suicide

15:20 - April 1, 2018

నిర్మల్ : జిల్లాలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కడెం మండలం బెల్లాల్ లో అప్పుల బాధ తాళలేక చిట్యాల గంగరాజం ఆత్మహత్య చేసుకున్నారు. గంగరాజం మూడెకరాలు కౌలుకు తీసుకుని రూ.3 లక్షలు అప్పు చేసి వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు కూతురి పెళ్లి కోసం మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పు దొరక్క మనస్తాపంతో గంగరాజం ఆత్మహత్య చేసుకున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

16:45 - February 3, 2018

కర్నూలు : జిల్లాలోని ఆదోనిలో ఆర్ట్స్ ఆండ్ సైన్సు కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని విజయలక్ష్మి ఆత్మహత్యకి పాల్పడింది. ప్రాక్టికల్‌ పరీక్షలకు ఆలస్యం కావడంతో కాలేజీ యాజమాన్యం అనుమతించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యానికి వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. పది లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

17:21 - November 2, 2017

వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రత్తి రైతు విలవిలలాడుతున్నాడు. పెట్టిన పెట్టుబడి రాక..గిట్టుబాటు ధర రాకపోవడంతో ప్రత్తి రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు. ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని..ప్రత్తిని కొనుగోలు చేస్తామని మంత్రులు స్వయంగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ విధంగా జరగడం లేదని తెలుస్తోంది. తాజాగా ఓ ప్రత్తి రైతు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటు చేసుకుంది.

వరంగల్ అర్బన్ జిల్లాలోని హసన్ పర్తి మండలం వంగపాడు గ్రామంలో ఐలయ్య అనే రైతు రెండెకరాల పొలం ఉంది. పొలంలో పత్తి పంట వేశాడు. చేతికి వచ్చిన పంట పంటను అమ్మడానికి ఎనుమాముల మార్కెట్ కు తీసుకెళ్లాడు. కానీ గిట్టుబాటు ధర రాకపోవడం..కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాలేని పరిస్థితిలో ఉండడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రైతులకు అందాల్సిన సబ్సిడీ అందకపోవడం..పంట చేతికి వస్తుందన్న సమయంలో సరైన దిగుబడి రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని నేతలు పేర్కొంటున్నారు. సీసీఐ కేంద్రంలో కొనుగోలు చేస్తున్నా అనుకున్న స్థాయిలో ధర రావడం లేదని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు..వామపక్షాలు కోరుతున్నాయి. ప్రభుత్వం..అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 

19:24 - October 7, 2017

కృష్ణా : జిల్లా తిరువూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని కుమారి ఆత్మహత్య చేసుకుంది. కుమారి కాలేజ్‌లోనే పురుగుల మందు తాగింది. అయితే ఆత్మహత్యకు ఇంటర్‌ సెకండ్ ఇయర్‌ విద్యార్థి వెంకటేశ్వరరావు వేధింపులే కారణమని తెలుస్తోంది. వెంకటేశ్వరరావుని లెక్చరర్లు హెచ్చరించినా.. వేధింపులు ఆగలేదని సమాచారం. 

19:30 - September 18, 2017

కర్నూలు : శివారులోని సీర్‌ రెడ్డి స్కూల్లో పదో తరగతి విద్యార్థిని ప్రీతి కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదని, హత్యని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇందకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్‌ వద్ద ధర్నా జరిగింది. దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

08:11 - September 18, 2017

సూర్యాపేట : జిల్లా మామిళ్లగడ్డలో విషాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వారి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమంటూ బంధువులు చెబుతున్నారు. మృతులు పర్చూరి జనార్ధన్ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి జనార్ధన్ భార్య చంద్రకళ, చిన్న కుమారుడు అశోక్, కోడలు ప్రభాత, మనవరాళ్లు సిరి(5), రిత్విక(2) మృతి చెందారు. వారంలో రోజులుగా పెద్ద కొడుకు సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:05 - September 15, 2017

కడప : జిల్లాలోని మైలవరం జలాశయంలో కలకలం రేగింది. జలాశయంలో ఒకే కుటుంబానికి చెందిన మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. జలాశయంలో మరో ఇద్దరి మృతదేహాలు ఉన్నట్టు సమాచారం. మృతులు జమ్మలమడుగు మండలం గూడెంకు చెందిన ఆసియా, షమీనాబీ, వాహీదాలుగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే హత్యా, ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

19:01 - September 11, 2017

సిద్దిపేట : అప్పులబాధ తాళలేక సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు.. ముంబైలో ఆత్మహత్య చేసుకున్నాడు. చెప్పాల్‌ గ్రామానికి చెందిన అక్కరాజు నర్సయ్య అనే రైతు తన రెండెకరాల భూమిలో నాలుగు బోర్లు వేసినా.. చుక్కనీరు పడలేదు. చేసిన అప్పులు తీర్చారని ముంబైకి వలసవెళ్లాడు. మూడు నెలలు గడవకముందే మనస్తాపానికి గురైన నర్సయ్య..ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

12:33 - September 10, 2017

చిత్తూరు : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గోకులం వీధిలో పురాతన భవనం కూలి.. వృద్ధురాలి మృతిచెందింది. ఇటీవల వర్షాలకు.. గోడలు బాగా దెబ్బతిన్నాయి. పురాతన భవనం కావడంతో... ఒక్కసారిగా కూలిపోయింది. ఇంట్లో నివాసముంటున్న వృద్ధురాలు అక్కడికక్కడే చనిపోయింది.

 

12:31 - September 10, 2017

హైదరాబాద్‌ : కూకట్‌పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆల్విన్ కాలనీ ఆదిత్యనగర్‌లో దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఇరువురు చనిపోయినట్టు తెలిపారు. మృతులను అనిత, ప్రవీణ్‌లుగా గుర్తించారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - suicide