state government

18:48 - November 20, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ ఆలి మండిపడ్డారు. కేటీఆర్ స్థాయికి మించిన మాటలు మానుకోవాలని ఆయన హితువు పలికారు. మోదీ పాలనతో విసిగిన జనాలు.. కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారని.. ఈ తరుణంలో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం ఎంతో శుభపరిణామని షబ్బీర్ ఆలీ అన్నారు.

18:47 - November 20, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇందిరాగాంధీ శతజయంతి ఉత్సవాలు జరపకుండా ఆమెను అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మను అవమానపరిచిన మోదీ, కేసీఆర్‌కు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానంటున్న కేటీఆర్‌...నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 

08:20 - November 6, 2017

గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని ఐద్వా ఏపీ రాష్ట్ర నాయకురాలు గాదె ఆదిలక్ష్మి డిమాండ్ చేశారు. గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేత ఆలోచన విరమించుకోవాలన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 'కేంద్రం మరోసారి సామాన్యుని వీపుపై గ్యాస్‌ బండ ను మోపింది. గ్యాస్‌ మీద ఉన్న సబ్సిడీని క్రమంగా ఎత్తివేయాలని గత సంవత్సరం జూలైలో కేంద్రం తీసుకున్న విషయం తెలిసిందే.. అప్పటినుండి తాజాగా పెరుగుదల వరకూ గ్యాస్‌ సిలిండర్‌ ధర 19సార్లు పెరిగింది. తాజాగా పెంచిన రూ.4.50తో నాన్‌ సబ్సిడీ సిలిండరు ధర రూ.742 గానూ, సబ్సిడీ సిలిండరు ధర రూ.495కు గానూ చేరింది. పెరిగిన ధరలు సామాన్యుని గుండెల్లో భయాన్ని పుట్టిస్తున్నాయి'. ఈ అంశాలపై ఆదిలక్ష్మి మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:12 - November 6, 2017

వరంగల్ : భూమి పుత్రులు దగా పడుతున్నారు. కష్టాల కాలం అన్నదాతను వెంటాడుతోంది. అన్నదాతకు మార్కెట్‌లో దోపిడీ తప్పడం లేదు. నాణ్యత పేరుతో అరాచకం రాజ్యమేలుతోంది. సీసీఐ కేంద్రాల్లో దళారుల చేతిలో రైతులు నిలువునా మోసపోతున్నారు. వారికి మద్దతు మచ్చుకైనా కనిపించడం లేదు.  తెల్ల బంగారమంటూ మురిసిపోతున్న రైతును కదిలిస్తే కన్నీటి సుడులు తిరుగుతున్నాయి.  మార్కెట్లోకొచ్చి తెల్లబోతున్న కాటన్‌ రైతుపై 10టీవీ ప్రత్యే కథనం..
పత్తికి దక్కని మద్దతు ధర
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో  తెల్ల బంగారాన్ని పండించిన రైతన్నల ముఖాలు ధరలు లేక తెల్లబోతున్నాయి. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని గొప్పలు చెబుతున్నా.. అవి నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్‌కు వచ్చిన వందలాది మంది కర్షకులకు క్వింటాకు కేవలం  3000 లోపే ధర దక్కుతోంది. మరికొందరి పరిస్థితి మరీ అధ్వానం. పత్తి నాసిరకంగా ఉందని చెప్పి కేవలం  1800 మాత్రమే చెల్లిస్తున్నారు. 4320 మద్దతు ధర దక్కుతుందనే ఆశతో వచ్చిన అన్నదాతలకు మార్కెట్‌లో నిరాశే మిగులుతోంది.  నాణ్యతను సాకుగా చూపి సరకును తిరస్కరిస్తుండడంతో హలధారులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
పత్తికొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతున్న దళారులు
వరంగల్ జిల్లాలో 15 వ్యవసాయ మార్కెట్‌ కమిటీలున్నాయి. ఇక్కడ సీసీఐ కొనుగోలు కేంద్రాలున్నా ఇప్పటి వరకు ఎక్కడా పత్తి కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో దళారుల రాజ్యం నడుస్తోంది.  రైతులు దళారులను ఆశ్రయించక తప్పడం లేదు. దళారులు ఇష్టారాజ్యంగా తూకంలోనూ, ధర చెల్లింపులోనూ, తేమ శాతం కోతలోనూ అక్రమాలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వడంలోనూ జాప్యం చేస్తున్నారు. పెద్దగా పెట్టుబడి, శ్రమ లేకుండా రైతులను  నిలువునా దోచుకుంటున్నారు.
ఎనుమాముల మార్కెట్‌కు లక్ష క్వింటాళ్ల పత్తి
వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, జనగామ, జయశంకర్‌, మహబూబాబాద్‌... జిల్లాల్లోని ప్రధాన పత్తి మార్కెట్లలోనూ 'మద్దతు' జాడ లేదు. కేసముద్రం లాంటి ప్రధాన మార్కెట్ లో కేవలం 3000లోపే ధర పలికింది. మిగతా చోట్ల కూడా పరిస్థితి ఇలాగే ఉంది. ఎనుమాములకు ఇప్పటి వరకు లక్ష క్వింటాళ్లకు పైగానే పత్తి వచ్చింది. ఇందులో సీసీఐ కేవలం 23,000 క్వింటాళ్లే కొనుగోలు చేసింది. అంటే వచ్చిన దాంట్లో పావు శాతం కూడా కొనడం లేదనేది స్పష్టమవుతోంది. ఇటీవల జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో కేంద్రం ప్రారంభమైనా కొన్నది కేవలం 30 క్వింటాళ్లే.
ఇతర రాష్ట్రాలకన్నా తెలంగాణలో తక్కువగా మద్దతు ధర
దేశంలో పత్తి ధరలతో పోలిస్తే... తెలంగాణలోనే మద్దతు ధర అతి తక్కువగా రైతులుకు దక్కుతోందని ఇండస్ట్రీ బాడీ కాటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక స్పష్టం చేసింది. పంజాబ్‌లో క్వింటాకు 5000  మద్దతు ధర లభిస్తుండగా... కర్ణాటక, మహారాష్ట్ర లో 4500 పైబడి కొనుగోలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో పత్తికొనుగోళ్లలో దళారులదే రాజ్యం. రైతులను అందినకాడికి అడ్డంగా దోచుకుంటున్నారు. తేమ, నాసిరకమనే సాకులు చూపుతూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 
స్వరాష్ట్రంలోనూ మాకు న్యాయం : అన్నదాతలు  
స్వరాష్ట్రంలోనూ తమకు న్యాయం జరుగడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడులు రావడంలేదని వాపోతున్నారు. చేసిన అప్పులు తీర్చే దారి తెలియడం లేదని విలపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం పత్తికొనుగోలు చేయాలని కోరుతున్నారు.
 

12:32 - April 11, 2017

హైదరాబాద్: 'గర్భనిరోధక ఇంజక్షన్లు' ఎంత వరకు సేఫ్ ఇదే అంశం పై మానవి 'వేదిక'లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో జనవిజ్ఞానవేదిక నేత డాక్టర్ రమ, బఠీపడావో..భేటీ బచావో స్టేట్ కన్వీనర్ గీతామూర్తి పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

10:58 - April 4, 2017

నిజామాబాద్ : లారీల సమ్మె కారణంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలొ ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. సరుకుల రవాణా నిలిచిపోయి.. నిత్యవసర సరుకుల ధరలు వివపరీతంగా పెరిగిపోతున్నాయి. మార్చి 30 నుండి లారి యజమానులు సమ్మెకు దిగడంతో.. తెలంగాణలో నిత్యావసర సరుకుల రవాణా కటకటగా మారింది.  నిజామాబాద్ జిల్లాలో లారీలను రోడ్ల పై తిరుగకుండా లారీయజమానులు అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై సమ్మె మరింత ప్రభావాన్ని చూపుతోంది. 
నిజామాబాద్‌ 2400, కామారెడ్డిలో 460 లారీలు బంద్‌
ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2400, కామారెడ్డి జిల్లాలో 460 లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర , రాష్ర్ట ప్రభుత్వాలు ఇష్టారీతిగా పన్నులు పెంచుతూ తమపై భారం వేస్తున్నారని లారీ ఓనర్లు అంటున్నారు.  డిజిల్ రేట్లు పెరగడం, రవాణా పన్నులు,  ఇన్సూరెన్స్  ఫిట్ నెస్ పర్మిట్ రేట్లు పెంచడంపై లారీ యజమానులు సమ్మెకు ఆగ్రహంగా ఉన్నారు.
ఆందోళనలో లారీడ్రైవర్లు, క్లీనర్లు
మరోవైపు కొత్త రవాణా నిబంధనలతో వేలాది మంది లారీడ్రైవర్లు, క్లీనర్లు ఉపాధికోల్పోయే పరిస్థితులు వచ్చాయనే ఆందోళన చెందుతున్నారు. డ్రైవర్లకు చదువు తప్పనిసరి అంటున్న నిబంధనతో తాము జీవనాధారా కోల్పోతున్నామని.. 15 నుంచి 30సంవత్సరాల అనుభమున్న సీనియర్‌ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
కూరగాయల ధరలకు రెక్కలు
అటు సరుకుల రవాణా గిపోవడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు., ముఖ్యంగా కూరగాయల ధరలు నింగినంటుతున్నాయి. అసలే ఎండకాలం..కూరగాయల ఉత్పత్తి  తక్కువగా ఉండటంతో.. సహజంగానే ధరలు మామూలు రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటాయి. ఇపుడు లారీల సమ్మెతో రవాణా స్థంభించింది. దీంతో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని నిజామాబాద్‌, కామారెడ్డిజిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని లారీ యజమానులు, డ్రైవర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. 

 

07:48 - April 3, 2017

లారీ ఓనర్స్ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. 'దక్షిణాది రాష్ట్రాల లారీ ఓనర్స్ అసోసియేషన్ చేపట్టిన లారీల సమ్మెతో నాలుగు రోజులుగా సరకు రవాణా స్తంభించిపోయింది. ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. వివిధ మార్కెట్లకు పూలు, పండ్లు, కూరగాయల సరఫరా తగ్గిపోయింది. దక్షిణాది రాష్ట్రాల లారీ ఓనర్స్ అసోసియేషన్ సమ్మెకు దారి తీసిన కారణాలేమిటి? ఈ సమ్మె విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఎలా వుంది? ఇదే అంశాలపై భాస్కర్ రెడ్డి మాట్లాడారు.ఆ వివరాలను వీడియోలో చూద్దాం....

 

22:18 - March 18, 2017

ఓ అమాయకుడు బందీ అయ్యాడు. ఏడేళ్ల శిక్షకు సిద్ధమయ్యాడు. కానీ అతడు మాత్రం ఏ తప్పూ చేయలేదు. అతనితోపాటు అతని భార్య.. ఆ నవ వధువు నట్టింట్లో శిక్ష అనుభవిస్తుంది. ఆమె కూడా ఏ తప్పు చేయలేదు. ఈ దంపతులు దూరమై, కనీసం మాట్లాడుకునేందుకు కూడా చేసింది నమ్మకం. ఆ నమ్మకమే వారి జీవితాలను నాశనం చేసింది. ఇప్పుడా ఇళ్లాలు కడుపులో బిడ్డను మోస్తోంది. కన్నీళ్లు తాగుతూ బతుకుంతోంది. దీనంతటికీ కారణం నమ్మకమే. భర్త ఏ నాటికైనా తిరిగి వస్తాడన్న ఒకే ఒక నమ్మకం. ఆమెలో ధైర్యాన్ని తెస్తోంది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

09:22 - January 23, 2017

శ్రీకాకుళం : ఉద్దాన కిడ్నీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కిడ్నీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కిడ్నీ వ్యాధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనితో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఎయిమ్స్ బృందం మూడు రోజులుగా ఇక్కడ పర్యటించి సమస్యలు తెలుసుకుంది. ఈ సందర్భంగా మంత్రి కామినేనితో టెన్ టివి ముచ్చటించింది. కిడ్నీ సమస్యలకు కారణం తెలియదని, వ్యాధి మూలాలను కనుక్కొనే సామర్థ్యం లేదని మంత్రి కామినేని పేర్కొన్నారు. ఇంకా ఏమి మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

06:35 - January 23, 2017

శ్రీకాకుళం : జిల్లా ఉద్దానంలో కిడ్ని బాధితులకు ఏపీ ప్రభుత్వం ఎయిమ్స్ బృందంతో పరీక్షలు చేయించింది. ఈ సమస్యకు మూలాలు కనుకున్నేందుకే.. ఈ పరీక్షలు నిర్వహించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. అయితే అసలు ఈ ప్రాంతంలో ఈ వ్యాధి ఎందుకొస్తుందో చెప్పలేమన్నారు కామినేని. అయితే బాదితులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంకా ఎలాంటి అంశాలు మాట్లాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

Pages

Don't Miss

Subscribe to RSS - state government