Sri Reddy Comments

14:31 - April 21, 2018

హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ప్రకంపనాలు ఇంకా ఆగడం లేదు. సినీ నటుడు పవన్ కళ్యాణ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. దీని వెనుక రాంగోపాల్ వర్మ ఉన్నాడని బయటకు రావడం..మా అసోసియేషన్ లో పవన్ నిరసన తెలియచేయడంతో ఒక్కసారిగా ఇది రాజకీయ రంగు పులుముకుంది.

ఇదిలా ఉంటే దీనిపై శనివారం అన్నపూర్ణ స్టూడియోలో సినీ పెద్దల సమావేశం జరిగింది. కాసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటల పాటు క్యాస్టింగ్‌ కౌచ్‌, ఇండస్ట్రీలోని పలు సమస్యలపై చర్చించారు. కాసేపట్లో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను కలువనున్నట్లు సమాచారం.

మరోవైపు పవన్ వరుసగా చేస్తున్న ట్వీట్లు మరింత ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. నిజాలను నిగ్గు తేలుద్దాం పేరిట ట్వీట్లు చేస్తున్నారు. 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం' అంటూ మీడియాపై విమర్శనాస్త్రాలు చేపట్టారు. ఫ్యాక్షనిస్టుల ఆస్తులను జాతీయం చేయాలన్న ఓ చానల్‌ స్లోగన్‌పై సెటైర్‌ వేశారు. ఈ స్లోగన్‌కు వెనకాల కథ ఏంటి అంటూ పవన్‌ ప్రశ్నించారు. నిజమైన అజ్ఞాతవాసి ఎవరు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. అజ్ఞాతవాసిని బ్లాక్‌మెయిలర్‌ అని సీఎం కేబినెట్‌ ర్యాంక్‌ మంత్రితో అన్నారు..ఆ కేబినెట్‌ మంత్రి ఒకరితో ఆ మాట చెప్పారని..ఆ ముఖ్యమంత్రి ఎవరు..? కేబినెట్‌ మంత్రి ఎవరు..? ఆ ఒక్కరు ఎవరు..? నిజాలను నిగ్గు తేలుద్దాం కార్యక్రమం నుంచి పవన్‌ కల్యాణ్‌..! అంటూ పవన్ సెటైర్స్ వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

15:01 - April 20, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ లో ప్రకంపనాలు జరుగుతూనే ఉన్నాయి. క్యాస్టింగ్ టచ్ పై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం సృష్టించాయి. ఏకంగా సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేయడం...దీనివెనుక తానున్నట్లు వివాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేర్కొనడంతో మెగా ఫ్యామిలీ తీవ్రంగా స్పందించింది. తాజాగా పవన్ కళ్యాణ్ ఏకంగా ఫిల్మ్ ఛాంబర్ వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. పవన్ వచ్చారన్న విషయం దావానంలా వ్యాపించడంతో 'మా' అసోసియేషన్ సభ్యులు, అభిమానులు చేరుకున్నారు. తన తల్లికి న్యాయం జరిగేవంతవరకు ఇక్కడి నుండి కదిలి వెళ్లనని పవన్ భీష్మించుకూర్చొవడంతో ఉత్కంఠ రేగింది. పవన్ కు మద్దతుగా మెగా కుటుంబం నుండి అల్లు అరవింద్, నాగబాబు, రామ్ చరణ్ తేజ, అల్లు అర్జున్ లు చేరుకున్నారు. కాసేపు నిరసన తెలిపిన పవన్ అక్కడి నుండి వెళ్లిపోయారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పవన్ కు పోలీసులు నచ్చచెప్పడంతో ఆయన వెళ్లిపోయినట్లు సమాచారం. కానీ తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పవన్ డిమాండ్ చేస్తున్నట్లు టాక్. కాసేపట్లో 'మా' కార్యాలయానికి మెగాస్టార్ చిరంజీవి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

12:26 - April 19, 2018

హైదరాబాద్ : క్యాస్టింగ్‌ కౌచ్‌పై టాలీవుడ్‌లో చెలరేగిన దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు చిత్ర పరిశ్రమ అన్ని చర్యలు తీసుకొంటోందని ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ సమస్య పరిష్కారం కోసం కమిటీ సభ్యులను త్వరలో ప్రకటిస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో క్యాస్టింగ్‌ కౌచ్‌  కమిటీని వేస్తామని తెలిపారు. శ్రీరెడ్డి వ్యవహారంపై ఆయన తీవ్రంగా స్పందించారు. సమస్యను పరిష్కరించుకోవాలని కాని రాద్ధాంతం చేయొద్దని అన్నారు. సినీ ఇండస్ట్రీపై దుష్ర్పచారం మంచిది కాదు అన్నారు. సినీ ఇండస్ట్రీ నీచమైంది అయితే తమ పిల్లలను ఎందుకు తీసుకొస్తామన్నారు. సమస్య పరిష్కరానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లమని పవన్‌ చెప్పడంలో తప్పేముందని చెప్పారు. పవన్‌ వ్యాఖ్యలను శ్రీరెడ్డికి ఎందుకు తప్పుగా అనిపించాయని తెలిపారు. 

12:19 - April 19, 2018

హైదరాబాద్ : ప్రత్యేకహోదా కోసం పోరాటాలు చేస్తుంటే టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల విమర్శిస్తున్నారని సినీ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. 'హోదా కోసం ఆందోళనలు చేస్తుంటే నీవు ఎవడు ఆందోళన చేయడానికి అని తెలుగుదేశం ప్రతినిధి అంటున్నారని అన్నారు. మరో టీడీపీ ప్రతినిధి బట్టలు ఊడదీసి కొడతా అంటున్నాడని...హోదా కోసం దీక్ష చేపట్టే ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా బట్టలు ఊడదీసి కొడతారా అని తమ్మారెడ్డి అన్నారు. తెలుగు వాళ్లంతా పిచ్చివాళ్లు అనుకుంటున్నారా అని మండిపడ్డారు. దరిద్రులను పార్టీలో పెట్టుకుంటే నష్టం వస్తుందని..చంద్రబాబుకు సూచించారు. 

 

08:48 - April 19, 2018

హైదరాబాద్ : క్యాస్టింగ్‌కౌచ్‌.. ఈ అంశం ఇపుడు టాలీవుడ్‌ను కుదిపివేస్తోంది. నటి శ్రీరెడ్డి యాక్షన్‌ సీన్లు.. దానికి మిగతా నటుల రియాక్షన్స్‌... ఇలా ఫిల్మ్‌నగర్‌లో నెలరోజులుగా కలర్‌ఫుల్‌ చిత్రం నడుస్తోంది. ముఖ్యంగా శ్రీరెడ్డి చేస్తోన్న ఆరోపణలపై సినీతారాలోకం ఫైరవుతోంది. పవన్‌పై శ్రీరెడ్డి ఆరోపణలను నాగబాబు ఖండించగా.. తన ఫ్యామిలీపై శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలను  జీవితా రాజశేఖర్‌ కూడా తిప్పికొట్టారు. తన వ్యాఖ్యలపై అందరూ విమర్శలు చేస్తుండడంతో.. శ్రీరెడ్డి పవన్‌ కల్యాణ్‌ తల్లికి, పవన్‌కల్యాణ్‌కు ట్విట్టర్‌ మూలంగా క్షమాపణలు చెప్పారు. 
కార్చిచ్చులా రగులుతున్న కాస్టింగ్‌ కౌచ్‌  
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ అంశం... కార్చిచ్చులా రగులుతూనే ఉంది. జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలపై ఫిల్మ్‌నగర్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నటి మాధవీలత.. పవన్‌పై శ్రీరెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా.. ఫిల్మ్‌ చాంబర్‌ ఎదుట మౌన దీక్షకు కూర్చున్నారు. అయితే పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి.. అదుపులోకి తీసుకున్నారు. శ్రీరెడ్డి వ్యాఖ్యలను మాధవీలత తీవ్రంగా తప్పుబట్టారు. 
కాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన మెగా బ్రదర్‌ నాగబాబు 
తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌పై మెగాబ్రదర్‌ నాగబాబు కూడా స్పందించారు. ఇండస్ట్రీ అమ్మాయిలను ఆటవస్తువుగా చూడదని.....అలా చూసేట్లుంటే..  తన కూతురిని ఎందుకు ఇండస్ట్రీకి తెస్తానని ప్రశ్నించారు. మా అసోసియేషన్‌లో సభ్యులకు సమస్యలు వస్తే కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. పవన్‌ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడం తప్పెలా అవుతుందన్నారు. పరిశ్రమలో  ఎవరు వేధించినా చెప్పుతో కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అంతే కాని మెగా ఫ్యామిలీని వేలెత్తి చూపిస్తే ఊరుకునేది లేదన్నారు నాగబాబు.  
శ్రీరెడ్డి విషయంలో నాపై తప్పుడు ఆరోపణలు ప్రచారం : జీవితారాజశేఖర్‌  
మరోవైపు శ్రీరెడ్డి విషయంలో ఓ చానల్‌ తనపై తప్పుడు ఆరోపణలు ప్రచారం చేసిందని జీవితారాజశేఖర్‌ ఫైరయ్యారు. క్యాస్టింగ్‌కౌచ్‌పై వేయబోయే కమిటీలో తన పేరు ఉన్నట్టు తెలుసుకుని పథకం ప్రకారం తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తనపై తన ఫ్యామిలీ మెంబర్స్‌పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని జీవిత హెచ్చరించారు. 
ట్విట్టర్‌ లో శ్రీరెడ్డి విచిత్రమైన పోస్టులు.. కలకలం
ఇదిలావుంటే నటి శ్రీరెడ్డి ఇవాళ ట్విట్టర్‌ మూలకంగా కొన్ని విచిత్రమైన పోస్టులు చేసి కలకలం సృష్టించాయి. పవన్‌ కల్యాణ్‌పై ఒంటికాలిపై లేచి.. దుర్భాషలాడిన శ్రీరెడ్డి.. బుధవారం.. ట్విట్టర్‌ మూలకంగా పవన్‌కు, ఆయన తల్లికీ క్షమాపణలు చెప్పారు. అంతేలోనే.. ఈ వ్యవహారంలో తాను ఒంటరినయ్యానని.. సహకరించిన వారికి ధన్యవాదాలు అనీ పోస్ట్‌ చేశారు. దీంతో ఆమె మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. అంతలోనే.. స్టేషన్‌లో కేసు పెట్టాలన్న పవన్‌ మాటలను పాటిస్తానని, నటి జీవితా రాజశేఖర్‌ నుంచే కేసుల పర్వం ప్రారంభిస్తానని మరో ట్వీట్‌ చేశారు. మొత్తానికి శ్రీరెడ్డి లేవనెత్తిన కాస్టింగ్‌ కౌచ్‌ వివాదం ఇప్పుడు భాషలకు అతీతంగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతోంది. 

 

20:37 - April 18, 2018
15:20 - April 18, 2018

హైదరాబాద్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో జరుగుతోన్న కాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. ఇండస్ట్రీ అమ్మాయిలను ఆటవస్తువుగా చూడదని.....అలా చూస్తే తన కూతురిని ఎందుకు ఇండస్ట్రీకి తీసుకువస్తానన్నారు. మా అసోసియేషన్‌లో సభ్యులకు సమస్యలు వస్తే కచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. అయితే మాలో సభ్యత్వం ఉచితంగా ఇవ్వడం కుదరదన్నారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపులకు తాను వ్యతిరేకమన్నారు నాగబాబు. పవన్‌ కల్యాణ్‌పై శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు. పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పడం తప్పెలా అవుతుందన్నారు. ఎవ్వరు వేధించినా చెప్పుతో కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అంతే కాని మెగా ఫ్యామిలీని వేలెత్తి చూపిస్తే ఊరుకోమన్నారు

14:32 - April 18, 2018

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ కు శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పారు. సమస్యలు ఉంటే పోలీస్ స్టషన్ కు వెళ్లండి అని చెప్పిన పవన్ గారి మాటలను అనుసరిస్తానని అన్నారు. 

16:37 - April 11, 2018

శ్రీరెడ్డి అర్ధనగ్న నిరసన తెలియజేయవచ్చా..? అనే అంశంపై మానవి మైరైట్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో లాయర్ పార్వతి పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెక్స్ వల్ అరాస్ మెంట్స్ ప్రతి రంగంలో ఉందన్నారు. శ్రీరెడ్డి తీవ్ర నిరాశనిస్పృహలకు లోనయ్యారని ఉంటారని తెలిపారు. నిరసన అనేది అనేక రూపాల్లో చేయవచ్చు అన్నారు. ఆమె తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Don't Miss

Subscribe to RSS - Sri Reddy Comments