srinivas goud

19:20 - September 13, 2018

హైదరాబాద్ : విపక్షాలపై టీఆర్ ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ ఎస్ కు ఉన్న బలాన్నిచూసి విపక్షాలు భయపడిపోయాయని ఎద్దేవా చేశారు. వారు చేసుకున్నసర్వేల్లో తమ పార్టీకున్న బలాన్నిచూసి భయపడి ఎట్లైనా అందరు ఐక్యమై టీఆర్ ఎస్ ను ఓడగొట్టాలనేదే వారికున్న ఏకైక లక్ష్యమని వేరేమీ లేదన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని..పొత్తులకు సిద్దం కావడం విడ్డూరంగా ఉందన్నారు. 70 సంవత్సరాల పాటు పరిపాలన చేసిన కాంగ్రెస్ దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని దివాళా తీయించారని మండిపడ్డారు. ’మీకు జెండా, ఎజెండా ఏమీ లేవని...నీతి మాలిన పనులు చేస్తూ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు అని కాంగ్రెస్ నేతలకు ఉద్ధేశించి మాట్లాడారు. నిన్నజైపాల్ రెడ్డి రాజీవ్ శర్మపై విమర్శలు చేశారని..అసలు తెలంగాణ ఉద్యమంలో జైపాల్ రెడ్డి పాత్ర ఏమిటని ప్రశ్నించారు. ’నీవు ఎవిరికి తాబీరుదారుగా ఉన్నావని, ఎవరికి బ్రోకర్ గా ఉన్నావని, ఎవరికి పని చేశావు’ అని జైపాల్ రెడ్డిని ఉద్ధేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ’రాజీవ్ శర్మ గురించి నీకు పూర్తిగా తెలుసా’ అని ఆయన్నుప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేంద్ర హోంశాఖలో పని చేస్తున్నరాజీవ్ శర్మ  పాత్ర ఏంటో తెలుసా అని అడిగారు. తెలంగాణ కోసం జరుగుతున్న అత్మబలిదానాలపై ఉన్నదిఉన్నట్లుగా రాజీవ్ శర్మ కేంద్రానికి నివేదిక ఇచ్చినందుకు ఆయన బ్రొకర్ అయ్యాడా ?  తెలంగాణలో పుట్టకపోయినా అయన పలుకుబడిని ఉపయోగించి ఎప్పటికప్పుడు రాష్ట్రానికి నిధులు తెచ్చినందుకా ఆయన బ్రోకర్? రాజీవ్ శర్మఎందుకు బ్రోకర్ అయ్యాడో చెప్పలాని జైపాల్ రెడ్డిని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అన్నిపోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు, ఓపెన్ క్యాటగిరిలో మిగిలిన 5శాతం రిజర్వేషన్లలో కూడా తెలుగువారికి అని నిబంధనలు పెట్టాలని రాజీవ్ శర్మ పేర్కొన్న విషయాన్నిశ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.

 

11:02 - March 28, 2018

హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. సభలో స్పీకర్ మధుసూధనాచారి ప్రశ్నోత్తరాలను చేపట్టారు. మానవ తప్పిదాల వల్లనే చెరువులు కలుషితం అవుతున్నయని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో పరిశ్రమలు వ్యర్ధాలను చెరువుల్లో వదులుతున్నారనీ దీని వల్ల హుస్సేన్ సాగర్ తీవ్రమైన కలుషితంగా తయారయిపోతోందని బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం తెలిపారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ మధ్య సమన్వయ లోపం వుందని అది మాపరిధికాదని ఇరువురు తప్పించుకోవటంపై లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనికి మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. చెరువుల పరిరక్షణ, నాలాల శుద్ధి, కాలుష్య కారక పరిశ్రమల తరలింపు వంటి అంశాలపై సభ్యులడిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు, హెచ్‌ఎండీఏ పరిధిలో 3,132 చెరువులు ఉన్నట్లు తెలిపారు. మురుగు నీరు వల్ల చెరువులు కలుషితమయ్యాయన్నారు. ఓఆర్‌ఆర్ పరిధిలోపల 40 చెరువులను శుద్ధి చేస్తున్నామన్నారు. నగరంలోని చెరువులు శిఖం పట్టాల్లో ఉన్నయని చెప్పారు. 1,234 కాలుష్య కారక పరిశ్రమలు ఉన్నయని.. కాలుష్య కారక పరిశ్రమలను నగరం అవతలికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మూడు నెలల్లో 100 కాలుష్య కారక పరిశ్రమలను తరిలిస్తమని వెల్లడించారు. ఫార్మా సిటీకి మరో 400 పరిశ్రమలను తరలిస్తామన్నాని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

21:04 - March 17, 2018

సీఎం క్యాంప్ ఆపీసుకాడ కాపుకాసిన వికలాంగులు.. బంగారు తెలంగాణ తెస్తనన్నకేసీఆర్ పాలనలో మాకేంటీ ఈ తిప్పలు అంటున్న వికలాంగులు.. బీజేపీకి టీడీపీకు హోదా పురిటి నొప్పులట..ప్రజలే సేయలట కాన్పు..కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపేంత వరకూ ఊరుకోనంటున్న కోమటి రెడ్డి. గంతవరకూ ఢిల్లీలోనే మకాం ఏస్తడంట. తెలంగాణ ఆడబిడ్డలు మంచినీటికోసం బిందెలు పట్టుకోని రోడ్ల మీదకు రానివ్వమని ప్రగల్బాలు పలిచిన కేటీఆర్ నియోజకవర్గంలో ఖాళీ బిందెలు నిరసన చేస్తున్న మహిళలు..

21:38 - March 16, 2018

తెలంగాణ జనం సంతోషంగున్నరు...ఆనందం ఎల్లగక్కిన అధినేత కేసీఆర్, మందక్రిష్ణను మళ్ల అణచివేస్తమన్న సీఎం..మస్తుగ జూశ్నం మీ అసొంటోళ్లనన్నక్రిష్ణ, అయ్యా భజన సుర్వు జేశ్న నారా లోకేశం...ఆర్కేస్ట్రా టీం ఒక్కటే తక్వుండే అసెంబ్లీల, చైర్మన్ సారు కంటి చికిత్స విజయవంతం...డాక్టర్లకు రుణపడి ఉన్న తెలంగాణ జనం, ఎంపీ, ఎమ్మెల్యే కీసులాటకు సీఐ బలి...బహుజన పోలీసు అధికారి సస్పెండ్, ఉంటె పులన్న ఉండాలే లేదంటె మేమన్న..చిర్తపులి రావొద్దని ఊరి జనాల ధర్నా... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

17:24 - March 12, 2018
17:29 - January 11, 2017

హైదరాబాద్: లాభాలు లేని రూట్లలో బస్సులు నడపకుండా, లాభాలు వచ్చే ఆంధ్రా నాయకులు ఇష్టారాజ్యంగా బస్సులు నడుపుతున్నారని టిఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ...పర్మిషన్ ఉన్నది కాంటాక్ట్ క్యారేజీ పర్మిషన్ అయితే.. స్టేజ్ క్యారేజ్ తో బస్సులను నడిపిస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ బస్సుల వారు ఉన్న టిక్కెట్లను బ్లాక్ చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. హైవేలపై బస్సులను చెక్ చేయాలని ఆర్టీఏ అధికారులకు సూచించారు. ఎక్కడైనా టిక్కెట్లను అధిక ధరకు అమ్ముతుంటే ఒక పోన్ చేయాలని ప్రయాణీకులకు సూచించారు. పండుగ సందర్భంగా 800 ఏపికి బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ఎండీని కోరినట్లు తెలిపారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆర్టీఏ చర్యలు తీసుకోవాలన్నారు.

20:57 - February 3, 2016

కాపుల రిజర్వేషన్ల అంశానికి సహేతుక పరిష్కారం కావాలని వక్తలు పేర్కొన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, బీసీ సంఘం నేత శ్రీనివాస్ గౌడ్, కాపునాడు జాతీయ సమన్వయకర్త గార్ల సుబ్రహ్మణ్యం, కరణం ధర్మశ్రీ, టిడిపి నేత...చందు సాంబశివరావు పాల్గొని, మాట్లాడారు. కాపులు, బీసీలు ఘర్షణ పడడం సరికాదన్నారు. సమస్యను జఠిలం చేయడం తగదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

15:16 - November 3, 2015

హైదరాబాద్ : ఉద్యోగుల విభజనలో కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఆరోపించారు. ఉద్యోగుల విభజన, ప్రమోషన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సీఎస్‌ రాజీవ్‌శర్మను కలిశారు. సీఎస్‌ విజ్ఞప్తి మేరకు రేపు ఇందిరాపార్క్‌ వద్ద ఉద్యోగ సంఘాలు తలపెట్టాల్సిన ధర్నాను వాయిదా వేసుకున్నట్లు శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు.

 

18:22 - July 11, 2015

హైదరాబాద్: ప్రస్తుతం హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలులోనే ఉందని మహబూబ్‌నగర్‌ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అయితే అందులో క్లాజ్‌ 3, 4 ప్రకారం శాంతి భద్రతలు అదుపు తప్పినప్పుడు, ఇతర రాష్ట్రాల వారికి ప్రాణహాని ఉందని భావిస్తేనే గవర్నర్‌ అధికారాలను చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉందని శ్రీనివాస్ గౌడ్‌ అన్నారు. అయితే గవర్నర్‌కు అధికారాలు సైతం తెలంగాణ కేబినేట్‌ సిఫార్సు మేరకే తీసకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8ను అమలు చేయాలని చంద్రబాబు.. కేంద్రానికి లేఖ రాసి తన కుట్రను బయటపెట్టారని ఆయన విమర్శించారు.

 

Don't Miss

Subscribe to RSS - srinivas goud