school students

17:39 - February 15, 2018

హైదరాబాద్ : షంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసినట్లు స్కూల్‌ ప్రిన్సిపల్‌ కూచీపూడి సునితా తెలిపారు. ఎగ్జిబిషన్‌తో అనేక విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు చెప్పారు.  

19:48 - February 3, 2018

భద్రాద్రి : జిల్లాలోని పాల్వంచలో మధ్యాహ్నం భోజనం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. అన్నం సరిగా ఉడకకపోవడంతో చిన్నారులు... తినకుండా వదిలేయాల్సి వచ్చింది. మూడురోజులుగా ఇదే తంతు జరుగుతున్నా... ఉపాధ్యాయులు పట్టించుకోలేదు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని.. ఇటీవలే మధ్యాహ్నం భోజనం కాంట్రాక్ట్‌ను అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థకు అప్పగించారు. అప్పటి నుంచి ఆహారం సరిగా ఉండటం లేదని స్థానిక విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

 

14:04 - January 17, 2018

హైదరాబాద్ : కాచిగూడలోని వెంకటేశ్వర నగర్ లో నడి రోడ్డు పై రెండు గ్యాంగ్ లు కొట్టుకున్నాయి. ఒకరిపై ఒకరు తీవ్రంగా వారు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలు కాచిగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘర్షణలో అంబర్ పేటకు చెందిన ముగ్గురు రౌడీ షీటర్లు ఉన్నట్టు సమాచారం ఉంది. పోలీసులు కేవలం పిటి కేసు నమోదు చేసి వదిలేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:40 - January 12, 2018

అనంతపురం : తాడిపత్రిలోని పాఠశాలల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అలనాటి పండుగల ఆచారాలు ఉట్టిపడేలా వేడుకలను నిర్వహించారు. పాఠశాలలో ముగ్గులు వేసి.. రంగురంగుల బొమ్మల కొలువులను ఏర్పాటు చేశారు. అష్టలక్ష్మి దేవతల రూపంలో పిల్లలు అలరించారు. హరిదాసు వేషాలతో పిల్లలు.. నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

 

17:46 - January 8, 2018

భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని అశ్వారావుపేట వ్యవసాయ పాలిటెక్నికల్‌ కాలేజీలో విద్యార్థులు, అధ్యాపకుల మధ్య తలెత్తిన వివాదం తారాస్థాయికి చేరింది. అధ్యాపకురాలు రేణుక తమ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రేణుక వేధింపులతో మనస్తాపానికి గురైన డిప్లొమా రెండో సంవత్సరం విద్యార్థిని రోహిణి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ వ్యవహారంపై విద్యార్థులు, అధ్యాపకులు పరస్పరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. 
భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ పాలిటెక్నికల్‌ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం 

 

17:58 - January 4, 2018

పెద్దపల్లి : నిర్భయ లాంటి కఠిన చట్టాలొచ్చినా ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఏ మాత్రం అవకాశం దొరికినా మృగాళ్లు చెలరేగిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలికపై.. కడంబాపూర్‌కు చెందిన పెద్ది నగేష్‌ లైంగికదాడికి తెగబడ్డాడు. కనుకుల అటవీ ప్రాంతంలో కట్టెలు ఏరేందుకు వెళ్లిన మైనర్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చిన నగేష్‌ అత్యాచారం చేశాడు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అయితే రాజీ కుదిర్చేందుకు స్థానికంగా ఉన్న పెద్దమనుషులు విఫలయత్నం చేశారు. నెల రోజుల తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

20:09 - December 26, 2017

విశాఖ : ఏజెన్సీలో దారుణం చోటు చేసుకుంది. విద్యా, బుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. గాడి తప్పారు.  విద్యార్థినులపై  లైంగిక దాడికి పాల్పడ్డారు.  ఆగ్రహించిన తల్లిదండ్రులు.. దేహశుద్ధి చేశారు.  జి.మాడుగుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులపై  ముగ్గురు ఉపాధ్యాయులు... లైంగిక వేధింపులకు  పాల్పడ్డారు. ఒంటిపై చేతులు వేసి.. అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ విద్యార్థునులు పాఠశాలకు వెళ్లడం మానేశారు. దీనిపై తల్లిదండ్రులు నిలదీయడంతో.. విద్యార్థునులు అసలు విషయం చెప్పారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలదీశారు.
ఒకరికి దేహశుద్ధి చేశారు. 

 

15:08 - December 19, 2017

హైదరాబాద్‌ : ఉప్పల్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. చిలుకానగర్‌ సమీపంలో చిన్నారిని స్కూల్‌కు తీసుకువెళ్తుండగా.. వేగంగా వచ్చిన లారీ యాక్టివాను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మూడో తరగతి చదువుతున్న చిన్నారి భూమిక మృతి చెందింది. చిన్నారి తల్లి పరిస్థితి విషమంగా ఉంది.

07:52 - December 13, 2017

చిత్తూరు : ఏపీలో విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తిరుపతిలో నారాయణ కాలేజీ విద్యార్థి శ్రీహర్ష ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ మెడికల్‌ అకాడమీలో చదువుతున్న శ్రీహర్ష ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసున్నాడని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.  

 

13:08 - December 12, 2017

విశాఖ : జిల్లాలోని పాయకరావుపేటలోని శ్రీప్రకాశ్‌ విద్యాలయంలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు. బి. హర్ష, నర్సీచేతన్‌ శివదుర్గ వీరబాబు అనే విద్యార్థులు కనిపించకుండా పోయారు. స్కూల్‌ ప్రిన్సిపాల్‌, వార్డెన్‌ మందలించారని విద్యార్థులు తీవ్ర మనస్తాపం చెందారు. దీంతో ఎవ్వరికీ చెప్పకుండా హాస్టల్‌ వదిలి పోయినట్టు తెలుస్తోంది. దీనిపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Pages

Don't Miss

Subscribe to RSS - school students