she teams

13:31 - May 19, 2017
13:30 - May 19, 2017

ట్రిపుల్ తలాక్ అంశం దాఖలైన అర్జిలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనంవిచారణ చేపట్టింది..... తండ్రి అంటే ఓ బాధ్యత కన్నతల్లి రూపన్ని కూతురిలో చూసుకుంటారు తండ్రులు మరి అటువంటి కూతురికి కష్టం వచ్చింది....అక్లాండ్ జరిగిన వరల్డ్ మాస్టర్స్ గేమ్ లో వంద మీటర్ల స్ప్రీంట్ లో బంగారు పథకం గెలుచుకున్నా 101 సంవత్సరాల బామ్మ మాన్ కౌర్ గుర్తున్నారా ఆమె మరో పోటీకి సిద్దమైయ్యారు... ట్రిపుల్ తలాక్ విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మసనంలో మహిళలకు చోటు లేకపోవడం విచారకరమని జాతీయ మహిళ కమిషన చైర్మన్ లలితా కుమార్ మంగళం అన్నారు...ప్రముఖ బాలీవుడ్ నటి రీమా లాగ్ కన్నుమూశారు. బాలీవుడ్ అమ్మ పాత్రలకు వన్నే తెచ్చిన ఆమె గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాదపడుతున్నారు....వెండి కొండ పీవి సింధును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్ కలెక్టర్ గా నియామించనుంది. 

12:50 - May 18, 2017

రోజురోజుకి మహిళల మీద హింస పెచ్చరిల్లుతుంది. న్యాయం కోసం వెళ్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి ధైర్యం చాలదు. బాధితులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో...న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో అనే ప్రశ్నలు వెంటాడుతుంటాయి. ఇలాంటి వారి కోసం అవిర్భావించిందే ''భరోసా''హెల్ప్ లైన్ పై నేటి 'ఫోకస్' పూర్తి వివరాల కోసం వీడియో చూడండి.

 

13:48 - May 2, 2017

భారీగా కట్నాలు తీసుకున్నా కొంతమంది డబ్బు మీద ఆశ చావక...ఇంకా అదనపు కట్నం కోసం వేధిస్తుంటారు. కట్నం తెస్తేనే ఇంటికి రానిస్తానంటూ..డబ్బులు తేవాలంటూ కట్టుకున్న భార్యలను భర్తలు వేధిస్తుండడం చూస్తూనే ఉంటాం. కానీ పెళ్లి జరిగిన అనంతరం భార్యను తీసుకెళ్లాలంటే అదనపు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేసిన వరుడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు...ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. పల్వల్ నగరంలో ఫరీద్ ఖరేషి వివాహం స్థానికంగా ఉండే యువతితో వివాహం జరిగింది. వధువును అత్తవారింటికి తీసుకెళ్లేందుకు వరుడు, అతని సోదరులు, మరో ఇద్దరు అమ్మాయి ఇంటికి వచ్చారు. తనకు ఇంకా అదనపు కట్నం ఇవ్వాలని..లేనిపక్షంలో భార్యను కాపురానికి తీసుకెళ్లలని వరుడు చెప్పడంతో వధువు కుటుంబసభ్యులు షాక్ తిన్నారు. తాము ఇవ్వలేమని చెప్పడంతో వరుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడంట. అంతే ఒక్కసారిగా అమ్మాయి తల్లిదండ్రులు..కుటుంబసభ్యులకు కోపం వచ్చింది. వెంటనే వచ్చిన వారిని ఓ గదిలోకి నెట్టి తాళమేశారు. హఠాత్తుగా జరిగిన పరిణామంతో వరుడు..అతని వెంట వచ్చిన వారు బిక్కమొహం వేశారు. ఈ విషయాన్ని గ్రామపెద్దల దృష్టికి అమ్మాయి తరపు వారు తీసుకెళ్లారు. వధువు పేరు మీద నాలుగు బిఘాల భూమిని రాయాలని...లేదా ఆమె పేరు మీద రూ. 10 లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ వేయాలని పంచాయతీ పెద్దలు తీర్పు చెప్పారు. వరుడికి దిమ్మదిరిగింది. కాసుల కోసం కక్కుర్తి పడితే గిలా అయిందేంటీరా అని ఆలోచిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసినా ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో వారు జోక్యం చేసుకోలేదు. ప్రస్తుతం వధువు, వరుడి కుటుంబాలు..గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చర్చలు జరుగుతున్నాయంట.

15:56 - April 27, 2017

వావి వరుసలు ఉండవు..వయస్సుతో సంబంధం లేదు..వారి లక్ష్యం ఆడాళ్లతో కలిసి సంచారం..నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లడం..ఎదురు తిరిగితే చంపేయడం..నగర శివార్లలోని ఘోరంపై మిస్టరీ వీడింది..

నగరంలో మృగాళ్ల ముఠాలు సంచరిస్తున్నాయి. ఐదు రోజుల క్రితం ఓ మహిళను కిరాతకంగా హత్య చేసిన దుర్మార్గులను పోలీసులు పట్టుకున్నారు..పాతికేళ్లు కూడా నిండని యువకులు చేస్తున్న ఘోరాలు చూసి కాప్స్ కలవరపడ్డారు. కల్లు దుకాణాల వద్ద వీరు మాటు వేసి అక్కడకు వచ్చే మహిళలకు గాలం వేసేవారు. వయస్సుతో సంబంధం లేకుండా..వావి వరుసలు మరిచి కిరాతకం చేస్తున్న దుర్మార్గుల పాపం పండింది.. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:49 - April 27, 2017

స్థిరపడేందుకు అవకాశం దొరికింది..అప్పు చేసి గల్ఫ్ కు పోవాలని అనుకున్నాడు..రెండు లక్షలను ఏజెంట్ కు పంపాడు..అక్కడకు వెళ్లాక అసలు కథ తెలిసింది.

దేశం కాని దేశంలో ఎక్కువ సంపాదించుకోవాలన్న కోరిక వారిని ఎన్నో కష్టాలకు గురి చేస్తోంది..ఏజెంట్ల మోసాల బారిన పడిన వారు అష్టకష్టాలు పడుతున్నారు. కొంతమంది అయితే మృత్యువాత పడుతున్నారు. కరీంనగర్ కు చెందిన ఓ యువకుడు కష్టాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్యాల హరీష్ అనే యువకుడు చొప్పదండి కొలిమికొట్టకు చెందిన వాడు. డ్రైవింగ్ నేర్చుకున్న ఇతను గల్ఫ్ కు పోవాలని అనుకున్నాడు. ఏజెంట్ ను కలిసి అప్పులు చేసి గల్ఫ్ కు వెళ్లాడు. డ్రైవర్ గా చేస్తూనే ఇతర పనులు చేయాలని చెప్పేవారు. తాను పడుతున్న కష్టాలను తల్లిదండ్రులకు చెప్పి రోదించే వాడు. చివరకు డిసెంబర్ 1న ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడు నెలల అనంతరం హరీష్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. దీనితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సో..ఏజెంట్ల మోసాలకు బలికాకండి..పక్కా వివరాలు తీసుకున్న అనంతరం విదేశాలకు వెళ్లండి..అని పలువురు సూచిస్తున్నారు.

15:35 - April 27, 2017

న్యాయం చేయాలని పోలీసులను కోరింది..పోలీసులు స్పందించలేదు..కలత చెందిన అమ్మాయి ఆత్మహత్యకు ప్రయత్నించింది..చివరకు పోలీసులు స్పందించారు. కాప్స్ మీద నమ్మకం లేని ఆ యువతి పోరాటానికి దిగింది..

ఓ యువకుడు తన జీవితంతో ఆడుకుంటున్నాడు..అని ఓ యువతి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు ఎలా స్పందించాలి ? వెంటనే యాక్షన్ తీసుకోవాలని అంటారు కదా. కానీ పోలీసులు స్పందించలేదు. దీనితో ఆ యువతి నేరుగా ఆ ఇంటి యువకుడి ఎదుట ఆందోళనకు దిగింది. చివరకు పోలీసులు స్పందించారు. బుజ్జగించే ప్రయత్నాలు జరిపారు. గిదేం పోలీసింగ్ అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. న్యాయం చేయాలంటూ వచ్చిన యువతికి అప్పుడే స్పందిస్తే బాగుండేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదంతా కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. అమ్మాయికి ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. యువతి గ్రామానికి చెందిన ఓ యువకుడు నిశ్చితార్థం జరిగిన వరుడికి ఫోన్ చేసి బెదిరించాడు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసింది. వెంటనే వారు పీఎస్ లో ఫిర్యాదు చేయగా నిర్లక్ష్యంగా పోలీసులు సమాధానం ఇచ్చారని యువతి పేర్కొంటోంది. న్యాయం చేయాలంటూ..యువతి కోరుతోంది.. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

15:53 - April 26, 2017

ఇంటి ముందు టులెట్ బోర్డు ఉంది..అద్దెకు కావాలంటూ వచ్చిన ముగ్గురు..ఇంట్లోకి వెళ్లి ఏం చేశారు ?

పెద్దింట్లో ఒంటిరిగా ఉంటున్నారా ? అద్దెకిస్తే ఎవరైనా వస్తే బాగుంటుందని అనుకుంటున్నారా ? కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. టు లెట్ బోర్డు పెట్టారంటే అద్దెకు వచ్చే వారు ఎవరో...ఎలాంటి వారో తెలియదు కదా..తెలిసిన వారికివ్వడమే మేలు. అపరిచితులకు ఇస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాకినాడలో అద్దె కావాలని అడిగి వచ్చిన ఓ దుర్మార్గుడు గొంతుకోసి దొరికింది దోచుకెళ్లారు. దీనితో వరుసగా కాకినాడలో జరుగుతున్న నేరాలపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మరిన్ని వివరాలకు వీడియో క్లిక్ చేయండి....

15:38 - April 20, 2017

ఒకడు ప్రేమ పేరిట వల విసురుతాడు..వాంఛలు తీసుకుని వదిలేస్తాడు..మరొకడు కట్నం కోసం పెళ్లి చేసుకుంటాడు..ఆ తరువాత సరిపోలేదని చేసుకున్న పెళ్లిని పెటాకులు చేస్తాడు..ఇంకొకడు మరొక కారణం.. ఎవరేం చేసినా దుర్మార్గుల లక్ష్యం అమాయకుల జీవితాలతో ఆడుకోవడమే. మూడు ముళ్లు వేసి తాళిని ఎగతాళి చేస్తున్న వారికి పడుతున్న శిక్షలెన్నీ ? ఇలా వెళ్లి అలా వెళ్లి మరొక అమాయకురాలి జీవితాలను నాశనం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ముగ్గురు అబలలు పోరాటం చేస్తున్నారు. వారు ఎవరు ? పూర్తి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

16:15 - April 14, 2017

విజయవాడ : సంచలనం సృష్టించిన విజయవాడ బీఫార్మసీ విద్యార్థిని ఆయేషామీరా హత్య కేసు మళ్లీ మొదటికి వచ్చింది. ఈ కేసులో మళ్లీ దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పోలీసు విభాగం ఇరకాటంలో పడింది. సత్యంబాబును విడుదల చేస్తూనే ఆయేషా కేసులో దర్యాప్తు చేసిన అప్పటి అధికారులపై చర్యలకు ధర్మాసనం ఆదేశించింది. అయితే ఆయేషా కేసుపై హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడ్డ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చివరకు మళ్లీ దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేయాలని మొదట్లో భావించినా ఆ తర్వాత హైకోర్టు ఆదేశాలతోనే ముందుకు పోవాలని పునర్విచారణ కోసం సన్నాహాలు చేస్తుంది.

ప్రభుత్వానికి ఆయేషా తల్లిదండ్రుల వినతులు..
ఇదిలా ఉండగా ఆయేషా హత్య కేసులో మళ్లీ విచారణ చేసి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలంటూ హతురాలి తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వినతి చేశారు. అయితే ఇప్పటికే ఈ కేసులో దర్యాప్తు ట్రయల్స్..అప్పీల్‌ కూడా పూర్తయినందున పునర్విచారణకు ఎలాంటి అవకాశాలున్నాయన్నదానిపై లీగల్‌ అథారిటీ సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. రీ ఇన్‌వెస్టిగేషన్‌కు కావాల్సిన లీగల్ ప్రొవిజన్స్‌ దొరకడం వల్ల సన్నాహాలు చేస్తున్నట్లు డీజీపీ చెబుతున్నారు. ఏదీ ఏమైనా మళ్లీ ఎనిమిదేళ్ల తర్వాత ఆయేషా కేసు విచారణ ప్రారంభం కానుంది. దీనిపై ఇప్పటివరకు జరిగిన లోటుపాట్లను సరిచేసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తారా ? లేక మామూలుగానే దర్యాప్తు కొనసాగుతుందా అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది. మరోవైపు ఆయేషా కేసులో అప్పట్లో అనుమానాలున్న వ్యక్తులను విచారిస్తారా..? లేక రాజకీయ ఒత్తిళ్లతో కేసు విచారణ నత్తనడకలా కొనసాగిస్తూ జాప్యం చేస్తారాన్నది చూడాల్సిందే.

Pages

Don't Miss

Subscribe to RSS - she teams