Supreme Court of India

12:04 - October 24, 2018

ఢిల్లీ : కంచె చేను మేసినట్లుగా వుంది సీబీఐలో ముదురుతున్న లంచాల వివాదం. కేంద్ర దర్యాప్తు సంస్థలో డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాల వివాదం రోజురోజుకు ముదురుతోంది. దీంతో రంగంలోకి దిగిన ప్రధాని నరేంద్రమోదీ  డైరెక్టర్ అలోక్ వర్మను తప్పించి తెలుగు తేజం..తెలంగాణ వాసి అయిన మన్నెం నాగేశ్వరరావుకు డైరెక్టర్ గా బాధ్యలను అప్పగిస్తు ఆదేశాలు జారీ అయిన వెంటనే ఆయన రంగంలోకి దిగిపోయారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం మరింతగా ముదిరినట్లుగా కనిపిస్తోంది.

Image result for alok verma with supreme courtవేటుకు గురైన అలోక్ వర్మ తనకు న్యాయం చేయాలంటు సుప్రీంకోర్టు మెట్లెక్కారు. డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ సెలవుపై వెళ్లాలని కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే తనను అకారణంగా తొలగించారని చెబుతూ అలోక్ వర్మ ఈ రోజు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
ఎలాంటి తప్పు లేకపోయినా ప్రభుత్వం తనను బాధ్యతల నుంచి తప్పించిందని అలోక్ వర్మ కోర్టు పిటీషన్ లో తెలిపారు. కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రికిరాత్రే నిర్ణయం తీసుకున్నారని వాపోయారు.  ఈ మేరకు అలోక్ వర్మ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల సుబ్రహ్మణ్యం దాఖలు చేసిన పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంగన్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ అత్యవసరంగా విచారించేందుకు అంగీకరించింది.ఈ సందర్భంగా పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం శుక్రవారం పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని స్పష్టం చేసింది. 

17:41 - July 11, 2018
16:47 - July 11, 2018

ఢిల్లీ : తాజ్‌మహల్‌ సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌మహల్‌ను రక్షించండి... లేదా మూసేయండి... లేదా ధ్వంసం చేయండని కోర్టు వ్యాఖ్యానించింది. తాజ్‌మహల్‌ను కాపాడుకోవాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం తాజ్‌ మహల్‌ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ కనిపించడం లేదని కోర్టు పేర్కొంది. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ కన్నా తాజ్‌మహల్‌ ఎంతో అందమైనదని.. దీన్ని సంరక్షిస్తే భారత్‌కున్న విదేశీ కరెన్సీ లోటు భర్తీ చేయొచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశ సమస్యను పరిష్కరించే సత్తా ఉన్న ఏకైక కట్టడం తాజ్‌మహల్‌... అలాంటి తాజ్‌ను మీరు పట్టించుకోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. తాజ్‌ ట్రాపెజియమ్‌ జోన్‌ పరిధిలోని పరిశ్రమలను ఎందుకు మూయించడం లేదని టిటిజెడ్‌ ఛైర్మన్‌ను ప్రశ్నించింది. టిటిజెడ్‌ పరిధిలో కొత్త ఫ్యాక్టరీలకు అనుమతించమని ఛైర్మన్‌ కోర్టుకు హామీ ఇచ్చారు.

12:43 - April 22, 2018

ఢిల్లీ : పోక్సో చట్ట సవరణ ఆర్టినెన్స్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. ఈ చట్టం ద్వారా ఇకపై 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే మరణదండన విధిస్తారు. గత కొన్ని రోజులుగా చిన్నారులపై లైంగికదాడులు పెరిగిపోవడంతో... నిన్న కేంద్రమంత్రి వర్గం సమావేశంలో ఈ చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ విడుదల చేశారు. దీనికి ఇవాళ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై 12 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధిస్తారు. ఇక ఈ కేసు దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తి చేయాలి. ఇందుకోసం అన్ని పోలీస్‌స్టేషన్లకు, ఆస్పత్రులకు ఫోరెన్సిక్‌ కిట్లను అందించాలని నిర్ణయించారు. ఇక 12 నుంచి 16 ఏళ్ల బాలికలపై లైంగికదాడులకు పాల్పడితే గతంలో కంటే కఠిన శిక్ష విధించనున్నారు. అలాగే మహిళలపై లైంగికదాడులకు పాల్పడితే శిక్షను ఏడేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని నిర్ణయించారు. 

 

10:59 - April 22, 2018

ఢిల్లీ : చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణ శిక్ష విధించాలని నిర్ణయించింది. పోక్సో చట్ట సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కథువా, సూరత్‌, ఎటా, ఛత్తీస్‌గఢ్‌, ఇండోర్‌...దేశంలో ఎక్కడో ఓ చోట చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ఈ ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.  ఈ ఘటనలపై పెద్ద ఎత్తున దుమారం రేగుతుండడంతో . ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం జరిపింది.

సుమారు రెండున్నర గంటలపాటు జరిగిన సమావేశంలో పోక్సో చట్టాన్ని సవరించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 12 ఏళ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడే దోషులకు మరణశిక్ష విధించేలా మోది ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ కేసుల్లో విచారణ 2 నెలల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 ఏళ్ల బాలికలపై అత్యాచారానికి పాల్పడేవారి శిక్షను పదేళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచారు.

చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టం కింద కనిష్ఠంగా ఏడేళ్లు, గరిష్ఠంగా జీవిత ఖైదును విధించే అవకాశం ఉంది. లైంగిక దాడి తర్వాత బాధితురాలు మృతి చెందినా, అచేతనంగా మారినా ముద్దాయికి మరణదండన విధించేలా పోక్సో చట్టంలో నిబంధనలు మార్చనున్నారు. ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపనున్నారు. వర్షాకాల సమావేశాల్లో ఈమేరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. 

11:58 - February 26, 2018

కృష్ణా : ఐఐటీల్లో పూర్వ ప్రమాణాలు నేడు లేవని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తిచలమేశ్వరరావు అన్నారు.. కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం వానపాముల వద్ద జరిగిన విశ్వభారతి స్కూల్‌ గోల్డెన్‌ జూబ్లీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 50 ఏళ్ళ కిందట నాలుగు ఐఐటీలు మాత్రమే ఉండేవని... వాటిలో సీటు సాధించడం ఎంతో కష్టంగా ఉండేదన్నారు. నేడు 25 ఐఐటీలు ఉన్నా... ప్రమాణాలు  మాత్రం లేవన్నారు.. ఈ కార్యక్రమంలో  సెంట్రల్‌ విజిలెన్స్ కమిషనర్‌ కొసరాజు వీరయ్య చౌదరి, ఎంపీ కొనకళ్ళ నారాయణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, విజ్ఞాన్‌ గ్రూప్స్‌  ఛైర్మన్‌ లావు రత్తయ్య, విశ్వభారతి విద్యాసంస్థల వ్యవస్థాపకులు పొట్లూరి శ్రీమన్నారాయణ పాల్గొన్నారు.

Don't Miss

Subscribe to RSS - Supreme Court of India