sonia gandhi

09:00 - December 28, 2017

హైదరాబాద్ : 2019 ఎన్నికల కోసం కాంగ్రెస్‌ కసరత్తు మొదలుపెట్టింది. ఎలాగైనా గెలుపు సాధించాలనే లక్ష్యంతో వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే... గెలుపు గుర్రాలను పట్టుకునేందుకు హస్తం అధిష్టానం రచిస్తున్న ప్లాన్‌ ఏంటి ? ఢిల్లీ పెద్దల ఆలోచనలపై రాష్ట్ర నేతలు ఏమంటున్నారు. ఈ ప్లాన్‌ పార్టీకి ఎంతవరకు లాభం చేకూరనుంది? వాచ్‌ దిస్‌ స్టోరీ.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. ఎన్నికల్లో ఓటమికి గురైంది కాంగ్రెస్‌ పార్టీ. ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ ఓటమి చవి చూసింది. దీంతో కేడర్‌ అంతా నిరూత్సాహంలో కొట్టుమిట్టాడుతోంది. అయితే... వాటన్నింటిని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హస్తం పార్టీ... 
తెలంగాణపై అధిష్టానం ప్రత్యేక దృష్టి 
దేశంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి అని పార్టీ భావిస్తోంది. అందుకోసం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేస్తూనే... రాష్ట్రంలోని పరిస్థితులు... నియోజకవర్గాల వారీగా గెలుపు-ఓటముల పరిస్థితిని అంచానా వేస్తోంది. అలాగే క్షేత్రస్థాయిలో నేతల పనితీరును పరిశీలిస్తోంది. పార్టీ కేడర్‌లో నేతలపై ఉన్న అభిప్రాయాలను అధిష్టానం నేరుగా సేకరిస్తోంది. 
గెలుపు గుర్రాలే లక్ష్యంగా ప్రణాళికలు 
అయితే.. గెలుపు గుర్రాలే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న అధిష్టానం.. అందుకు ఒక కొత్త ఫార్ములాను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. నియోజకవర్గంలో రెండుసార్లు వరుసగా ఓటమికి గురైన వారికి టికెట్‌ ఇవ్వకూడదని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అది ఎంపీ అభ్యర్థి అయినా.. ఎమ్మెల్యే అభ్యర్థి అయినా సరే ఇదే విధానం అమలు చేయాలని భావిస్తోంది. మరోవైపు భారీ తేడాతో ఓటమికి గురైన అభ్యర్థులను సైతం దూరం పెట్టాలని యెచిస్తోంది.  అయితే... అధిష్టానం జరిపిన సర్వే ప్రకారం... రాష్ట్రంలో 30 మందికి టికెట్లు దక్కే అవకాశం కనిపించడం లేదని తెలుస్తోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు డోకా లేకపోయినప్పటికీ.. కొందరు మాజీలకు టికెట్లు కట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రమేయం లేకుండా... నియోజకవర్గ అభ్యర్థి పేరును ఎవరూ ప్రకటించవద్దని అధిష్టానం సంకేతాలు పంపింది. 
అధిష్టానం నిర్ణయంపై రాష్ట్ర నేతల్లో ఆసక్తికర చర్చ 
అయితే... అధిష్టానం నిర్ణయంపై రాష్ట్ర నేతల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఢిల్లీ పెద్దల నిర్ణయంతో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఓటమి ప్రాతిపదికను చాలా కోణాల్లో విశ్లేషించుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. గతంలో రెండుసార్లు వరుసగా ఓడిన నేతలు.. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అధిష్టానం ఈ ఫార్ములాను పక్కనపెట్టి... 2019 ఎన్నికల్లో గెలుపే ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక చేయాలని సీనియర్లు సూచిస్తున్నారు. 
ఫార్ములాపై మిశ్రమ స్పందన 
మొత్తానికి హైకమాండ్‌ అనుసరిస్తున్న ఫార్ములాపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొత్తగా టికెట్లు ఆశిస్తున్న వారిలో జోష్‌ నింపుతుంటే... గతంలో ఓటమి చవిచూసిన వారికి ఆందోళన కలిగిస్తోంది.  ఇప్పటికే కొంతమంది సీనియర్లు దీనిపై పెదవి విరుస్తున్నారు. మరి... వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అధిష్టానం ఎలా ముందుకె వెళ్తుందో చూడాలి. 

17:50 - December 22, 2017

ఢిల్లీ : హస్తినలో కాంగ్రెస్‌ వర్కింగ్‌కమిటీ సమావేశం జరుగుతోంది. ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో సీడబ్ల్యూసీ భేటీ అయ్యారు. రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ అధ్యక్షపగ్గాలు చేపట్టాక జరగుతున్న మొదటి భేటీ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. గుజరాత్‌, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై భేటీలో సమీక్ష జరపనున్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల నాటికి దేశవ్యాప్తంగా పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో రాహుల్ తోపాటు మన్మోహన్‌ సింగ్, ఏకే ఆంటోని, అహ్మద్‌పటేల్‌, చిదంబరం, అంబికాసోని భేటీకీ హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:53 - December 17, 2017

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికపై వక్తలు భిన్నవాదనలు వినిపించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత విష్ణు, కాంగ్రెస్ నేత నర్సారావు, విశాలాంధ్ర సంపాదకులు ముత్యాలప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ లో వారసత్వ, కుటుంబ రాజకీయాలు ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:05 - December 17, 2017

హైదరాబాద్ : రాహుల్‌గాంధీ ఏఐసీసీ అధ్యక్ష పగ్గాలు చేపట్టినందుకు కాంగ్రెస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. రాహుల్‌ కుటుంబం మొత్తం ప్రజాసేవకే అంకితమయ్యారని నేతలంటున్నారు. రాహుల్‌ సారధ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ...  2019లో అధికారంలోకి వస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

21:24 - December 16, 2017

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ పాత్ర, జాతీయ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు అనే అంశాలపై ప్రొ.నాగేశ్వర్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. 
రాజకీయాల్లో సంక్షోభం సహజం
'ప్రజాస్వామ్య రాజరికం కాంగ్రెస్ కే పరిమితం కాదు. భారత రాజకీయాల్లోనే ప్రజాస్వామిక రాజరికం ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వారసత్వ రాజకీయాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంక్షోభం కొత్తకాదు. రాజకీయాల్లో సంక్షోభం సహజం. ప్రజా అనుకూల విధానాలతోనే నాయకులకు మంచి పేరు వస్తుంది. నాయకులు చరిత్రను సృష్టించలేరు. చరిత్రే నాయకులను సృష్టిస్తుంది. తెలంగాణ ఉద్యమం లేకుంటే కేసీఆర్, కేటీఆర్ ఈ స్థాయిలో ఉండేవారు కాదు. ఓటములను నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. 
సరైన విధానాలు అనుసరిస్తే ఉపయోగం
బీజేపీ అనుసరించే విధానాలకు ప్రత్యామ్నాయంగా ఏ విధానాలు అవలంభిస్తారనే అంశంపై పైనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఆధారపడుతుంది. మోడీ గొప్పనాయకుడు కాదు.. రాహుల్ చేతగాని నాయకుడు కాడు. పార్టీ ఓడిపోయే దశ వస్తే ఎలాంటి నాయకుడైన వేస్ట్.. పార్టీ గెలిచి దశ వస్తే ఎలాంటి నాయకుడైన గెలుస్తాడు. సందర్భాన్ని బట్టి నాయకులు తయారు అవుతారు. విధానాలు నిర్ణయించేది వయస్సు కాదు. విధానాలు అనుసరించే అంశమే ముఖ్యం. వయసు ఆధారిత సిద్ధాంతాన్ని నేను అంగీకరించను. సరైన విధానాలు అనుసరిస్తే ఉపయోగం. రాజకీయాల్లో చాలా మంది అసమర్థలు ఉన్నారు. 
ప్రజా ఉద్యమాలతోనే రాహుల్ కు ఇమేజ్
బలమైన ప్రజా ఉద్యమాలకు రాహుల్ నాయకత్వం వహిస్తేనే నాయకుడు అవుతాడు. ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి రాహుల్ కు మంచి నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. ప్రజా సమస్యలపై రాహుల్ పోరాటాలు చేయాలి.. అందుకు పార్టీ యంత్రాంగాన్ని కదిలించాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించాలి. బీజేపీ హిందూ పార్టీగానే ఉంది. ప్యాన్ ఇండియాగా ఏ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీలో కేంద్రంలో ఉన్న ఒక నాయకుని చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. స్థానికంగా పార్టీని బలోపేతం చేసుకోవాలి'. అని అన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:53 - December 16, 2017

ఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో ప్రియాంక గాంధీ రాయబరేలి లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని మీడియాలో కథనాలు హల్‌ చల్‌ చేశాయి. దీనిపై ప్రియాంకా గాంధీ స్పందించారు. రాయబరేలీ నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ప్రియాంక స్పష్టం చేశారు. ఆ స్థానంలో తన తల్లి సోనియా గాంధీనే పోటీ చేస్తారని చెప్పారు. తాను చూసిన శక్తిమంతమైన మహిళల్లో సోనియా గాంధీ ఒకరని...ఆమె సేవలు పార్టీకి చాలా అవసరమని పేర్కొన్నారు. మరోవైపు రాహుల్‌ గాంధీ పట్టాభిషేకానికి  ప్రియాంకా గాంధీ తన భర్త రాబర్ట్‌ వాద్రాతో కలిసి హాజరయ్యారు. ప్రియాంకా గాంధీ అందర్నీ పలకరిస్తూ సందడి చేశారు.

 

20:51 - December 16, 2017

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలను స్వీకరించారు. నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టిన ఆరో వ్యక్తిగా రాహుల్‌ నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రాహుల్‌కు సోనియాగాంధీ అభినందనలు, ఆశీస్సులు తెలియజేశారు. అధ్యక్షుడిగా రాహుల్‌ తన తొలి ప్రసంగంలోనే బిజెపిని టార్గెట్‌ చేశారు. బిజెపి దేశంలో మంటలు రేపుతోందని, హింసను వ్యాపింపజేస్తోందని మండిపడ్డారు. 

కాంగ్రెస్‌ పార్టీలో నూతన శకం ఆరంభమైంది. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎన్నికల సంఘం అధ్యక్షుడు రామచంద్రన్‌ -పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన రాహుల్‌ గాంధీకి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ గాంధీ తన తొలి ప్రసంగంలోనే బిజెపిని టార్గెట్‌ చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 21వ శతాబ్ధం వైపు తీసుకువెళ్లిందని, కానీ ప్రధాని మోదీ మాత్రం దేశాన్ని మళ్లీ మధ్యయుగంలోకి తీసుకువెళ్తున్నారని విమర్శించారు. దేశంలో ఒకసారి మంటలు రేగితే దాన్ని చల్లార్చడం అంత సులువు కాదన్నారు. వాళ్లు మంటలు రేపితే మనం చల్లార్చుదామన్నారు. దేశంలో బిజెపి హింసను సృష్టిస్తోందని...ఆ హింస దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతోందని రాహుల్‌ విమర్శించారు. బీజేపీ విద్వేషాలను ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు మాత్రమే నిలువరించగలరని.... రాహుల్ తెలిపారు. 
రాహుల్‌ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోనియాగాంధీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ అధ్యక్షురాలిగా తన ప్రస్తానాన్ని గుర్తు చేసుకుంటూ రాజీవ్‌ గాంధీతో పెళ్లయ్యాకే రాజకీయాలతో పరిచయమైందని తెలిపారు. గాంధీ, నెహ్రూ కుటుంబం  దేశం కోసం ఆస్తులు, కుటుంబ జీవనాన్ని త్యాగం చేసిందన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ హత్యోదంతాలు తన జీవితాన్ని పూర్తిగా మార్చి వేశాయని చెప్పారు. రాహుల్‌గాంధీని శక్తిమంతమైన నేతగా సోనియా పేర్కొన్నారు. తన కుమారుడు రాహుల్‌ను ప్రశంసించడం భావ్యం కాదని... చిన్నతనంలోనే అతను హింస ప్రభావాన్ని ఎదుర్కొని నిలబడ్డాడని.... రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో వ్యక్తిగత విమర్శలను ఎదుర్కొన్నారని ఆమె తెలిపారు. దేశంలో భయానక వాతావరణం నెలకొందని, రాజ్యాంగ విలువలపై దాడి జరుగుతోందని సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన కాంగ్రెస్‌ వెనకడుగు వేసే ప్రసక్తే లేదని...దేశ శ్రేయస్సు కోసం మా పోరాటం కొనసాగుతుందని సోనియా స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఇది చారిత్రాత్మకమైన రోజని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అభివర్ణించారు. రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా పర్యటించారని...దేశంలోని అన్ని సమస్యలపై ఆయనకు అవగాహన ఉందన్నారు. రాహుల్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ఉన్నత శిఖరాలకు చేరుతుందన్న ఆకాంక్షను వ్యక్త పరిచారు.

రాహుల్‌ అధ్యక్ష పదవీ స్వీకార వేడుక సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఆ ప్రాంగణమంతా రాహుల్‌.. రాహుల్‌ నినాదాలతో హోరెత్తిపోయింది. టపాసులు కాలుస్తూ.. మిఠాయిలు పంచుకుంటూ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.


 

17:27 - December 16, 2017
17:26 - December 16, 2017

సంగారెడ్డి : ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు స్వీకరించడంతో.. సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లువిరుస్తున్నాయి. సంగారెడ్టి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్టి ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో పార్టీ బలోపేతమౌతుందని జగ్గారెడ్డి అన్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. 2019లో రాహుల్‌గాంధీ నాయకత్వంలో... కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. సోనియా కుటుంబం ప్రజాసేవకు అంకితమైందన్నారు. గతంలో ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చినా వద్దన్నారని గుర్తు చేశారు. 

 

16:02 - December 16, 2017

ఢిల్లీ : రాహుల్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టడం శుభపరిణామమన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. క్లిష్టపరిస్థితుల్లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం రాహుల్ సాహసోపేతమైన నిర్ణయంగా రఘువీరా చెప్పారు. దేశంలో అందర్నీ కలుపుకుంటూ పోవాలని రాహుల్ ఇచ్చిన పిలుపుతో తామంతా ముందుకు సాగుతామన్నారు కాంగ్రెస్ సీనియర్ షబ్బీర్ అలీ. రాహుల్ పదవులు ఆశించి వస్తున్నారంటూ బీజేపీ విమర్శించడం తగదన్నారు కాంగ్రెస్ నేత కేవీపీ.రామచంద్రరావు. పదవులే కావాలనుకుంటే ఈపాటికే సొంతం చేసుకునేవారని ఆయన దేశం కోసం, పార్టీ కోసం వారు చేసిన వారు చేసిన త్యాగాలకు ఖచ్చితమైన ఫలితం వస్తుందని కేవీపీ అన్నారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - sonia gandhi