state division

18:19 - October 3, 2018

నిజామాబాద్ : ప్రజా ఆశీర్వాదసభలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదని విమర్శించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదని ఆజాద్ ఆరోపించారనీ..టీఆర్ఎస్ పాత్ర లేకుంటే ఆజాద్ అయ్య పాత్ర ఉందా? గులాంలకు బుద్ధి చెప్పాలంటే నిజామాబాద్ లో 9 స్థానాలు గెలవాలని నిజామాబాద్ ప్రజాశీర్వాద సభ వేదికనుండి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

 

21:10 - January 12, 2018

విజయవాడ : విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న హామీలను అమలు చేయకపోతే కోర్డును ఆశ్రయించడం మినహా మరో ప్రత్యామ్నాయంలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం చెప్పడంతో ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీకి ఒప్పుకున్నానని.. అయితే ఇంతవరకు నిధులు ఇవ్వలేదని ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు రాజధాని అమరావతి నిర్మాణం, మంజూరైన విద్యాసంస్థలకు నిధులు ఇవ్వాలని ఢిల్లీలో ప్రధాని మోడీతో జరిపిన భేటీలో చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై చర్చించారు. విభజన చట్టంలోని అపరిష్కృత హామీలపై 17 పేజీల నివేదిక అందజేశారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత చంద్రబాబు, మోదీ భేటీ అయ్యారు.

ప్రధాని మోదీతో చర్చించిన వివరాలను చంద్రబాబు వెల్లడించారు. అన్నింటినీ అమలు చేయమని మోదీని కోరామని, లేకపోతే కోర్టుకు వెళ్లడం మినహా మరో గత్యంతరంలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు అమరావతి నిర్మాణానికి వచ్చే బడ్జెట్‌లో ఎక్కువ నిధులు కేటాయించాలని కోరారు. సవరించిన అంచనాల ప్రకారం పోలవరంకు 58 వేల కోట్ల రూపాయలు అవుతుందని చంద్రబాబు ప్రధాని మోదీ దృష్టికి తెచ్చారు. దీని పునరావసం, పునర్నిర్మాణానికే 35 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వివరించారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 16 వేల కోట్ల రూపాయల రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సి ఉండగా ఇంతవరకు చాలా తక్కువ మొత్తమే ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. దీనిని నేరుగా నగదు రూపంలో ఇవ్వకపోతే పాత రుణాలు చెల్లింపునకు సర్దుబాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయాల్సిన 11 కేంద్ర విద్యాసంస్థలకు 2,900 ఎకరాల భూమి ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు ప్రధాని దృష్టికి తెచ్చారు. దీని విలువ 16,600 కోట్లని, మరో 133 కోట్లతో వీటన్నింటికీ ప్రహరీగోడలు నిర్మించిన అంశాన్ని ప్రస్తావించారు. హిందూపురంలో కేంద్రీయ విశవిద్యాలయం, విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. వీటికి 11,673 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉంటే ఇంతవరకు కేవలం 420 కోట్లు మాత్రమే ఇచ్చారని ప్రధాని దృష్టికి తెచ్చారు. అసెంబ్లీ సీట్లు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాకినాడ పెట్రో రసాయనాల పారిశ్రామిక సముదాయం, కడప స్టీల్‌ ప్లాంట్‌, విజయవాడ, విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టులు, విశాఖ-చెన్నై పారిశ్రామికి నడవాను అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. విభజన చట్టంలోని హామీల అమలుకు టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వీటన్నింటిని పరిశీలించి, పరిష్కారానికి స్వయంగా చర్యలు తీసుకుంటానని చంద్రబాబుకు మోదీ హామీ ఇచ్చారు. 

20:26 - January 12, 2018

మొత్తానికి కలిశారు.. కలిశారు. సరే.. దీనివల్ల ప్రయోజనమేంటి? ఏపీకి ఏం ఒరుగుతోంది? మూడున్నరేళ్లుగా విభజన తర్వాత అనేక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిందేంటి? రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీయలేని రాష్ట్ర ప్రభుత్వం.., పైగా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల నోళ్లు నొక్కే రాష్ట్ర ప్రభుత్వం... ఏపీలో కనిపిస్తున్న తరుణం. ఇప్పుడు ఏడాది తర్వాత మోడీని కలిసిన చంద్రబాబు ఏపీకేమైనా ప్రయోజనాలు సాధించారా? లేక రాజకీయ ప్రయోజనాలకోసమే కలిశారా? ఈ అంశంపై టెన్ టివిలో ప్రత్యేక కథనం..

ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాయం చేస్తామంటూనే.. దాటవేత కబుర్లు.. కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ..పాడిందే పాడుతూ కేంద్రం ఏపీకి దారుణంగా మొండిచేయి చూపిందనే విమర్శలు. మరోపక్క ప్రజల పక్షాన ఉంటూ ప్రజల ఆకాంక్షలను కేంద్రానికి వినిపించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం సైలెంట్ గా చోద్యం చూస్తున్న తీరు స్పష్టం. ఈ క్రమంలో జరిగిన తాజా భేటీ ఆసక్తికరంగా మారింది. పోలవరానికి నిధులు ప్రవహిస్తాయా? రైల్వేజోన్ శాంక్షన్ అవుతుందా? రాజధానికి నిధులొస్తాయా? విద్యాసంస్థలు వచ్చేస్తాయా? చంద్రబాబు, మోడీ భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? మోడీపై నమ్మకం, ఏపీ ప్రయోజనాలే ముఖ్యం అంటున్న చంద్రబాబు, ఏపీకి ఆశించిన ప్రయోజనం లేకుంటే బీజేపీతో తెగతెంపులకు సిద్ధమౌతారా? మోడీ అపాయింట్మెంట్ చంద్రబాబుకు కష్టంగా దొరికిందా? ఏపీకి న్యాయంగా రావలసిన వాటిని గట్టిగా అడగలేని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారా?కేంద్రంలో చక్రం తిప్పే నేతగా ప్రొజెక్ట్ అయిన చంద్రబాబు వాయిస్ ఎందుకు తగ్గింది? అసలీ పర్యటన రాజకీయ ప్రయోజనాల కోసమా? లేక రాష్ట్ర హితం కోసమా? సమస్యలు స్పష్టంగా ఉన్నాయి..పరిష్కారం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు..న్యాయంగా రావలసింది ఆశిస్తున్నారు.. కానీ, మొండి చేయి.. చెంబుడు మట్టి కాసిన్ని నీళ్ళు ఇచ్చి వాటితో ఎడ్జస్ట్ కావాలన్న కేంద్రం మూడున్నరేళ్లు గడుస్తున్నా ఏపీకి ఒరగబెట్టింది ఏం లేదు.. మరి ఈ భేటీ తర్వాతేమైనా పరిస్థితి మారుతుందా? ఏపీకి కాస్తైనా ఉపయోగం ఉంటుందా?

సమాఖ్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు నిర్వచించబడే ఉంటాయి. అందులోనూ కొత్తగా ఏర్పడే రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధను కేంద్రం చూపెట్టాల్సిందే. కానీ, విభజన తర్వాత ఏళ్లు గడుస్తున్నా ఏపీని పట్టించుకోని కేంద్రాన్ని నిలదీసి తమ హక్కుగా రావలసింది సాధించుకోవాలి. కానీ, ఏపీ సర్కారు ఈ విషయంలో ఏ మాత్రం ముందుకు వెళ్లటం లేదు. ఇప్పుడు ఈ నామ్ కే వాస్తే మీటింగ్ తో ఒరిగేది అంతకంటే ఏ మాత్రం లేదు. మరింత విశ్లేషణ కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:35 - January 12, 2018

ఢిల్లీ : ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ముగిసింది. గంటపాటు సమావేశం కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి మరింత సాయంపై చర్చించారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల పెంపు, రెవెన్యూ లోటుపై సాయం అడిగినట్లు తెలుస్తోంది. రాబోయే కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మరిన్ని నిధులు కేటాయించాలని మోడీని కోరారు. రాష్ట్ర విభజన చట్టం హామీలపై ప్రధానితో చర్చించారు. 16 పేజీల నివేదికను చంద్రబాబు, మోడీకి అందజేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:51 - January 12, 2018

ఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు.  ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోడీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం, రాజధాని నిర్మాణాలకు కేంద్ర సహకారంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల పెంపు అంశాలతోపాటు విభజన చట్టం హామీలను నెరవేర్చాలని చంద్రబాబు మోడీని కోరనున్నారు. కేంద్ర విద్యుత్, జల పరిశోధన కేంద్రం రూపొందించిన త్రీడీ నమూనాను చంద్రబాబు పరిశీలించనున్న 
మోడీతో భేటీ అనంతరం పూణె వెళ్లనున్నారు. 

07:57 - January 12, 2018

రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు విమర్శించారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తులసీదాస్, టీడీపీ నేత శ్రావణ్ కుమార్, బీజేపీ నేత లక్ష్మీపతి రాజా పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర విభజన సౌకర్యాల కల్పనలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దా.. 

 

07:11 - January 12, 2018

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆయన  భేటి కానున్నారు. ఏడాది తరువాత జరుగుతున్న ఈ భేటీలో... పోలవరం ప్రాజెక్ట్‌, రాష్ట్ర విభజన అంశాలపై మోదీతో చర్చించనున్నారు. ఇతర ముఖ్య అంశాలను ..చంద్రబాబు.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. 
పోలవరం, రాష్ట్ర విభజన అంశాలపై చర్చ 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు  షెడ్యూల్‌ ఖరారైంది. గురువారం రాత్రి చంద్రబాబునాయుడు హస్తినకు బయల్దేరనున్నారు.  శుక్రవారం ఉదయం 10.40 గంటలకు ప్రధాని మోదీతో..  చంద్రబాబు సమావేశమవుతున్నారు. ఏడాది తరువాత వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్‌, రాష్ట్ర విభజన అంశాలు కీలకంగా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. 
మోదీకి దృష్టికి ఈఏపీ నిధుల అంశం
అలాగే ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని చంద్రబాబునాయుడు .. మోదీని కోరనున్నారు. ఈఏపీ నిధుల అంశంపైనా ప్రధానితో చర్చించనున్నారు. అదేవిధంగా.. నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూలోటు గురించి ప్రస్తావించనున్నారు. ప్రధానితో చర్చించాల్సిన అంశాలపై ఉన్నతాధికారులు ఇప్పటికే ఓ నివేదికను రూపొందించి  చంద్రబాబునాయుడుకు అందించారు. ప్రధానితో భేటీ అనంతరం.. చంద్రబాబు ఇతర కేంద్ర మంత్రులతో కూడా భేటీ కానున్నారు.

చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారు

07:38 - June 7, 2017
22:33 - June 6, 2017

విజయవాడ : పేదల అభివృద్ధికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. సీఎం చంద్రబాబు తెలిపారు. ఐటీ రంగంలో తాము చేపట్టిన చర్యలవల్లే మన విద్యార్థులు విదేశాల్లో రాణిస్తున్నారని చెప్పారు. నదుల అనుసంధానంద్వారా నీటి భద్రత కల్పిస్తామని ప్రకటించారు. పోలవరం ఏపీ ప్రజల జీవనాడిఅని.. త్వరగా పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. పేదరికం లేని సమాజమే తన లక్ష్యమన్నారు. ప్రజలకోసమే పనిచేయాలని నేతలకు సూచించారు. నవ నిర్మాణదీక్ష ఐదోరోజు మానవ వనరుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ అంశంపై చర్చించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం సమాధానమిచ్చారు.

 

21:36 - June 6, 2017

విశాఖ : విభజనతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విభజించిన వారి కన్ను కుట్టేలా సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. విశాఖలో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మంత్రి గంటా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా పలు రంగాల్లో శిక్షణ తీసుకున్న విద్యార్ధులకు మంత్రి సర్టిఫికేట్స్ అందజేశారు. 
నెల్లూరు..
విభజన తరువాత కష్టాల్లో ఉన్న రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు నడిపించేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు మంత్రి అమర్‌నాధ రెడ్డి.  నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని కొడవలూర్‌లో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఏపీని నిలబెట్టేందుకు అందరూ  కృషి చేయాలని అమర్‌నాధ రెడ్డి పిలుపునిచ్చారు. 
కడప
కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో 5వరోజు నవ నిర్మాణ దీక్షలు ఘనంగా జరిగాయి. మంత్రి ఆదినారాయణరెడ్డితో పాటు పలు శాఖలకు చెందిన అధికారులు ఈ దీక్షలో పాల్గొన్నారు. 2029 నాటికి దేశంలోనే నంబర్‌ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దూసుకుపోయేలా అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - state division