shalini

09:55 - May 4, 2018

మేడ్చల్ : అతివేగం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన గంగరాజు కతార్ వెళ్లి తిరిగి వస్తున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అతన్ని రిసీవ్ చేసుకునేందుకు అతని భార్య సత్తవ్వ (35), ఇద్దరు పిల్లలు శ్రవణ్ (12), శాలిని (12) కలిసి కారులో వెళ్తున్నారు. మార్గంమధ్యలో మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండలం తుర్కపల్లి వద్ద ఆగి వున్న లారీని అతివేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితోపాటు కారు డ్రైవర్ రాజు (24)  మృతి చెందారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. 

 

20:04 - August 25, 2017

పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా స్టార్ డమ్ సంపాధించుకున్న విజయ్ దేవరకొండ లేట్ అయినా పర్వాలేదు హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యి... చాలా ఓపికగా.. అర్జున్ రెడ్డీ మూమూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు.. టీమ్ అంతా ఎంతో ఎఫర్ట్ పెట్టి తీసిన అర్జున్ రెడ్డీ ప్రేక్షకులను ఏ మేరకు అలరించాడు. టీమ్ నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టాడు ఇప్పుడు చూద్దాం...

ఈ సినిమా కథ విషయానికి వస్తే మెడికో అయిన అర్జున్ రెడ్డీ అస్సలు కోపం కంట్రోల్ చేసుకోలేడు.. అలాంటి అతను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన ప్రీతీని తొలి చూపులోనే ప్రేమిస్తాడు... అర్జున్ తన మీద చూపిస్తున్న కేరింగ్, ఎఫెక్షన్ చూసి ఆమె కూడా లవ్ లో పడుతుంది... అయితే శారీరకంగా ఒకటై చాలా కాలం రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళ పెళ్లికి హీరోయిన్ ఫాదర్ అడ్డు పడతాడు.. ఆమెను వేరే ఒకరికి ఇచ్చి పెళ్ళి చేస్తారు... అయితే ఆమెను పిచ్చిగా ప్రేమించిన అర్జున్ రెడ్డీ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు.. ఆమె జ్ఞాపకాలనుండి బయట పడ్డాడా లేదా చివరికి అతని జీవితం ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే...

నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాకి బ్యాక్ బోన్ గా నిలిచాడు విజయ్ దేవరకొండ సినిమా చూస్తున్నంత సేపు మనకు స్క్రీన్ పై అర్జున్ రెడ్డే కనిపిస్తాడు.. అంతగా ఆ పాత్రను ఓన్ చేసుకుని నటించాడు విజయ్.. బ్లడ్ అండ్ హార్ట్ పెట్టి పని చేశాడు.. ఇక హీరోయిన్ షాలినీ జస్ట్ ఒక నార్మల్ అమ్మాయిగా విత్ అవుట్ మేకప్ తో ప్రజంట్ చేశారు హీరో లవ్ లో సింన్సియర్ గా ఉన్నాడు తప్పా.. ఆ అమ్మాయి అందం చూసి లవ్ చేయలేదు అని అలా డిజైన్ చేసినట్టు ఉన్నారు..అయితే క్లైమాక్స్ ఒక్క సీన్ లో తన నటనకు మంచి అప్లాజ్ వచ్చింది... పెళ్ళి చూపులు ఫేమ్ ప్రియదర్శి ఏదో సెంటి మెంట్ కోసం కనిపించాడు.. ఇక ఈ సినిమాతో పరిచయం అయిన కొత్త కమెడియన్ రాహుల్ రామకృష్ణ నాచ్యూరల్ స్లాంగ్ తో కామెడీ పండించి సినిమాకు చాలా ప్లస్ అయ్యాడు.. ఇక మిగతా నటీనటులు పాత్రల పరిది మేరకు బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు..

టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఇలాంటి కల్ట్ సినిమాను టేకప్ చేసిన రైటర్ అండ్ డైరక్టర్ సందీప్ రెడ్డీని మెచ్చుకోవాల్సిందే.. ఎంచుకున్న పాయింట్ ను కామెడీ, ఎమోషన్స్ తో మిక్స్ చేసి చెప్పిన విధానం బావుంది.. సినిమాను క్లారిటీగా తీసిన విధానంలో కమిట్ మెంట్ రిప్లేక్ట్ అవుతుంది.. ఇక అంత అరచి కోల చేసిన లిప్ కిస్ సీన్స్ కథలో బాగంగా వచ్చాయి.. పైగా హీరో హీరోయిన్ కు మధ్య వల్గర్ రొమాన్స్ లేకుండా ఆ ముద్దులతో లవ్ లో డెప్త్ ను ప్రజంట్ చేశారు.. ఈ సినిమాలో సాంగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నా.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు రాధన్.. రాజుతోట కెమేరా వర్క్ చాలా బాగుంది.. నిర్మాణ విలువలకు డొకా లేదు. కథకు తగ్గట్టు వెనకాడకుండా డిమాండింగ్ లొకేషన్స్ లో తీశారు..

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే ప్రజంట్ యూత్ ట్రెండ్ ను రిప్లెక్ట్ చేస్తు కొత్త డైరక్టర్ సందీప్ రెడ్డీ వంగా తీసిన ఈ కల్ట్ మూవీ అన్ని వర్గాలను అలరించి మంచి విజయాన్ని అందుకునే అంశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే మోడ్రన్ అండ్ రియలిస్ట్ ఆలోచనలు ఉన్న ఆడియన్స్ ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి..

ప్లస్ పాయింట్స్

విజయ్ దేవరకొండ

డైరక్షన్

రియలిస్టిక్ స్క్రీన్ ప్లే

కామెడి

కెమెరా వర్క్


 

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

రొటీన్ క్లైమాక్స్

అనవసరమైన లాగ్స్

ఫోర్స్ డు సీన్స్


 

టెన్ టివి రేటింగ్ కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

12:09 - August 25, 2017

'పెళ్లి చూపులు' చిత్రంతో గుర్తింపు పొందిన నటుడు 'విజయ్ దేవరకొండ' తన తాజా చిత్రం 'అర్జున్ రెడ్డి'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. విజయ్ సరసన షాలిని షాండే హీరోయిన్ గా నటించారు. విడుదల కాకముందే పలు వివాదాలు చుట్టుముట్టుకున్నాయి. బోల్డ్ సీన్స్ ఉండడం..లిప్ లాక్ సీన్స్ ఉండడం..పోస్టర్స్ కూడా అదే విధంగా ఉండడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హీరో హీరోయిన్ ముద్దు సీన్ ప్రాక్టీస్ చేస్తున్న పుటేజీ లీక్ చేసి సంచలనం క్రియేట్ చేశారు. అనంతరం టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ వినూత్నంగా వదులుతూ హైప్ భారీగా పెంచేశారు. ఇదంతా సినిమాకు భారీగా ప్రచారం కల్పించినట్లైంది.

ఇక చిత్ర విషయానికి వస్తే అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) బెస్ట్ స్టూడెంట్. ఇతనికి కోపం చాలా ఉంటుంది. కోపం వస్తే మాత్రం ఏదీ ఆలోచించడు. ఇతను కీర్తి (షాలిని)ని చూసి ప్రేమిస్తాడు. ఆమె వెంట తిరుగుతాడు. తాను ప్రేమిస్తున్నానంటూ పేర్కొనడంతో చివరకు కీర్తి కూడా అతడిని ప్రేమిస్తుంది. అన్ని చిత్రాల్లో లాగానే ఈ సినిమాలో కూడా వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించరు. కీర్తికి వేరే మరొకరితో వివాహం చేస్తారు. దీనితో అర్జున్ రెడ్డి మద్యానికి బానిసగా మారుతాడు. డ్రగ్స్ అలవాటు చేసుకుంటూ ఎక్కడో..ఒంటిరిగా బతికేస్తుంటాడు. మరి అర్జున్ ఏమయ్యాడు..చివరకి ఏమైంది అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ సినిమాలో రియలిస్టిక్ గా..బోల్డ్ గా చూపించారని తెలుస్తోంది. తెలుగు సినిమాను ఇంత బోల్డ్ గా తీయవచ్చా ? సన్నివేశాలను అలా చూపించొచ్చా ? అనిపిస్తుందని టాక్. కానీ ఈ తరానికి మాత్రం 'అర్జున్ రెడ్డి' నచ్చుతాడని అనిపిస్తోంది. కథలో మాత్రం ఏ మాత్రం కొత్తదనం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో 'విజయ్ దేవరకొండ' మంచి నటనే కనబర్చారని, షాలిని కూడా అదరగొట్టేసిందని సోషల్ మాధ్యమాల్లో ప్రివ్యూలు పేర్కొంటున్నాయి. కుటుంబ ప్రేక్షకులకు మాత్రం ఇబ్బంది కలిగించే సినిమా అని తెలుస్తోంది. మరి సినిమా ఎలా ఉంది ? రివ్యూ..రేటింగ్ తదితర విషయాల కోసం టెన్ టివిలో ప్రసారమయ్యే 'నేడే విడుదల' కార్యక్రమం చూసేయండి....

Don't Miss

Subscribe to RSS - shalini