suicide attempt

11:55 - October 6, 2018

న‌ల్గొండ‌: మ‌ద్యపానం అల‌వాటు ఎంత చేటో చెప్పే ఘ‌ట‌న ఇది. మ‌ద్య‌పానం కార‌ణంగా అనేక కుటంబాలు చిన్నాభిన్నం అయ్యాయి, అవుతున్నాయి. న‌మ్ముకున్న వాళ్లు రోడ్డున ప‌డుతున్నారు. మందు అల‌వాటు నేరాల‌కు కూడా కార‌ణ‌మ‌వుతోంది. అయినా మందుబాబుల వైఖ‌రిలో మాత్రం మార్పు రావ‌డం లేదు. చ‌దువురాని వాళ్లే కాదు మంచి ఉద్యోగాలు చేసుకుంటున్న వారు సైతం మ‌ద్యానికి బానిస‌లై జీవితాన్ని నాశ‌నం చేసుకుంటున్నారు. తాజాగా ఓ తాగుబోతు భ‌ర్త కార‌ణంగా ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెల‌కొంది. తాగుబోతు భ‌ర్త వేధింపులు తాళ‌లేక త‌న ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఓ త‌ల్లి కాలువ‌లోకి దూకేసింది.

భార్య పిల్ల‌ల్ని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన భ‌ర్త రోజు తాగొచ్చి చిత్ర హింసలు పెట్టాడు. ఎంత న‌చ్చచెప్పినా అత‌డిలో మార్పు రాలేదు. భర్త చేష్టలతో విసిగిపోయిన ఆ భార్య తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. మరో బాలుడు గల్లంతయ్యాడు. ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

తిరుమలగిరి మండలం రంగుండ్ల గ్రామానికి చెందిన కానిస్టేబుల్ మోహన్‌కు స్వాతితో ఎనిమిదేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి సాత్విక (6), మధునశ్రీ (4), మమంత్‌ కుమార్‌ (3) ముగ్గురు పిల్లలు. మోహన్ పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. పిల్లల చదువు కోసం వారు నాలుగేళ్ల కిందట అనుముల మండలం హాలియాకు వచ్చేశారు.

ఈ క్రమంలో మోహన్ మద్యానికి బాసయ్యాడు.దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవ జరుగుతుండేది. రోజుమాదిరిగానే శుక్రవారం పిల్లలను బడికి పంపిన స్వాతి, భోజనం తినిపించి తీసుకొస్తానని చెప్పి ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం వారిని తీసుకుని నాగార్జునసాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లింది. ఇది గమనించిన పక్కింటి ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు వీరి వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతడి రాకను చూసిన స్వాతి కొడుకుని కాలువలోకి తోసి, ఆ తర్వాత ఇద్దరు పిల్లలతో కలిసి దూకేసింది. వెంకటేశ్వర్లు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంట‌నే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్వాతి, సాత్విక, మధునశ్రీలను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆడపిల్లలు ఇద్దరూ మృతిచెందగా.. స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన బాలుడి ఆచూకీ కోసం వెతుకున్నారు.

ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అప్ప‌టివ‌ర‌కు క‌ళ్ల‌ముందు ఆడుతూ పాడుతూ అల్ల‌రి చేసిన పిల్లలు విగ‌త‌జీవులుగా మార‌డం చూసి క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. బాధ్య‌త‌గా వ్య‌వ‌హరించాల్సిన పోలీసే ఇలా వేధింపులకు పాల్ప‌డ‌టంపై ఆగ్ర‌హం వ్యక్త‌మ‌వుతోంది. ఈ ఘ‌ట‌న చూశాకైనా మ‌ద్యం తాగే వారిలో మార్పు రావాల‌ని ఆశిస్తున్నారు.

16:34 - July 10, 2018

తూర్పుగోదావరి : జియో టవర్ పై గ్రామస్తులు యుద్ధం ప్రకటించారు. మామిడికుదురు మండలం మగటపల్లిలో జియో టవర్ కు విద్యుత్ లైన్ల కనెక్షన్ ఇవ్వవద్దంటు నిరసన వ్యక్తంచేస్తున్నారు. జియో టవర్ కు ఇచ్చే విద్యుత్ లైన్లను తమ నివాసాల మధ్య నుండి వేయటంతో తమకు ప్రమాదకరంగా మారుతున్నాయని దీన్ని ఆపకుంటే ఆత్మహత్య చేసుకంటామని ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. మరోవైపు ఇద్దరు యువకులు సెల్ టవర్ ఎక్కి తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. కాగా గ్రామస్థులు జియో టవర్ విషయంలో రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరు జియోకు మద్దతుగా నిలిస్తే..మరికొందుకు వ్యతిరేకించటం విశేషం. ఈ విషయంలో పోలీసులు కలగజేసుకోవటంతో మగటపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న నేపథ్యంలో జియోను వ్యతిరేకిస్తు ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో అతని పరిస్థితి విషమంగా వుండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

21:04 - March 20, 2018

తెలంగాణ ప్రభుత్వానికి అసలైన పంచాంగం నిరుద్యోగులే జెప్పెతట్టున్నరు రాబోయే ఎన్నికలళ్ల.. మొన్న అసెంబ్లీల ముఖ్యమంత్రిగారు ఏం జెప్పిండు.. ఇప్పటికే ఇర్వై ఏడువేల ఉద్యోగాలు భర్తీ జేశ్నం.. ఇంకా భర్తీగావాల్సినయ్ ఉన్నయ్ అన్నడుగదా..? కని ముఖ్యమంత్రిగారు జెప్పిన లెక్కలకు మీడియా జేశిన ఎంకువైరీకి పొంతన గలుస్తనే లేదు..

కేసీఆర్ గారు గట్టవోతున్న మూడో ఫ్రంట్.. ఇది మూడో ఫ్రంటు గాదు.. బీజేపీ పార్టీకి బీ టీం అసొంటిది.. నరేంద్రమోడీకి ఎవ్వలైతె వ్యతిరేకంగ ఉన్నరో వాళ్లను చిల్లర కల్లెర జేస్తందుకు తప్పితె.. ఆయన దేశ రాజకీయాలను ఉద్దరిచ్చెతందుకు ఉర్కొస్తున్న మొనగాడేం గాదు అని కాంగ్రెస్ పార్టీ లీడర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇజ్జత్ తీశేశిండు..

ఈ ముచ్చట ఇంకా కొత్తగనిపియ్యవట్టే.. పండుగ పూట అందరు పసందైన బువ్వదింటరుగదా..? కని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సారు ఇర్వైమూడేండ్ల సంది ఉగాదినాడు సొంటెండ వెట్టుకునే కార్యం జేస్తున్నడట.. అదనుకు ఉగాది పండుగ నాడు ఢిల్లీ ప్లీనరీకి వొయ్యిండుగదా.?? ఇగ ఆ సారు ఇంటామె సారు చేపట్టిన ఆనవాహితిని కొనాసగించింది..

ఓదిక్కు జీహెచ్ఎంసీ కార్మికుల జీతాలు వెంచిండ్రు..వాళ్లను పర్మినెంట్ జేస్తమని చెప్పిండ్రు.. వాళ్లను కడ్పుల వెట్టుకోని సాదుకుంటమన్నరు.. ఎంత జెప్పానా..? జీహెచ్ఎంసీ కార్మికులు టీఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మలే.. కార్మిక సంఘం ఎన్నికలళ్ల చిత్తు చిత్తుగ ఓడగొట్టి చెవ్వులు మూశిండ్రు.. ఇంత జేశ్నా కార్మికులు ఓడగొట్టిడ్రంటే.. రేపు పొద్దుగాళ్ల తెలంగాణ ప్రజలు గూడ ఇదే పనిజేస్తె టీఆర్ఎస్ పరిస్థితి ఏంది..? 

తాగుడు నోట్లె మన్నువొయ్య.. తాగిపిచ్చెటోనికి శిగ్గులేదు.. తాగెటోనికి శిగ్గులేదు.. తాగకపోతె సస్తారు నీ జనం సల్లగుండ.. అరే ఏమున్నదమ్మా..? హైద్రావాద్ పాతబస్తీల ఒకడు కుత్కెల దాక తాగొచ్చి పెండ్లాం మీద గ్యాస్ నూనే వోశిండట సంపేస్తాని..? సుట్టుముట్టున్నోళ్లు జూశి ఆమెను దావఖనకు గొంచవొయ్యిండ్రట.. ఇంత అద్వాహ్నమా..? చెప్పుండ్రి లోకంల.. 

హురక ఇదెక్కడి ఉగాది పండుగరో... బాపణోళ్ల శాస్త్రాల ప్రకారం ఉగాది పండుగంటే.. పచ్చడి జేస్కోని ఆరు రూచుల సంగమం జేశి.. పచ్చటి ఆకులళ్ల వోస్కోని తాగాలే.. ఆయాళ జేశ్న బచ్చాలు తినాలే ఇదిగదా..? కని ఈ అయ్యగార్ల మాటలు వట్టిచ్చుకోకుంట యాదాద్రి బోనగిరి జిల్లా మోత్కురు కాడ ఒక ఊరి జనం ఏం జేశిండ్రో సూడుండ్రి.. ఉగాది పండుగనాడు..

హురక సంగారెడ్డికాడ ఉగాది పండుగ గమ్మతైంది.. పబ్లీకు మీదికి లడ్డులు ఇశిరేసుడు.. వాళ్లు అందుకునుడు.. అదే ప్రసాదం లెక్క తినుడు.. యవ్వారమంత గమ్మతే ఉన్నది పాండ్రి మరి మనం గూడ ఆ లడ్డూలేంటియి.? ఆ కథ ఏంది అర్సుకొద్దాం..

20:41 - March 19, 2018

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ రానుందట..కోదండరాముడు పార్టీ పెడ్తుండు..జెండా ఏందో...ఎజెండా ఏందో తెలియనుందట..దేశంలో గుణాత్మక మార్పు తెచ్చేటందుకు బెంగాల్ పోయిన కేసీఆర్ సారు..కలకత్తా అక్కతోని చర్చలన్నీ సేసేసిండు..అవిశ్వాసంపై ఎన్నో అభిప్రాయాలు వచ్చేసినుల్ల..మోదీగారి సర్కార్ కు గండమని గన్ని మీడియాలు లొల్లి లొల్లి సేసేనియ్యి...మోడీ..నీరవ్ మోడీ ఒకటే నన్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ..సిరిసిల్లల మున్సిపల్ మేడము మళ్లీ లొల్లి లొల్లిగా మాట్లాడిండు..

21:04 - March 17, 2018

సీఎం క్యాంప్ ఆపీసుకాడ కాపుకాసిన వికలాంగులు.. బంగారు తెలంగాణ తెస్తనన్నకేసీఆర్ పాలనలో మాకేంటీ ఈ తిప్పలు అంటున్న వికలాంగులు.. బీజేపీకి టీడీపీకు హోదా పురిటి నొప్పులట..ప్రజలే సేయలట కాన్పు..కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపేంత వరకూ ఊరుకోనంటున్న కోమటి రెడ్డి. గంతవరకూ ఢిల్లీలోనే మకాం ఏస్తడంట. తెలంగాణ ఆడబిడ్డలు మంచినీటికోసం బిందెలు పట్టుకోని రోడ్ల మీదకు రానివ్వమని ప్రగల్బాలు పలిచిన కేటీఆర్ నియోజకవర్గంలో ఖాళీ బిందెలు నిరసన చేస్తున్న మహిళలు..

21:38 - March 16, 2018

తెలంగాణ జనం సంతోషంగున్నరు...ఆనందం ఎల్లగక్కిన అధినేత కేసీఆర్, మందక్రిష్ణను మళ్ల అణచివేస్తమన్న సీఎం..మస్తుగ జూశ్నం మీ అసొంటోళ్లనన్నక్రిష్ణ, అయ్యా భజన సుర్వు జేశ్న నారా లోకేశం...ఆర్కేస్ట్రా టీం ఒక్కటే తక్వుండే అసెంబ్లీల, చైర్మన్ సారు కంటి చికిత్స విజయవంతం...డాక్టర్లకు రుణపడి ఉన్న తెలంగాణ జనం, ఎంపీ, ఎమ్మెల్యే కీసులాటకు సీఐ బలి...బహుజన పోలీసు అధికారి సస్పెండ్, ఉంటె పులన్న ఉండాలే లేదంటె మేమన్న..చిర్తపులి రావొద్దని ఊరి జనాల ధర్నా... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం.. 

 

21:01 - March 13, 2018

కోమటిరెడ్డి సంపత్ల సభ్యత్వాలు రద్దు..సర్కారు ఇడ్సిపెడ్తలేదుగదా తన జిద్దు, మూకుమ్మడి రాజీమాలకు కాంగ్రెస్ ప్లాన్...మీడియా సహకరిస్తలేదన్న ఉత్తంరెడ్డి, కోమటిరెడ్డితోని కేసీఆర్ ప్లాన్ ఏశిండా.?..కాంగ్రెస్ ఏలుతోని కాంగ్రెస్ కంటికే గాయం, కాంగ్రెస్ను క్లీన్ బోల్డ్ జేయవోతున్నకేసీఆర్..రాజ్య సభ ఎన్నికల కోసం పక్కా స్కెచ్, తెలంగాణ రాష్ట్రంల ధర్నాలే ధర్నాలు...బంగారు తెలంగాణల బత్కులేని జనాలు, సమంత చెవ్వు గిచ్చిన అభిమానురాలు.. ఆయింత మాత్రం ఓర్సుకోకుంట ఎట్లమ్మా?... ఈ అంశాలపై మల్లన్నముచ్చట్లను వీడియోలో చూద్దాం... 

21:55 - March 12, 2018

అనుకున్నట్టే అయ్యింది.. తెలంగాణ అసెంబ్లీ పేరంటం పెంట పెంట అయ్యింది.. ఓదిక్కు గవర్నర్ నర్సింహన్ సారు ఎనలేని పథకాల కీర్తిని వివరిస్తుంటే.. కాంగ్రెసోళ్లు కాయిదాలు చింపి ఇశిరేశిండ్రు.. ఇగ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జర్ర ఓవరాక్షన్ జేశి హెడ్ ఫోన్సు ఇశిరేస్తె స్వామీగౌడ్ సారు కంటికి దాకింది.. ఆయన మీద చర్యలు దీస్కుంటరట రేపు.. ఇదిట్లుంటే.. అప్పటి అసెంబ్లీ గాదుగదా.?? అందుకే కాంగ్రెసోళ్లు కయ్యానికి దిగకముందుకే మార్షల్సును వెట్టి కంట్రోలింగ్ జేశింది సర్కారు.. సభ వాయిదా.మీ సీన్మలు ఇడ్దలైతున్నయంట.. కాయకష్టం జేశిన పైకమంత దీస్కపోయి మీ సీన్మలు జూస్తం.. మీ సంపద వెంచుకునెతందుకు మేము ఉపయోగపడ్తున్నంగదా..? శీన్మ హీరోలు.. మరి మా ప్రజలకు బాధైనప్పుడు మీరెందుకు మాట్లాడ్తలేరు..? అని ప్రశ్నిస్తున్నరు ఆంధ్ర రాష్ట్రంల పోరగాళ్లు.. మీరు నిజంగ హీరోలే అయితే.. ప్రత్యేక హోదా కోసం కొట్లాడుమంటున్నరు..సింగరేణి కాడ అగ్గిరాసుకున్నది.. లంచాలు అడ్గితె చెప్పుతోని గొట్టుండ్రి అని కార్మికులకు పిల్పునిచ్చిన ముఖ్యమంత్రిగారు..లంచాలు మింగే నాయకులనే మళ్ల కమిటీల వెట్టి తమాష జేస్తున్నడని కార్మికులు కండ్లెర్ర జేస్తున్నడు.. అవినీతి కేసుల అరెస్టైన రాజిరెడ్డిని మళ్ల కమిటీల ఎట్ల వెడ్తరని ప్రశ్నిస్తున్నరు.. ఇదిట్లుంటే.. ఇగ టీఆర్ఎస్ సంఘం ఆఫీసుకు నిప్పుగూడ వెట్టిండ్రు.. నిజామాబాద్ జిల్లా బోధన్ కాడ నిన్న బీజేపీ పార్టోళ్ల సభ అయ్యింది.. సభంటె మామూలు సభగాదు.. ఉశ్కెవోస్తె రాలకుంటొచ్చిండ్రు జనం.. ఒక్కొక్క కుర్చీల ఇద్దరిద్దరు గూసున్నరు.. ఏం మంది ఏం మంది అని వచ్చిన నేతలు గూడ జనాన్ని జూస్కుంట సూస్కుంట నిద్రలు దీశిండ్రు.. సభ అంటే ఈ నమూన గావాలె.. ఇంత అద్భుతంగ ఉండాలే అని కుర్చీలు గూడ అనుకున్నయట..పావుల పనికి పన్నెండు రూపాల ప్రచారం అంటే ఎట్లుంటదో సూస్తరా..? మన రైతు ఆత్మహత్యల మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిగారు జెప్తున్నడు.. ఇంటాంటే మీకు గూడ ఇనిపిస్త.. బాన్సువాడ దిక్కు ఆడోటి ఆడోగి కట్కం సుర్వు జేశ్న డబుల్ బెడ్రూం ఇండ్ల కాడ కుర్చేస్కోని అహో ఆంధ్రా బోజా లేవళ్ల సారు దంచికొడ్తున్నడు పాండ్రి సూపెడ్త..చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభక్క గొట్టిందట.. ఒకాయినను ఆయన పోలీసోళ్లతానికొచ్చి అక్కమీద చర్యలు దీస్కోండ్రి..అడ్డగోల్గ తిట్టింది నన్ను.. చెవ్వు వడివెట్టింది అని పోలీసోళ్లకు ఫిర్యాదు జేశిండట.. మరి పంచాది ఏడొచ్చింది బొడిగె శోభక్క అంత ఉగ్రరూపం ఎందుకు దాల్చింది అనేది ఒక్కపారి వొయ్యి అర్సుకొద్దాం పాండ్రి.. ఈనడ్మ శోభక్కకు అంత బీపీ ఎందుకు వెర్గుతున్నదో..చంద్రశేఖర్ రావు ఏలువడిల తెలంగాణల రైతులకు గోస ఎట్లున్నదో.. అటు చంద్రాలు ఏలువడిల ఆంధ్రా రైతుల పరిస్థితి అంతే ఉన్నది.. అప్పుల బాధలు తట్టుకోలేక కర్నూలు కాడ ఒక రైతు జీవిదీస్కున్నడు.. మన చంద్రాలు ఏం జేప్తడు ముచ్చట జెప్పుమంటే.. కొత్త తరహా వ్యవసాయం అంటడు.. ఆధునిక పద్దతులు అంటడు.. కని అసలు మద్దతు ధర మాత్రం ఇప్పియ్యలేకపోతడు.. పార్లమెంట్ పగటేశకాడు మళ్ల ఇయ్యాళ ఇంకో ఏశంల దిగిండు.. సంగీతానికి ప్రత్యేక హోదా రాలగొట్టెతందుకు పీకె చేతుల వట్కోని కూతలు వెడ్తున్నడు.. అదేనుల్లా.. చిత్తూరు శివప్రసాదు.. ఈన లోపట తక్వుంటడు బైట ఎక్వుంటది.. ఈన గట్టిన ఏశాలకు దశావతారం సీన్మల ఒక్కొక్క సీన్ డబుల్ రోల్ల వాడుకొవచ్చన్నట్టు..చర్లపల్లి సెంట్రల్ జైలు కాడ ఒక ఖైదీ పోలీసోళ్లకు పట్టవగటీలే సుక్కలు జూపెట్టిండు.. దన్నున ఉర్కిపొయ్యి కరెంటి పోలు మీదికి ఎక్కిండు.. దిగురా మయ్యగాని అంటే దిగడు.. ఆఖరికి అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీసొచ్చి ఫోన్ల గూడ బతిలాడిండు.. లేదు నేను నా భార్యను సంపలేదు.. ఎస్సై నాగరాజే నా భార్యతోని అక్రమ సంబంధం బెట్టుకోని నన్ను జైలు పాలు జేశిండని ఓ ఉత్తరం రాశి కిందేశిండు పాండ్రి దించన్నొద్దాం..వనపర్తి మున్సిపాల్టీ పరిస్థితి బీడి బిచ్చె కల్లు ఉద్దుర లెక్కైందట.. కనీసం చెత్త ఊడ్సెటోళ్లకు గూడ జీతాలిచ్చెతందకు పైకం లేవట.. ఇగ పాత బకాయి కాయిదాలు ముంగటేస్కోని వసూళ్లు జేస్తున్నరట.. వనపర్తి కాడ వ్యాపారులు మున్సిపాల్టీకి ఐదు కోట్ల రూపాల అప్పున్నరట.. అవ్వన్ని జమజేస్తున్నరు.. పాపం ఇంత పెద్ద బంగారు తెలంగాణల ఒక మున్సిపాల్టీ తాన జీతాలిచ్చె పైకం లేవంటె సూడుండ్రి ఎంత గొప్పగున్నది ముచ్చట..గిదో గమ్మతి ముచ్చటున్నది.. దేవుని ముంగట అగ్గిగుండాలని ఒక కార్యం ఉంటది.. అండ్లకెళ్లి నడిస్తె పాపాలు వొతయ్.. పుణ్యాలు పుట్లకొద్దొచ్చిపడ్తయ్ అని భక్తుల నమ్మకం అయితే.. ఎవ్వలన్న శిగమూగితె దేవుడొచ్చిండని అంటరు.. మరి దేవుడు పెయ్యిల గూసున్నంక అగ్గిగుండాలు తొక్కుడు గాదు.. నిప్పుల మీద బొర్రినా ఏం గావొద్దుగదా..? పాండ్రి పబ్లీకు భక్తీ కథ సూపెడ్త..

16:44 - January 14, 2018

కడప : జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బద్వేల్ లో మహిళ..వ్యక్తి కోసుకుకున్న గొంతులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడం కలకలం రేపుతోంది. బద్వేల్ లో ఖాదర్ హుస్సేన్ చిన్న షాపు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఆ షాపుకు శాంతి అనే యువతి వెళ్లింది. కాసేపటికి గొంతు మీద గాటుతో శాంతి ఆర్తానాదాలు చేసుకుంటూ పక్కనే ఆసుపత్రికి పరుగెత్తింది. స్థానికులు షాపులోకి వెళ్లగా ఖాదర్ బాషా షాపులో గొంతు వద్ద కత్తిగాటుతో కుప్పకూలిపోయిన పరిస్థితిలో కనిపించాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వారు గొంతు కోసుకున్నారా ? గొంతు కోశారా ? అనేది తెలియరావడం లేదు. వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. 

08:55 - October 28, 2017

భద్రాద్రి : ర్యాగింగ్ తట్టుకోలేక..ప్రిన్స్ పాల్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది. సాయి కిరణ్ అనే విద్యార్థి ధన్వంతరీ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ చేస్తున్నాడు. కానీ సీనియర్లు ర్యాగింగ్ చేయడాన్ని సాయి కిరణ్ తట్టుకోలేకపోయాడు. ఈ విషయాన్ని ప్రిన్స్ పాల్ కు చెప్పినా పట్టించుకోకపోవడంతో అతను తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దీనితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితి విషమించడంతో కొత్తగూడెంలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - suicide attempt