Speaker Kodela

12:16 - December 28, 2017

గుంటూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫిరంగిపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. నలుగురు విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. స్కూల్‌ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. మరణ వార్త విన్న...  విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

11:13 - December 28, 2017

గుంటూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఫిరంగిపురం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురు విద్యార్థులతోపాటు ఆటో డ్రైవర్‌ మృతి చెందాడు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. స్కూల్‌ ఆటోను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. శ్రీశైలం..పొన్నూరు ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. ఘటనా స్థలం రక్తపు మడుగులతో ఉంది. మరణ వార్త విన్న... విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. క్షతగాత్రులను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి మృతదేహాలను నర్సారావుపేట మార్చురీకి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం చేయనున్నారు. ప్రమాద ఘటనపై మంత్రులు అచ్చెన్నాయుడు, నక్కా ఆనంద్ బాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను మంత్రి నక్కా ఆనంద్ బాబు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

15:14 - July 17, 2017

విజయవాడ : వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి చిక్కుల్లో పడ్డారు. గతంలో నిండు అసెంబ్లీలో వ్యవహరించిన తీరుపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆమె చేసిన వ్యాఖ్యలపై ఏపీ స్పీకర్ కోడెల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. వ్యాఖ్యలపై రోజాకు నోటీసులు ఇవ్వాలని కోడెల అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు.

ఎందుకు నోటీసులు..
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. అందులో భాగంగా అధికార పక్షానికి చెందిన సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం పలువురు సభ్యులు ఓటింగ్ వేశారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. స్పీకర్ కోడెల తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. టిడిపి నాయకులకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పీకర్ కోడెల ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వచ్చి మాక్ ఓటింగ్‌ లో పాల్గొనడం సరికాదని..స్పీకర్ కూడా అందుకు సహకరించారని ఆరోపణలు గుప్పించారు. స్పీకర్ హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని కానీ స్పీకర్ పదవికి ఆయన గౌరవం లేకుండా చేశారంటూ వ్యాఖ్యానాలు చేశారు.

కోడెల ఆగ్రహం..
స్పీకర్‌ను కించపరిచే విధంగా రోజా మాట్లాడారంటూ స్పీకర్ కోడెలకు విషయాన్ని తెలియచేశారు. దీనితో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రోజాకు వెంటనే నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో వైసీపీలో మరోసారి టెన్షన్ మొదలైంది.

13:21 - June 9, 2017

గుంటూరు : అమరావతిలోని నూతన అసెంబ్లీ భవనంలోకి వర్షం నీరు రావడంపై 3వ రోజు సీఐడీ విచారణ కొనసాగుతోంది. వాటర్‌ లీక్‌ అయిన ప్రాంతాన్ని సీఐడీ చీఫ్‌ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. జగన్‌ చాంబర్‌ను జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది. సివిల్‌ పనులను పరిశీలించి సీఐడీ అధికారులకు ప్రొఫెసర్ల బృందం రిపోర్టు ఇవ్వనుంది. 

12:20 - June 9, 2017

గుంటూరు : ఏపీ అసెంబ్లీ భవనాల సందర్శనకు స్పీకర్ కోడెల శివప్రాసాదరావు అనుతిచ్చారు. భవనాలు సందర్శించడానికి మీడియాకు అవకాశం కల్పించారు. భవనాలకు సందర్శనకు వైసీపీ సభ్యులు అనుమతి కోరితే ఇచ్చే వాడినని స్పీకర్ కోడెల అన్నారు. మరో వైపు ప్రతిపక్ష నేగ వైఎస జగన్ ఛాంబర్ లోకి నీరు రావడంపై సీఐడీ విచారణ మూడవ రోజు కొనసాగుతోంది. 

09:59 - June 8, 2017

గుంటూరు : వెలగపూడిలోని ఏపీ సచివాలయం, అసెంబ్లీలోకి వర్షపు నీళ్ల లీకేజీ వ్యవహారం ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీస్తోంది. నాసిరకం పనుల వల్లే వర్షపు నీళ్లు లీకేజీ అయ్యాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుండగా... ఇందులో కుట్ర కోణం దాగి ఉందని ప్రభుత్వమంటోంది. ఇదిలావుంటే ఈ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు ఎలా లీక్‌ అయ్యాయో సీఆర్డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ను వివరణ కోరారు. అటు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఇంటెలిజెన్స్‌ డీజీ వెంకటేశ్వరరావు కూడా అసెంబ్లీని పరిశీలించారు.

లీకేజీలో కుట్ర....
వర్షపు నీళ్ల లీకేజీని పరిశీలించిన కోడెల ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్నారు. ఎవరో కావాలని జగన్‌ చాంబర్‌లోకి వెళ్లే ఏసీ పైప్‌ను కట్‌ చేశారన్నారు. ఆధారాలన్నీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించి విచారణ జరిపిస్తామన్నారు. అలాగే ఈ అంశంపై సీఐడీ ఎంక్వయిరీ వేస్తున్నట్లు.. విచారణలో అన్ని విషయాలు బయటపడతాయన్నారు కోడెల. జగన్‌ చాంబర్‌లో వర్షపు నీళ్లు లీకేజ్‌ కావడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం చెప్పేవన్నీ కట్టుకథలేనని వైసీపీ నేతలంటున్నారు. సాక్ష్యాలన్నీ తారుమారు చేసి సీఐడీ ఎంక్వయిరీకి ఆదేశించారన్నారు. ప్రభుత్వ తీరును, ఘటనాస్థలికి మీడియాను అనుమతించక పోవడాన్ని నిరసిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో ధర్నా చేశారు. ఈ వ్యవహారంలో వాస్తవాలన్నీ వెలుగు చూడాలంటే సీబీఐతో దర్యాపు చేయించాలని డిమాండ్‌ చేశారు. మొత్తానికి అధికార, ప్రతిపక్షం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడమే కాదు.. వర్షపు నీళ్లు కూడా మాటల మంటలు పుట్టిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారంలో కుట్ర ఉందా.. లేక పనుల్లో నాణ్యతాలోపం తెలియాలంటే సీఐడీ నివేదిక వచ్చేదాకా వేచిచూడాల్సిందే !

19:09 - March 16, 2017

గుంటూరు : సభలో రౌడీయిజం చేయడం మంచిది కాదని సీఎం చంద్రబాబు హితవు పలికారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తీసుకున్నామని తెలిపారు. ఆనాడు వైఎస్ ప్రభుత్వం రూ. 2535 కోట్లు ఖర్చు పెట్టిందని.. తాము అధికారంలోకి వచ్చాక రూ.3451 కోట్లు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. 

 

12:42 - March 15, 2017

విజయవాడ : వ్యవసాయానికి పునరుజ్జీవం కల్పించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. శాసనసభలో 2017-18 వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. వ్యవసాయ సమస్యలు అధిగమించడానికి వినూత్న పద్ధతులు అవలింబిస్తోందన్నారు. 28.5 శాతం తక్కువ వర్షపాతం ఉందన్నారు. పట్టిసీమ ద్వారా పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, గడ్డు పరిస్థితుల్లోనూ వ్యవసాయంలో 14 శాతం వృద్ధి సాధించామని, వ్యవసాయం అనుబంధ రంగాలను ఒకే గొడుగకు కిందకు తీసుకొస్తామని వెల్లడించారు. పత్తి రైతులు గడ్డు పరిస్థితులను ధీటుగా ఎదుర్కొన్నారని సభకు తెలిపారు. పప్పు ధాన్యాల ఉత్పత్తిలో 2.81 శాతం పెరుగుదల సాధించినట్లు, వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యలను అధిగమిస్తున్నట్లు వెల్లడించారు. మొక్కజొన్న, మినుము ఉత్పత్తిలో ప్రథమ స్థానం, వరి ఉత్పాదక స్థానంలో మూడో స్థానంలో ఉందన్నారు. రాయలసీలమ, ప్రకాశం జిల్లాల్లో కరువు నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా రైతుల కళ్లల్లో ఆనందం చూడడం జరిగిందన్నారు. రుతుపవనాల వైఫల్యంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, 6.27 లక్షల ఎకరాలకు రెయిన్ గన్ ల ద్వారా నీటి తడి అందించినట్లు పేర్కొన్నారు. 2016 లో ఖరీఫ్ దిగుబడులు అధికమయ్యాయని, పాల ఉత్పత్తిలో ఏపీ 5వ స్థానం సాధించిందన్నారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులు అవలింబిస్తున్నట్లు, మాంసం ఉత్పత్తిలో 4వ స్థానంలో ఏపీ ఉందన్నారు.

 • వ్యవసాయ రంగానికి రూ. 9091 కోట్లు.
 • మత్స్య శాఖకు : రూ. 782 కోట్లు
 • పండ్లతోటల పెంపకానికి : రూ. 1015 కోట్లు
 • ఆయిల్ ఫామ్ తోటల విస్తరణకు రూ. 55 కోట్లు.
 • పొలం పిలుస్తోంది, చంద్రన్న క్షేత్రాలకు రూ. 17 కోట్లు.
 • సమగ్ర సాగునీటి వ్యవసాయ రూపాంతీకరణ ప్రాజెక్టు కు : రూ. 1600 కోట్లు.
 • 55 లక్షల మందికి రుణమాఫీ.
 • రూ. 1100 కోట్లతో కరవు నివారణ పథకం.
 • రుణమాఫీ కోసం : రూ. 3600 కోట్లు
 • వ్యవసాయంలో యాంత్రీకరణ కోసం : రూ. 147 కోట్లు.
 • బిందు తుంపర సేద్యానికి : రూ. 717 కోట్లు.
 • హార్టికల్చర్ యూనివర్సిటీకి : రూ. 51 కోట్లు.
 • పశుగణాభివృద్ధి : రూ. 1,112 కోట్లు.
 • రైతు బిందు పథకానికి రూ. 33 కోట్లు.
 • ఘంటసాల, రామగిరిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలు.
 • ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి : రూ.308 కోట్లు
 • శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయానికి : రూ. 153 కోట్లు
 • అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ కరవు నివారణ పథకం అమలు
 • కృష్ణా జిల్లా గన్నవరం దగ్గర ఇండియన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ ప్లాంటేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు. దీని కోసం రూ. 25 కోట్లు.
 • విదేశాలకు ఉద్యానవన ఉత్పత్పుల ఎగుమతులు పెంచేందుకు జైకా, సిమ్‌ఫెడ్‌, ఐకోవా సంస్థలతో ఒప్పందం
 • అన్ని వ్యవసాయ కోర్సుల్లో 25 శాతం సీట్లు పెంపు
 • రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.172 కోట్లు (రూ. లక్షలోపు రుణాలకు)
 • పావలా వడ్డీ రుణాలకు రూ. 5 కోట్లు
 • విత్తన ఉత్పత్తి కోసం రూ. 220 కోట్లు
 • రైతు బంధు పథకానికి రూ. 18 కోట్లు
 • ప్రధాన మంత్రి పసల్‌ బీమా యోజన కింద పంటల బీమాకు రూ. 269 కోట్లు
 • మత్స్య శాఖకు రూ. 282 కోట్లు
11:50 - March 15, 2017

విజయవాడ : రాజధాని అమరావతి వేదికగా తీసుకొచ్చిన తొలి బడ్జెట్ పద్దును బుధవారం ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశ పెట్టారు. రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రలో నిర్మించిన తాత్కాలిక శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది రాష్ట్ర బ‌డ్జెట్ రూ.1,56,999 కోట్ల‌ని తెలిపారు. రెవెన్యూ రూ.1,25,911 కోట్ల‌ని చెప్పారు. నిర్వ‌హ‌ణ వ్య‌యం కూ.31,087 కోట్ల‌ని, వ్య‌వ‌సాయ అనుబంధ రంగాల‌కు రూ.8,790 కోట్లని కేటాయిస్తున్న‌ట్లు చెప్పారు. అభివృద్ధే ల‌క్ష్యంగా దూసుకుపోతామని చెప్పారు. బడ్జెట్ ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి..

 • శాస్త్ర సాంకేతిక శాఖకు : రూ. 29 కోట్లు.
 • పరిశ్రమల శాఖకు : రూ. 2,086 కోట్లు
 • మత్య్స శాఖకు : రూ. 282 కోట్లు.
 • పశుగణాభివృద్ధి శాఖకు : రూ. 1,112 కోట్లు.
 • రైతు రుణమాఫీకి : రూ. 3,600 కోట్లు. (రూ.11వేల కోట్లు చెల్లించాం)
 • హోం శాఖకు : రూ. 5,221 కోట్లు.
 • సాంస్కృతిక వ్యవహారాల శాఖకు : రూ. 78.27 కోట్లు.
 • క్రీడలు, యువజన సర్వీసుల శాఖకు : రూ. 728 కోట్లు.
 • గృహ నిర్మాణ శాఖకు : రూ. 1,326 కోట్లు.
 • పట్టణాభివృద్ధి శాఖకు : రూ. 4,216 కోట్లు.
 • రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యకలపాలకు : రూ. 1,061 కోట్లు.
 • సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్, ఇతర రంగాలకు : రూ.1,051 కోట్లు
 • ఎస్టీల సంక్షేమానికి : రూ. 3,528 కోట్లు.
 • ఎస్సీల సంక్షేమానికి : రూ. 9,485 కోట్లు.
 • ఖనిజాభివృద్ధి శాఖకు : రూ. 1,665 కోట్లు.
 • కార్మిక, ఉపాధి కల్పనకు : రూ. 468 కోట్లు.
 • సామాజిక భద్రత, సంక్షేమానికి : రూ. 1,636 కోట్లు.
 • సంక్షేమ శాఖకు : రూ. 11,361 కోట్లు.
 • పర్యావరణం, అటవీ శాఖకు : రూ. 383 కోట్లు.
 • కార్మిక, ఉపాధి కల్పనకు : రూ. 468 కోట్లు.
 • బీసీల సంక్షేమానికి : రూ. 10,000 కోట్లు.
 • క్రైస్తవ కార్పొరేషన్ కు : రూ. 35 కోట్లు.
 • ఈబీసీల సంక్షేమానికి : రూ. 1695 కోట్లు.
 • వికలాంగుల సంక్షేమానికి : రూ. 89.51 కోట్లు.
 • మరుగుదొడ్ల నిర్మాణానికి : రూ. 100 కోట్లు.
 • ఎన్టీఆర్ సుజల స్రవంతికి : రూ. 100 కోట్లు.
 • అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనానికి : రూ. 1000 కోట్లు.
 • ఆరోగ్య శ్రీకి : రూ. 1000 కోట్లు.
 • సాధారణ ఆర్థిక సర్వీసులకు : రూ. 4272 కోట్లు.
 • సమాచార ప్రసార శాఖ కు : రూ. 152 కోట్లు.
 • పేదల విద్యుత్ సబ్సిడీకి : రూ. 3,300 కోట్లు.
 • విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి : రూ. 450 కోట్లు.
 • మహిళా సాధికారిత సంస్థకు : రూ. 400 కోట్లు.
 • దుల్హన్ పథకానికి : రూ. 60 కోట్లు.
 • ఎన్టీఆర్ జలసరి పథకానికి : రూ. 44 కోట్లు.
 • ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కోసం : రూ. 695 కోట్లు.
 • విజయవాడలో మెట్రో రైలుకు : రూ. 100 కోట్లు.
 • దివ్యాంగుల వివాహ ప్రోత్సాహానికి :రూ. 40 వేల నుండి లక్షకు పెంపు.
 • మసీదుల్లో పనిచేసే ఇమామ్ లు, మౌసమ్ లకు : రూ. 24 కోట్లు.
 • వక్ఫ్ సర్వే కమిషన్ కు : రూ. 50 కోట్లు.
 • జెరూసలెం యాత్రికులకు సాయం : రూ. 20 వేల నుండి రూ. 40 వేలకు పెంపు.
 • కొత్త చర్చిల నిర్మాణానికి సాయం : రూ. లక్ష నుండి రూ. 3 లక్షలకు పెంపు.
 • వ్యవసాయ అనుబంధ రంగాలకు : రూ. 9091 కోట్లు.
 • మున్సిపల్ శాఖకు : రూ. 5207 కోట్లు
 • రోడ్లు భవనాలకు : రూ. 4041 కోట్లు.
 • జలవనరుల, వరద నివారణకు : రూ. 701 కోట్లు
 • విద్యారంగానికి : రూ. 20710 కోట్లు.
 • వైద్య రంగానికి : రూ. 6574 కోట్లు.
 • పౌరసరఫరాల శాఖకు : రూ. 2,800 కోట్లు.
 • పెన్షన్లకు : రూ. 4376 కోట్లు.
 • ఎన్టీఆర్ క్యాంటిన్ పథకానికి : రూ. 200 కోట్లు.
 • రవాణా రంగానికి : రూ. 1677 కోట్లు.
 • ఆరోగ్య శాఖకు : రూ. 7020 కోట్లు.
 • హౌసింగ్ శాఖకు : రూ. 1456 కోట్లు.
 • ఐటీ శాఖకు : రూ. 364 కోట్లు.
 • పట్టణాభివృద్ధి శాఖకు : రూ. 5207 కోట్లు.
 • నీటిపారుదల శాఖకు : రూ. 12,770 కోట్లు.
 • కాపు కార్పొరేషన్ కు : రూ. 1000 కోట్లు.
 • ఉన్నత విద్యకు : రూ. 3513 కోట్లు.
 • పాఠశాల విద్యకు : రూ. 17,197 కోట్లు.
 • గ్రామీణ రహదారులకు : రూ. 262 కోట్లు.
 • ప్రజాపంపిణీ పథకానికి : రూ. 2800 కోట్లు.
 • స్కిల్ డెవలప్ మెంట్ కు : రూ. 398 కోట్లు.
 • ఎల్ పీజీ కనెక్షన్ల కోసం : రూ. 380 కోట్లు.
 • పశుగణాభివృద్ధికి : రూ. 1112 కోట్లు.
 • పండ్ల తోటల పెంపకానికి : రూ. 1015 కోట్లు

 

09:44 - March 15, 2017

అమరావతి: కొద్ది సేపటి క్రితం ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ చేపట్టారు. దేవాదాయ భూములపై సభ్యులు లేవనెత్తి ప్రశ్నలకు సంబంధిత శాఖ మంత్రి మాణిక్యాలరావు సమాధానం ఇచ్చారు.

Pages

Don't Miss

Subscribe to RSS - Speaker Kodela