ss rajamouli

13:15 - April 13, 2018

ఢిల్లీ : ప్రతిష్టాత్మక 65వ జాతీయ అవార్డుల ప్రకటన కాసేపటి క్రితం వెలువడింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ కార్యక్రమం జరుగుతోంది. 2017లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వచ్చిన చిత్రాలను పరిగణలోకి తీసుకుని అవార్డులను ప్రకటిస్తున్నారు.

 • ఉత్తమ నటి : శ్రీదేవి (మామ్)
 • ఉత్తమ తెలుగు చిత్రం : ఘాజీ
 • ఉత్తమ హిందీ చిత్రం : న్యూటన్
 • ఉత్తమ మలయాళీ చిత్రం : టేకాఫ్
 • ఉత్తమ తమిళ చిత్రం : టు లెట్
 • ఉత్తమ మరాఠీ చిత్రం : కచ్చా నింబూ
 • ఉత్తమ కన్నడ చిత్రం : హెబ్బెట్టు రామక్క
 • ఉత్తమ బెంగాలీ చిత్రం : మయురాక్షి
 • ఉత్తమ యాక్షన్ చిత్రం : బాహుబలి 2
 • ఉత్తమ సంగీత దర్శకుడు : ఏ.ఆర్.రెహమాన్ (మామ్), (కాట్రు వెలియిదామ్)
 • ఉత్తమ కొరియాగ్రాఫర్ : గణేష్ ఆచార్య (టాయ్ లెట్, ఏక్ ప్రేమ్ కథా)
 • ఉత్తమ దర్శకుడు : జయరాజ్ (మలయాళ చిత్రం భయానకం)
 • ఉత్తమ సహాయ నటుడు : ఫహాద్ ఫాసిల్ (తొండిముత్తలం ద్రిసాక్షియుం)
 • బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. 
11:57 - December 13, 2017

గుంటూరు : అమరావతిలో సీఆర్ డీఏ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభం జరుగుతోంది. అసెంబ్లీ, హైకోర్టు డిజైన్లపై చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి దర్శకుడు రాజమౌళి, న్మారన్ ఫోస్టర్ ప్రతినిధులు, మంత్రి నారాయణ, సీఆర్ డీఏ ఉన్నతాధికారులు హాజరయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:22 - December 12, 2017

గుంటూరు : సీఆర్డీఏ అధికారులు, దర్శకుడు రాజమౌళితో ఇవాళ  సీఎం చంద్రబాబు  భేటీ కానున్నారు. అమరావతి శాశ్వత భవనాల డిజైన్లపై చర్చిస్తారు. రాజధాని డిజైన్లను  2, 3 రోజుల్లో ప్రభుత్వం ఖరారు చేయనున్న నేపథ్యంలో ముందుగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో రాజమౌళి భేటీ అవుతారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అవుతారు.  రేపు  ఫైనల్ డిజైన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. రాజధాని భవనాల డిజైన్లను పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

 

15:34 - December 11, 2017

గుంటూరు : రాజధాని భవనాల డిజైన్లపై ఏపీ సర్కార్ ప్రజాభిప్రాయం సేకరించనుంది. పబ్లిక్ డొమైన్ లో పెట్టి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోనుంది. రేపు సీఎం చంద్రబాబు, సీఆర్డీఏ అధికారులతో దర్శకుడు రాజమౌళి భేటీ కానున్నారు. రాజధాని శాశ్వత భవనాల డిజైన్లను ప్రభుత్వం 2,3 రోజుల్లో ఖరారు చేయనుంది. ఎల్లుండి ఫైనల్ డిజైన్లు ఖరారు చేసే అవకాశం ఉంది. ముందుగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో రాజమౌళి భేటీ కానున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:52 - November 20, 2017

సినిమా : దేశంలో సినీ చరిత్రలో రికార్డు సృష్టించిన దర్శకుడు రాజమౌళి. ఆయన తీసిన బాహుబలి దేశావ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. అయితే బాహుబలి తర్వాత ఆయన ఇంత వరకు ఏ సినిమాను మొదలు పెట్టలేదు. కాని ఆయన లేటెస్టుగా ట్వీట్టర్ లో మెగా స్టార్ చిరు తనయుడు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ తో కలసి దిగిన ఫోటో పోస్టు చేశారు. దీంతో చరణ్, ఎన్టీఆర్ తో జక్కన్న మల్టీస్టారర్ తీయబోతున్నాడా అనే వార్తాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాజమౌళి మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా చరణ్ రంగస్థలం చేస్తున్నారు.

06:59 - October 19, 2017

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించే ప్రభుత్వ భవనాల ఆకృతుల కసరత్తు వేగవంతమైంది. డిజైన్ల రూపకల్పన, ఖరారులో ఆలస్యం కావడంతో రాజధాని నిర్మాణంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్న ప్రభుత్వం... వీలైనంత త్వరగా అమరావతి ఆకృతులను ఖరారు చేయాలని నిర్ణయించింది.

11న లండన్‌ వెళ్లిన టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి....

ప్రభుత్వ సలహా మేరకు ఈనెల 11న లండన్‌ వెళ్లిన టాలీవుడ్‌ దర్శకుడు రాజమౌళి.... నార్మన్‌ పోస్టర్‌ బృందంతో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి పలురకాల నమూనా ఆకృతులను రూపొందించారు. గతంలో కంటే భిన్నంగా ఉండే విధంగా ఏడు రకాల ఆకృతులను తయారు చేశారు. ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు వీటిని సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు. ఎక్కువ మంది ప్రజలు బాగుందని సూచించిన డిజైన్‌కు ప్రభుత్వం కూడా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు... అక్కడ నుంచి యూఏఈ వెళ్లి, అటునుంచి ఈ నెల 24న లండన్‌ చేరుకుంటారు. 25న రాజధాని ఆకృతులు రూపొందిస్తున్న నార్మన్‌ పోస్టర్‌ బృందంతో భేటీ అవుతారు. అసెంబ్లీ కోసం రూపొందించిన ఏడు డిజైన్లపై చర్చించి, ఒకదానిని ఖరారు చేస్తారు. ఈ విషయంలో ప్రజల అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి పరిగణలోకి తీసుకుంటారు. లండన్‌ నుంచి చంద్రబాబు తుది డిజైన్‌తో తిరిగివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అసెంబ్లీ భవనంపై పొడవైన టవర్‌ వచ్చే విధంగా రూపొందించిన డిజైన్‌ను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

20:08 - September 20, 2017

అమరావతీ ఊపిరి పీల్చుకో...రాజమౌళి వస్తున్నాడు.. మాహిష్మతి కాదు.. దాని తలదన్నే డిజైన్లతో భవనాలు సెలక్ట్ చేయబోతున్నాడట.. అమరావతిలో ముఖ్యమైన భవనాల డిజైన్ల విషయంలో జక్కన్న క్రియేటివిటీ వాడబోతున్నారు. దేశ విదేశాల ఆర్కిటెక్కులు, ఎన్నో ఏజన్సీలు చేయలేని పనిని రాజమౌళి చేస్తారని చంద్రబాబు నమ్ముతున్నారు. ఈగ ఎగిరినట్టే, ఉదయఘర్ సామ్రాజ్యం వెలిగినట్టే, మాహిష్మతి అబ్బురపరిచినట్టే, అమరావతి డిజైన్లు కూడా వస్తాయని ఏపీ సర్కారు భావిస్తోందా? ఇది కావాలని చేస్తున్న కాలయాపనా? లేక మహిష్మతి పట్ల చంద్రబాబుకున్న ఇష్టమా?

అమరావతి..భ్రమరావతి..మాహిష్మతమరావతి ..డిజైన్లు, సంస్థలు, ఆర్కిటెక్కులు మారుతున్నట్టే... అమరావతికి మారుపేర్లూ పెరుగుతున్నాయి. రాజధాని నిర్మాణం పేరుతో ఏపీ సర్కారు చేస్తున్న స్టంట్లు అనేక ప్రశ్నలను రేరెత్తిస్తున్నాయి. అనేక విమర్శలకు కారణమౌతున్నాయి. గుళ్లూ గోపురాలను డిజైన్ చేయించుకున్నారంటే ఓ అర్ధముంది..ఫ్యాట్ వెడ్డింగ్ డిజైనర్లుగా సలహా అడిగారంటే అర్ధం చేసుకోవచ్చు..కానీ, ఓ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భవనాల డిజైన్ల గురించి ఓ డైరెక్టర్ ని సంప్రదించటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మరి సర్కారీ యంత్రాగంలోని ఆర్కిటెక్కులు.. కోట్లు ఛార్జ్ చేసి డిజైన్లు ఇచ్చిన కన్సల్టెంట్ లు వీరికంటే ఓ సినిమా నిపుణుడికి ఎక్కువ తెలుస్తుందా?

దేశ విదేశాల ఆర్కిటెక్కుల ప్రతిభ సరిపోలేదు..మూడేళ్ల కాలం, పర్యటనల మీద పర్యటనలు నడిచాయి.. డిజైన్లు రావటం... పక్కకు పోవటం జరిగిపోతూనే ఉన్నాయి.. కానీ, బాబుగారి కన్ను మాహిష్మతి మీద పడింది. ఆ రేంజ్ డిజైన్లు కావాలంటున్నారు. గ్రీన్ మ్యాట్ అద్భుతాలను రియల్ లైఫ్ లో సాకారం చేయాలని భావిస్తున్నారు. మరి ఇది కాలయాపన వ్యవహారమా? లేక పనిజరిగేదేమైనా ఉందా? రాజధాని అంటే నాలుగు రోడ్లు, పది భవనాలు, ఓ పార్కు మాత్రమే కాదు.. అక్కడి ప్రజలు, వారి బాగోగులు , ఇతర ప్రాంతాలకు కూడా పాలనా పరంగా అందుబాటులో ఉండటం, పారదర్శక విధానాలు అని గుర్తిస్తే ఆధునిక అమరావతి కల సాకారమయినట్లే.. ఈ దిశగా సాగకుండా జై మాహిష్మతీ అంటూ కలలు కంటే ప్రయోజనం ఉంటుందా? గ్రాఫిక్స్ డిజైన్లను వాస్తవంలో కావాలనటంలో అర్ధం ఉందా? పూర్తి వివరాలకు వీడియో చూడండి.

20:42 - September 17, 2017

హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ అవార్డు ఇవ్వడం సముచితమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. శిల్పాకళా వేదికలో దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై, వెంకయ్యనాయుడు మాట్లాడారు. శ్రద్ధ, ఆసక్తిని పెంచడానికే పురస్కారాలు ఇస్తారని చెప్పారు. తెలుగు విలక్షణ నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు అని కొనియాడారు. రెండు లక్షల మందికి సిని పరిశ్రమ ఉపాధి 
కల్పిస్తుందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

20:17 - September 17, 2017

హైదరాబాద్ : దర్శకుడు రాజమౌళికి అక్కినేని జాతీయ పురస్కారం ప్రదానం చేశారు. శిల్పాకళా వేదికలో పురస్కారాల కార్యక్రమం నిర్వహించిచారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ తనకు అక్కినేని జాతీయ పురస్కారం రావడం సంతోషకరమన్నారు. అక్కినేని నాగేశ్వర్ గొప్పవ్యక్తి అన్నారు. డాక్టర్లు, మందులతో నాగేశ్వర్ 14 సం.లు బతికితే.... విల్ పవర్ తో ఇంకో 14 సం.లు బతికారని తెలిపారు. చావుకే ఆయన వార్నింగ్ ఇచ్చి బతికారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్, హీరో నాగార్జున పాల్గొన్నారు. 
 

13:26 - September 9, 2017

సినిమా వాళ్ళు వ్యాపారం లోకి దిగటం కొత్తేమి కాదు. రియల్ ఎస్టేట్, హోటల్స్ పబ్స్, ఇలా ప్రతి బిసినెస్ లో రాణిస్తూనే ఉన్నారు. రీసెంట్ గా హిట్ ట్రాక్ లో దూసుకెళ్తున్న హీరో కొత్తగా బిజినెస్ మీద ఫోకస్ పెట్టాడు. మరి ఆ హీరో ఎవరు ? 'ప్రభాస్' అంటే ఒకప్పుడు లోకల్ యాక్టర్ ఇప్పుడు ఇంటెర్నేషన్స్ స్టార్ లో ఒకడయ్యాడు. ఒకప్పుడు తెలుగు స్క్రీన్ కి మాత్రమే పరిమితమయిన నటుడు. తెలుగు సినిమా రుచిని గ్రాండ్ గా ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమాతో అందరికి ఒక్క సరిగా ఇంటర్నేషనల్ లెవెల్ రికగ్నైజేషన్ వచ్చింది. మరి ఆ గుర్తింపును క్యాష్ చేసుకుంటున్నాడు మన అమరేంద్ర బాహుబలి. కలక్షన్స్ పరంగానే కాకుండా టెక్నీకల్ గా కూడా సూపర్బ్ అనిపించుకుంది ఈ బాహుబలి సినిమా.

'బాహుబలి' తర్వాత ప్రభాస్ కెరీర్లోనే అత్యంత బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'సాహో' సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'సాహో' సినిమా గ్రాఫిక్స్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు ఫిలిం యూనిట్. ఇదిలా ఉంటె 'ప్రభాస్' బిజినెస్ లోకి అడుగు పెట్టాడు. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ ఎత్తున థియేటర్లను నిర్మిస్తున్నారు. ఈ థియేటర్ల క్యాంపస్ ను 'బాహుబలి' థియేటర్లుగా వ్యవహరిస్తున్నారు. మొత్తం రూ.40 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న బాహుబలి థియేటర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం శరవేగంగా నిర్మిస్తున్న ఈ థియేటర్ ను 2018లో ప్రారంభించనున్నారు

Pages

Don't Miss

Subscribe to RSS - ss rajamouli