Summer Water Problem

16:48 - March 21, 2018

విజయవాడ : వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా అన్ని రకాల చర్యలు చేపడుతున్నామన్నారు కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం. ఇందుకోసం కృష్ణా నది నుండి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యతలేని నీటిని అమ్మకం చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణా జిల్లాలో ప్రజలకు మంచినీటి ఏర్పాటు, నదీజలాల విడుదల వంటి అంశాలపై కలెక్టర్‌ లక్ష్మీకాంతం పేర్కొన్నారు.

15:45 - January 29, 2018

విజయవాడ : నీటి నిల్వకోసం ఆంధ్రప్రదేశ్‌లో వంతెనలు, బ్యారేజీల నిర్మాణానికి ప్రభుత్వ యంత్రాంగం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. తొలిగా గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని చూస్తున్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో నీటికి ఇబ్బందులు లేకుండా కృష్ణా నదిలో వాటర్‌ స్టోరేజ్‌ వంతెన నిర్మాణానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పులిచింతల దిగువన, ప్రకాశం ఆనకట్టకి ఎగువన మరో కొత్త వంతెన నిర్మాణం చేసేలా ఏపీ జలవనరుల శాఖ నిపుణులు సమాయత్తం అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కంచికర్ల మండలం గని ఆత్కూరు, గుంటూరు జిల్లాలో వైకుంఠపురం గ్రామాల మధ్య కృష్ణానదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఇదివరకే ప్రాథమిక సర్వే పూర్తి చేశారు.

ప్రకాశం బ్యారేజీలో రాజధాని అవసరాలకు తగ్గట్టుగా వాటర్‌ స్టోరేజీ నిర్మాణానికి ఆవశ్యకత ఏర్పడింది. వర్షాకాలంలో దిగువ ప్రాంతంతో పాటు మున్నేరు నుంచి వచ్చే వరద నీరు ఆధారంగా ఈ నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. వరద నీరు ప్రతి ఏడాది ప్రకాశం బ్యారేజీ గుండా సముద్రంలోకి వృథాగా పోతోంది. ప్రకాశం బ్యారేజీ దిగువన యనమలకుదురు సమీపంలో చోడవరం వద్ద, మరీ దిగువన ఘంటసాల మండలం శ్రీకాకుళం వద్ద బ్యారేజీల నిర్మాణానికి పూర్తి స్థాయి ప్రాజెక్ట్‌ కోసం నివేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన నిర్మించే బ్యారేజీ వల్ల దాదాపు 10నుంచి 12 టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేయొచ్చు. దీంతో సుమారు 22 టీఎంసీల వరకూ వినియోగించుకునే అవకాశం ఉంటుందని లెక్క గట్టారు. దీనివల్ల 50 లక్షలమ మంది తాగు నీటికి గానీ... లేదా రెండున్నర లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టుకు గానీ ఈ నీటిని వాడుకోవచ్చు.. 3, 278కోట్లతో ఈ బ్యారేజీ నిర్మాణానికి అంచనాలు రూపొందించారు. 1900 కోట్లతోనే నిర్మించవచ్చని నిర్ధారించారు.

నీటి నిల్వకు మునేరు వాగే పెద్ద ఆధారం. ఈ వాగులో ప్రతి యేడాది దాదాపు రెండు నెలల్లో 50 టీఎంసీల లభ్యత ఉందని లెక్కగట్టారు. గతంలో అన్ని చోట్లా వర్షాలు కురిసిన సమయంలో ఈ మునేరు నీరే సముద్రంలోకి వృథాగా పోతోంది. పాలేరు వాగు నుంచి కూడా కొన్ని ప్రవాహాలు సముద్రం పాలవుతున్నాయి. కృష్ణానదిలో కంచికచర్ల, ఇబ్రహీంపట్నం, అమరావతి మండలాల్లో సుమారు 8లంకలు ఉన్నాయి. ఈ లంకలను తొలగిస్తే నదిలో పూడిక తీసేందుకు వీలుంటుంది. అలాగే నదిగట్టు పటిష్టం చేయడంతోపాటు.. నదిలో అదనంగా మూడు టీఎంసీల వరకూ నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యారేజీల నిర్మాణాల వల్ల లంక గ్రామాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందడంతోపాటు... సముద్ర ఆటుపోట్లతో భూములు ఉప్పుకయ్యలుగా మారే సమస్య తీరుతుంది. 

20:07 - April 20, 2017

హైదరాబాద్: గొర్రులు మేకల నడుమ బాబుగారి జయంతి...అంగరంగ వైభవంగా అన్న పుట్టినరోజు, కోతకు రాని పంట కోసిన హరీష్ రావు...ఇట్లమ్మినా మద్దతు ధర కూడా రావు, హిందూపురంలో విపరీతమైన నీళ్ల పంచాయతీ...బాలికాక మీద కాక మీదున్న జనాలు, పక్కపొంటే ప్రాజెక్టు ఉన్నా తాగునీళ్లకు కరువు..నిజామాబాద్ దిక్కు పోతున్నది సర్కార్ పొరువు, అర్థకి పావుసేరు ధరకొచ్చిన మిర్చి పంట..పట్టించుకోని ప్రభుత్వాల మీద రైతన్నల మంట, చెరువు కింద బయటపడ్డ మరొక చెరువు..ఇప్పటికన్నా తీరాలే ఏలూరు కరువు ఇలాంటి అంశాలతో ఈ రోజు మల్లన్న 'మల్లన్న ముచ్చట్లు' కార్యక్రమంలో మన ముందుకు వచ్చాడు. పూర్తి వివరాలు చూడాలనుకుంటే ఈ వీడియోను క్లిక్ చేయండి..

Don't Miss

Subscribe to RSS - Summer Water Problem