songs

20:25 - November 14, 2017

బాలల దినోత్సవం సందర్భంగా బాలల చలన చిత్రోత్సవాల్లో 'ఎగిసే తారాజువ్వల' చిత్రం ప్రదర్శనకు ఎంపిక చేశారు. నవంబర్ 14 బాలల దినోత్సవాల సందర్భగా చిత్ర యూనిట్ తో ముచ్చటించింది. తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వ పాఠాశాలలను, అక్కడి బోధనాభ్యసన పద్ధతులను, వాస్తవ విధానములను చక్కగా ప్రతిబింబించిన చిత్రమని చెప్పచ్చు. ఈ సినిమాలో సమస్య గురించి బాధ పడడం కన్నా చక్కని సులభపరిష్కారాలు చూపడం జరిగిందని చిత్ర యూనిట్ పేర్కొంటోంది. విద్యార్థులు పాఠ్యాంశాలు పుస్తకాలలో వున్నట్లు మక్కీకి మక్కీ కాకుండా ప్రయోగాత్మకంగా, అనుభవ పూర్వకంగా అవగాహన చేసుకొనే ప్రయత్నాలను చూపినట్లు తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

19:20 - November 5, 2017

తల్లిదండ్రులు మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉండడం వల్లే తాను సంగీతంపై మక్కువ పెంచుకోవడం జరిగిందని..తనకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని షణ్ముఖ ప్రియ పేర్కొంది. పాటలతో దేశాన్ని ఈ తెలుగు అమ్మాయి కిరాక్ చేస్తోంది. లిటిల్ ఛాంప్స్ లో..ఇతర షోల్లో ఆమె పాల్గొని అద్భుత ప్రతిభను కనబర్చింది. ఈ సందర్భంగా టెన్ టివి షణ్ముఖ ప్రియతో ముచ్చటించింది. సంగతం పట్ల మక్కువ..ఇతరత్రా విషయాలను వెల్లడించింది. తల్లిదండ్రులు నిర్వహించే కచేరీని చిన్నప్పటి నుండి చూడడం జరిగిందని, ఈ రంగంలో తనకు పేరెంట్స్ చాలా ప్రోత్సాహం ఇస్తున్నారని పేర్కొంది. ఏ.ఆర్.రెహామాన్ పాడిన పాటను తాను పాడడం జరిగిందని, ఇందుకు ప్రశంసలు రావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. ఏ.ఆర్.రెహామన్ ముందు పాట పాడడం చాలా గొప్పగా భావిస్తున్నట్లు తెలిపింది. పూర్తి విషయాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:02 - October 20, 2017

ఎం.ఎఫ్‌ క్రియేషన్స్‌ పతాకంపై అచ్చివర్స్‌ సిగేచర్‌ బ్యానర్‌లో హీరోయిన్‌ అక్షత దర్శకత్వంలో మద్దిపాటి సోమశేఖర రావు, మధు ఫోమ్రా నిర్మిస్తున్న చిత్రం 'శేఖరం గారి అబ్బాయి'. విన్ను మద్దిపాటి, అక్షత నాయకానాయికలు. ఈ సినిమా నేడు విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర బృందంతో టెన్ టివి ముచ్చటించింది. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

17:16 - July 26, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' తన చిత్రాల్లో ఏదో ఒక స్టైల్ ను పరిచయం చేస్తుంటాడు. సినిమా..సినిమాకు వైవిధ్యంగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. పాత్ర పాత్రకూ గెటప్ మారుస్తూ స్టైలిష్ స్టార్ అనిపించుకుంటున్న నటుడు 'బన్నీ'. ఇటీవలే ఆయన నటించిన 'డీజే..దువ్వాడ జగన్నాథమ్' సినిమాలో నటించాడు. ఇందులో బ్రాహ్మణ యువకుడిగా కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన పాత్ర కోసం బన్నీ కొన్ని రోజుల పాటు బ్రాహ్మణుల దగ్గర శిక్షణ తీసుకున్నాడని టాక్.

ఈ చిత్ర సక్సెస్ అనంతరం మరో చిత్రం కోసం 'బన్నీ' ఇప్పటి నుండే వర్కవుట్ చేస్తున్నాడంట. వక్కంతం వంశీ దర్శకత్వంలో ' నా పేరు సూర్య'..నా ఇల్లు ఇండియా పేరిట ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో బన్నీ ఆర్మీ అధికారిగా కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం తగ్గట్టు తన శరీరాన్ని మార్చుకోవడానికి..ఆహార్యం మార్పు కోసం శిక్షణ తీసుకోవాలని అనుకున్నాడంట. అందుకోసం అమెరికాకు బన్నీ వెళ్లనున్నట్లు సోషల్ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తోంది. 

20:43 - July 19, 2017

శ్రీకాకుళం : పొంటపొలాల్లో కలిసి కట్టుగా, విశ్రాంతి లేకుండా పనిచేస్తారు. ఉత్సాహంగా పాటలు పాడుతూ తాము పడుతున్న శ్రమను మర్చిపోతారు. వరిపైర్లను లక్ష్మీదేవితో సమానంగా కొలుస్తారు. పంటలు బాగా పండాలని, తమ యజమానికి లాభాలు చేకూరాలని పాటల ద్వారా వేడుకుంటారు. ఇదంతా శ్రీకాకుళం జిల్లాలోని వరినాట్లు వేసే రైతుల స్టైల్‌ఆఫ్‌ వర్కింగ్‌.
నాట్లు వేసే సమయంలో పాటలు
శ్రీకాకుళం జిల్లాలో వరినాట్ల సీజన్‌ మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది. వర్షాలు విరివిగా కురుస్తుండటంతో పదిహేను రోజుల నుండి ఊబలు వేయడం ప్రారంభించారు. వరినాట్లు వేసేందుకు ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా పనిచేయాల్సి ఉంటుంది. మహిళలే ఈ పని చేయడానికి ఎక్కువశాతం ఆసక్తి చూపుతారు. నాట్లు వేసే సమయంలో అలసట తెలీకుండా ఉల్లాసంగా పనిచేయడానికి పాటలు పాడటం ఆనవాయితీగా వస్తోంది. 
మత్య్సకారుల కూలీలు అధికం 
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ముప్పై ఎనమిది మండలాలున్నాయి. కవిటి నుండి గార వరకు గల తీర ప్రాంతంలో ఎక్కువ  శాతం కూళీలు మత్య్సకారులె. వీళ్లందరూ పాటలు పాడుతూ, సరదాగా పనిచేయడం వారసత్వంగా వస్తుంది. మహిళలు అందరూ నోటితో ఊళలు వేస్తూ ఒకేసారి లక్ష్మీదేవిని కొలుస్తూ పాటలు పాడుతుంటారు. ఆడుతూ పాడుతూ  పనిచేసే వీళ్ల పనితీరు.. చూసే వారికి చాలా సరదాగా కనిపిస్తుంటుంది. ఖరీఫ్‌, రబీ సీజన్లలో, వరినాట్ల సమయంలో ఈ తరహా స్వరాలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఉద్దాన ప్రాంతంలోని పంటపొలాలలో ఈ తరహా సాంప్రదాయం కొనసాగుతోంది. ఉదయం పొలాల్లో అడుగు పెట్టినప్పడినుండి సాయంత్రం పనిలో నిమగ్నమయ్యే కూళీలంతా చెప్పులు వేసుకోకుండానే పొలాల్లో అడుగుపెడతారు. పూజలు, పాటలతో లక్ష్మీదేవిని కొలుస్తూ పనులు చేసుకోవడం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని కూళీలు చెబుతున్నారు.

 

10:32 - June 7, 2017

తాను పాడితే ఎవరూ నిద్రపోరని బాలీవుడ్ కండల వీరుడు 'సల్మాన్ ఖాన్' వ్యాఖ్యానించాడు. వరుసగా విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ దూసుకెళుతున్న ఈ నటుడు తాజాగా 'ట్యూబ్ లైట్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల సంగతి తెలిసిందే. భారత్ - చైనా యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 'సల్మాన్ ' సరసన చైనా నటి నటించింది. ఇదిలా ఉంటే సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా 'సల్మాన్' ని ఓ విలేకరి 'రెడియో' పాట పాడమని కోరింది. ఇందుకు 'సల్మాన్' అస్సలు ఒప్పుకోలేదు. ‘ఆ పాట తాను పాడలేదని..పాడితే టెక్నిషీయన్లు కొన్ని రోజుల పాటు నిద్రపోరని' పేర్కొన్నారు. గతంలో 'సల్మాన్' ‘కిక్'..’హీరో' సినిమాల్లో పాటలు పాడిన సంగతి తెలిసిందే. జూన్ 23వ తేదీన 'ట్యూబ్ లైట్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

11:57 - April 9, 2017

ఎవరో ఒకరు ఊరికే పలకరిస్తారు గాని.. లోపలి నిశ్శబ్దాన్ని కదిపేదెవరు? అంటూ సున్నిత భావాలను తన కవిత్వంలో పలికించిన కవయిత్రి అరుణ నారదభట్ల. ఆమె ఇటీవల 'ఇన్నాళ్ళ మౌనం తరువాత' అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. చైత్రానికి చిగురాకుకూ మధ్య తీయని సంగమమే కవిత్వం అంటున్న అరుణ కొత్త డిక్షన్ తో భావనా బలంతో కవిత్వం రాస్తున్నారు. అరుణ నారదభట్ల మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

 

07:20 - February 21, 2017

ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం స్పూర్తికే తూట్లు పడుతున్నాయి. 2013 ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని మార్చేందుకు దళిత, గిరిజన ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి కెసిఆర్ కమిటీ ఏర్పాటు చేయడం తీవ్ర వివాదస్పదమైంది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని రక్షించుకునేందుకు వివిధ దళిత, గిరిజన సంఘాలు ఉద్యమ బాట పడుతున్నాయి. ఈ అంశంపై టెన్ టివి జనపథంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేత బి. ప్రసాద్ విశ్లేషించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

11:52 - December 28, 2016

టాలీవుడ్ లో రెండు చిత్రాలపై తెగ చర్చ జరుగుతోంది. ఈ రెండు చిత్రాలపై సోషల్ మాధ్యమాల్లో తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి'..చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'....ఈ రెండూ చిత్రాలు వెరైటీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. మొన్న 'శాతకర్ణి' ఆడియో విడుదల కాగా 'ఖైదీ' చిత్ర ఆడియోను నేరుగా మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే రెండు చిత్రాల పాటలు యూ ట్యూబ్ లో విడుదలయ్యాయి కూడా. ఇటీవలే విడుదల చేసిన 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు', 'సన్నజాజిలా పుట్టేసిందిరో సుందరి'... గీతాలతో పాటు టీజర్‌కు ప్రేక్షకుల నుండి చక్కటి స్పందన లభిస్తోందని నిర్మాత పేర్కొన్నారు. బుధవారం 'యు అండ్ మీ' అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేయనున్నట్లు, జనవరి 4న విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించనున్నామన్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. తమిళ చిత్రం 'కత్తి' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. 'కాజల్ అగర్వాల్' కథానాయిక. సంక్రాంతి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

13:35 - December 11, 2016

ప్రపంచ దేశాల కవిత్వానికి వేల ఏళ్ళ చరిత్ర వుంది. మాతృభాషలోనే కాకుండా ప్రపంచ భాషల్లో కవిత్వాలను పరికించాలనే తపన అనేకమంది పాఠకుల్లో వుంటుంది. అటువంటి వారికోసం ప్రముఖ అనువాద రచయిత 'ముకుంద రామారావు అనే గాలి పేరుతో వివిధ దేశాల కవిత్వాన్ని అనువాదం చేశారు. అవేంటో చూద్దాం..

Pages

Don't Miss

Subscribe to RSS - songs