sexual harassment

15:36 - November 15, 2018

న్యూఢిల్లీ: ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో మహిళా వర్కర్లపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖమంత్రి మేనకా గాంధీ కేంద్ర సమాచార శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్‌కు ఓ లేఖ రాశారు. క్యాజువల్ ఎనౌన్సర్లుగా పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్న దృష్ట్యా తక్షణమే విచారణ జరిపించాలని మంత్రిని మేనకా గాంధీ కోరారు. 
దీనికి సంబంధించిన ఒక వార్తా క్లిప్పింగ్‌ను కూడా మంత్రి జతచేశారు. ఈ వేధింపులు ఢిల్లీలొనే కాక పలు ఆల్ ఇండియా రేడియోలోని వివిధ కేంద్రాల్లో చోటు చేసుకుంటున్నాయని మేనకా గాంధీ తెలిపారు. ఎవరైన మహిళ లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే.. ఒక బాధ్యత కలిగిన సంస్థలో పనిచేస్తున్న మహిళలకు సమాన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. వారు పర్మినెంట్ ఉద్యోగా.. లేదా తాత్కాలిక ఉద్యోగా అన్న తారతమ్యాలు చూపకూడదని మేనకా గాంధీ ఈ లేఖలో కోరారు.
 

 

18:27 - November 4, 2018

డెహ్రాడూన్: "మీటూ"సెగ బీజేపీని బలంగానే తాకినట్టు కనిపిస్తోంది. మీటూ దెబ్బకు కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి ఎంజేఅక్బర్ తన పదవి కోల్పోయినా, ఇంకా ఆయనపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి  సంజయ్ కుమార్ పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆయన్నికూడా పార్టీ పదవి నుంచి తప్పించారు. పార్టీకి చెందిన ఓమహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదుతో  సంజయ్ కుమార్ పై పార్టీ వేటు వేసింది.  సంజయ్ కుమార్ పై ఆరోపణలు వచ్చినప్పటినుంచి అతడ్ని పదవి నుంచి తొలగించాలని స్ధానికంగా నిరసనలు వెల్లువెత్తాయి. బీజేపీ అధిష్టానం సంజయ్ ని ఢిల్లీ పిలిపించి పార్టీ పదవి నుంచి తొలగిసస్తున్నట్లు తెలిపింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తీసుకున్ననిర్ణయాన్నిపార్టీ అధిష్టానం ఉత్తరాఖండ్ రాష్ట్ర నేతలకు చెప్పింది. త్వరలోనే నూతన ప్రధానకార్యదర్శిని కేంద్ర కమిటీ ప్రకటిస్తుందని తెలిపారు. 

16:53 - October 24, 2018

ఢిల్లీ : హాలీవుడ్‌లో మొదలైన ‘మీ టూ’ భారత్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులపై సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు గతంలో జరిగిన చేదు అనుభవాలను స్వేచ్చగా మహిళామణులు నినదిస్తున్నారు. దీనితో ఒక్కసారిగా పరిణామాలు వేడెక్కాయి. తాజా, మాజీ హీరోయిన్లు.., . సెలెబ్రెటీలు..,లైంగిక వేధింపుల గురించి ధైర్యంగా వెల్లడిస్తు మీ టూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తు్న్నారు. ఇవన్నీ నిజం కాదని ఆరోపణలు వచ్చిన వారు వీటిని ఖండిస్తున్నారు. 
తాజాగా ప్రముఖ టెలివిజన్ నటి సొనాల్ వెంగురేల్కర్ స్పందించింది. తనతో ఫొటోగ్రాఫర్, కాస్టింగ్ డైరెక్టర్ రాజ బజాజ్ అసభ్యకరంగా ప్రవర్తించాడని, ఇదంతా 19 ఏళ్ల వయస్సులో జరిగిందని తెలిపారు. ఓ ఆన్ లైన్ పోర్టల్‌లో అడిషన్ కోసం సంప్రదించడం జరిగిందని, అడిషన్‌లో తాను పొల్గొనడం జరిగిందన్నారు. Image result for Sonal Vengurlekarఓ రోజు తన దుస్తులను తొలగించేందుకు ప్రయత్నించాడని, బలవంతంగా ఛాతీపై క్రీమ్ రాసేందుకు యత్నించాడని వెల్లడించింది. Image result for Raja Bajaj sexual harassmentమరలా తన గదికి వచ్చిన బజాజ్ తాంత్రిక విద్యలు నేర్పిస్తానని..రాత్రికి రాత్రే స్టార్ అయిపోవచ్చని..కానీ దుస్తులు తొలగించి తన ఎదుట కూర్చొని తాను చెప్పిన మంత్రాలను చెప్పాలని డిమాంఢ్ చేశాడని ఆరోపించింది. షాక్‌కు గురైన తాను బజాజ్‌పై 2012లో కస్తుర్బామార్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. రాజా బజాజ్ ఆమె ఆరోపణలని తోసిపుచ్చారు. సొనాల్ తన ఇంటికి వచ్చి మూడు లక్షలు డిమాండ్ చేసిందని, ఆ తరువాత లక్షన్నర కి దిగివచ్చిందని దానికి ఒప్పుకోకపోవడంతో ఆమె ఈ విధమైన ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. 

 
14:27 - October 17, 2018

ముంబై : మీ టూ...ప్రకంపనల పర్వం కొనసాగుతోంది. బాలీవుడ్ నుండి మొదలైన ఈ ప్రకంపనలు రాజకీయాలకు కూడా పాకుతున్నాయి. నానా పాటేకర్‌పై బాలీవుడ్ నటి తను శ్రీ దత్త తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం తాము వేధింపులకు గురయ్యామంటూ పలువురు నటీమణులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పెయింటర్ జతిన్ దాస్‌పై కూడా పలు ఆరోపణలు వచ్చాయి. నిషా బోరా అనే మహిళ జతిన్‌పై ఆరోపణలు గుప్పించారు. తాను 14 ఏళ్ల వయస్సులో ఉండగా ఆయన వేధించారని ఆరోపించారు. 
Image result for #meToo Nandita Das Response On Sexual Harassment Allegation On Fatherదీనిని జతిన్ ఖండించారు. తాను షాక్‌కు గురయ్యాయనని, ఆమె అసభ్యంగా మాట్లాడుతోందన్నారు. ఆమె ఎవరో తనకు తెలియదని, ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ ఆమెను ఏ సందర్భంలోనైనా కలిసి ఉన్నప్పటికీ అలా ప్రవర్తించి ఉండననని వెల్లడించారు. 
ఇక ఆమె కుమార్తె నందితా దాస్ ఎలా స్పందిస్తారో అని ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆమె మౌనం వీడారు. దీనికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. మీటూ’ ఉద్యమానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని, కానీ తన తండ్రిపై ఇబ్బందికరమైన తప్పుడు ఆరోపణలు వచ్చాయన్నారు. మహిళలు/పురుషులు మాట్లాడటానికి ఇదే సరైన సమయమని, వారు చెప్పే విషయాల్ని వినాలన్నారు. కానీ ఆరోపణలు ‘మీటూ’ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

08:24 - October 17, 2018

ఢిల్లీ : సినీరంగం నుంచి మొదలై వివిధరంగాల్లో ప్రకంపనలు పుట్టిస్తున్న మీటూ ఉద్యమం సెగ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని తాకింది. మొన్నటికి మొన్న ఎన్డీయేలోని కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్  జర్నలిస్టుగా పనిచేసేటప్పుడు మహిళా ఉద్యోగినులను వేధించిన ఆరోపణలతో తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. లేటెస్ట్ గా  కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం (ఎన్.ఎస్.యూ.ఐ) జాతీయ అధ్యక్షుడు  ఫైరోజ్ ఖాన్  లైంగిక వేధింపుల కేసులో మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. చత్తీస్ ఘడ్ కు చెందిన ఒక మహిళా కాంగ్రెస్ కార్యకర్త  ఫైరోజ్ ఖాన్ తనను లైంగికంగా వేధించాడని  పోలీసులకు ఫిర్యాదు  చేసింది. ఫైరోజ్ ఖాన్ వల్ల తన ప్రాణాలకు ముప్పు  పొంచి ఉందని  కూడా ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.  ఫైరోజ్ ఖాన్ రాజీనామాను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన ఫైరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లకూడదనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అయితే మహిళ చేసిన ఆరోపణలపై  నిజానిజాలు విచారించేందుకు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. 

15:18 - October 16, 2018

‘#మీ టూ’ హ్యాష్ ట్యాగ్ మీ టూ ఉద్యమం అసలు ఎలా ఉద్భవించిందొ తెలుసా? ఇప్పుడ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఉద్యమం సంచలనాలు సృష్టిస్తే.. భారత్‌లో పెద్ద ప్రకంపనాలనే సృష్టిస్తోంది. దీని తాకిడికి భారతీయ సినీ రంగం అతలాకుతలం అవుతోంది. సినిమాలు ఆగిపోతున్నాయి. వేల కోట్ల రూపాయలు ఆవిరిఅయిపోతున్నాయి. ఇంతటి సునామీకి కారణం ఎవరో తెలుసా? తరానా బూర్కే అనే అమెరికన్ బ్లాక్ ఉమన్. 
అసలు తరానా 2006 సంవత్సరంలోనే మీ టూ ఉద్యమాన్ని రూపొందించినా.. అది కార్యారూపం దాల్చి జనం మధ్యకు రావడానికి పదేళ్ల పైనే పట్టింది. ఈ  ‘మీ టూ’ ఉద్యమం అక్టోబర్ 15, 2017లో జనబాహుళ్యంలోకి వచ్చింది. మహిళలు ఎదుక్కొంటున్న లైంగిక వేధింపులు, దాడులను భరించిన మహిళలు ఎలుగెత్తి చాటిచెప్పే వేదిక ‘మీ టూ’. ఏడాది తర్వాత తరానా వెనక్కితిరిగి చూసుకుంటే తను కలలు కన్న ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో తరానా ఆనందానికి హద్దులు లేవు. ఈ సందర్భంగా తరానా ఈ విధంగా ట్వీట్ చేసింది.

‘‘అసలు ‘మీ టూ’ ఉద్యమం 20 ఏళ్ల కిందే ప్రారంభం అయ్యింది. పదేళ్ల క్రితం ఈ ఉద్యమం ఓ రూపు దాల్చింది. ఏడాది క్రితం ఈ శక్తిని ప్రపంచం అర్ధం చేసుకొంది. ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదు. ఈ ఉద్యమాన్నిమరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇంకా చాలా చేయాల్సిఉంది’.’ 
 

14:29 - October 16, 2018

కర్నాటక : రుణం కావాలని అడిగిన మహిళపై ఓ బ్యాంకు మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. లోన్ మంజూరు చేయమంటే తన కోరిక తీర్చమన్నాడు. దీంతో ఆగ్రహించిన మహిళ మేనేజర్‌కు దేహశుద్ధి చేసింది.  
కర్నాటకలోని దవనగిరిలో ఓ మహిళ లోన్ కోసం బ్యాంకుకు వెళ్లింది. రుణం కావాలని మేనేజర్‌ను అడిగింది. అయితే రుణం కావాలని అడిగిన ఆ మహిళపై బ్యాంకు మేనేజర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన కోరిక తీరిస్తే లోన్ మంజూరు చేస్తానన్నాడు. రుణం కావాలని అడిగినందుకు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని సదరు మహిళ ఆరోపిస్తోంది. తన కోరిక తీర్చితేనే లోన్ మంజూరు చేస్తామనడంతో ఆగ్రహించిన మహిళ బ్యాంకు మేనేజర్‌కు దేహశుద్ధి చేసింది. అతని చొక్కా పట్టుకుని చితకబాదింది. చెప్పుతో, కట్టెతో దాడి చేసింది.  

12:52 - October 15, 2018

హైదరాబాద్: ‘#మీ టూ’ సృష్టిస్తున్న సునామీతో దేశం అల్లకల్లోలం అవుతోంది. సినిమా, మీడియా, రాజకీయ, కార్పొరేట్ రంగాలను ఇది భారీగా కుదిపేస్తోంది. లైంగిక వేధింపుల బారిన పడిన ఎందరో వనితలు గళం విప్పి సోషల్ మీడియా వేదికగా తన బాధలను ప్రజలతో పంచుకుంటున్నారు. దీనిపై ఏం చేయాలో అర్థంకాని గందరగోళంలో కేంద్ర, రాష్ట్ర సర్కర్‌లు కొట్టుమిట్టాడుతున్నాయి. గతంలో ఎన్నడూ మన దేశంలో ఇటువంటి న్యాయపరమైన సంకటస్థితి తలెత్తలేదు. మన చట్టాలు ఇందుకు సిద్ధంగా ఉన్నాయా అన్నది అనుమానమే. అందుకే ‘మీ టూ’ కేసులను విచారణ చేసేందుకు తక్షణ చర్యగా కేంద్రం మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ నలుగురు రిటైర్డ్ న్యాయవాదులతో ఓ కమిటీని నియమించారు. Image result for me too
వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపులపై చట్టం ఏం చెబుతోంది?
సాధారణంగా చెప్పాలంటే..మహిళ ఉద్యోగిని శారీరకంగా, భావోద్వేగం(ఎమోషనల్‌)గా, ఆర్థిక స్వేచ్ఛ, భధ్రతకు భంగం కలిగించడమే సెక్సువల్ హెరాస్‌మెంట్ కిందకు వస్తుంది. న్యాయపరంగా చెప్పాలంటే... 
1) శారీరకంగా తగలడంతో పాటు కవ్వించే చర్య
2) లైంగిక ఉద్దేశ్యాన్ని కలిగించే విధంగా మాట్లాడటం 
3) లైంగిక వాంఛతో డిమాండ్ లేదా కోరికలు వెలిబుచ్చడం
4) అశ్లీల చిత్రాలు చూపించడం
5) ఇవికాక ఇష్టపడని లైంగిక సంబంధమైన వ్యాఖ్యలు లేదా వ్యాఖ్యలు లేని ప్రవర్తన 

వీటితో పాటు బాధితురాలు లైంగిక వేధింపులు జరిగినట్టుగా వేదనకు గురైనా..భావించినా, ఆరోగ్య, భద్రత సమస్య తలెత్తినట్టుగా పనిచేసే చోట భావించినా..లైంగిక వేధింపులుగానే పరిగణించబడుతుంది. 

Image result for sexual harassment at work placeఅలాగే... యజమాని కానీ.. బాధితురాలితో కలిసి పనిచేసే వ్యక్తులు కాని తమ చర్యల ద్వారా లేదా మాటల ద్వారా లేదా సంజ్ఞల ద్వారా బాధితురాలికి ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టిస్తే దాన్ని లైంగిక వేధింపులుగానే పరిగణిస్తారు. 
2013 లైంగిక వేధింపుల చట్టం ఇదే చెబుతోంది! 
నీ కిది నాకిది (క్విడ్ ప్రో కో) గురించి కూడా అంటే ఇచ్చి పుచ్చుకొనే దానిపై కూడా ఈ చట్టం సవివరంగా వివరించింది. కొన్ని పరిస్థితులకు తలోగ్గి మహిళా బాధితురాలు ఇష్టపూర్వకంగా సమ్మతించినా అది లైంగిక వేధింపుల కిందే భావించబడుతుంది. ఈ చట్టంలో ఇది చాల ముఖ్యమైన నిబంధన ఎందుకంటే నిందితుడు తన వాదనను బలపరుచుకొనేందుకు ఇష్టపూర్వక చర్యగా పేర్కొనవచ్చు. ఈ వాదనలో బాధితురాలు యొక్క వాదనకే ఎక్కువ బలాన్ని చేకూర్చేందుకు చట్టం వీలు కల్పించింది.  ఈ చట్టం ప్రకారం శారీరక కలయిక ఒక్కటే లైంగిక వేధింపులు కాదు... తిట్టడం, శారీరక కోర్కెలు వ్యక్తపరిచే విధంగా జోకులు పేల్చడం, లైంగికంగా భావాలు వ్యక్తీకరించడం, అశ్లీల చిత్రాలను షేర్ చేయడం, వ్యక్తిగత ఖ్యాతికి భంగం కలిగిస్తూ రూమర్స్ క్రియేట్ చేయడంతో పాటు ఎటువంటి చర్య అయినా పనిచేసే ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేయటాన్ని లైంగిక వేధింపుల కిందే భావిస్తుంది ఈ చట్టం. 

Image result for sexual harassment at work placeఈ చట్ట ప్రకారం.. ఏదేని వ్యక్తి పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు నిరూపించబడితే అతనికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 354 కింద 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. 
అయితే ఈ చట్టంకానీ.. చట్టం రూపొందించిన మార్గదర్శకాలు కానీ  ఎక్కడా ఎంత సమయంలోపు లైంగిక వేధింపుల కేసు రిజిస్టర్ చేయాలి అనేది నిర్ధారించలేదు. కాబట్టి ఎంత కాలం తర్వాతైనా ఫిర్యాదు చేయవచ్చు అని అర్థం చేసుకోవాలి. 
2013 లైంగిక వేధింపుల చట్టం ఎలా వచ్చింది?

  • 1997 లో మొదటిసారి ఈ చట్టం అవసరాన్ని గుర్తించారు
  • ఈ చట్టం రూపొందించడానికి ఉపయోగపడింది కేవలం ఒక పిటీషన్
  • ‘విశాఖ’ అనే స్వచ్ఛంధ సంస్థ రాజస్థాన్‌లో 1992లో జరిగిన ఒక గ్యాంగ్‌రేప్ కేసును సుప్రీంకోర్టులో 1997లొ సవాల్ చేసింది.
  • దీంతో పనిచేసే చోట లైంగిక వేధింపులపై ఐపీసీ సెక్షన్ 354 కింద 509 కింద డీల్ చేయాలని కోర్టు భావించింది. 
  • సెక్షన్ 354 అంటే మహిళలు గౌరవంగా జీవించే హక్కును కాలరాయడం. సెక్షన్ 509 ఏం చెబుతోందంటే.. భావ వ్యక్తీకరణ ద్వారా కానీ, మాటల ద్వారా కానీ లేదా మహిళల అవమానానికి గురిచేసే చర్యలు లైంగిక వేధింపుల కిందకు వస్తాయి.
  • రాజస్థాన్‌ సంఘటన జరిగిన 16 ఏళ్ల తర్వాత ‘విశాఖ’ అనే స్వచ్ఛంధ సంస్థ రూపొందించిన మార్గదర్శకాల ద్వారా.. సెక్సువల్ హెరాస్‌మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్‌ వర్క్‌ప్లేస్ (ప్రివెంక్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెశల్) చట్టం, 2013 ను పార్లమెంటు ఆమోదించింది. 
11:43 - October 12, 2018

ఢిల్లీ : ‘మీ టూ’ (నేనూ బాధితురాలినే) సంచలనం సృష్టిస్తోంది. ఒక ఉద్యమంలా మారతోంది. తమపై జరిగిన లైంగిక దాడులు..వేధింపులను మహిళలను ప్రస్తుతం బహిర్గతం చేస్తున్నారు. ప్రముఖులపై ఆరోపణలు చేస్తుండడంతో కలకలం రేపుతోంది. బాలీవుడ్ నటుడు నానా పటేకర్‌పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలతో పలువురు కూడా స్పందించారు. ఇతర హీరోలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 
తండ్రి పాత్రలను పోషించి ఆకట్టుకున్న నటుల్లో అలోక్ నాథ్ ఒకరు. ఆయన పోషించిన పాత్రలతో..టీవీ షోలలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రచయిత్రి బింటా నంద, సంధ్యా మృదుల్‌లు లైంగిక వేధింపులు ఆరోపణలు చేశారు. ఈ జాబితాలో మరో నటి చేరింది. Image result for Actress Deepika Amin Accuses Alok Nath Of Sexual Harassment
అలోక్ నాథ్ మద్యానికి బానిస అని, మహిళలను వేధిస్తాడని సోను కే టిటు క స్వీటీ’ చిత్రంలో నటించిన నటి దీపిక ఆమీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని సంవత్సరాల క్రితం షూటింగ్‌లో పాల్గొన్న తాను ఓ గదిలో ఉండగా అలోక్ నాథ్ చొచ్చుకొని వచ్చాడని ఆ సమయంలో యూనిట్ సభ్యులు అండగా నిలిచారని పేర్కొన్నారు. చిన్న వయస్సులో జరిగిన ఈ ఘటన ఇప్పటికీ గుర్తుకొస్తుంటే భయంగా ఉంటుందని తెలిపారు. ఈ విషయాలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియచేశారు. ఇవన్నీ అసత్య ఆరోపణలు అని అలోక్ నాథ్ న్యాయవాది తెలిపారు. కేవలం ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. వస్తున్న ఆరోపణల్ని చట్టప్రకారం ఎదుర్కోవడానికి అలోక్‌నాథ్‌ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 

10:24 - October 11, 2018

ముంబై: ‘మీటూ’ ఉద్యమం దుమారం రేపుతోంది. దేశాన్ని కుదిపేస్తోంది. పలు రంగాల్లో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇన్నాళ్లు తమలోనే దాచుకున్న బాధలను నిర్భయంగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సొసైటీలో పెద్దలుగా చలామణి అవుతున్న వారి బాగోతాలను వెలుగులోకి తెస్తున్నారు. 

మీటూ ఉద్యమం సినీ, క్రీడా రంగాలనే కాదు రాజకీయాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి శ్రీలంక మాజీ క్రికెటర్‌, ప్రస్తుత శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి అర్జున రణతుంగ కూడా చేరిపోయారు. రణతుంగ తనను లైంగికంగా వేధించాడంటూ ముంబైకి చెందిన ఓ ఎయిర్‌ హోస్టెస్‌ ఆరోపించారు. ముంబైలోని ఓ హోటల్‌లో తనకు ఎదురైన ఘటన గురించి ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆమె ఏం చెప్పిందో ఆమె మాటల్లోనే...

‘కొన్నేళ్ల క్రితం క్రికెట్‌ మ్యాచ్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్లు ముంబైలోని జుహు సెంటార్‌ హోటల్‌లో దిగాయి. అక్కడకు వెళ్లి వాళ్ల వద్ద ఆటోగ్రాఫ్‌ తీసుకుందామని నా సహచర ఉద్యోగిని కోరింది. సరేనని అక్కడికి వెళ్లాం. శ్రీలంక క్రికెటర్ల వద్దకు వెళ్లగానే నాకు భయం వేసింది. వాళ్లు దాదాపు ఏడుమంది ఉన్నారు. మేం ఇద్దరమే. నాకు అసౌకర్యంగా, ఇబ్బందిగా అనిపించడంతో వెంటనే వెళ్లిపోదామని నా స్నేహితురాలిని కోరాను. అంతలోనే వారు కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. నేను తాగలేదు. అంతలోనే మరికొందరు మమ్మల్ని హోటల్ వెనకవైపు ఉన్న స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ శ్రీలంక క్రికెటర్‌ అర్జున రణతుంగ నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా నడుము మీద చేయివేయబోయాడు. నేను అతడిని తప్పించుకుందామని ప్రయత్నించాను. ఆయన నన్ను కొట్టాడు. నేను పోలీసులతో చెప్పి పాస్‌పోర్ట్‌ రద్దు చేయిస్తానని బెదిరించాను. ఆయన వద్ద నుంచి తప్పించుకుని వచ్చి రిసెప్షన్‌లో ఫిర్యాదు చేస్తే ‘ఇది మీ వ్యక్తిగత విషయం. మేం ఎలాంటి సహాయం చేయలేం’ అని చెప్పేశారు’ అంటూ ఆమె పోస్ట్‌ పెట్టింది.

Pages

Don't Miss

Subscribe to RSS - sexual harassment