Summer Times

13:46 - April 21, 2018

నిజామాబాద్ : భానుడి ప్రతాపంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత రెండు, మూడు రోజులుగా ఎండలు విపరీతంగా పెరగడంతో బయటకు రావాలంటే ప్రతి ఒక్కరూ జంకుతున్నారు. ఏప్రిల్‌ నెలలోనే ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు ఉంటే.. మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని నిజామాబాద్‌ జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఎండ తీవ్రతపై మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

12:50 - March 31, 2018

విజయవాడ : భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో రోడ్లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. నిజాబామాద్‌ జిల్లాలో మార్చి నెలలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంలో జనాలు బెంబేలెత్తుతున్నారు.

వేసవి కాలం ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే దాదాపు మూడు డిడ్రీల ఉష్ణోగ్రతలు పెరిపోయాయి. నిజామబాద్, కామారెడ్డి జిల్లాలో ఎండలు ఉగ్రరూపం దాల్చుతున్నాయి. ఈ నెల 26న ఏకంగా 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం 9 గంటలకే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. మధ్యాహ్నం వచ్చేసరికి వాతావారణం అగ్నిగుండంగా మారుతోంది.

2013 మే నెలలో 45.6 డిగ్రీలు, 2014లో మార్చిలో 43.6 డిగ్రీలు, 2016లో ఏప్రిల్‌లో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెల 13వ తేదీన 36,14న 36, 15న 35.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి 26వ తేదీ నాటికి 41.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడే ఎండలు ఇలా మండిపోతుంటే రాబోయే రోజులను తలుచుకొని జనం భయపడుతున్నారు. భౌగోళిక పరిస్థితులరిత్యా వేసవి తీవ్రత ఎక్కువగానే ఉంటుందని వాతావారణ నిపుణులు అంటున్నారు. ఎండ తీవ్రతను తప్పించుకునేందుకు ప్రజలు కొబ్బరిబొండాలు, నిమ్మరసం, శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు.

10:53 - May 19, 2017

హైదరాబాద్ : మండుతున్న ఎండల తీవ్రతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటలు దాటితే చాలు.. ఎండ మంట, ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోడ్లపై జన సంచారం కనిపించడం లేదు. నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సూర్యుడి కర్ఫ్యూకి.. జనం బయటకు రావాలంటేనే జడుసుకుంటున్నారు. ఈ వేసవి నిప్పుల కొలిమేనని భారత వాతావరణ విభాగం మార్చి నెలలో ప్రకటించింది. అన్నట్లుగానే వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 45 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ ఎండలు రానున్న రోజుల్లో మరింత ముదరనున్నాయి.

నిర్మానుష్యంగా వీధులు
నిత్యం రద్దీగా కనిపించే వీధులు కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. వడగాలుల ప్రభావంతో రాత్రి ఏడైనా భూగర్భం నిప్పుల కొలిమిలా ఉంటోంది. వాతావరణ శాఖ నిపుణుల అంచనా ప్రకారం తెలంగాణలోని భూ ఉపరితల వాతావరణం వేడెక్కటం.. ఉత్తర భారతదేశం నుంచి వేడిగాలులు తెలంగాణ వైపు వీస్తుండటంతో అత్యంత వేడి నెలకొంటోంది. ఎండ వేడి వల్ల కళ్లు తిరగడం, శరీరం త్వరగా అలసిపోవడం జరుగుతుంది. నీళ్లు ఎక్కువగా తాగకపోయినా.. చల్లని పదార్థాలను తీసుకోకపోయినా ఈ ఎండలను తట్టుకోవడం చాలా కష్టం. నిమ్మకాయ, పుచ్చకాయ, కొబ్బరిబోండాం, మజ్జిగ ఒంట్లో వేడిని తగ్గించడానికి ఎంతో శ్రేష్టం. కాబట్టి ద్రవ పదార్థాలను తీసుకుంటూనే ఉండటం మంచిది. ఇక ఈ వేసవి తాపానికి పెద్దలే తట్టుకోలేకపోతోంటే.. ఇక చిన్నారుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అంగన్‌వాడీ సెంటర్లలో.. ఎండల వేడికి పిల్లలు కుతకుతలాడిపోతున్నారు. ఎలాంటి సదుపాయాలు లేని అద్దె భవనాల్లో అంగన్‌వాడీ సెంటర్లు నిర్వహిస్తున్నారు. కట్టెల పొయ్యిపై వంట చేస్తుండటంతో అటు ఎండ, ఇటు మంట వేడికి పిల్లలు అల్లాడిపోతున్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

18:50 - April 30, 2017
17:22 - April 25, 2017

సమ్మర్ రాగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది నోరూరించే మామిడి పండ్లు , ఇవి వేసవి సీజన్‌లో విరివిగా లభించే పండ్లు . ఇది మామిడి పండ్ల సీజన్ కావడంతో చాల విసరివిగా లభిస్తాయి. బంగారపు వన్నె కలిగి పసుపు రంగులో మిసమిసలాడే ఈ పండ్లు నిజంగానే బంగారమంటున్నారు పరిశోధకులు . అలాంటి మామిడి పండును ఆరగిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పరిశోధకులు తెలిపారు. అలాంటి మామిడి పండులో క్యాలరీల శక్తి, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, పీచు పదార్థం ఇలా అనేక పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఈ పండును ఆరగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా.. మామిడిలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మలబద్ధకానికి ఇది స్వాభావికమైన మందుగా పరిగణిస్తారు. మామిడి పెద్ద పేగుకు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను సమర్థంగా నివారిస్తుంది. కంటిచూపును మెరుగుపరిచేందుకు అవసరమైన బీటా–కెరొటిన్‌ మామిడిలో పుష్కలంగా ఉంటుంది. మామిడిలో ఉండే పొటాషియమ్‌ కారణంగా అది గుండెజబ్బుల (కార్డియో వాస్క్యులార్‌ డిసీజెస్‌)నూ, రక్తపోటునూ నివారిస్తుంది. మామిడిలోని బీటా కెరొటిన్‌ పోషకమే ప్రోస్టేట్‌ క్యాన్సర్‌తో పాటు... రొమ్ము, లుకేమియా వంటి అనేక క్యాన్సర్ల నివారణకూ తోడ్పడుతుంది.

11:22 - April 21, 2017

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..

  • ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.
  • రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.
  • టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.
  • ఒక టేబుల్ స్పూన్ ఉప్పు..నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.
20:37 - April 19, 2017

హైదరాబాద్: ఎండలు మండుతున్నాయ్ ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అని వుంటారు... ఎన్ని సార్లు విని వుంటారు. అవును మామూలుగా కాదు మధ్యాహ్నాం రోడ్ల పైకి వెళితే నిప్పుల కొలిమిలో మొహం పెట్టినట్లు, అగ్ని వర్షం కురుస్తున్నట్లు గా అనిపించడం లేదు. ఇంతా రొటీన్ సమ్మర్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాదు. నాగరికంగా మారుతున్న మానవరహిత సమాజ స్వయం కృతాపరాధం అంటే సందేహం అనవసరం. మరి ఏప్రిల్ లోనే ఇలా వుంటే! మే పరిస్థితి ఏంటి? ఇదే నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

18:44 - April 19, 2017

చిత్తూరు: పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. తిరుమలలో 40 నుంచి 42 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండడంతో భక్తులు ఎండ వేడిమికి అవస్థలు పడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం కల్పించడానికి టీటీడీ అధికారులు శ్రీవారి ఆలయం వద్ద కార్పెట్లు ఏర్పాటు చేసి.. నీటితో తడుపుతున్నారు. 

12:24 - April 17, 2017

విజయవాడ : భానుడి ప్రతాపానికి విజయవాడ నగర వాసులు విలవిల్లాడుతున్నారు. మండుతున్న ఎండలకు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక ఉదయం నుంచే నగరంలోని ప్రధాన కూడళ్ళన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. అటు ఇంద్రకీలాద్రిపై భక్తుల ఇక్కట్లు పెరిగిపోయాయి. ఆలయ అధికారులు భక్తుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఎండతో ఇబ్బంది పడుతున్నారు. దర్శనానికి కార్డు సిస్టం, ఒకే కౌంటర్ ఉండటంతో చిన్నపిల్లలు, మహిళలు ఎండ వేడిమి తట్టుకోలేకపోతున్నారు. వ్యాపారులు కూడా సాయంత్రం సమయంలోనే వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు.

 

 

11:56 - April 17, 2017

ఆదిలాబాద్‌ : జిల్లాపై సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వారం రోజులుగా జిల్లాలో 45 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు జనాన్ని భయపెడుతున్నాయి. ఉదయం నుంచే మండిపోతున్న ఎండలు మధ్యాహ్ననానికి అగ్నిగుండాన్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఎండతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా పడుతున్నారు.

 

 

Pages

Don't Miss

Subscribe to RSS - Summer Times