారుల సాయంతోనే గ్యాంగ్ స్టర్ గా ఎదిగాడని, బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు లేవని ఈ ఫోటోలు పేర్కొంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. విపక్షాలు సీబీఐ విచారణ కోరున్నప్పటికీ ప్రభుత్వం నిరాకరించడం, నయీం ఇళ్లపై దాడులు చేస్తున్న సందర్భంగా పట్టుబడ్డ నగదు, నగలు, డాక్యుమెంట్లను గోల్ మాల్ చేయడానికేనని బాధితులు ఆరోపిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - scams