south africa

07:53 - June 12, 2017

లండన్ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ సెమీస్‌కు చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 192 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్‌ 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తక్కువ స్కోరుకే వెనుదిరిగినప్పటికీ.. ధావన్‌ 78, కోహ్లీ76, యువరాజ్‌సింగ్‌ 23 పరుగులతో రాణించి భారత్‌కు విజయాన్ని అందించారు. అంతకుముందు భారత బౌలింగ్‌ దాటికి సఫారీలు 44.3 ఓవర్లలో 191 పరుగులకు అలౌటయ్యారు. భారత్‌ సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

 

21:30 - June 11, 2017

బర్మింగ్ హోమ్ : చాంపియన్స్ ట్రోఫీలో సౌత్ అఫ్రికా పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్ తో తలపడనుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో జట్టును ముందుండి గెలిపించా

15:23 - April 21, 2017

దక్షిణాఫ్రికా : ఓ చిన్నారిని సజీవంగా పూడ్చిపెట్టినా ప్రాణాలతో బయటపడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలోని ప్రావిన్స్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...క్వాజులు - నాటల్ ప్రావిన్స్ లో ఓ 25 ఏళ్ల మహిళ టింబర్ డిపోలో పనిచేస్తోంది. ఇటీవలే పండటి మగబిడ్డ జన్మించాడు. కానీ ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలియవద్దని ఆ పసికందును పనిచేస్తున్న చోటే పూడ్చేసింది. కానీ మూడు రోజులకు ఆ చిన్నారి ఏడుపులు అక్కడి వారికి వినిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. వెంటనే పోలీసులు శిశువును కాపాడారు. ప్రస్తుతం పోర్ట్ పెష్ స్టోన్ రీజనల్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే తల్లిపై పోలీసులకు కేసు నమోదు చేశారు.

22:13 - February 4, 2017

సౌతాఫ్రికా : శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య వన్డే మ్యాచ్‌లో క్రికెటర్లకు తేనెటీగలు చుక్కలు చూపించాయి.. జోహెన్నస్‌బర్గ్‌లో టాస్‌ నెగ్గిన సఫారీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.. శ్రీలంక ఆటగాళ్లు బ్యాటింగ్‌ చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి.. ఈ కీటకాల గుంపును చూసిన ప్లేయర్లు, అంపైర్లతో సహా అందరూ కిందపడుకుని తమను తాము రక్షించుకున్నారు..

 

08:56 - November 3, 2016

జైపూర్ : రాజస్థాన్‌లోని ఓ నగరంలోకి బీఎస్‌ఎఫ్‌ బలగాలతో అధికారులు వెళ్లారు..ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు..అక్కడికి వెళ్లిన అధికారులు కూడా ఆ ప్రాంతంలో సోదాలు చేస్తే దొరికిన టాబ్లెట్లు చూసి నివ్వెరపోయారు..అవన్నీ మత్తు పదార్థాలే... భారీ డ్రగ్‌ రాకెట్‌ను చేధించిన డీఆర్‌ఐ అధికారులు బాలివుడ్‌ నిర్మాతను అదుపులోకి తీసుకున్నారు...అధికారుల రైడ్స్‌లో దొరికిన మత్తు పదార్థాల విలువ మూడువేల కోట్లకుపైనే...
పెద్దమొత్తంలో మత్తు పదార్థాలు 
మాదక ద్రవ్యాలను సరఫరా చేసేందుకు రెడీ చేస్తున్న భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టును విప్పారు డీఆర్‌ఐ అధికారులు...సెంట్రల్‌ టీమ్స్‌ ఆధ్వర్యంలో జరిగిన సోదాల్లో పెద్దమొత్తంలో మత్తు పదార్థాలు దొరికాయి...వేల కోట్లు విలువజేసే డ్రగ్స్‌ను పట్టుకోవడంతో కలకలం రేపింది.
3వేల కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్‌ సీజ్ 
రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఓ ఫ్యాక్టరీపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చేసిన దాడుల్లో భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. 3వేల కోట్ల విలువైన నార్కోటిక్ డ్రగ్‌ను అధికారులు సీజ్ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఈ డ్రగ్ వ్యవహారంతో సంబంధమున్న బాలీవుడ్ నిర్మాత సుభాష్ దుధానిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
టాబ్లెట్ల రూపంలో తయారీ...
ఉదయపూర్ సమీపంలోని మరుధర్ డ్రింక్స్ అనే కంపెనీలో టాబ్లెట్ల రూపంలో మత్తు పదార్థాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందుకుని దాడులు చేశారు...ఇందులో మెత్తం 2 కోట్లకుపైగా ఉన్న టాబ్లెట్స్ దొరికాయి..ఇవి 23 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని లెక్క తేల్చారు.... దీని మార్కెట్ విలువ 3వేల కోట్ల విలువ ఉంటుందని  సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ క‌స్టమ్స్‌ చైర్‌ప‌ర్సన్ న‌జీబ్ షా వెల్లడించారు. ఇక్కడ త‌యారవుతున్న ఈ మాండ్రాక్స్ మాత్రలను మొజాంబిక్‌, సౌతాఫ్రికాల‌కు త‌ర‌లిస్తున్నట్లు విచారణలో తేలింది.

 

08:12 - October 17, 2016

గోవా : బ్రిక్స్ వేదిక‌గా దాయాది పాకిస్థాన్‌పై నిప్పులు చేరిగారు ప్రధాని నరేంద్ర మోదీ. ప‌ర్యావ‌ర‌ణ శ్రేయ‌స్సుకు ఉగ్రవాదం విఘాతం క‌లిగిస్తోంద‌న్న మోదీ.. దుర‌దృష్టవ‌శాత్తు దాని మూలాలు త‌మ పొరుగుదేశంలోనే ఉన్నాయన్నారు. బ్రిక్స్ చివరి రోజైన రెండో రోజు స‌మావేశాల్లో భాగంగా మోదీ ప్రసంగించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాల‌ని బ్రిక్స్ దేశాధినేత‌ల‌కు పిలుపునిచ్చారు. 
పాకిస్థాన్‌పై పరోక్షంగా నిప్పులు చెరిగిన మోదీ
ఉగ్రమూకల శిబిరాలపై మెరుపుదాడులు చేయటం ద్వారా పాకిస్థాన్‌కు సరైన గుణపాఠం చెప్పిన భారత్‌.. ఆ దేశాన్ని ఏకాకిని చేసేందుకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. గోవాలో జరిగిన 8వ 'బ్రిక్స్‌' శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్‌ పేరు ఎత్తకుండా ఆ దేశాన్ని తూర్పారబట్టారు. ఈ సమావేశానికి మోదీతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్‌ జుమా, బ్రెజిల్‌ అధ్యక్షుడు మైఖేల్‌ టెమెర్‌ హాజరయ్యారు. 
ఉగ్రవాదానికి పొరుగుదేశం తల్లిలాంటిదని మోదీ వ్యాఖ్య
ఉగ్రవాదానికి పొరుగుదేశం తల్లిలాంటిదని, ఆర్థిక సమృద్ధతకు ఉగ్రవాదం నుంచి ప్రత్యక్ష ముప్పు పొంచి ఉందన్నారు మోదీ.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రమూకలన్నింటికీ ఆ దేశంలోని ముష్కర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని విమర్శించారు. రాజకీయ లబ్ధికోసం ఉగ్రవాదాన్ని సమర్థించే ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేశారు. పాక్‌ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన మోదీ.. బ్రిక్స్‌ దేశాలన్నీ ఉగ్రభూతానికి వ్యతిరేకంగా ఏకమై, కలిసి కట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. 
ఆర్థిక సంబంధాల బలోపేతం దిశగా బ్రిక్స్‌ సదస్సు 
ఉగ్రవాదం నిర్మూలనకు త్వరలోనే అంతర్జాతీయ స్థాయిలో సమగ్ర ఒప్పందం కుదిరేలా కృషి చేయాల్సిన ఆవశ్యకతను ప్రధాని గుర్తు చేశారు. తీవ్రవాదులను, వారిని సమర్థించే వారిని శిక్షించి తీరాలన్నదే తమ అభిమతమని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగేందుకు భారత్‌ సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇటీవల పారిస్‌ ఒప్పందాన్ని ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్థిక సంబంధాల బలోపేతం దిశగా బ్రిక్స్‌ సదస్సు జరిగిందన్నారు మోదీ. బ్రిక్స్‌ సభ్యదేశాల అభివృద్ధే ప్రధాన అజెండాగా సమావేశాలు కొనసాగాయని అన్నారు. ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. సదస్సులో భాగంగా విద్య, వాణిజ్యం, పర్యాటకం తదితర అంశాలపై ఒప్పందాలు జరిగాయని మోదీ వెల్లడించారు.
దేశాల మ‌ధ్య మూడు ఒప్పందాలు 
బ్రిక్స్ స‌మావేశాల్లో భాగంగా దేశాల మ‌ధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. ఈ మేర‌కు ఆయా దేశాల విదేశాంగ మంత్రులు ఒప్పంద ప‌త్రాల‌ను మార్చుకున్నారు. సమావేశాల సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. భారత్ తోపాటు ఈ మధ్యకాలంలో కొన్ని బ్రిక్స్ దేశాల్లో జరిగిన ఉగ్రదాడులను సమావేశం ఖండించింది. ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచ శాంతిభద్రతలకు పెను ముప్పుగా పరిణమించినట్లు బ్రిక్స్ దేశాలు గుర్తించాయి. శాంతి, భ‌ద్రతల విష‌యంలో ప‌ర‌స్పర స‌హ‌కారం, సంప్రదింపుల‌కు బ్రిక్స్ దేశాలు క‌ట్టుబ‌డి ఉన్నాయ‌ని మోదీ అన్నారు. ట్యాక్స్ ఎగవేత, నల్లధనం, అవినీతి నిర్మూలనలోనూ బ్రిక్స్ దేశాలు కలిసి పని చేస్తాయని స్పష్టంచేశారు.
పాకిస్థాన్‌కు షాక్‌ ఇచ్చిన రష్యా
బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు వేదికగా రష్యా..పాకిస్థాన్‌కు షాకిచ్చింది. పాక్‌తో ఎలాంటి సైనిక ఒప్పందాలు కుదుర్చుకోలేదని రష్యా రోస్టెక్‌ కార్ప్‌ సీఈవో సెర్గీ సెమిజోవ్‌ స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆ దేశంతో ఎటువంటి ఒప్పందాలు చేసుకోమని, ఆధునిక హెలికాప్టర్లు, సైనిక ఎయిర్‌క్రాప్ట్‌లను పాకిస్థాన్‌కు అమ్మబోమని చెప్పారు. ఇకపై ఎలాంటి ఒప్పందాలు ఉండవని కుండబద్దలు కొట్టారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని పారద్రోలేందుకే సంయుక్త సైనిక విన్యాసాలు చేశామన్నారు. ఇరుదేశాల దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్ట పరచాలని నిర్ణయించినట్లు బ్రిక్స్‌ సదస్సు భేటీ అనంతరం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో చైనా తెలిపింది.  

 

08:33 - March 21, 2016

ముంబై : టీ 20 ప్రపంచకప్‌లో సఫారీ టీమ్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-1 రెండో రౌండ్‌  మ్యాచ్‌లో ఆఫ్గనిస్తాన్‌పై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన  సఫారీ టీమ్‌ భారీ స్కోర్‌ నమోదు చేసింది. ఓపెనర్‌ డికాక్‌, డు ప్లెసి అదరగొట్టడంతో పాటు....డాషింగ్‌ బ్యాట్స్ మెన్‌ డివిలియర్స్ ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్ ఆడటంతో సౌతాఫ్రికా జట్టు...20 ఓవరల్లో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్గానిస్తాన్‌ జట్టుకు మహమ్మద్‌ షెహజాద్‌ అదిరిపోయె ఆరంభాన్నిచ్చాడు. షెన్వారీ,నయీబ్‌,అలీ జద్రాన్‌ పోరాడినా కీలక సమయంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్‌ జట్టుకు ఓటమి తప్పలేదు. 37 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా జట్టు...బోణీ కొట్టింది.4 ఓవర్లలో 27 పరుగులు మాత్రమే ఇచ్చిన 4 కీలక వికెట్లు పడగొట్టిన  క్రిస్‌ మోరిస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.  

 

07:11 - March 19, 2016

హైదరాబాద్ : అనుక్షణం ఉత్కంఠ మధ్య సాగిన థ్రిల్లర్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ జట్టు సఫారీలను చిత్తు చేసింది. సఫారీలు ముందుంచిన 230 పరుగుల లక్ష్యాన్ని వికెట్లు కోల్పోతున్నా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. భారీ లక్ష్యాన్ని ముందుంచిన మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయామనే బాధ సఫారీలకు మిగిలింది.  
కసితో ఇంగ్లండ్..
టీ20 ప్రపంచకప్‌లో రెండో మ్యాచ్‌లోనైనా కచ్చితంగా విజయం సాధించాలన్న కసితో ఆడిన ఇంగ్లాండ్‌ జట్టు.. సఫారీలు తమ ముందుంచిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడి అర్ధశతకం సాధించిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ జోరూట్‌ 44 బంతుల్లో 83 పరుగులు సాధించాడు. 
ఉత్కంఠ పోరు..
జోరూట్‌తో 5వ వికెట్‌కు బట్లర్‌ తో కలిసి 36 బంతుల్లో 75 పరుగులు, ఆరో వికెట్‌కు మొయిన్‌అలీ కలిసి 18 బంతుల్లో 33 పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పడంతో ఇంగ్లాండ్‌ ఉత్కంఠపోరులో విజయం సాధించింది. 
చివరి ఓవర్ కు ఒకే పరుగు చేయాల్సి ఉన్నా..
చివరి ఓవర్‌లో గెలుపునకు ఒకే పరుగు అవసరం ఉన్న సమయంలో వరుస బంతుల్లో 2 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లాండ్‌ శిబిరంలో కాస్త కంగారు నెలకొంది. మొయిన్‌అలీ వచ్చి పరుగు తీసి లాంఛనాన్ని పూర్తిచేశాడు. ఈ విజయంతో టీ20 చరిత్రలో అత్యధిక భారీ స్కోరు ఛేదించిన రెండో జట్టుగా ఇంగ్లాండ్‌ నిలిచింది.
పరుగుల వరద..
అంతకు ముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు ఓపెనర్లు ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో పరుగుల వరద పారించారు.  ఆమ్లా 31 బంతుల్లో 58 పరుగులు, డికాక్‌ 24 బంతుల్లో 52 పరుగులు సాధించారు. ఆ తర్వాత డుమిని 28 బంతుల్లో 54 పరుగులు సాధించాడు. ఈ ప్రపంచకప్‌ టోర్నీలో సూపర్‌ 10 మ్యాచ్‌లు ప్రారంభమైన తర్వాత ఒకే మ్యాచ్‌లో నాలుగు అర్ధశతకాలు నమోదవడం ఇదే తొలిసారి. దక్షిణాఫ్రికా జట్టులో డికాక్‌, ఆమ్లా, డుమిని అర్ధశతకాలు సాధించగా.. ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ జట్టులో జోరూట్‌ 83 పరుగులు చేశాడు.

18:21 - March 18, 2016

ముంబై : టీ 20 వరల్డ్ కప్‌ సూపర్‌ టెన్‌ రౌండ్‌లో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టుకు పవర్‌ ప్యాకెడ్‌ సౌతాఫ్రికా జట్టు సవాల్‌ విసురుతోంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఇచ్చిన షాక్‌తో ఇంగ్లీష్‌ టీమ్‌ షాక్ లో ఉంటే...టైటిల్ వేటను విజయంతో ఆరంభించాలని సఫారీ టీమ్ తహతహలాడుతోంది. ముంబై వాంఖెడీ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ సూపర్ ఫైట్ ప్రారంభమవుతుంది.
సౌతాఫ్రికా వర్సెస్ ఇంగ్లండ్‌ 
ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్‌లో సూపర్‌ ఫైట్‌కు రంగం సిద్ధమైంది. సంచలనాలకు మారుపేరైన సౌతాఫ్రికా జట్టు...మాజీ చాంపియన్‌  ఇంగ్లండ్‌తో పోటీకి పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ఈ టోర్నీలో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగబోతున్న దక్షిణాఫ్రికా జట్టు.....ఆరంభ మ్యాచ్‌ నుంచే ఆధిపత్యం ప్రదర్శించాలని ప్లాన్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఇచ్చిన షాక్‌తో ఇంగ్లీష్‌ టీమ్‌ డైలమాలతో ఉండగా...టోర్నీని విజయంతో ఆరంభించారని సఫారీ టీమ్ తహతహలాడుతోంది.  
సఫారీ టీమ్‌లో అందరూ మ్యాచ్‌ విన్నర్లే
టీ 20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయె ఆటగాళ్లున్న సఫారీ టీమ్‌లో అందరూ మ్యాచ్‌ విన్నర్లే. ఫాఫ్‌ డు ప్లెసి నాయకత్వంలోని సఫారీ టీమ్‌ .... అనుభవజ్ఞులు, ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో  సమతూకంగా ఉంది.డేంజరస్‌ బ్యాట్స్‌మెన్‌ డివిలియర్స్‌,డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ హషీమ్‌ ఆమ్లా, డు ప్లెసి, క్వింటన్‌ డి కాక్‌, డేవిడ్‌ మిల్లర్‌,డుమినీతో పాటు..... స్పీడ్‌ గన్‌  డేల్‌ స్టెయిన్‌, ఇమ్రాన్‌ తాహిర్‌ ,కగిసో రబద,క్రిస్‌ మోరిస్‌ వంటి మ్యాచ్‌ విన్నర్లతో భీకరంగా ఉంది. 
ఫీల్డింగ్‌ విభాగంలోనూ సఫారీ ఆటగాళ్ల తర్వాతే ఎవరైనా 
ఫీల్డింగ్‌ విభాగంలోనూ సఫారీ ఆటగాళ్ల తర్వాతే ఎవరైనా. ఆటగాళ్లందరికీ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడిన అనుభవం కూడా ఉండటంతో .....సౌతాఫ్రికా జట్టుకు పెద్ద ప్లస్‌ పాయింట్‌. 
తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విఫలం
మరోవైపు ఓయిన్‌ మోర్గాన్‌ నాయకత్వంలోని ఇంగ్లండ్‌ జట్టులో టాప్‌ క్లాస్‌ ఆటగాళ్లు, ట్వంటీ ట్వంటీ స్పెషలిస్ట్ లున్నా.....తొలి రౌండ్‌ మ్యాచ్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించడంలో విఫలమైంది. తొలి మ్యాచ్‌లో భారీ స్కోర్‌ చేసినా.... బౌలర్ల వైఫల్యంతో కరీబియన్‌ టీమ్‌ చేతిలో ఓడిన ఇంగ్లండ్‌ జట్టు  రెండో మ్యాచ్‌లో నెగ్గితీరాలని పట్టుదలతో ఉంది. అలెక్స్‌ హేల్స్‌, జో రూట్‌, మోర్గాన్‌, జోస్ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌ వంటి హిట్టర్లు.....టోప్లే, డేవిడ్‌ విల్లీ వంటి మెరుపు ఫాస్ట్‌ బౌలర్లతో పటిష్టంగా ఉంది. కానీ ఎన్నో అంచనాలు పెట్టుకున్న స్పిన్నర్లు ఆదిల్‌ రషీద్‌, మొయిన్‌ అలీ ఆరంభ మ్యాచ్‌లో నిరాశపరచడంతో ఇంగ్లీష్‌ టీమ్‌ శుభారంభం చేయలేకపోయింది.
టీ 20 ఫార్మాట్‌లో సఫారీ టీమ్‌దే పై చేయి 
ఇక టీ 20 ఫార్మాట్‌లో ఈ రెండు జట్లలో సఫారీ టీమ్‌దే పై చేయిగా ఉంది. ఇరు జట్లూ ఇప్పటివరకూ 11 మ్యాచ్‌ల్లో పోటీ పడగా దక్షిణాఫ్రికా జట్టు 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా...ఇంగ్లీష్ టీమ్‌ 3 మ్యాచ్‌ల్లో మాత్రమే నెగ్గింది. ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీల్లో నాకౌట్‌ రౌండ్‌ మ్యాచ్‌ల్లో తేలిపోయె సఫారీ టీమ్‌....రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో ఏ స్థాయిలో  చెలరేగుతుందో అందరికీ తెలిసిందే. అందుకే ఇంగ్లండ్‌ కంటే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

21:27 - December 6, 2015

ఢిల్లీ : టెస్ట్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌ డిఫెన్స్‌ మంత్రాన్ని జపిస్తున్నారు. ఆఖరి టెస్ట్‌లో గెలిచే అవకాశం లేకపోవడంతో పరమ జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్లకు పెద్ద పరీక్షే పెట్టారు. కెప్టెన్‌ హషీమ్‌ ఆమ్లా, డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ పోటీలు పడి మరీ....క్రీజ్‌లో పాతుకుపోయారు.72 ఓవర్లలో ఒక్క పరుగు సగటుతో 72 పరుగులు చేసి అరుదైన రికార్డ్‌ నమోదు చేశారు. ఢిల్లీ టెస్ట్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌ డిఫెన్స్‌ మంత్రాన్నే జపిస్తున్నారు.డిఫెన్స్‌ అంటే అలాంటి ఇలాంటి డిఫెన్స్‌ కూడా కాదు....డెడ్లీ డిఫెన్స్‌ అనే చెప్పాలి.

అభిమానులకూ విసుగు...
ఆఖరి టెస్ట్‌లో ఎలాగూ గెలిచే అవకాశం లేకపోవడంతో డెడ్లీ డిఫెన్స్‌తో భారత బౌలర్ల సహనానికి పెద్ద పరీక్షే పెట్టారు. పరమ జిడ్డు బ్యాటింగ్‌తో క్రీజ్‌లో పాతుకుపోయిన సౌతాఫ్రికా టాప్‌ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌ ఆట నాలుగో రోజు టీమిండియా బౌలర్ల దూకుడుకు చెక్‌ పెట్టారు. 480 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు శుభారంభం చేయలేకపోయింది. 6 పరుగులకే సఫారీ టీమ్‌ తొలి వికెట్‌ పడగొట్టిన భారత జట్టు బౌలర్లకు...హషీమ్‌ ఆమ్లా, బవూమ ఆనందం లేకుండా చేశారు. కెప్టెన్‌ హషీమ్‌ ఆమ్లా, డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏబీ డివిలియర్స్‌ పోటీలు పడి మరీ....క్రీజ్‌లో పాతుకుపోయి భారత బౌలర్లకే కాదు వీక్షిస్తున్న అభిమానులకు విసుగు తెప్పించారు.

డివిలియర్స్ సైతం డిఫెన్స్ కే...
మోడ్రన్‌ క్రికెట్‌లో పరమ జిడ్డు బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన ఆమ్లా...అయితే 100 బంతుల్లో 6 పరుగులే చేసి డిఫెన్స్‌ ఆడటంలో తన తర్వాతే ఎవరైనా అని నిరూపించాడు. మరో ఎండ్‌లో ఓపెనర్‌ బవూమా సైతం తానెమన్నా తక్కువా అంటూ..... ఆమ్లా ఫార్ములానే ఫాలో అయిపోయాడు. 38.4 ఓవర్ల పాటు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ఈ ఇద్దరూ....రెండో వికెట్‌కు 232 బంతుల్లో 44 పరుగులు జోడించారు. 117 బంతుల్లో 34 పరుగులు చేసిన బవూమాను ఔట్‌ చేసిన భారత బౌలర్ల ఆనందం ఎంతో సేపు నిలువలేదు. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ బ్యాట్స్‌మెన్‌గా పేరున్న ...సఫారీ సూపర్‌మ్యాన్‌ ఏబీ డివిలియర్స్‌ సైతం డిఫెన్స్‌కే పరిమితమయ్యాడు. ధూమ్‌ ధామ్‌ ఇన్నింగ్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌ అయిన డివిలియర్స్‌ 50 బంతుల్లో 3 పరుగులే చేసి.....ఫార్మాట్‌కు తగ్గట్టుగా ఆడటంలో తనకు తాను మాత్రమే సాటి అనిపించుకున్నాడు. 200 బంతుల్లో అతి కష్టం మీద 23 పరుగులే చేసిన ఆమ్లా టెస్టు ఫార్మాట్‌లో మరో చెత్త రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. పరమ జిడ్డు బ్యాటింగ్‌తో ఢిల్లీ టెస్ట్‌ను డ్రా చేసే ప్రయత్నంలో ఉన్న సఫారీ బ్యాట్స్‌మెన్‌...ఐదో రోజు ఇంకెన్ని చెత్త రికార్డ్‌లు నమోదు చేస్తారో చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - south africa