speech

16:21 - November 20, 2018

సిద్ధిపేట : దేశంలో తెలంగాణను నెంబర్ వన్‌గా చేస్తామని అపద్ధర్మ సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్య పోయిందని తెలిపారు. సిద్ధిపేటలో నిర్వహించిన టీఆర్ఎస్ ప్రచార సభలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. క్రాప్ కాలనీలుగా విభజించుకోవాలన్నారు. రైతులకు ఉచితంగా 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నామని..అధికారంలోకి వస్తే కొనసాగిస్తామని చెప్పారు. రైతు సమస్యలు తనకు తెలుసునని చెప్పారు. రైతు బిడ్డను కాబట్టే..రైతు కష్టాలు తనకు తెలుసునని తెలిపారు. తాను ఈరోజుకు కూడా వ్యవసాయం చేస్తున్నానని తెలిపారు. రాబోయే ఏడాది నుంచి రూ.10 వేలు రైతులకు ఇస్తామని చెప్పారు. వచ్చే ఏడాది లోపు ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రాబోయే ఏడాది నాటికి సాగు నీరు అందిస్తామని చెప్పారు. సిద్ధిపేటలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేలు మంచి హుషారుగా ఉన్నారని తెలిపారు. హరీష్, రామలింగారెడ్డిలు జోడు గుర్రాల్లా పని చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయని తెలిపారు.

 

15:30 - November 20, 2018

సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించిన కేసీఆర్ సిద్దిపేటపై వరాల జల్లు కురిపించారు. రెండేళ్లలో సిద్దిపేటకు రైలు తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు రైతులకు 24 గంటల ఉచిత్ విద్యుత్ అందుబాటులో ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. ప్రాజెక్టులన్నీ పూర్తవుతున్నాయని, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు ఇకపై ఎలాంటి నీటి కొరత ఉండదని చెప్పారు. రైతులు, ఐకేపీ మహిళలు, రేషన్ డీలర్లకు లబ్ధి చేకూర్చేవిధంగా సరికొత్త కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు సమన్వయ సంఘం సభ్యులకు గౌరవ వేతనం అందిస్తామని చెప్పారు. 
‘సిద్దిపేట జిల్లా కావాలనుకున్నాం.. బ్రహ్మాండంగా చేసుకున్నాం. సిద్దిపేటకు మెడికల్ కాలేజీ కావాలనుకున్నాం.. చేసుకున్నాం. ఇదే గడ్డలో మీ చేతుల్లోనే పెరిగి, మీరు అందించిన బలంతో రాష్ట్ర సాధన కోసం బయలుదేరా.. తెలంగాణ సాధించుకున్నాం.. సాధించుకున్న రాష్ట్రంలో ఎన్నో అపోహలు. కరెంట్ ఉండదని, నీళ్లు రావని ప్రచారం చేశారు. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నాం’ అని కేసీఆర్ అన్నారు. 

 

21:10 - November 11, 2018

హైదరాబాద్ : హైదరాబాద్ మినీ భారత్ అని తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. నగరంలోని లలితాకళాతోరణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. మరాఠీలు, గుజరాతీలు, బెంగాలీలు అన్ని రాష్ట్రాలవాళ్లు హైదరాబాద్‌లో నివసిస్తున్నారని తెలిపారు. 

 

17:23 - November 10, 2018

సిరిసిల్ల :  చేనేత కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉందని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈమేరకు సిరిసిల్లలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. నేతన్నల ఆత్మహత్యలను నివారించగలిగామని తెలిపారు. బతుకమ్మ చీరలను నేతన్నలతోనే తయారు చేయించామని చెప్పారు. సిరిసిల్ల బ్రాండ్ దేశ వ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. సిరిసిల్ల..ఒక సిరిపూర్ కావాలన్నారు. భారతదేశంలో కాటన్‌కు తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు. దేశంలోనే అత్యుతమ కాటన్ తెలంగాణ రాష్ట్రంలో ఉందని తెలిపారు. ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని..చేతల ప్రభుత్వమన్నారు. టీసర్కార్ నికరంగా పని చేసింది 3 ఏండ్ల 3 నెలలు అని చెప్పారు. 

 

09:10 - September 25, 2018

అమెరికా : ఐక్యరాజ్య సమితిలో ఏపీ సీఎం చంద్రబాబు ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై  ప్రసంగించారు. అనంతరం ఈ సమావేశవంలో పాల్గొన్న అంతర్జాతీయ సంస్థలు ఏపీలోని ప్రకృతి వ్యవసాయంపై ప్రశంసలు కురిపించాయి. 30 దేశాల్లో వ్యవసాయ-అటవీ రంగంలో పరిశోధనలు చేస్తున్న తమ సంస్థ ..ఏపీలో జరుగుతున్న సేంద్రీయ సేద్యాన్ని ఆసక్తికరంగా పరిగణిస్తోందని జీరో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందని ఐసీఆర్‌ఏఎఫ్‌కి చెందిన ప్రపంచ అగ్రోఫారెస్ట్రీ సెంటర్ డీజీ టోనీ సైమెన్స్ తెలిపారు. అభివృద్ధిలోనే పరిశోధన ఉంటుందని...చంద్రబాబు ఆలోచన విధానంలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఏపీలో గ్లోబల్ సెంటర్ ఏర్పాటైన ఆశ్చర్యపడనవసరం లేదని టోనీ సైమెన్స్ పేర్కొన్నారు. ఏపీలో కూడా పరిశోధనలకు టోనీ సైమెన్స్ ఆసక్తి కనబర్చటం సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షతకు..వ్యవసాయం రంగంలోను..అభివృద్ధిలోను ఆయనకు గల ముందుకు చూపుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

07:46 - September 25, 2018

అమెరికా  : ఐక్యరాజ్య సమితిలో మాట్లాడే అరుదైన అవకాశం దక్కించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. కొద్దిసేపటి క్రితం ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అరుదైన అవకాశం దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ‘సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత: అంతర్జాతీయ సవాళ్లు-అవకాశాలు’ అనే అంశంపై చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మనమంతా రసాయన ఎరువులతో పండించిన పంటలనే తింటున్నామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ కొత్త ఒరవడి సృష్టిస్తోందన్నారు. ఐటీ నిపుణులు కూడా వ్యవసాయం వైపు దృష్టి సారిస్తున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికే ఆదర్శమన్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి కలుషితం కాదన్నారు. అంతేకాక, పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి సేద్యం తీరుతెన్నులను వివరించారు. అమ్మ జన్మ మాత్రమే ఇస్తే.. భూమి ఆహారం నుంచి అన్నీ ఇస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్నపూర్ణ అనే పేరు కూడా ఉందన్నారు. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయం వల్లే రైతులకు పెట్టుబడి తగ్గుతుందన్నారు. రసాయన ఎరువుల వాడకం వల్ల పంట దిగుబడుల్లో నాణ్యత లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణంగానే అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగంలో పేర్కొన్నారు.

 

17:07 - September 18, 2018

కర్నూల్ : కాంగ్రెస్ నిర్వహిస్తున్న సత్యమేవ జయతే సభలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అనీ..అందుకే ఢిల్లీ నుండి వచ్చిన వెంటనే సంజీవయ్యగారి నివాసానికి వెళ్లానని రాహుల్ గాంధీ తెలిపారు. జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా వున్న సమయంలో సంజీవయ్యను సీఎంగా చేయాలనే ప్రతిపాదన వచ్చిందని రాహుల్ తెలిపారు. తెలుగు వారైన కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, ప్రధానిగా పీవీ నర్శింహారావులను మీరు గెలిపించారనీ..నిజాయితీపరులైన నాయకులను మీరెప్పుడు గెలిపించారనీ..మాకు అవకాశం ఇస్తే అటువంటి నాయకులను కాంగ్రెస్ పార్టీ తయరు చేస్తుందని హామీ ఇస్తున్నాననీ రాహుల్ పేర్కొన్నారు. దేశానికే ఏపీ దశ, దిశ, నిర్ధేశం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏపీతో సుదీర్ఘమైన అనుబంధం వుందని రాహుల్ గుర్తు చేసుకున్నారు. 

 

18:30 - September 15, 2018

మహబూబ్ నగర్ : టీఆర్ ఎస్ ప్రభుత్వం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఎందుకు ఇచ్చిందని అమిత్ షా నిలదీశారు. ఎవరికి భయపడి 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారని ప్రశ్నించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వడానికి వేళ్లేదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కోత పెట్టి మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్  ఇవ్వాలన్నారు. 2014లో గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పారు..కానీ సీఎం సీట్లో ఎవరు ఉన్నారు?  ప్రశ్నించారు. 

 

17:32 - September 14, 2018

కర్నూలు : స్మార్ట్ వాటర్ గ్రిడ్ కు శ్రీకారం చుట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. జిల్లాలో నిర్వహించిన ’జలసిరికి హారతి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం భావితరాలకు సంబంధించినదన్నారు. నీరు ఉంటే బంగారం పండించే అవకాశం ఉంటుందని తెలిపారు. నీరు ఉంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తయన్నారు. గోదావరి నదికి అఖండ హారతి ఇచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు నదులు కలిపామని చెప్పారు. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామన్నారు. కృష్ణమ్మ తల్లికి జల హారతి ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు జల హారతికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. అనంతపురంకు నీటిని తీసుకెళ్లడానికి లిఫ్టు ద్వారా తప్ప వేరే మార్గంలేదని చెప్పారు. కుప్పం వరకు నీరును తీసుకెళ్తామన్నారు.

వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చాలని సూచించారు. కర్నూలు జిల్లాలో 45 గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించామని తెలిపారు. దేశంలో వ్యవసాయరంగంలో ఏపీ నెంబర్ వన్ రాష్ట్రంగా ఉందని చెప్పారు. వేరుశనగ పంట ఎండిపోయి నష్టపోయిన రైతులను పూర్తిగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ’మన భవిష్యత్ మన చేతిలోనే ఉంది’ అని పేర్కొన్నారు. ప్రజల్లలో చైతన్యం తీసుకరావాలన్నారు. నీటి పరిశుభ్రతను కాపాడాలని సూచించారు. 

 

21:28 - October 7, 2017

హైదరాబాద్ : నిజాం కాలం నాటి నియంతృత్వ థోరణులు మళ్లీ పునరావృతమవుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. . హైదరాబాద్‌ ఎస్వీకేలో మఖ్దూమ్‌ మోహినుద్దీన్‌ జీవితం-కవిత్వం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన.. పాలకులను ప్రశ్నించేందుకు అందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - speech