sports

12:27 - October 10, 2018

న్యూఢిల్లీ: దేశంలో ఆన్‌లైన్ వీడియో వీక్షించే వారి సంఖ్య పెరగడంతో పాటు చూస్తున్న సమయం కూడా పెరుగుతోంది. ఇతర దేశాల్లో ఆన్‌లైన్ వీడియే వీక్షించే వారు వెచ్చించే సమయం కంటే భారత్‌లో అత్యధికంగా ఉందని ఇటీవల చేసిన సర్వేలో తేలింది. భారతీయులు ఆన్‌లైన్ వీడియోలు చూడ్డానికి వారానికి సరాసరి వెచ్చిస్తున్న సమయం అక్షరాలా 8 గంటల 28 నిమిషాలు. ఇది ప్రపంచ స్థాయి సరాసరి (6 గంటల 45 నిమిషాలు) కంటే చాలా ఎక్కువ. ఇది రోజూ టీవీ చూసే సమయం కంటే  కూడా ఎక్కువేనని ఈ సర్వే చెబుతోంది. 2016 సంవత్సరం కంటే 2018లో ఇది 58 శాతం పెరుగుదల రికార్డయ్యిందని ఈ అధ్యయనం తెలుపుతోంది. లైమ్‌లైట్ నెట్‌వర్క్స్ అనే ప్రపంచ స్థాయి డిజిటల్ కంటెంట్ పంపిణీ చేసే సంస్థ  ఈ సర్వేను నిర్వహించింది. 
ఆన్‌లైన్ చానల్స్ ద్వారా ఫోన్ వినియోగదారులు ఎక్కువ సంఖ్యలో సినిమాలు.. అ తర్వాత వార్తలు, టీవీ షోలు, క్రీడలు ఇతర వీడియోలను ఎక్కువగా చూస్తున్నట్టు సర్వే ‘‘స్టేట్ ఆప్ ఆన్‌లైన్ వీడియో 2018’’  తెలుపుతోంది.
ఇతర దేశాల్లో ఆన్‌లైన్ వీడీయో వీక్షణంలో వారానికి సరాసరి గంటలు ఇలా ఉన్నాయి. ఫిలిప్పీన్స్ - 8 గంటల 46 నిమిషాలు,  అమెరికా  - 8 గంటల 30 నిమిషాలు, భారత్ - 8 గంటల 28 నిమిషాలు, జర్మనీ - 5 గంటల 02 నిమిషాలు 
అయితే భారత్ సహా చాలా మంది వీక్షకులు 46 శాతం మంది వీడియో బఫరింగ్ సమయంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టుగా పేర్కొన్నారు. పెరుగుతున్న డిజిటల్ వినియోగం, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని మీడియా పరిశ్రమ క్వాలిటీ వీడియోలను అందించాల్సి ఉందని లైమ్‌లైట్ నెట్‌వర్క్స్ సీనియర్ డైరక్టర్ ఆగ్నేయ ఆసియా, భారత ప్రతినిధి జహీర్ అబ్బాస్ అభిప్రాయపడ్డారు. 
పశ్చిమ దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్‌లలో కంప్యూటర్లు ద్వారా ఆన్‌లైన్ వీడియోలు చూసేందుకు ప్రజలు ఇష్టపడుతుంటే.. భారత్ సహా ఫిలీప్పీన్స్, సింగపూర్, దక్షిణ కొరియా దేశాల్లో స్మార్ట్ ఫోన్ల ద్వారా వీక్షించేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారని అబ్బాస్ వెల్లడించారు. ఇండియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, ఫిలిప్పీన్స్, సింగపూర్, దక్షిణ కొరియా, అమెరికా, బ్రిటన్ దేశాలతో సహా  పది దేశాల్లో 5 వేల మంది వీక్షకులతో సర్వే నిర్వహించారు. వీరిలో 18-35 ఏళ్ల వయస్సున్న వారి అభిప్రాయాలను ఈ అధ్యయనంలో తీసుకున్నారు. 
దుష్ప్రభావాలు : ఎక్కువ సమయం ఆన్‌లైన్ వీడియో వీక్షణం కారణంగా యువతలో కొన్ని ఆరోగ్య సమస్యలు సైతం తలెత్తుతున్నాయి.  బెంగుళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో సైన్సెస్ (నిమ్‌హన్స్) క్లినిక్‌లో ఆన్‌లైన్ వీడియోలకు ఎడిక్ట్ అయిన వ్యక్తి ఆరోగ్యాన్ని పరిశీలించిన వైద్యులు నిశ్చేక్షులయ్యారు. 26 ఏళ్ళ ఓ నిరుద్యోగి రోజుకు 7 గంటల పాటు నెట్‌ప్లిక్స్‌లో వీడియోలు చూడటం వల్ల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలయ్యాడు. నిద్రలేమితో పాటు కళ్లకు ఎక్కువ శ్రమ, అలసట అతని అనారోగ్యానికి కారణమని వైద్యులు తేల్చిచెప్పారు. ఈ తరహా కేసులు ఆసుపత్రికి రావడం ఇదే ప్రధమమని డాక్టర్లు చెప్పారు.  

 

10:24 - September 26, 2018

హైదరాబాద్ : ప్రతిభ అనేది ఎవరూ దాచేస్తే దాగేది కాదు. దానికి తగిన రాణింపు కాస్త ఆలస్యమైనా సరే వెలుగులోకి రాక తప్పదు..పలువురి ప్రశంసలు అందుకోకమానదు. దానికి కొద్దిగా ఓపిక..ఆత్మవిశ్వాసం కూడా తోడైతే..ఆ ప్రతిభ మరింతగా రాణిస్తుంది. సైనా నెహ్వాల్‌ సూపర్‌ సిరీస్‌ టైటిళ్లతో హోరెత్తిస్తున్న రోజుల్లో.. పి.వి.సింధు పేరే వినిపించని కాలంలో.. జాతీయ స్థాయిలో ఆ  ఓ అమ్మాయి పెను సంచలనం సృష్టించింది. అంతర్జాతీయ వేదికల మీద సైనా సత్తాచాటుతుండగా.. జాతీయ స్థాయిలో మెరుపులన్నీ ఆ అమ్మాయివే! సైనా వారసురాలిగా..ఆమెను మించిపోయే క్రీడాకారిణిగా ప్రశంసలు! అంతలోనే.. అనుకోని అవాంతరం ఆమెను అదిమిపెట్టేసింది. మోకాలి గాయం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 ఆపరేషన్లు! పూర్తిగా సంవత్సరకాలం మంచం దిగొద్దని వైద్యుల హెచ్చరిక! ఇక బ్యాడ్మింటన్‌ ఆడలేవనీ..రాకెట్‌ పట్టలేని పరిస్థితి.
కానీ అంతులేని ఆత్మవిశ్వాసంతో ధైర్యం చేసిం సంకల్పంతో మళ్లీ రాకెట్ పట్టేంత తెగువ చూపింది. అగ్రశ్రేణి డబుల్స్‌ క్రీడాకారిణిగా సరికొత్త ప్రస్థానం. అంతర్జాతీయ వేదికల మీద మువ్వన్నెల జెండాను రెపరెపలాండించింది. ఈ నేపథ్యంలోనే కాస్త ఆలస్యమైనా  ఆమెనే వెతుక్కుంటూ వచ్చిన అర్జున అవార్డు! గాయాలతో మధ్యలోనే కెరీర్‌లను వదిలేస్తున్న ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విజయగాథ నేలకుర్తి సిక్కిరెడ్డిది. ఓరుగల్లు విసిన రాకెట్ నేలకుర్తి సిక్కిరెడ్డి. 
 రాష్ట్రపతి చేతులమీదుగా నేలకుర్తి సిక్కిరెడ్డి అర్జున పురస్కారాన్ని అందుకుంది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన క్రీడా అవార్డుల కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా తన ప్రతిభకు తగిన పురస్కారాన్ని అందుకున్న నేలకుర్తి సిక్కిరెడ్డికి అభినందనలు..

 

18:50 - November 20, 2017

హైదరాబాద్ : చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే ఉన్నత శిఖరాలు అదిరోహించవచ్చని సరోజిని టెన్నిస్ అకాడమి డైరెక్టర్, నేషనల్ వాలీబాల్ మాజీ చాంపియన్ కిరణ్ రెడ్డి అన్నారు. సరోజిని టెన్నిస్ అకాడమి విద్యార్ధులు ఇండియన్ టెన్నిస్ లీగ్‌లో విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అండర్ 12 ఐటిఎల్‌ లీగ్‌లో రాహిణ్‌, అండర్ 14 ఐటిఎల్‌లో రూహి విజేతలుగా నిలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారి విజయం వెనక తల్లిదండ్రుల సపోర్ట్‌తో పాటు కోచ్‌లు లీవింగ్ స్టన్, సందీప్ శిక్షణే విజయానికి దోహదపడిందన్నారు. 

16:48 - September 24, 2017

హైదరాబాద్ : దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ మహిళాసభ- పి ఓబుల్‌ రెడ్డి పాఠశాలలో బాస్కెట్‌ బాల్‌ క్లస్టర్‌ 7 బాలికల బాస్కెట్‌ బాల్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి అపోలో హాస్పిటల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంగీతారెడ్డి, ఓబుల్‌ రెడ్డి స్కూల్‌ చైర్మన్‌ ఎస్‌వి రావ్‌, సెక్రటరీ నరసింహారావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఓబుల్‌ రెడ్డి పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఇండోర్‌ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభం చేశారు. 3 రోజుల పాటు బాస్కెట్‌ బాల్‌ టోర్నమెంట్స్‌ జరుగుతాయని సంగీతా రెడ్డి తెలిపారు. జాతీయ స్థాయి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని క్రీడలలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలన్నారు. విద్యార్థులకు అత్యుత్తమ స్థాయిలో విద్యాభ్యాసాన్ని అందిస్తున్న ఓబుల్‌ రెడ్డి పాఠశాలలో ఇండోర్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రధానమైనవిగా భావిస్తున్నామని ఓబుల్‌రెడ్డి పాఠశాల చైర్మన్‌ విఎస్‌ రావు అన్నారు. బాస్కెట్‌ బాల్‌ క్లస్టర్‌ 7 బాలికల బాస్కెట్‌ బాల్‌ పోటీలు నిర్వహించే అవకాశం దక్కడం గర్వకారణమని స్కూల్‌ ప్రిన్సిపల్‌ అంజలి రజ్దాన్‌ అన్నారు. 3 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్‌లో చాంపియన్‌ షిప్‌ కోసం 42 జట్లు పోటీపడనున్నాయి. 

15:54 - August 6, 2017

ఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా తన పరుగుతో అభిమానులను ఉర్రూతలూగించిన జమైకన్‌ చిరుత ఉసేన్‌ బోల్ట్‌ కెరీర్‌లో చివరి పరుగును మాత్రం కాంస్యంతో ముగించాడు. లండన్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో బోల్ట్‌ చివరిసారిగా పాల్గొని మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. బోల్ట్‌ చివరి పరుగును చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎంతో మంది క్రీడాభిమానులను సంపాదించుకున్నా... బోల్ట్‌ చివరి పోరులోనూ గెలుపొంది తమను అలరిస్తాడని భావించినా.. చివరకు మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. అమెరికన్ అథ్లెట్ జస్టిన్‌ గాట్లిన్‌ తొలిస్థానంలో నిలిచాడు. 
 

17:50 - July 23, 2017

హైదరాబాద్ : స్కేట్‌ బోర్డింగ్‌ కింగ్స్‌ రాఫా నిక్స్‌, ఎడ్వర్డ్‌ జెన్నింగ్స్‌, టామ్‌ పెయిన్‌ చైనాలో వరల్డ్‌ రికార్డ్‌ స్టంట్‌తో అదరగొట్టారు. హైవేపై చెంగ్‌డూ నుంచి లాసా వరకూ స్కేటింగ్‌ చేయడం మాత్రమే కాకుండా ఆ తర్వాత లాసా నగర వీధుల్లో స్ట్రీట్‌ స్కేటింగ్‌ చేసి ఆకట్టుకున్నారు. 

 

17:47 - July 23, 2017

హైదరాబాద్ : స్కై డైవింగ్‌ స్పెషలిస్ట్‌లు కరీబియన్‌ ద్వీపంలో పెద్ద సాహసమే చేశారు. గ్వాడిలౌప్‌ తీరంలో సోల్‌ ఫ్లయర్స్‌ డైవింగ్‌ టీమ్‌ ప్రదర్శించిన స్టంట్ ప్రస్తుతం ఎడ్వంచరస్‌ స్పోర్ట్స్ వరల్డ్‌లోనే హాట్‌ టాపిక్‌గా మారింది. ఫెడెరిక్‌ ఫ్యుజెన్‌, విన్సెంట్‌ రెఫెట్‌ సముద్రమట్టానికి 500 మీటర్ల ఎత్తులో నుంచి డైవింగ్‌ చేయడం మాత్రమే కాదు...రివర్స్‌లో డైవ్‌ చేసి ఔరా అనిపించారు. ఆ తర్వాత వింగ్‌ సూట్‌ డైవింగ్‌ సైతం చేసి ... డైవింగ్‌లో తమ తర్వాతే ఎవరైనా అని నిరూపించారు. 

 

18:27 - June 25, 2017

హైదరాబాద్ : స్కై డైవింగ్‌, బేస్‌ జంపింగ్‌ స్పెషలిస్ట్‌ మైల్స్‌ డైషర్‌ జోర్డాన్‌లో చరిత్రను తిరగరాశాడు. బేస్‌ జంపింగ్‌ హిస్టరీలోనే మరెవ్వరికీ సాధ్యం కాని రికార్డ్‌ సృష్టించాడు. ఒక్క రోజులో, 24 గంటల్లోనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 63 సార్లు బేస్‌ జంప్‌ చేసి ఆశ్చర్యపరచాడు. బేస్‌ జంపింగ్‌ ట్రాక్‌ రికార్డ్‌లోనే రికార్డ్‌ లెవల్లో 24 గంటల్లో 63 సార్లు బేస్‌ జంప్‌చేసిన తొలి అథ్లెట్‌గా వరల్డ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు.  

 

17:48 - June 25, 2017

టోక్యో : జపాన్‌ క్యాపిటల్‌ సిటీ టోక్యోలో నిర్వహించిన రెడ్‌బుల్‌ కిక్‌ ఇట్‌ చాలెంజ్‌లో టాప్‌ క్లాస్‌ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ స్పెషలిస్ట్‌లు అదరగొట్టారు. డేర్‌ డెవిల్‌ ట్రిక్స్‌తో వీక్షకులను చూపుతిప్పుకోనివ్వకుండా చేశారు. గాల్లో గిర్రున తిరుగుతూ కళ్లు చెదిరే ఫ్రీ స్టైల్‌ ఫీట్స్‌తో ఔరా అనిపించారు. వ్యక్తిగత విభాగాల్లో మొత్తం మూడు రౌండ్లలో ఈ పోటీలను నిర్వహించారు. ఒకరిని మించి మరొకరు పోటీ పడి మరీ రిస్కీ స్టంట్స్‌ ప్రదర్శిస్తుంటే...ఆశ్చర్యపోవడం వీక్షకుల వంతయ్యింది. ఈ డేర్‌డెవిల్‌ కాంపిటీషన్‌లో దక్షిణ కొరియాకు చెందిన జాకబ్‌ పింటో ప్రదర్శించిన ఫీట్స్‌....టోటల్‌ కాంపిటీషన్‌కే హైలైట్‌గా నిలిచాయి. మూడు రౌండ్లలో ఎక్కడా తడబడకుండా ..మిగతా పోటీదారులెవరికీ సాధ్యం కానటువంటి స్టంట్స్‌ ప్రదర్శించిన పింటో ....వీక్షకులతో పాటు, న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నాడు.

 

15:45 - June 12, 2017

ఉసేన్ బోల్ట్ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. మైదానంలో చిరుతలాంటి పరుగుతో ప్రపంచాన్ని శాంసిచే అథ్లెట్. ఇతడిని ముద్దుగా 'జమైకా చిరుత' అంటుంటారు. ఇతను తన క్రీడా జీవితానికి గుడ్ బై చెప్పేశాడు. శనివారం రాత్రి సొంత గ్రౌండ్ కింగ్స్ ట్టన్ నేషనల్ స్టేడియంలో చివరి పరుగు తీశాడు. 100 మీటర్ల పరుగులు పందెంలో బోల్ట్ విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కేవలం 10.03 సెకండ్లలోనే అధిగమించడం విశేషం. చివరి పరుగు చూసేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. 30 వలే మంది ఈ పరుగును తిలకించడం గమనార్హం. పరుగు ముగిసిన వెంటనే 'బోల్ట్‌' మైదానంలోని అభిమానులకు సెల్యూట్‌ చేసి అభివాదం చేశాడు. తనను మొదట్నుంచి ఆదరిస్తూ వచ్చిన జమైకన్ల ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. 2002 అంతర్జాతీయంగా కెరీర్‌ను 'బోల్ట్' ప్రారంభించాడు. వరుసగా మూడు ఒలింపిక్స్‌ల్లోను 100, 200 మీటర్లు పరుగుతో పాటు 400 మీటర్లు పరుగు పందెంల్లో వరుసగా బీజింగ్‌, లండన్‌, రియో ఒలింపిక్స్‌ల్లో తొమ్మిది స్వర్ణాలు సాధించాడు. కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన 30 ఏళ్ల బోల్ట్‌ ఇక ఓ ఇంటి వాడు కావడంతో రెండో ఇన్నింగ్స్‌ మొదలెట్టనున్నాడు.

Pages

Don't Miss

Subscribe to RSS - sports